tehran
-
నా జోలికొస్తే.. ఇరాన్ సర్వ నాశనమవుతుంది: ట్రంప్
వాషింగ్టన్: అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి తెచ్చే విధానాన్ని తిరిగి అమలు చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారాయన. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ఆయన సంతకం కూడా చేశారు. అదే సమయంలో.. ఇరాన్ గనుక తనను చంపాలని చూస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆయన హెచ్చరించారు.గతంలో.. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గరిష్టంగా ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇరాన్ మళ్లీ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా కథనాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీకి ముందు ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తన తొలి హయాంలో టెహ్రాన్‌పై వాషింగ్టన్ అమలుచేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాండమ్‌పై ఆయన సంతకం చేశారు.టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి.. ‘‘ఇరాన్(Iran) అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే మా లక్ష్యం. ఇరాన్‌తో డీల్‌కు నేను సానుకూలంగానే ఉన్నా. కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదు. ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమే. అయితే, అణ్వాయుధాన్ని అందుకోవడంలో టెహ్రాన్ చాలా దగ్గరగా ఉంది. దాన్ని అడ్డుకోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు.... ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ, నాకు అంతగా ఇష్టం లేదు. అధ్యక్షుడిగా నేను సంతకం చేసే సమయంలోనే అన్ని విభాగాల నుంచి ఆ విజ్ఞప్తులు వచ్చాయి. ప్రత్యేకించి.. అణ్వాయుధాల విషయంలో. తప్పనిసరిగా ఆ ఆదేశాలపై నేను సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరాన్‌కు విషయంలో అది మరింత కఠినంగా ఉండబోతోంది’’ అని అన్నారాయన. ఇక ఇరాన్ తనను హత్య చేయడానికి కుట్ర పన్నితే.. అ దేశం పూర్తిగా నాశనమవుతుంది. ఏమీ మిగలదు అని ట్రంప్ హెచ్చరించారు. ‘‘నన్ను చంపాలని చూస్తే మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్లే..! నన్ను హత్య చేస్తే ఇరాన్‌ను సమూలంగా నాశనం చేయాలని ఇప్పటికే నా అడ్వైజర్లకు ఆదేశాలిచ్చా’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఇరాన్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని నిఘా వ్యవస్థలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో 2020లో అప్పటి ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీని మట్టుబెట్టేందుకు ఆదేశాలిచ్చారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతోనే అమెరికా దళాలు వైమానిక దాడులు చేయగా.. అందులోనే సులేమానీ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు ప్రతీకారంగా టెహ్రాన్.. ట్రంప్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. కిందటి ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం వెనక ఇరాన్ పాత్ర ఉన్నట్లు అమెరికా న్యాయవిభాగం అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇరాన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. -
ఇరాన్ సంచలన నిర్ణయం? మారనున్న రాజధాని?
ఇరాన్ తన పొరుగు దేశమైన ఇజ్రాయెల్‌తోనూ, అగ్రరాజ్యం అమెరికాతోనూ ఉన్న వివాదం కారణంగా గత కొంతకాలంలో ప్రపంచం దృష్టిలో పడింది. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై అప్రకటిత యుద్ధ ధోరణిలో ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే ఇరాన్ తన రాజధానిని టెహ్రాన్ నుండి వేరే ప్రదేశానికి మార్చాలనుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది కూడా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది.ఈ చర్చల నేపధ్యంలో ఇరాన్(Iran) ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా రాజధానిని మార్చాలనే నిర్ణయం తీసుకోలేదని మొహజెరానీ అన్నారు. అయితే ఇరాన్ నిర్ణయం వెనుక పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో టెహ్రాన్‌ను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని అంటున్నారు. ఇండోనేషియాలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. జకార్తాను విడిచిపెట్టి, మెరుగైన నగరాన్ని నిర్మించే దిశగా ఇండోనేషియా ప్రయత్నాలు ప్రారంభించింది.టెహ్రాన్(Tehran) మహానగరం అటు జనాభా, ఇటు పర్యావరణం పరంగా అనేక సమస్యలను ఎదుర్కొటోంది. ఫలితంగా నగరంలోపై మరింత ఒత్తిడి పెరుగుతోందని మొహజెరానీ తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభా కారణంగా నీటితో పాటు విద్యుత్ కొరత పెరుగుతోంది. కాలుష్యం కూడా పెరిగిపోతోంది. దీనికితోడు భూకంపాలు సంభవించే ప్రాంతంలో టెహ్రాన్ ఉండటం వల్ల మరింత అసురక్షితంగా మారిందని మొహజెరానీ వివరించారు. అటువంటి పరిస్థితిలోనే ఇరాన్ ప్రభుత్వం రెండు కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. రాజధానిని టెహ్రాన్ నుండి మక్రాన్ ప్రాంతానికి మార్చడంపై ఈ కౌన్సిళ్లు విశ్లేషించాయి.ఇది కూడా చదవండి: UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ -
ధర్మాగ్రహం కట్టలు తెంచుకున్న వేళ
టెహ్రాన్: హిజాబ్ ధరించలేదంటూ సూటిపోటి మాటలతో వేధిస్తున్న మతాధికారిని తనదైన శైలితో బుద్ధిచెప్పిన వీర వనిత ఘటన ఇది. మతాచారాలను కఠినంగా అమలుచేసే ఇరాన్లో ఇటీవల జరిగిందీ ఘటన. హిజాబ్ ధరించవా ? అంటూ వేధిస్తున్న ఒక ముల్లాను అతని సంప్రదాయ తలపాగాను తొలగించి దానినే హిజాబ్గా ధరించి అక్కడి వారంతా అవాక్కయ్యేలా చేసింది. నవీద్ మొహెబ్బీ అనే ఇరాన్ మహిళా యూజర్ ఒకరు పెట్టిన వీడియో ప్రకారం టెహ్రాన్‌లోని మహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వివాహిత విమానం కోసం ఎదురుచూస్తుండగా అటుగా వచ్చిన ఒక ముస్లిం మతాధికారి ఆమె దగ్గరికి వచ్చి ‘హిజాబ్ ధరించవా?’అని మొదలెట్టి పలు రకాలుగా వేధించసాగాడు. కొద్దిసేపు ఓపిక పట్టిన ఆ మహిళ తర్వాత వీరావేశంతో ఆ ముల్లాకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది. అతని తలపై ఉన్న తలపాగాను విసురుగా లాక్కొని దానిని వస్త్రంగా విడదీసి హిజాబ్గా ధరించింది. ‘‘ఇంతసేపు హిజాబ్ ఉంటేనే మహిళకు గౌరవం అని మాట్లాడావుకదా?. ఇప్పుడు నేను హిజాబ్ ధరించాను. నాకు తగిన గౌరవం ఇవ్వు ఇప్పుడు’’అని గద్దాయించింది. దీంతో ఏం చేయాలో తెలీక అతను దిక్కులు చూశాడు. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతూ ‘‘మా ఆయన ఇక్కడే ఉండాలికదా!. నేను హిజాబ్ ధరించలేదని నా భర్తను ఏమైనా చేశారా ఏంటి?’’అంటూ తన భర్తను వెతికేందుకు వెళ్లింది. మహిళ చర్యను ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది నెటిజన్లు మెచ్చుకున్నారు. ఛాందసవాద ప్రవర్తనకు వీరవనిత తగిన బుద్ధి చెప్పిందని కొనియాడారు. అయితే ఈ ఘటన వార్త తెలిసి అక్కడే ఉన్న ఇరాన్ నైతిక పోలీసు విభాగం ఆమెను అరెస్ట్చేసిందని, తర్వాత ఆమెను విడుదలచేసిందని తెలుస్తోంది. -
బొగ్గు గనిలో ప్రమాదం.. 30 మంది కార్మికులు మృతి
టెహరాన్: ఇరాన్లో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బొగ్గు గనిలో పేలుడు కారణంగా 30 మంది మరణించగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ ఘోరం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది.వివరాల ప్రకారం.. ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌లోని బొగ్గు గనిలో శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. బొగ్గు గని నుంచి మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 70 మంది పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 30 మంది మరణించగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గని లోపల మరో 24 మంది చిక్కుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. ❗️30 Dead In Iran Coal Mine Explosion, 20+ Missing - IRNATabas, in the South Khorasan province, was rocked by the blast on Sunday morning as emergency workers continue trying to free miners trapped underground.pic.twitter.com/xUbqjBV0kU— RT_India (@RT_India_news) September 22, 2024మరోవైపు.. బొగ్గు గనిలో పేలుడు ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు. ఇది కూడా చదవండి: కమలా హారీస్‌కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్ -
బెడ్రూంలో బాంబు
‘జింకను వేటాడేప్పుడు పులి ఓపికగా ఉంటది. అదే పులినే వేటాడాల్సొస్తే?! ఇంకెంత ఓపిక కావాలి?’ ఇది ఓ సినిమాలోని డైలాగ్. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేపై దాడి కోసం ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్ కూడా అచ్చం అలాగే ఓపిక పట్టింది. అది కూడా ఒక రోజో, రెండ్రోజులో కాదు.. ఏకంగా రెండు నెలలకు పైగా! ఆయన బస చేస్తారని భావించిన ఇంట్లో అప్పటికే బాంబు అమర్చి ఉంచింది. ఏ బెడ్రూంలోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరీ అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. అలా హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూచున్న మృత్యువు, సమయం రాగానే అమాంతంగా మింగేసింది...!ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గత బుధవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో హనియే మరణించారు. అత్యంత కచి్చతత్వంతో కూడిన ఇజ్రాయెల్ క్షిపణి దాడే అందుకు కారణమని తొలుత వార్తలొచ్చాయి. క్షిపణిలాంటి వస్తువేదో హనియే గది కిటీకిని తాకడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని కొందరు చెప్పారు. అది క్షిపణి దాడేనని ఇరాన్ కూడా ఆరోపించింది. టెహ్రాన్‌లో కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్‌ను హనియేకు కేటాయించారు. అలాంటి గెస్ట్ హౌస్‌పై సుదూరం నుంచి అంతటి కచి్చతత్వంతో క్షిపణి దాడి సాధ్యమేనా? పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. కానీ ఆ గెస్ట్ హౌస్‌కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే బాగా దెబ్బతిన్నాయి. అదే భవనంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్ నఖలా బస చేసిన పక్క గది కూడా దెబ్బ తినలేదు. కనుక ఎలా చూసినా జరిగింది క్షిపణి దాడి కాదు.వామ్మో ఇజ్రాయెల్! హనియే మృతికి గది లోపలి పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ గదిలో రెండు నెలల కిందే బాంబు పెట్టారని తెలుస్తోంది. ఇరాన్ భద్రతలోని లోపాలనే అందుకు అనువుగా మార్చుకున్నారు. బాంబు పెట్టి రెండు నెలలపాటు ఓపికగా నిరీక్షించారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు హనియే టెహ్రాన్ చేరుకున్నారు. అది ముగిశాక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఆ గదిలోకే వెళ్లినట్టు పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే రిమోట్‌తో బాంబు పేల్చారు. పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కదిలిపోయింది. గోడలో కొంత భాగం కూలింది. కిటికీలు పగిలాయి. పేలుడు తీవ్రతకే హనియే మృతి చెందారు. ఈ కోవర్ట్ ఆపరేషన్ వివరాలన్నింటినీ పాశ్చాత్య అధికారులతో మొసాద్ పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. దేశం వెలుపల రాజకీయ ప్రత్యర్థులు తదితర టార్గెట్ల ఏరివేతకు మొసాద్ పాల్పడుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7 దాడుల తర్వాత దాని అగ్ర నేతలందరినీ వేటాడతామని ప్రధాని నెతన్యాహూతో పాటు మొసాద్ చీఫ్ డేవిడ్ బరి్నయా కూడా ప్రతిజ్ఞ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ ఇరాన్ యువతి మృతి
దుబాయ్: ఇరాన్లో కొద్ది వారాల కింద హిజాబ్ ధరించకుండా మెట్రో రైల్లో ప్రయాణిస్తూ అంతుబట్టని రీతిలో తీవ్ర గాయాలపాలైన టీనేజ్ యువతి మరణించింది. కొద్ది రోజుల కోమా అనంతరం ఆమె తుదిశ్వాస విడిచినట్టు ప్రభుత్వ మీడియా శనివారం ఈ మేరకు వెల్లడించింది. అరి్మత గెర్వాండ్ అనే ఆ యువతి అక్టోబర్ 1న టెహ్రాన్‌లో మెట్రోలో ప్రయాణిస్తూ గాయపడింది. ఆమె ట్రైన్లోంచి ప్లాట్‌ఫాంపైకి వచ్చి పడుతున్న వీడియో బయటికి వచి్చంది. మెట్రోలో ఏమైందో ఇప్పటిదాకా బయటికి రాలేదు. హిజాబ్ ధరించనందుకే పోలీసులు ఆమెకు ఈ గతి పట్టించి ఉంటారని హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాది కింద ఇలాగే హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మహ్సా అమినీని మోరల్ పోలీసులు తీవ్రంగా కొట్టడం, ఆమె జైల్లో మరణించడం, దానిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెర్వాండ్ మృతితో మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఇరాన్ హక్కుల యోధురాలికి నోబెల్ శాంతి
స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మదికి లభించింది. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కులపై అవగాహన, అందరికీ స్వేచ్ఛ, మరణ శిక్ష రద్దు కోసం అలుపెరగకుండా ఆమె చేస్తున్న పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గిస్ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ జైల్లో ఉన్నారు. ‘‘నర్గిస్ చేసిన పోరాటం అత్యంత సాహసోపేతమైనది. మహిళా హక్కుల కోసం ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారు. ఇరాన్లో ఏడాదిగా సాగుతున్న మహిళా హక్కుల పోరాటానికి నోబెల్ శాంతి తొలి గుర్తింపు. జైలు నుంచే ఈ ఉద్యమానికి ఊపిరిలా మారిన వివాదరహితురాలైన నర్గిస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తున్నాం’’అని కమిటీ చైర్ పర్సన్ బెరిట్ రెసి అండర్సన్ వెల్లడించారు. నోబెల్ శాంతి పురస్కారం కింద ఆమెకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (దాదాపుగా 10 లక్షల డాలర్లు) నగదు బహుమానం, 18 కేరట్ గోల్డ్ మెడల్, డిప్లొమా లభిస్తుంది,. డిసెంబర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవం సమయానికి నర్గిస్ జైలు నుంచి విడుదల కావాలని, స్వయంగా పురస్కారాన్ని అందుకోవాలని నోబెల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్లో మహిళా హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నర్గిస్ జైలు నుంచే న్యూయార్క్ టైమ్స్‌కి ఒక ప్రకటన పంపారు. ‘‘నోబెల్ శాంతి పుర స్కారం నాలో మరింత స్ఫూర్తిని నింపింది. మహిళల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ పెరిగింది. ఇరాన్లో మార్పు కోసం పోరాడుతున్న వారి లో మరింత బలం పెరుగుతుంది. ఇక విజయం సమీపంలో ఉంది’’అని ఆ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. 13 సార్లు అరెస్ట్..31 ఏళ్ల జైలు శిక్ష హక్కుల పోరాటంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా నర్గిస్ వెనుకంజ వేయలేదు. ఇరాన్ ప్రభుత్వం ఆమెను ఇప్పటికి 13 సార్లు అరెస్ట్ చేసింది. అయిదు సార్లు దోషిగా నిర్ధారించింది. 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 154 సార్లు కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించి తొలిసారి అరెస్టయి ఏడాది జైల్లో ఉన్నారు. హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరి మళ్లీ అరెస్టయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ మరోసారి అరెస్ట్ చేశారు. ఇరాన్లో మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు 2015లో జైలుకు పంపారు. ఇలా తన జీవితంలో సగభాగం ఆమె జైల్లోనే గడుపుతున్నారు. అన్నీ కోల్పోయినా.... సంప్రదాయం పేరుతో మహిళలపై ఆంక్షలు విధిస్తూ హిజాబ్ కాస్త పక్కకి జరిగినా జైలు పాల్జేయడమో, కొట్టి చంపేయడమో చేసే దేశంలో పుట్టి మహిళా హక్కుల కోసం జీవితాన్ని ధారపోస్తున్న నర్గిస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన సమయంలో నాలుగ్గోడల మధ్య బందీగా ఉన్నారు. వ్యక్తి గత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పణంగా పెట్టి 51 ఏళ్ల వయసున్న నర్గిస్ ఇంకా మార్పు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ‘‘ప్రభుత్వం నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే, ఎంతగా శిక్షిస్తే నాలో పోరాట స్ఫూర్తి అంతకంతకూ పెరుగుతుంది. దేశంలో మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వరకు ఈ పోరాటం ఆగదు’’అని నర్గిస్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇరాన్‌లోని జంజన్ పట్టణంలో 1972, ఏప్రిల్ 21న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక రైతు. తల్లి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రాచరికం రద్దయిందో అప్పుడే నర్గిస్ తల్లి సోదరుడు, మరో ఇద్దరు కుటుంబసభ్యులు జైలు పాలయ్యారు. వారిని ప్రతీ వారం కలుసుకోవడానికి తల్లితో పాటు జైలుకు వెళ్లే చిన్నారి నర్గిస్‌కు తమ బతుకులు ఎందుకంత అణచివేతకు గురవుతున్నాయో అర్థం కాక తీవ్ర సంఘర్షణకు లోనయ్యేది. అది చూసి ఆమె తల్లి తనకున్న అనుభవంతో రాజకీయాలు, వ్యవస్థల జోలికి వెళ్లొద్దని హితవు చెప్పింది. అయినప్పటికీ నర్గిస్లో చిన్నప్పట్నుంచి ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి ఆమెను హక్కుల పోరాటంలో ముందుకు నడిపించాయి. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నాళ్లు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో 2003లో చేరిన ఆమె ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో సహచర విద్యారి్థగా పరిచయమైన ప్రఖ్యాత సామాజిక కార్యకర్త తాఘి రెహమనీను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రెహమనీ తన పిల్లలతో కలిసి పారిస్‌కు ప్రవాసం వెళ్లిపోయారు. తన భర్త, పిల్లలతో మాట్లాడి, ప్రేమతో వారిని అక్కున చేర్చుకొని ఆమెకు ఏళ్లు గడిచిపోయాయి. జైలు నుంచే పోరాటం జైలు నుంచి ఆమె ఎందరిలోనో ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తున్నారు. రాజకీయ ఖైదీలు, మహిళా ఖైదీలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా జైల్లోనే ఆమె ఉద్యమం ప్రారంభించారు. జైల్లో కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో అధికారులు ఆమెపై పలు ఆంక్షలు విధించారు. అయినా ఆమె బెదరలేదు. జైలు నుంచే పలు వ్యాసాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి వాటికి పంపించారు. 2022 సెపె్టంబర్లో హిజాబ్ ధరించనందుకు మాసా అమిని అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేయగా కస్టడీలో తీవ్ర గాయాలపాలై ఆమె మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్లో భారీగా యువతీ యువకులు ఆందోళనలు చేపట్టి రోడ్లపైకి వచి్చనప్పుడు జైలు నుంచే ఆమె తన గళాన్ని వినిపించారు. పోరాడే వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తోటి మహిళా ఖైదీల అనుభవాలతో వైట్ టార్చర్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు విధించే ఇరాన్లో అత్యంత క్రూరమైన ఆ శిక్షను రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని నర్గిస్ ఎలుగెత్తి చాటుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Hijab: అరెస్ట్ కాదు.. ఆమెకు ఘన స్వాగతం!
టెహ్రాన్: అంతర్జాతీయ క్రీడా వేదికలో హిజాబ్ లేకుండా పాల్గొని.. వార్తల్లో ప్రముఖంగా నిలిచింది ఇరాన్ అథ్లెట్ ఎల్నాజ్ రెకాబీ. అయితే.. ఆపై ఆమె ప్రభుత్వాగ్రహానికి గురికాకతప్పదని, జైలు శిక్ష ఖాయమని అంతా భావించారు. అంతేకాదు.. స్వయంగా ఆమె తన అరెస్ట్ భయాన్ని సైతం వ్యక్తం చేయడం, ఆ వెంటనే కనిపించడం లేదన్న కథనాలతో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇక భయాందోళనల నడుమ బుధవారం వేకువజామున రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్న ఆమెకు ఊహించని సీన్ కనిపించింది. వేల మంది ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఆమెకు ఘనస్వాగతం పలికారు. హిజాబ్ లేకుండా పోటీల్లో పాల్గొన్న ఆమె తెగువకు సలాం చేస్తూ నినాదాలు చేశారు. ఆ గ్రాండ్ వెల్కమ్ను రెకాబీ సైతం అంతే ఆత్మీయంగా స్వీకరించింది. 33 ఏళ్ల వయసున్న రెకాబీ.. ఇరాన్ తరపున సియోల్(దక్షిణ కొరియా రాజధాని)లో ఆదివారం జరిగిన క్లయింబింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నారు. గతంలో హిజాబ్‌తోనే ఆమె ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఆదివారం ఈవెంట్ సందర్భంగా ఆమె హిజాబ్ ధరించకపోవడంతో ఆమె ఇరాన్ ప్రభుత్వ ఆగ్రహానికి గురికాక తప్పదని అంతా భావించారు. ఇరాన్లో జరుగుతున్న హిజాబ్ నిరసనల్లో భాగంగానే ఆమె అలా చేసి ఉంటుందని అంతా చర్చించుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అరెస్ట్ కాక తప్పదని అనుకున్నారు. కానీ, ఆ అంచనా తప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని గతంలో స్పందిస్తూ.. ఇరాన్ మహిళా అథ్లెట్లకు మెడల్స్ కంటే హిజాబ్ ముఖ్యమని సూచించారు. అయితే.. రెకాబీ మాత్రం హిజాబ్ తొలగించి మరీ పోటీల్లో పాల్గొంది. ఇక హిజాబ్ తొలగింపుపై ఇరాన్ నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్తూ.. అది అనుకోకుండా జరిగిందంటూ ఓ సందేశం సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టెహ్రాన్‌లో ల్యాండ్ అయిన ఆమెకు.. ముందు ముందు ఎలా ఉంటుందన్నది చూడాలి మరి!. ఇదీ చదవండి: తప్పు జరిగిపోయింది.. క్షమించండి -
Iran anti-hijab protest: హిజాబ్ అల్లర్లతో...అట్టుడుకుతున్న ఇరాన్
దుబాయ్: ఇరాన్లో హిజాబ్ కల్లోలం చినికిచినికి గాలివానగా మారుతోంది. నిర్బంధ హిజాబ్ ధారణ నిబంధనను వ్యతిరేకిస్తూ వారం రోజులుగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు నానాటికీ మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు హిజాబ్‌లను చేబూని జెండాల మాదిరిగా ఊపుతూ భారీ సంఖ్యలో నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటంటూ నిరసిస్తున్నారు. ‘మాకు స్వేచ్ఛ కావాల్సిందే’ అంటూ వీధుల్లోకి వస్తున్నారు. ‘నియంత ఖొమేనీకి మరణమే’, ‘ముల్లాల పీడ వదలాల్సిందే’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బహిరంగంగా జుత్తు కత్తిరించుకోవడంతో పాటు హిజాబ్‌లను తగలబెడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని టెహ్రాన్‌లో ఆందోళనకారులు ఓ పోలీసు వాహనానికి నిప్పు పెడుతున్న వీడియోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. పలుచోట్ల ఇరు వర్గాలు బాహాబాహికి దిగుతూ కన్పించారు. పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు కూడా రంగంలోకి దిగి నిరసనకారులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోయాయి. ‘ఓ దేవుడా! వాళ్లు విచక్షణారహితంగా కాల్చి పారేస్తున్నారు’ అని ఆక్రోశిస్తూ జనం చెల్లాచెదురుగా పారిపోతున్న దృశ్యాలు కొన్ని వీడియోల్లో కన్పిస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటిదాకా 26 మంది దాకా మరణించారని దేశ అధికారిక మీడియా సంస్థ చెబుతున్నా శుక్రవారమే ఏకంగా 30 మందికి పైగా బలైనట్టు తెలుస్తోంది. ఆందోళనకారుల పట్ల పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వెలిబుచ్చింది. అతి సమీపం నుంచి కాల్పులకు పాల్పడుతున్నారని ఆక్షేపించింది. ఇరాన్‌పై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. మరోవైపు అల్లర్లను నిరసిస్తూ ప్రభుత్వ అనుకూల ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. సర్కారు ఉక్కుపాదం నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ర్యాలీలు, ఆందోళనల పిలుపుకు ఆందోళనకారులు ప్రధానంగా ఆధారపడుతున్న ఇన్స్టాగ్రాం, వాట్సాప్ వంటివాటిపై ఆంక్షలను తీవ్రతరం చేసింది. అనుమానితుల కోసం పోలీసులు ఇంటింటి సోదాలకు దిగుతున్నారు! వందలాది మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమీనీ అనే 22 ఏళ్ల యువతిని మోరల్ పోలీసులు అరెస్టు చేయడం, ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించడం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ గత శనివారం నుంచి దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు రోడ్లెక్కుతున్నారు. హిజాబ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ! ఇరాన్ పాలకవర్గంలో గూడుకట్టుకుపోయిన సంప్రదాయవాదానికి తార్కాణమీ ఫొటో. కుర్చీలో కూర్చున్నది సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియాన్ అమన్‌పోర్ (64). ఆమె ఎదురు చూస్తున్నది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కోసం. ఐరాస సర్వసభ్య ప్రతినిధి సభలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన రైసీ ఇరాన్లో చెలరేగుతున్న హిజాబ్ హింసాకాండపై ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తీరా సమయానికి ఆమె హిజాబ్ ధరించాలంటూ పట్టుబట్టారు. అందుకు క్రిస్టియాన్ ససేమిరా అన్నారు. 1995 నుంచీ ఇరాన్ అధ్యక్షులందరినీ హిజాబ్ ధరించకుండానే ఇంటర్వ్యూ చేశానని గుర్తు చేశారు. ‘‘ఇంటర్వ్యూ కోసం వారాల ముందునుంచీ ఏర్పాట్లు చేసుకున్నాం. నేను షెడ్యూల్ ప్రకారం సిద్ధమై అధ్యక్షుని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ ఆయన జాడే లేదు. 40 నిమిషాల తర్వాత సహాయకుడొచ్చి నేను హిజాబ్ ధరించి తీరాల్సిందేనని ఆయన కోరుతున్నట్టు తెగేసి చెప్పాడు. అందుకు నిరాకరించి ఇంటర్వ్యూనే రద్దు చేసుకున్నా’’ అంటూ ఈ అనుభవాన్ని ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు. ఇరాన్లో పుట్టిన క్రిస్టియానా 11 ఏళ్లొచ్చేదాకా టెహ్రాన్‌లోనే పెరిగారు. -
హిజాబ్‌లు తొలగించి.. జుట్టు కత్తిరించుకుని నిరసనలు
అన్యాయంగా ఓ యువతిని పొట్టనబెట్టుకున్న మోరల్ పోలీసింగ్‌పై.. అక్కడి మహిళా లోకం ఎదురు తిరిగింది. ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటాయి. 22 ఏళ్ల మహ్సా అమినీ పోలీసుల వేధింపుల వల్లే మరణించిందనే నేపథ్యంతో.. మహిళలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులను తీవ్రంగా అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం యత్నిస్తుండగా.. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను కొనసాగిస్తున్నారు పలువురు. ఇరాన్ మహిళలు చాలామంది బహిరంగంగానే హిజాబ్‌లు తొలగించి.. వాటిని తగలబెడుతున్నారు. మరికొందరు జుట్టును కత్తిరించుకుని.. వాటిని వీడియోలుగా తీసి వైరల్ చేస్తున్నారు. దమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండంటూ ఇరాన్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిండిన వీడియోలే ఇప్పుడు అక్కడ సోషల్ మీడియాలో పోటెత్తుతున్నాయి. మరోపక్క రోడ్డెక్కిన వేలమంది మహిళలను అణిచివేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టియర్ గ్యాస్, తుపాకులు ప్రయోగించి చెల్లాచెదురు చేస్తున్న దృశ్యాలు ట్విటర్లో కనిపిస్తున్నాయి. Iranian women show their anger by cutting their hair and burning their hijab to protest against the killing of #Mahsa_Amini by hijab police. From the age of 7 if we don’t cover our hair we won’t be able to go to school or get a job. We are fed up with this gender apartheid regime pic.twitter.com/nqNSYL8dUb — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 18, 2022 This is the real Iran, Security forces in Iran’s Saqqez opened fire at peaceful protesters following the burial of #Mahsa_Amini. Several protesters have been injured. First Hijab police killed a 22 Yr old girl and now using guns and tear gas against grieving people.#مهسا_امینی pic.twitter.com/IgUdFEnJCS — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 17, 2022 ఇరాన్లో ఏడేళ్లు దాటిన మహిళంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబంధన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టును కవర్ చేసుకోవడంతో పాటు నిండుగా ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే.. బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ కూడా చేస్తారు. దీనిపై చాలాకాలంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ.. సవరించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధంగా లేదు. Do you really want to know how Iranian morality police killed Mahsa Amini 22 year old woman? Watch this video and do not allow anyone to normalize compulsory hijab and morality police. The Handmaid's Tale by @MargaretAtwood is not a fiction for us Iranian women. It’s a reality. pic.twitter.com/qRcY0KsnDk — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 16, 2022 తాజాగా తన కుటుంబంతో ఆ దేశ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లిన మహ్సా అమినీ.. ఆమె కుటుంబీలకు సమక్షంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఆపై హఠాత్తుగా ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. కోమాలో నుంచే కన్నుమూసిందామె. ఈ ఘటనపై ఇరాన్ మహిళా లోకం భగ్గుమంది. ఆమెపై ఒంటిపై గాయాలున్నాయని ఆమెది ముమ్మాటికీ వేధింపుల హత్యే అని అమినీ కుటుంబంతో సహా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తుండడంతో.. అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. ఇదీ చదవండి: వాళ్లను తాకొద్దు.. మంకీపాక్స్ వస్తది! -
అక్కడ ఇరుక్కుపోయిన వాటర్ బాటిల్.. భార్యకు భయపడి చెప్పని భర్త.. చివరకు..
టెహ్రాన్: ఇరాన్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి సీటీ స్కాన్ తీసీ అవాక్కయ్యారు వైద్యులు. అతని మలద్వారంలో 19 సెంటీమీటర్ల వాటర్ బాటిల్‌ను గుర్తించి కంగుతిన్నారు. సీటీ స్కాన్ చేసే వరకు ఏం జరిగిందో సదరు వ్యక్తి చెప్పకపోడం చూసి ఆశ్చర్యపోయారు. ఆస్పత్రిలో చేరిన ఈ వ్యక్తి వయస్సు 50 ఏళ్లు. కొద్ది రోజులుగా మలబద్దకం, ఆకలి లేకపోవడం, తిమ్మిరి వంటి లక్షణాలు చూసి ఆందోళనతో ఆయన భార్య హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అయితే ఏం జరిగిందో అతను మాత్రం వైద్యులకు కూడా చెప్పలేదు. పరీక్ష నిర్వహించిన అనంతరం వైద్యులకు అసలు విషయం తెలిసింది. మలద్వారంలో వాటర్ బాటిల్ ఇరుక్కున్న విషయం తన భార్యకు చెబితే రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడే భర్త ఈ విషయాన్ని దాచినట్లు వైద్యులు చెప్పారు. చివరకు మలద్వారం నుంచి వాటర్ బాటిల్‌ను బయటకు తీశారు. మూడు రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. అతని పెద్దపేగుకు, ఇతర అవయవాలకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అయితే బాధితుడు స్వయంగా తానే వాటర్ బాటిల్‌ను మలద్వారంలోకి ఇన్సర్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పొరపాటున ఇరుక్కు పోయి ఉంటుందని, లైంగిక సంతృప్తి కోసమే అతను ఇలా చేసి ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం అతడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు పంపారు. చదవండి: (ట్రంప్ సోషల్ మీడియా డీల్ లీక్!) -
భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేసేందుకు ఇరాన్ సిద్ధం!..నేరుగానే డీల్
Rupee-rial trade mechanism: ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో దాని చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో న్యూ ఢిల్లీ టెహ్రాన్ నుంచి దిగుమతులను నిలిపివేయవలసి వచ్చింది. ఒపెక్ సభ్యునికి వ్యతిరేకంగా ఆంక్షల ఎత్తివేతపై ప్రపంచ దేశలు, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నందున భారత్‌కి ముడి చమురు అవసరాలను తీర్చడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని పేర్కొన్నారు. అంతేకాదు రూపాయి-రియాల్ ట్రేడ్ మెకానిజంతో రెండు దేశాల కంపెనీలకు ఒకరితో ఒకరు నేరుగా డీల్ నిర్వహించు కోగలుగుతారని అలీ చెగేని అన్నారు. దీని వల్ల మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గుతాయి అని కూడా చెప్పారు. ఇరాన్‌కి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ ముడి చమురు అవసరాలలో 80% దిగుమతులతో కవర్ చేస్తుంది. భారతీయ రిఫైనర్లు ఇరాన్ చమురును స్థానిక బ్యాంకుకు రూపాయిలలో చెల్లిస్తున్న వ్యాపారాన్ని పరిష్కరించేందుకు భారత్, ఇరాన్ ఒక బార్టర్ లాంటి యంత్రాంగాన్ని రూపొందించాయి ఆ నిధులను టెహ్రాన్ భారతదేశం నుంచి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించింది. ఆంక్షల కారణంగా భారత్-ఇరాన్ వాణిజ్యం మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మది నెలలు నుంచి దాదాపు రూ. 1700 కోట్లు వాణిజ్యం ఈ ఏడాది మొదటి 10 నెలల ఏప్రిల్ నుంచి జనవరిలో 200 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. పైగా రెండు దేశాలు రూపాయి-రియాల్ వాణిజ్య విధానాలను ప్రారంభిస్తే, ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెగేని అన్నారు. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి..
టెహ్రాన్: ఇరాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఆమె తల నరికి చంపాడో భర్త. అంతేగాక నరికిన తలతో భర్త వీధుల్లోకి రావడం తీవ్ర కలకలం రేపింది. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌లోని అహ్వాజ్లో ఓ వ్యక్తి తన భార్య(17) మోనా హీదారీతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన కొన్నాళ్లపాటు వీరి వివాహ బంధం సజావుగానే సాగింది. అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త గ్రహించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య కలహాలు తలెత్తాయి. భర్తకు విషయం తెలియడంతో మహిళ దేశం విడిచి టర్కీకి పారిపోయింది. అయినప్పటికీ వివాహితను వెతికి పట్టుకున్న తండ్రి, ఆమె భర్త తిరిగి ఇరాన్‌కు తీసుకువచ్చారు. అయితే భార్య ఇంటి నుంచి పారిపోవడంతో తన పరువు పోయిందని భావించిన భర్త.. తమ్ముడితో కలిసి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు అంతటితో ఆగకుండా ఓ చేతిలో కత్తి, మరో చేతిలో భార్య తల పట్టుకొని రోడ్డు మీదకు నవ్వుతూ వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన భర్తతోపాటు అతని సోదరుడిని సోమవారం అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లను పోలీసులు బయటపెట్టలేదు. మరోవైపు ఈ ఊదంతంపై ఇరాన్ దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఇరాన్ దేశ ప్రజలందరూ షాక్‌కు గురయ్యారని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మహిళా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ ఎన్సీ ఖాజాలీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంట్‌ను కోరింది. కాగా ఇరాన్లో బాలికల వివాహ వయసు 13 ఏళ్లుగా నిర్ణయించారు. అంతేగాక బాధితురాలికి పెళ్లి అయినప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు కావడం గమనార్హం. -
Iran: అతిపెద్ద యుద్ధనౌక కథ విషాదాంతం
టెహ్రాన్: ఇరాన్ నావికా దళానికి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక ‘ఖర్గ్’ కథ ముగిసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో విధి నిర్వహణలో ఉన్న ఈ నౌకలో బుధవారం తెల్లవారుజామున 2.25 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చివరకు ఖర్గ్ నీట మునిగింది. ఈ యుద్ధ నౌక పొడవు 207 మీటర్లు (679 అడుగులు). సముద్రంలో ఇతర నౌకలను అవసరమైన సామగ్రిని సరఫరా చేయడానికి, శిక్షణ కోసం ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు నౌకపై 400 మంది సిబ్బంది ఉన్నారని, వారంతా ప్రాణాలతో బయటపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 20 మంది గాయపడ్డారని తెలియజేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 1,270 కిలోమీటర్ల దూరంలో హర్మూజ్ జలసంధికి సమీపంలో జాస్క్ పోర్టు వద్ద ఖర్గ్ నీటిలో మునిగిపోయింది. గత ఏడాది ఇరాన్ సైన్యానికి శిక్షణ ఇస్తుండగా ఓ క్షిపణి పొరపాటున జాస్క్ పోర్టు వద్ద యుద్ధ నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది నావికులు మరణించారు. 15 మంది గాయపడ్డారు. అంతకుముందు 2018లో ఇరాన్ యుద్ధనౌక కాప్సియన్ కూడా సముద్రంలో మునిగింది. (చదవండి: వైరల్: 12 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజీ.. కలవరపడుతున్న నెటిజన్లు ) -
చిన్న కారణంతోనే మహిళా జర్నలిస్ట్ వేలు విరిచిన గార్డు
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఒక వార్తా వెబ్సైట్లో ఫేజె మోమెని అనే మహిళా జర్నలిస్ట్ పనిచేస్తుంది. ఈ కోవిడ్ సమయంలో టీకా ప్రక్రియ గురించి ఒక నివేదికను తయారు చేస్తున్నప్పుడు మే 18న రాష్ట్ర టీకా కేంద్రం వద్ద ఉన్న గార్డు ఆమెను కొట్టారు. టీకా కేంద్రం నుంచి బయటకు వెళ్తుండగా జర్నలిస్టును బెహేష్తి మెడికల్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏజెంట్ కొట్టాడని ప్రభుత్వ ఈటెమాడ్ ఆన్లైన్ వెబ్సైట్ తెలిపింది. అప్పటివరకు సేకరించిన అన్ని ఇంటర్వ్యూలను డిలీట్ చేయమని గార్డు ఆమెను కోరాడు దానికి ఆమె నిరాకరించడంతో వెంటనే అతను ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె వేలు విరిగింది. అయితే, అక్కడ స్థానికులు ఫేజేను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె తనకు గాయాల ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆమె కేంద్రంలోని వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతో వరుసగా ఇంటర్వ్యూలు నిర్వహించిందని, అయితే వాటిని తొలగించమని సెక్యూరిటీ గార్డు ఆమెకు చెప్పారు. ఇది ఇలా ఉంటే మరోవైపు ఆ దేశంలో నిదానంగా జరగుతున్న కోవిడ్ -19 టీకా ప్రచారం గురించి మీడియా, నిపుణులు పదేపదే ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శిస్తున్నారు. మరి మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడి యాదృశ్చికంగా జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారో ఇంకా తెలియదు. ఇస్లామిక్ రిపబ్లిక్ లో మహిళలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని, కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ వల్ల నిరుద్యోగం తీవ్రంగా పెరగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. చదవండి: మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ -
Iran: అధ్యక్ష ఎన్నికల బరిలో అహ్మదీ నెజాద్
టెహ్రాన్: ఇరాన్ అతివాద నాయకుడు, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీ నెజాద్ (64) మరోసారి అదే పదవి ఆశిస్తున్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అణ్వస్త్ర కార్యక్రమాల్లో దూకుడుగా వ్యవహరించి, పశ్చిమ దేశాలకు సవాలు విసిరారు. అహ్మదీ నెజాద్ వైఖరి నచ్చని అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్‌ను దుష్టదేశాల జాబితాలో చేర్చింది. తాజాగా మళ్లీ అధ్యక్ష పదవికి పోటీపడాలని నెజాద్ నిర్ణయించుకున్నారు. బుధవారం అభ్యర్థిగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇరాన్లో జూన్ 8న ఎన్నికలు జరుగనున్నాయి. చురుకైన నేతగా ఇరాన్ ప్రజల్లో ఆదరణ ఉన్న నెజాద్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఖాయమేనన్న అంచనాలు వెలువడుతున్నాయి. 2017 జరిగిన ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆయన విఫలయత్నం చేశారు. అప్పట్లో నెజాద్ ప్రయత్నాలకు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అడ్డుతగిలారు. ఈసారి ఆ పరిస్థితి లేదని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ పట్ల ప్రజల్లో విముఖత వ్యక్తమవుతోంది. కరోనా మహమ్మారి విజృంభన, అమెరికా ఆంక్షలతో పూర్తిగా చితికిపోయిన ఇరాన్ ప్రజలు ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే వచ్చా.. అహ్మద్ నెజాద్ రిజిస్ట్రేషన్ కేంద్రంలో తన రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలని లక్షలాది మంది కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చడానికే బరిలోకి వచ్చానని చెప్పారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు తనకు తెలుసని అన్నారు. దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించే నాయకత్వం రావాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అహ్మదీ నెజాద్ 2005 నుంచి 2013 వరకూ వరుసగా రెండు పర్యాయాలు ఇరాన్ అధ్యక్షుడిగా సేవలందించారు. నెజాద్ హయాంలో చమురు శాఖ మంత్రిగా పనిచేసిన రుస్తుం ఘాసేమీ కూడా ఇరాన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. (చదవండి: Israel- Palestine: మధ్య ప్రాచ్యం.. మరింత ఉద్రిక్తం) (చదవండి: ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసిన బీజేపీ ఎంపీలు) -
ఇరాన్లో గ్యాస్ లీకేజీ: 19 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్ రాజధానిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్‌లోని ఓ మెడికల్ క్లినిక్‌లో మంగళవారం గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో క్లినిక్‌లో 25 మంది సిబ్బంది ఉన్నట్లు టెహ్రాన్ డిప్యూటీ గవర్నర్ రెజా గౌదర్జీ తెలిపారు. రెండు గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. (విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్..) కాగా ఇరాన్లో ఇది రెండవ ఘటన అని గతవారం కూడా టెహ్రాన్ సమీపంలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి సైనిక ప్రదేశానికి సమీపంలో ఉన్న గ్యాస్ నిల్వ కేంద్రం వద్ద ట్యాంకర్ పేలీ మంటలు చెలరేగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగిందన్న దానిపై సమాచారం లేదు. -
ఇరాన్లో భూకంపం.. వణికిన టెహ్రాన్
టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్జీఎస్) స్పష్టం చేసింది. భూమి కంపించడంతో భయాబ్రాంతులకు గురైన ప్రజలు వీధుల్లోకి పరిగెత్తారు. ఈ ప్రమాదం కారణంగా ఒకరు చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఇరాన్ వైద్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కియానుష్ జహన్‌పూర్ ప్రకటించారు. అయితే భూకంపం నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఒకరు మరణించినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. టెహ్రాన్‌కి ఈశాన్యంగా ఉన్న దమావాండ్ ప్రాంతంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంపన కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. #Tehran #Earthquake photos of people waiting in the street in the early hours by IRNA. May 8 (Thr time) #زلزله_تهران #زلزله#Iran pic.twitter.com/mVS15DCLzC — Living in Tehran (@LivinginTehran) May 7, 2020 -
ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్
టెహ్రాన్: అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో జనవరి 8న తాము పొరపాటున కూల్చేసిన ఉక్రెయిన్ విమాన ఘటనపై మంగళవారం ఇరాన్ మరింత వివరణ ఇచ్చింది. ఆ రోజు ఉదయం టెహ్రాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానం నగర శివార్లలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని తమ రెండు ‘టార్ ఎం1’ క్షిపణులు కూల్చేశాయని తాజాగా ప్రకటించింది. విమానంలోని బ్లాక్ బాక్స్‌లను డీకోడ్ చేసే అత్యాధునిక సాంకేతికత తమ వద్ద లేదని, డీకోడ్ చేసేందుకు అమెరికా, ఫ్రాన్స్‌ల సాయం కోరామని, వారి నుంచి సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ఇరాన్ పౌర విమానయాన విభాగం తెలిపింది. టార్ ఎం1 భూమిపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలపై ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి. దీన్ని విమానాలు, క్షిపణులు లక్ష్యంగా నాటి సోవియట్ యూనియన్ రూపొందించింది. ఉక్రెయిన్‌లోని కీవ్‌కు వెళ్లాల్సిన ఆ బోయింగ్ 737 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు 176 మంది ఉండగా, వారంతా దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు నిరసనగా ఇరాన్‌లోనూ విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. -
కూలిన విమానం
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్లో ఓ విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన పౌర విమానం టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్, కెనడా దేశస్తులే అత్యధికంగా ఉన్నారు. ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. రెండు నిమిషాల్లోనే రాడార్ నుంచి అదృశ్యం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు (యూఐఏ) చెందిన పీఎస్ 752 విమానం టెహ్రాన్ విమానాశ్రయంనుంచి ఉదయం 6:10 గంటలకి టేకాఫ్ అయింది. ఆ తర్వాత రెండు నిమిషాలకే రాడార్‌తో సంకేతాలు తెగిపోయాయి. టెహ్రాన్ విమానాశ్రయానికి వాయవ్య దిశగా 45 కి.మీ. దూరంలో షారియార్లోని పంట పొలాల్లో విమాన శిథిలాలు కనిపించినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న 176 మందిలో ఎవరూ జీవించే అవకాశమే లేదు. ఇరాన్ మీడియా ప్రసారం చేసిన వీడియోలో విమానం కూలిన ప్రాంతంలో మంటలు, దట్టమైన పొగ అలము కొని ఉన్నాయి. సహాయ సిబ్బంది మృతదేహాలను, ప్రయాణికుల వస్తువులను మోసుకొస్తున్న దృశ్యాలు అందరి హృదయాల్ని కలిచివేశాయి. కూలిపోయిందా ? కూల్చేశారా ? ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోకుండా, వేరే ఏదైనా కుట్ర కోణం ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెంస్కీ హెచ్చరించారు. సందేహాలు ► ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన కొద్ది సేపటికే విమానం ప్రమాదానికి గురైంది. ఇరాన్ క్షిపణులకి పొరపాటున తగలడం వల్లే విమానం ప్రమాదానికి గురైందన్న అనుమానాలున్నాయి. ► బోయింగ్ 737 విమానం 2016లో తయారు చేశారు. ప్రమాదానికి గురైన రెండు రోజుల ముందే దానిని తనిఖీ చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన ఈ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే మొదటి సారి. విమానం పూర్తిగా పనిచేసే సామర్థ్యంలోనే ఉందని యూఐఏ అధ్యక్షుడు యెవగనీ వెల్లడించారు. తాము నడిపే విమానాల్లో ఇదే అత్యుత్తమమైనదనీ కన్నీళ్ల మధ్య చెప్పారు. ► విమానం కుప్పకూలాక మంటల్లో చిక్కుకుం దని ఇరాన్ మీడియా వెల్లడించింది. కానీ గాల్లోనే విమానం మంటల్లో చిక్కుకున్నట్టుగా ప్రమాద దృశ్యాల్లో కనిపిస్తోంది. ► విమానంలో టిక్కెట్ బుక్ చేసుకొని ఆఖరి నిముషంలో ఇద్దరు ప్రయాణికులు రద్దు చేసుకున్నారని ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ ఒలెక్సీ డేనిలవ్ అంటున్నారు. ► ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్ సంస్థకు కానీ, అమెరికాకి కానీ ఇరాన్ ఇంకా ఇవ్వలేదు. విమాన ప్రమాదంపై విచారణ ఏ దేశం చేస్తుందో స్పష్టత లేదని అందుకే ఇవ్వలేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ► ఈ విమాన ప్రమాదంలో మానవ తప్పిదం ఉన్నట్టుగా తాము భావించడం లేదని బోయింగ్ సంస్థ చెబుతోంది. అంతకు ముందు ఇరాన్లో ఉక్రెయిన్ దౌత్యకార్యాలయం తన వెబ్సైట్లో ఈ ప్రమాదం వెనుక ఎవరి హస్తం లేదని, ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే ఇంజిన్ వ్యవస్థ పనిచేయకపోవడమే కారణమని భావిస్తున్నట్టు వెల్లడించింది. -
'ఈ దాడులు అమెరికాకు చెంపపెట్టు'
టెహ్రాన్ : ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై మంగళవారం రాత్రి జరిపిన క్షిపణి దాడులపై ఇరాన్ సుప్రీం కమాండర్, అగ్రనేత అయతోల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇరాన్‌లోని పవిత్రమైన ఖోమ్ నగరంలో ఏర్పాటు చేసిన ఖాసీం సులేమానీ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖమేనీ మాట్లాడుతూ.. తాము గత రాత్రి ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేశామని పేర్కొన్నారు. ఈ దాడులతో తమలో కూడా తిరుగుబాటు ఇంకా బతికే ఉందని నిరూపించామని వెల్లడించారు. ఈ క్షిపణి దాడులు అమెరికాకు చెంపపెట్టులాంటిది అవుతుందని తెలిపారు. తాము చేసే ప్రతీకార దాడులు, సైనిక చర్యలు తమకు జరిగిన నష్టాన్ని పూరించలేవని తెలిపారు. నిన్న రాత్రి అమెరికా స్ధావరాలపై జరిగిన దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇలాంటివి చూడడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఖమేనీ హెచ్చరించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఉనికికి ముగింపు పలకడమే తమ కర్తవ్యమని ఖమేనీ పేర్కొన్నారు. చదవండి: 80 మంది చచ్చారు.. మళ్లీ దాడికి తెగబడితే.. రేపే ప్రకటన.. ఆత్మరక్షణ కోసమే ‘భారత్ ముందుకొస్తే స్వాగతిస్తాం’! -
తెహ్రాన్‌లో స్వల్ప భూకంపం
