టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జీఎస్) స్పష్టం చేసింది. భూమి కంపించడంతో భయాబ్రాంతులకు గురైన ప్రజలు వీధుల్లోకి పరిగెత్తారు. ఈ ప్రమాదం కారణంగా ఒకరు చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఇరాన్ వైద్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కియానుష్ జహన్‌పూర్ ప్రకటించారు. అయితే భూకంపం నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఒకరు మరణించినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. టెహ్రాన్‌కి ఈశాన్యంగా ఉన్న దమావాండ్ ప్రాంతంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంపన కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
#Tehran #Earthquake photos of people waiting in the street in the early hours by IRNA. May 8 (Thr time) #زلزله_تهران #زلزله#Iran pic.twitter.com/mVS15DCLzC
— Living in Tehran (@LivinginTehran) May 7, 2020
Comments
Please login to add a commentAdd a comment