
ఖాట్మాండు: హిమాలయ దేశం నేపాల్‌లో భూమి కంపించింది. సింధుపల్‌చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వివరాల ప్రకారం.. నేపాల్‌లోని సింధుపల్‌చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడే భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు. భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని తెలిపారు. భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలందరూ బయటకు పరుగులు తీశారు. ఇక, భారత్, చైనా, టిబెట్ సరిహద్దుల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు.
కాగా, నేపాల్ భూకంపం ప్రభావం మన దేశంలోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించింది. బీహార్ రాజధాని పాట్నాతో పాటు పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Un sismo de magnitud 5.5 sacudió hoy cerca de Kathmandu, Nepal. El sismo se sintió con fuerza en la India, Bután y Bangladesh. Sin embargo, no se reportan víctima ni daños. #earthquake pic.twitter.com/X49YtPaUrf
— Centinela35 (@Centinela_35) February 28, 2025
An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit Nepal at 2.36 IST today.
(Source - National Center for Seismology) pic.twitter.com/OtockGLncO— ANI (@ANI) February 27, 2025
Comments
Please login to add a commentAdd a comment