తెహ్రాన్: ఇరాన్ రాజధాని తెహ్రాన్, పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అయితే ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. భూకంపం కేంద్రీకృతమైన ప్రాంతం తెహ్రాన్-అల్బోర్జ్ ప్రావిన్స్‌లో మలార్డ్ నగరానికి సమీపంలో ఉంది. ఇది 12 కి.మీ. లోతులో సంభవించిందని స్థానిక టీవీ పేర్కొంది. -
ఇరాన్లో భూకంపం.. భయంతో పరుగులు
టెహ్రాన్ : ఇరాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై 6.1తీవ్రతతో ఏర్పడిన ఈ భూకంపం కెర్మాన్ ప్రావిన్స్‌లోని హజ్‌డాక్ అనే గ్రామాన్ని తాకింది. భూకంప శాస్త్రవేత్తల వివరాల ప్రకారం బుధవారం ఉదయం టెహ్రాన్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించామని అది సంభవించగానే ఇళ్లల్లో నుంచి జనాలు బయటకు పరుగులు తీశారని చెప్పారు. దీనికారణంగా దాదాపు 60 మందిగాయాలపాలయ్యారని, ఆస్తి నష్టం కూడా చోటు చేసుకున్నట్లు తెలిపారు. తొలుత 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కాస్త తర్వాత 4 తీవ్రతతో ఓసారి 5.1 తీవ్రతతో మరోసారి ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్లోనే 7.2తీవ్రతతో ఏర్పడిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దీని కారణంగా 600మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2003లో ఏర్పడిన 6.6 తీవ్రతతో ఏర్పడిన భూకంపం పెను విధ్వంసాన్నే సృష్టించి 26వేలమందిని బలితీసుకుంది. -
ఇరాన్ పార్లమెంటుపై ఉగ్ర దాడి
ఆత్మాహుతి దాడులతో ఐసిస్ బీభత్సం - 12 మంది మృతి - దీటుగా బదులిచ్చిన బలగాలు - ఐదుగంటల్లో ఆపరేషన్ పూర్తి.. ఉగ్రవాదుల హతం టెహ్రాన్: ఇరాన్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెండుచోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు. సాయుధులు, ఆత్మాహుతిదళ ఉగ్రవాదులు ఇరాన్ పార్లమెంటు, ఆ దేశ విప్లవనాయకుడు ఆయతుల్లా ఖొమేనీ స్మారక భవనం వద్ద దాడులకు పాల్పడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు ఐసిస్ బాధ్యత ప్రకటించుకుంది. అటు ఐదుగంటల పోరాటం తర్వాత అందరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇరాక్, సిరియాల్లో ఐసిస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా హెచ్చరికలు చేస్తున్న ఐసిస్ బుధవారం విధ్వంసానికి దిగింది. ఈ దాడిని ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ ఖండించారు. ‘ఈ టపాసుల చప్పుడుతో ఇరాన్ ప్రజల మనోబలాన్ని దెబ్బతీయలేరు’ అని అన్నారు. ‘అంతర్జాతీయ సమస్యగా మారిన ఉగ్రవాదంపై ఇరాన్ తీరు సుస్పష్టం. ఉగ్రవాదంపై పోరులో ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారం తప్పనిసరి’ అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ స్పష్టం చేశారు. ఈSదాడిని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్‌పై ఇది తొలి ఉగ్రదాడి కావటం గమనార్హం. దాడి ఇలా జరిగింది! ఎప్పటిలాగానే బుధవారం ఇరాన్ పార్లమెంటు సమావేశాలు ప్రారంభ మయ్యాయి. ఇంతలోనే బురఖాలు ధరించి పార్లమెంటు కాంప్లెక్సులోకి ప్రవేశించిన నలుగురు సాయుధులు.. లోపలకు వస్తూనే కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాదళ గార్డుతోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రయత్నించాయి. లోపలున్న పార్లమెంటు సభ్యులకు పటిష్టమైన భద్రత కల్పించి ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. చాలాసేపు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పార్లమెంటు భవనం నాలుగో అంతస్తులోకి చొరబడ్డ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. మరికొందరు భద్రతా దళ సభ్యులు హెలికాప్టర్లలో పార్లమెంటు భవనం పైనుంచి లోపలకు ప్రవేశించారు. మొత్తానికి ఆపరేషన్ ప్రారంభమైన ఐదుగంటల తర్వాత ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందే టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దాదాపుగా పార్లమెంటు పై దాడి జరుగుతున్న సమయంలోనే టెహ్రాన్‌లోని ఇస్లామిక్ విప్లవనాయకుడు అయతుల్లా రాహుల్లా ఖొమేనీ స్మృతి భవనం లోపలకు కూడా ముగ్గురు సాయుధులు చొరబడ్డారు. వస్తూనే కాల్పులకు తెగబడ్డారు. తోటమాలిని చంపేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వీరిని మట్టుబెట్టాయి. స్మృతి భవనం ఘటనలో ఓ మహిళా ఉగ్రవాది ఆత్మాహుతి దాడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతీకారం తప్పదు ఐసిస్‌పై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ భద్రతాదళాలు స్పష్టం చేశాయి. అమెరికా, సౌదీ అరేబియా కలిసే ఈ దాడికి కుట్రపన్నాయని ఆరోపించాయి. దాడి సమయంలోనూ సమావేశాలు పార్లమెంటుపై ఉగ్రదాడి విషయంతెలిసినా లోపలున్న ఎంపీలు ఏమాత్రం చెదిరిపోలేదు. తమ భద్రత విషయంలో ప్రత్యేక బలగాలపై పూర్తి నమ్మకంతో రోజూవారీ కార్యక్రమాలను కొనసాగించారు. కొందరు నిశ్శబ్దంగా ఉన్న తమ సెల్ఫీలను పోస్టు చేశారు. సమావేశాల్లోనే ఈ దాడిని ఖండించిన స్పీకర్ అలీ లారిజానీ.. ఇదో చిన్న ఘటన అని భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెబుతారని చెప్పారు. ప్రభుత్వం టెహ్రాన్‌తోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. గతేడాది జూన్‌లో భారీ ఉగ్రకుట్రను ఇరాన్ బలగాలు భగ్నం చేశాయి. అనంతరం విడుదల చేసిన ఓ వీడియోలో ‘ఇరాన్‌ను స్వాధీనం చేసుకుంటాం. అక్కడ సున్నీ రాజ్యాన్ని నెలకొల్పుతాం’ అని ఐసిస్ హెచ్చరించింది. -
ఇరాన్ ఉగ్రదాడి; బీభత్సం సృష్టించిన మహిళ
- చారిత్రక ఖొమేనీ స్మారకం వద్ద తననుతాను పేల్చుకున్న మహిళా ఉగ్రవాది - పార్లమెంట్ భవనంలోకి చొరబడిన ముష్కరుల హతం - దాడుల్లో ఏడుగురు పౌరులు మృతి.. మా పనేనన్న ఐసిస్ టెహ్రాన్: పవిత్ర రంజాన్ మాసం ఆరంభంలోనే ఇస్లామిక్ దేశం ఇరాన్ రక్తమోడింది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సవాలు విసురుతూ ఏకంగా పార్లమెంట్ భవనం సహా పలు చారిత్రక ప్రదేశాల్లో బుధవారం ఉగ్రవాదులు చేశారు. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు కనీసం ఏడుగురు చనిపోయినట్లు సమాచారం. బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు.. పార్లమెంట్ భవనం, చారిత్రక ప్రార్థనా స్థలాలు, ప్రఖ్యాత ఖొమేని స్మారకం వద్ద ఏకకాలంలో దాడులు చేశారు. ఏకే 47 తుపాకులు పట్టుకులు, పిస్టల్స్ చేతపట్టుకుని పార్లమెంట్ భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. అక్కడి ఉద్యోగుల్లో కొంతమందిని చంపి, మరికొంతమందిని బందీలుగా పట్టుకున్నారు. ఉగ్రవాదులు తుపాకులతో భవనం కిటికీల వద్ద నిల్చున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. రంగంలోకిదిగిన భద్రతాబలగాలు.. ఉగ్రవాదులను వేటాడి హతమార్చినట్లు తెలిసింది. మహిళా ఉగ్రవాది విధ్వంసం చారిత్రక అయతుల్లా ఖొమేనీ స్మారకచిహ్నం వద్ద ఆత్మాహుతిదాడితో బీభత్సం సృష్టించింది ఓ మహిళా ఉగ్రవాది అని తెలియడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు. భారీగా పేలుడు పదార్థాలు నింపిన దుస్తులను ధరించిన ఆ మహిళ.. ప్రార్థనా స్థలం వద్ద తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోగా, పదుల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది మా పనే: ఐసిస్ షియా దేశమైన ఇరాన్లో అలజడి సృష్టించేందుకు సున్నీ ఉగ్రవాదులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సున్నీ ప్రాబల్య ఐసిస్.. చాలా కాలం కిందటే ఇరాన్‌ను టార్గెట్ చేసుకుంది. బుధవారం నాటి టెహ్రాన్ దాడులు మా పనేనని ఐసిస్ ప్రకటించుకుంది. అయితే ఇటీవలి ఎన్నికల్లో మితవాది హసన్ రౌహానీ వరుసగా రెండోసారి విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేక అతివాదులే ఈ పని చేసిఉండొచ్చనే అనుమానాలు కూడా లేకపోలేదు. వరుస దాడులతో ఇరాన్ అతలాకుతలం! -
బాంబు దాడి జరిగినట్లే కుప్పకూలింది..
-
బాంబు దాడి జరిగినట్లే కుప్పకూలింది..
ఇరాన్: టెహ్రాన్‌లో ఓ పదిహేను అంతస్థుల పాత భవంతి కుప్పకూలింది. అంతకుముందు జరిగిన భారీ అగ్ని ప్రమాదం కారణంగా మంటల్లో కాలుతూనే అమాంతం బాంబు దాడికి గురైన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 30మంది అగ్నిమాపక సిబ్బంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు. ఈ భవనం కూలిపోతున్న దృశ్యాలు స్పష్టంగా లైవ్‌లో ప్రసారం అయ్యాయి. టెహ్రాన్‌లో ప్లాస్కో అనే ఒక పాత 15 అంతస్తుల భవనం ఉంది. ఇందులోని తొమ్మిదో అంతస్తులో తొలుత మంటలు అంటుకున్నాయి. అవి కాస్త శరవేగంగా పై అంతస్తుల్లో ఉన్న వర్క్షాపుల్లోకి వ్యాపించాయి. దీంతో పెద్ద మొత్తంలో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది వచ్చింది. మంటలు ఆర్పేందుకు లోపలికి ప్రవేశించి చర్యలు ప్రారంభించింది. వాళ్లు అలా ఆ పనుల్లో ఉండగా టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. అదే సమయంలో అందరూ చూస్తుండగా దాదాపు ఆ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 30మంది ఫైర్ సిబ్బంది చనిపోయారని, ఇప్పటికే మరో 38మంది కాలిన గాయాలతో పోరాడుతున్నారని చెప్పారు. మొత్తం నాలుగుగంటల వ్యవధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవన నిర్మాణాన్ని 1962లో పూర్తి చెశారు. ఆ సమయంలో టెహ్రాన్‌లో ఇదే అత్యంత ఎత్తయిన భవనం. ఇరాన్ సంతతికి చెందిన యూధుడు హబీబుల్లా ఎల్గానియన్ అనే ఓ వ్యాపారి దీనిని నిర్మించాడు. ఇతడిని 1979లో ఇస్లామిక్ విప్లవం తలెత్తిన తర్వాత ఉరేశారు కూడా. -
టెహ్రాన్ గురుద్వారాలో ప్రధాని మోదీ
-
'అమెరికా మా డబ్బు దొంగిలించాలనుకుంటుంది'
టెహ్రాన్: అమెరికా తీరుపై ఇరాన్ మండిపడింది. ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. ఇరాన్ దాడుల్లో గాయపడిన అమెరికన్ కుటుంబాలకు భారీ మొత్తంలో ఆ దేశ ప్రభుత్వం చెల్లింపులు జరపాలని అమెరికా కోర్టు చెప్పిన తీర్పును ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ముమ్మాటికి 'దొంగతనం'లాంటి తీర్పు అని వ్యాఖ్యానించింది. 1983లో అమెరికా గస్తీ దళం బీరుట్ లో జరిగిన బాంబు దాడుల్లో గాయపడింది. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ దాడికి ఇరాన్ కారణమని అమెరికా ఆరోపించింది. ఆ ఆరోపణల ప్రకారమే పలు దఫాలుగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దాదాపు రెండు బిలియన్ల ఆస్తులను అమెరికా కుటుంబాలకు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ జబేరి అన్సారీ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును తప్పుబడుతూ ఆ తీర్పు 'ఇరాన్ సొమ్మును దొంగలించడమే' అని అభివర్ణించారు. -
అసద్కే మా మద్దతు
టెహ్రాన్: పారిస్ ఉగ్రదాడి అనంతరం అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద రాజ్యాలనే తేడా లేకుండా ప్రపంచమంతా ఒక్కటై ఐఎస్ఐఎస్తో పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అవసరమైతే ఉగ్ర సంబంధాలు గల దేశాలతో అనుబంధాలు తెంచుకుంటామని ప్రతినబూనాయి. అయితే సోమవారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య జరిగిన సమావేశం గత తీర్మానాలను ప్రశ్నార్థకంగా మార్చింది. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో శాంతి స్థాపన జరిగేలా ఎన్నికలు నిర్వహించాలన్న అంతర్జాతీయ సంస్థల నిర్ణయాన్ని ఆయతుల్లా కొట్టిపారేశారు. సదరు వ్యవహారమంతటినీ ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. శాంతి ముసుగులో అమెరికా తన సైన్యాన్ని సిరియాలోకి దించాలని ప్రయత్నిస్తున్నదని, తద్వారా ఇక్కడి భూభాగానికి పరోక్ష పాలకుడు కావాలనుకుంటున్నదని ఆరోపించారు. అమెరికా కుట్రలపై అన్నిదేశాలు అప్రమత్తంగా ఉండాలన్న ఇరాన్ సుప్రీం.. ప్రధానంగా ఇరాన్, రష్యాలకు ఆ అవసరం మరింత ఉందని పేర్కొన్నారు. పుతిన్ తో జరిగిన సమావేశంలో ఆయతుల్లా ఇలా మాట్లాడారని, రష్యా అధ్యక్షుడు కూడా ఇరాన్ సుప్రీం అభిప్రాయంతో ఏకీభవించారని స్థానిక మీడియా వార్తా కథనాలను ప్రసారం చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ లో పర్యటిస్తున్న పుతిన్.. ఆయతుల్లా రెండు గంటలు ఏకాంత చర్చలు జరిపారు. ప్రస్తుత సిరియా అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు తమ మద్దతు కొనసాగించాలని నిర్ణయించిన ఇరాన్, రష్యాలు.. మధ్యప్రాశ్చంలో పాశ్చాత్యుల పెత్తనాన్ని అంగీకరించేదిలేదని తేల్చిచెప్పాయి. దీంతో సిరియాలో ఎన్నికల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. గత జులైలో రష్యా- ఇరాన్ ల మధ్య కుదిరిన అణుఒప్పందాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అంతేకాక మిస్సైళ్లను ధ్వంసం చేయగల అత్యాధునిక ఎస్- 300 రాకెట్లను ఇరాన్ కు సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు రాకెట్ల ఎగుమతి ప్రక్రియను ప్రారంభించినట్లు మాస్కోలోని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక దళాలకు మద్దతు తెలుపుతున్న అమెరికా.. ఆ మేరకు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అలా అమెరికా నుంచి దిగుమతైన ఆయుధ సంపత్తిలో చాలావరకు ఐఎస్ఐఎస్ చేతిలోకీ వెళుతుండటం గమనార్హం. సున్నీ తెగకు చెందిన అసద్‌ను ఎలాగైనా సరే గద్దె దించాలని షియా వర్గీయులు తిరుగుబావుటా ఎగరేయటం, ఐఎస్ఐఎస్ కూడా షియాల నాయకత్వంలో నడుస్తుండటంతో ఈ రెండు పక్షాల మధ్య లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, ఏకైక అధికారిక సున్నీ దేశంగా కొనసాగుతున్న ఇరాన్.. తన వర్గానికే చెందిన అసద్‌కు మద్దతుగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇటీవలే రష్యా కూడా అసద్‌కు మద్దతుపలికి తిరుగుబాటు దళాలపై వైమానిక దాడులు జరుపుతోంది. -
రోడ్డుపై కూలిన విమానం
39 మంది మృతి.. ఇరాన్లో దుర్ఘటన టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి తబస్ నగరానికి వెళతున్న ఓ విమానం ఆదివారం ఉదయం 9:18 గంటలకు ఓ రోడ్డుపై కూలిపోవడంతో 39 మంది మరణించారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన సెఫాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-140 విమానం నగర శివార్లలో వందలాది మిలటరీ కుటుంబాలు ఉంటున్న ప్రదేశానికి సమీపంలో రోడ్డుపై కూలిపోయిందని ‘ఐఆర్ఎన్ఏ’ వార్తా సంస్థ పేర్కొంది. రోడ్డుపక్కన ఓ గోడను, చెట్లను ఢీకొట్టి విమానం పేలిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. రద్దీగా ఉండే ఓ మార్కెట్‌కు 500 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. -
కుప్పకూలిన ఇరాన్ విమానం
టెహ్రాన్: మలేసియా విమాన దుర్ఘటన మరవకముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ పౌర విమానం ఒకటి ఆదివారం కూలిపోయింది. టెహ్రాన్ లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం ఈ ఉదయం 9.18 నిమిషాలకు కూలిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. విమానం దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్ లోని టబాస్ నగరానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలిపింది. 40 మందిపైగా మృతి చెందివుంటారని ఆందోళన చెందుతున్నారు. విమానం శకలాల కోసం గాలింపు జరుపుతున్నారు. -
శ్రీజ సంచలనం
టెహరాన్: హైదరాబాద్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి... 15 ఏళ్ల శ్రీజ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇరాన్లో జరిగిన ఫజర్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ జూనియర్ విభాగంలో సింగిల్స్ టైటిల్ గెలిచింది. శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 3-0 (11-9, 14-12, 11-7) తేడాతో బెలారస్‌కు చెందిన బరవోక్ను చిత్తు చేసింది. విజేతగా 800 డాలర్ల ప్రైజ్‌మనీని అందుకుంది. క్యాడెట్ విభాగంలో ప్రపంచ 23వ ర్యాంకర్ అయిన శ్రీజ ఈ టోర్నీలో అగ్రశ్రేణి క్రీడాకారులను చిత్తు చేసి టైటిల్ నెగ్గింది. సెమీస్‌లో హంగెరీకి చెందిన టాప్ సీడ్ క్రీడాకారిణిని మట్టికరిపించి శ్రీజ అందరి దృష్టినీ ఆకర్శించింది. మరోవైపు జూనియర్స్ సింగిల్స్‌లో వ్యక్తిగత ప్రదర్శనతో పాటు టీమ్ ఈవెంట్లోనూ శ్రీజ రాణించింది. టీమ్ విభాగంలో భారత్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. అలాగే డబుల్స్ ఈవెంట్లో శ్రీజ, ప్రియదర్శిని (బెంగాల్) కలిసి కాంస్యం సాధించారు. ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో శ్రీజ మొత్తం 12 పతకాలు సాధించడం విశేషం. డబుల్స్‌లో నైనా జోడికి స్వర్ణం: ఇదే టోర్నీ డబుల్స్ ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన నైనా జైస్వాల్ జోడి స్వర్ణం సాధించింది. బెంగాల్‌కు చెందిన మోమితా దత్తాతో జత కట్టిన నైనా 11-8, 9-11, 11-9, 11-6 తేడాతో సబా సఫారీ, మషీద్ (ఇరాన్)ను ఓడించింది. బాలికల క్యాడెట్ టీమ్ ఈవెంట్లోనూ నైనా, దత్తా జోడి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ప్రపంచ ర్యాంకింగ్స్ ఆటగాళ్లు ఫజర్ కప్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇప్పటిదాకా ఇదే నా అత్యుత్తమ ప్రదర్శనగా భావిస్తున్నాను. ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు, కోచ్ సోమ్‌నాథ్‌కు అంకితమిస్తున్నాను’ - శ్రీజ. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఒక్కరి కల. అలాంటి అవకాశాన్ని మా అమ్మాయి ఇంత చిన్న వయసులోనే చేజిక్కించుకోవడం, చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం గొప్ప విషయం. ఆమె ఘనవిజయాల పట్ల మేం గర్వపడుతున్నాం.’ - ప్రవీణ్, సాయిసుధ (శ్రీజ తల్లిదండ్రులు)