![Missile strikes in Iraq Becomes Slap In Face Of US Says By Khamenei - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/8/Khamenie.jpg.webp?itok=1sw42cjs)
టెహ్రాన్ : ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై మంగళవారం రాత్రి జరిపిన క్షిపణి దాడులపై ఇరాన్ సుప్రీం కమాండర్, అగ్రనేత అయతోల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇరాన్‌లోని పవిత్రమైన ఖోమ్ నగరంలో ఏర్పాటు చేసిన ఖాసీం సులేమానీ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖమేనీ మాట్లాడుతూ.. తాము గత రాత్రి ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేశామని పేర్కొన్నారు. ఈ దాడులతో తమలో కూడా తిరుగుబాటు ఇంకా బతికే ఉందని నిరూపించామని వెల్లడించారు.
ఈ క్షిపణి దాడులు అమెరికాకు చెంపపెట్టులాంటిది అవుతుందని తెలిపారు. తాము చేసే ప్రతీకార దాడులు, సైనిక చర్యలు తమకు జరిగిన నష్టాన్ని పూరించలేవని తెలిపారు. నిన్న రాత్రి అమెరికా స్ధావరాలపై జరిగిన దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇలాంటివి చూడడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఖమేనీ హెచ్చరించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఉనికికి ముగింపు పలకడమే తమ కర్తవ్యమని ఖమేనీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment