ఇరాన్: టెహ్రాన్‌లో ఓ పదిహేను అంతస్థుల పాత భవంతి కుప్పకూలింది. అంతకుముందు జరిగిన భారీ అగ్ని ప్రమాదం కారణంగా మంటల్లో కాలుతూనే అమాంతం బాంబు దాడికి గురైన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 30మంది అగ్నిమాపక సిబ్బంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు. ఈ భవనం కూలిపోతున్న దృశ్యాలు స్పష్టంగా లైవ్‌లో ప్రసారం అయ్యాయి. టెహ్రాన్‌లో ప్లాస్కో అనే ఒక పాత 15 అంతస్తుల భవనం ఉంది. ఇందులోని తొమ్మిదో అంతస్తులో తొలుత మంటలు అంటుకున్నాయి. అవి కాస్త శరవేగంగా పై అంతస్తుల్లో ఉన్న వర్క్షాపుల్లోకి వ్యాపించాయి.
దీంతో పెద్ద మొత్తంలో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది వచ్చింది. మంటలు ఆర్పేందుకు లోపలికి ప్రవేశించి చర్యలు ప్రారంభించింది. వాళ్లు అలా ఆ పనుల్లో ఉండగా టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. అదే సమయంలో అందరూ చూస్తుండగా దాదాపు ఆ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 30మంది ఫైర్ సిబ్బంది చనిపోయారని, ఇప్పటికే మరో 38మంది కాలిన గాయాలతో పోరాడుతున్నారని చెప్పారు. మొత్తం నాలుగుగంటల వ్యవధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవన నిర్మాణాన్ని 1962లో పూర్తి చెశారు. ఆ సమయంలో టెహ్రాన్‌లో ఇదే అత్యంత ఎత్తయిన భవనం. ఇరాన్ సంతతికి చెందిన యూధుడు హబీబుల్లా ఎల్గానియన్ అనే ఓ వ్యాపారి దీనిని నిర్మించాడు. ఇతడిని 1979లో ఇస్లామిక్ విప్లవం తలెత్తిన తర్వాత ఉరేశారు కూడా.
బాంబు దాడి జరిగినట్లే కుప్పకూలింది..
Published Thu, Jan 19 2017 6:05 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM
Advertisement
Advertisement