
నేపాల్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు
ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండులో భూకంపం సంభవించింది. బుధవారం భూమి కంపించడంతో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైనట్టు జియోలాజికల్ విభాగం అధికారులు వెల్లడించారు.
భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8.42 గంటల ప్రాంతంలో నేపాల్ రాజధాని ఖాట్మండుకు తూర్పున 52 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.