టెహ్రాన్: ఇరాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఆమె తల నరికి చంపాడో భర్త. అంతేగాక నరికిన తలతో భర్త వీధుల్లోకి రావడం తీవ్ర కలకలం రేపింది. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌లోని అహ్వాజ్‌లో ఓ వ్యక్తి తన భార్య(17) మోనా హీదారీతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన కొన్నాళ్లపాటు వీరి వివాహ బంధం సజావుగానే సాగింది.
అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త గ్రహించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య కలహాలు తలెత్తాయి. భర్తకు విషయం తెలియడంతో మహిళ దేశం విడిచి టర్కీకి పారిపోయింది. అయినప్పటికీ వివాహితను వెతికి పట్టుకున్న తండ్రి, ఆమె భర్త తిరిగి ఇరాన్‌కు తీసుకువచ్చారు. అయితే భార్య ఇంటి నుంచి పారిపోవడంతో తన పరువు పోయిందని భావించిన భర్త.. తమ్ముడితో కలిసి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు.
చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు
అంతటితో ఆగకుండా ఓ చేతిలో కత్తి, మరో చేతిలో భార్య తల పట్టుకొని రోడ్డు మీదకు నవ్వుతూ వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన భర్తతోపాటు అతని సోదరుడిని సోమవారం అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లను పోలీసులు బయటపెట్టలేదు. మరోవైపు ఈ ఊదంతంపై ఇరాన్ దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఇరాన్ దేశ ప్రజలందరూ షాక్‌కు గురయ్యారని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై స్పందించిన మహిళా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ ఎన్సీ ఖాజాలీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంట్‌ను కోరింది. కాగా ఇరాన్‌లో బాలికల వివాహ వయసు 13 ఏళ్లుగా నిర్ణయించారు. అంతేగాక బాధితురాలికి పెళ్లి అయినప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment