ఇస్లామాబాద్: పాకిస్థాన్ నైరుతి ప్రాంతాన్ని కుదిపేసిన భారీ భూకంప మృతుల సంఖ్య 350కి పెరిగింది. క్షతగాత్రుల సంఖ్య కూడా 250కి చేరింది. బలూచిస్థాన్ రాష్ట్రంలో మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన ఈ విపత్తులో అవారన్ జిల్లా ఘోరంగా దెబ్బతింది. ఈ జిల్లాలో అత్యధిక ప్రాణనష్టం సంభవించింది. అవారన్, కెచ్ జిల్లాలో 327 మృతదేహాలను వెలికి తీశా రు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. భూకంపం ధాటికి ఆరు జిల్లాల్లో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 3 లక్ష ల మంది ఇక్కట్లకు గురయ్యారు. తిండితిప్పలు లేకఅల్లాడుతున్నారు. ఇళ్లు కోల్పోయిన వేలాది మంది శిథిలాల మధ్యే గడుపుతున్నారు. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.
‘భూక ంప ద్వీపం’ నుంచి మీథేన్ వాయువు
బలూచిస్థాన్‌లో భూకంపం కారణంగా అరేబియా సముద్రంలో గ్వదర్ తీరానికి 600 మీటర్ల దూరంలో ఏర్పడిన చిన్న ద్వీపం నుంచి మీథేన్ వాయువు వెలువడుతోంది. అక్కడి నేలపై వేడి బుడగలు వస్తున్నాయని, వాటిపై అగ్గిపుల్ల అంటించగానే మంటలు వస్తున్నాయని పాక్ శాస్త్రవేత్తలు చెప్పారు.
పాక్ భూకంప మృతులు 350
Published Thu, Sep 26 2013 1:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement