టెహరాన్: ఇరాన్‌లో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బొగ్గు గనిలో పేలుడు కారణంగా 30 మంది మరణించగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ ఘోరం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది.
వివరాల ప్రకారం.. ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌లోని బొగ్గు గనిలో శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. బొగ్గు గని నుంచి మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 70 మంది పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 30 మంది మరణించగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గని లోపల మరో 24 మంది చిక్కుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది.
❗️30 Dead In Iran Coal Mine Explosion, 20+ Missing - IRNA
Tabas, in the South Khorasan province, was rocked by the blast on Sunday morning as emergency workers continue trying to free miners trapped underground.
pic.twitter.com/xUbqjBV0kU— RT_India (@RT_India_news) September 22, 2024
మరోవైపు.. బొగ్గు గనిలో పేలుడు ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు.
ఇది కూడా చదవండి: కమలా హారీస్‌కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్
Comments
Please login to add a commentAdd a comment