Rector scale
-
కొమురంభీం జిల్లాలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు..
కౌటాల/చింతమానెపల్లి: చింతమానెపల్లి: కుమురం భీం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. కొద్ది సెకన్లపాటు వచ్చిన ప్రకంపనలతో ఆయా మండలాల ప్రజలు భయాందోళనలకు గుర య్యారు. సిర్పూర్(టి) నియోజకవర్గం కేంద్రంగా భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కాగా, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. కౌటాల, సిర్పూర్(టి), చింతల మానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోని వస్తువులు కింద పడటంతో గమనించిన పలువురు భయాందోళనలతో బయటకు పరుగెత్తారు. భూప్రకంపనల ద్వారా ఎలాంటి నష్టం లేదని, ప్రజలు భయాందోళనలకు గురికా వొద్దని అధికారులు తెలిపారు. చదవండి: ‘సిట్’ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు.. -
దేశ రాజధాని న్యూఢిల్లీలో భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భూకంపం వచ్చింది. అయితే భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో ప్రమాదమేమీ జరగలేదు. గురువారం ఉదయం 9.17 గంటలకు పశ్చిమ ఢిల్లీలో కొంత భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 2.8గా నమోదయ్యిందని వెల్లడించింది. భూకంప కేంద్ర ఢిల్లీకి వాయవ్యంలో ఉందని ఎన్సీఎస్ అధికారులు ప్రకటించారు. భూంకంపంతో భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. అయితే ఈ స్వల్ప భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఢిల్లీలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గతంలోనూ ఢిల్లీలో స్వల్ప భూకంపాలు సంభవించాయి. గురువారం వచ్చిన భూంకంపంపై ఇంకా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
ఇరాన్లో భూకంపం.. వణికిన టెహ్రాన్
టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్జీఎస్) స్పష్టం చేసింది. భూమి కంపించడంతో భయాబ్రాంతులకు గురైన ప్రజలు వీధుల్లోకి పరిగెత్తారు. ఈ ప్రమాదం కారణంగా ఒకరు చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఇరాన్ వైద్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కియానుష్ జహన్‌పూర్ ప్రకటించారు. అయితే భూకంపం నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఒకరు మరణించినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. టెహ్రాన్‌కి ఈశాన్యంగా ఉన్న దమావాండ్ ప్రాంతంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంపన కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. #Tehran #Earthquake photos of people waiting in the street in the early hours by IRNA. May 8 (Thr time) #زلزله_تهران #زلزله#Iran pic.twitter.com/mVS15DCLzC — Living in Tehran (@LivinginTehran) May 7, 2020 -
నేపాల్ లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదు
ఖట్మాండ్: నేపాల్ రాజధాని ఖట్మాండ్లో బుధవారం రాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.2 భూకంప తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో అక్కడి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనలతో.. ప్రజలంతా ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. ఈశాన్య ఖట్మాండ్‌కు 20 కిలో మీటర్ల దూరంలో భూ ప్రకపంనలు రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదై ఉన్నట్లు భూగర్భ శాస్త్రజ్ఞులు తెలిపారు. -
నేపాల్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు
ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండులో భూకంపం సంభవించింది. బుధవారం భూమి కంపించడంతో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైనట్టు జియోలాజికల్ విభాగం అధికారులు వెల్లడించారు. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8.42 గంటల ప్రాంతంలో నేపాల్ రాజధాని ఖాట్మండుకు తూర్పున 52 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భయకంపం
రెక్టార్ స్కేల్‌పై 5 పాయింట్లు! నగరంలో పలుచోట్ల ప్రకంపనలు రోడ్లపైకి జనం పరుగులు ఎలాంటి నష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న వైనం విజయవాడ : నేపాల్‌లో మంగళవారం మళ్లీ భూకంపం వచ్చింది. ఆ ప్రభావం మన జిల్లాపై చూపింది. మధ్యాహ్నం 12.53 గంటల ప్రాంతంలో నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇటీవల నేపాల్‌లో జరిగిన భూకంపంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన విషయం ప్రజలు మరిచిపోకముందే మళ్లీ భూమి కంపించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వెంటనే రోడ్లపైకి పరుగులు తీశారు. అపార్టుమెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో ఉన్న వారు కిందికి దిగారు. రెక్టార్ స్కేల్‌పై 5 పాయింట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నవరంగ్ థియేటర్ వద్ద.. గవర్నరుపేటలోని నవరంగ్ థియేటర్ వద్ద భూప్రకంపం ప్రభావం ఎక్కువగా కనిపించింది. వాహనాల స్పేర్ పార్టులు అమ్మే దుకాణాల్లో సామగ్రి కిందపడిపోవడంతోపాటు బల్లలు, కుర్చీలు కదిలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బందరురోడ్డులో మిడ్ సిటీ హోటల్ వద్ద కూడా భూమి క ంపించడంతో హోటల్లోని వారు రోడ్లపైకి పరుగులు తీశారు. కృష్ణలంక, బెంజిసర్కిల్, గురునానక్ కాలనీ, పటమటలంక , ఆటోనగర్‌లోనూ భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గొల్లపూడి, భవానీపురం, సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాల్లోనూ అక్కడక్కడా భూమి కంపించింది. టీవీల్లో ఈ సమాచారం చూసిన బయటి ప్రాంతాలవారు నగరవాసులను ఫోన్లలో పరామర్శించారు. భూకంపం వల్ల ఆస్తినష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదని అర్బన్ తహశీల్దార్ శివరావు ‘సాక్షి’కి తెలిపారు. వణికిన జిల్లా.. ఠబందరు, అవనిగడ్డ, పామర్రు, పెడన, ఉయ్యూరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఠఅవనిగడ్డ మండలం రామచంద్రాపురం గ్రామం, కోడూరు మండలం మాచవరం గ్రామంలోనూ కొన్ని ఇళ్లలో సామానులు కింద పడిపోయాయని స్థానికులు చెప్పారు. పామర్రు స్టేట్ బ్యాంక్‌లో సొమ్ము చెల్లించడానికి క్యూలో ఉన్నవారు భూమి కంపిస్తున్నట్లు గుర్తించి బయటకు పరుగులు తీశారు. ఉయ్యూరు సాయిమహల్ సెంటర్లో భూమి స్వల్పంగా కంపించింది. కలిదిండి మండలం పెదలంకలో భూమి కంపించిందని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఇలా.. జిల్లాలో భూమి కంపించడం ఇది తొలిసారి కాదు. గతంలో కృష్ణలంక మెట్లబజార్‌లో కృష్ణానది ఒడ్డున భూమి స్వల్పంగా కంపించింది. నది ఒడ్డున ఇళ్లలో ఫ్యాన్లు స్విచ్ ఆన్ చేయకుండా తిరగడం, తలుపులు కొట్టుకోవడం జరిగాయి. దీంతో అప్పటి మునిసిపల్ కమిషనర్ ఉషారాణి కాల్వ గట్లవాసుల్ని అప్రమత్తం చేశారు. రెండేళ్ల కిందట నగరంతోపాటు నందిగామ, కంచికచర్ల తదితర మండలాల్లో ఉదయం భూమి కంపించింది. దీంతో భయభ్రాంతులైన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. మధురానగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు రాత్రిపూట రోడ్లపైనే నిద్రించారు. గత ఏడాది నందిగామలో స్వల్పంగా భూమి కంపించింది. -
థాయ్ లాండ్ లో భారి భూకంపం
-
పాక్ భూకంప మృతులు 350
ఇస్లామాబాద్: పాకిస్థాన్ నైరుతి ప్రాంతాన్ని కుదిపేసిన భారీ భూకంప మృతుల సంఖ్య 350కి పెరిగింది. క్షతగాత్రుల సంఖ్య కూడా 250కి చేరింది. బలూచిస్థాన్ రాష్ట్రంలో మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన ఈ విపత్తులో అవారన్ జిల్లా ఘోరంగా దెబ్బతింది. ఈ జిల్లాలో అత్యధిక ప్రాణనష్టం సంభవించింది. అవారన్, కెచ్ జిల్లాలో 327 మృతదేహాలను వెలికి తీశా రు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. భూకంపం ధాటికి ఆరు జిల్లాల్లో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 3 లక్ష ల మంది ఇక్కట్లకు గురయ్యారు. తిండితిప్పలు లేకఅల్లాడుతున్నారు. ఇళ్లు కోల్పోయిన వేలాది మంది శిథిలాల మధ్యే గడుపుతున్నారు. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ‘భూక ంప ద్వీపం’ నుంచి మీథేన్ వాయువు బలూచిస్థాన్‌లో భూకంపం కారణంగా అరేబియా సముద్రంలో గ్వదర్ తీరానికి 600 మీటర్ల దూరంలో ఏర్పడిన చిన్న ద్వీపం నుంచి మీథేన్ వాయువు వెలువడుతోంది. అక్కడి నేలపై వేడి బుడగలు వస్తున్నాయని, వాటిపై అగ్గిపుల్ల అంటించగానే మంటలు వస్తున్నాయని పాక్ శాస్త్రవేత్తలు చెప్పారు. -
టిబెట్‌లో భారీ భూకంపం
బీజింగ్: చైనాలోని టిబెట్ ప్రావిన్స్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. భూకంపం కారణంగా ప్రావిన్స్‌లోని 21, హిమాల యన్ ప్రాంతంలోని 17 ఇళ్లు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపా రు. పలు రోడ్లు ధ్వంసమయ్యాయని వివరించారు. అయితే, ఎలాంటి ప్రా ణ నష్టం సంభవించలేదని తెలిపారు. ఇండోనేసియాలో కూడా.. ఇండోనేసియాలోని తూర్పు ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అయితే, సునామీ హెచ్చరికలు జారీ కాలేదని పేర్కొన్నారు.