నా నరాల్లో పామురక్తం...మాజికల్ పవర్ నా సొంతం
హంగరీ: బాక్సింగ్ లో బారతీయ ఆటగాడిని ఎలాగైనా ఓడించాలనే తపనతో హంగేరియన్ బాక్సర్ అష్టకష్టాలు పడుతున్నాడు. భారత బాక్సర్ ఒలంపిక్ విజేత, పద్మశ్రీ, విజయేంద్ర సింగ్ ను ఎదర్కోవడానికి హంగరీ బాక్సర్ అలెగ్జాండెర్ హోర్వాత్(20) తన డైట్ లో సాంప్రదాయ పద్ధతులను ఫాలో అవుతున్నాడట. పాము రక్తాన్ని తాగుతున్నానని, దీంతో తన పవర్ పంచ్ లతో ఇక అతనికి సరైన గుణపాఠం చెబుతానంటున్నాడు.
బాక్సింగ్ రింగ్ లో విజయేంద్ర సింగ్ తో తలపడేందుకు పాము రక్తాన్ని తాగుతున్నాడు. పాము తాజా రక్తాన్ని తాగడం ద్వారా తన శరీరాన్ని మరింత ధృఢంగా శక్తివంతంగా తయారు చేసుకోవాలని అతని ప్లాన్. పాము రక్తాన్ని సేవించడం వల్ల అద్భుతమైన శక్తి సామర్ధ్యాలను సాధించ వచ్చని హంగేరియన్లు నమ్ముతారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం సైనికుల్లో కూడా అమల్లో ఉంది.
అనేక శతాబ్దాలుగా తన కుటుంబంలో తాజా పాము రక్తాన్ని తాగడం సంప్రదాయం గా కొనసాగుతోందని స్వయంగా అలెగ్జాండర్ తెలిపాడు. ఇది తనకు చాలా గర్వకారణమని, దాని మాజికల్ పవర్ ను మాటల్లో చెప్పలేనన్నాడు. పాము రక్తం తన నరాల్లో ప్రవహిస్తున్నంతసేపు తనకిక ఎదురే ఉండదని, తన ప్రధాన ప్రత్యర్థి విజయేందర్ ను మట్టికరిపిస్తానని వ్యాఖ్యానించాడు.
కాగా మార్చి 12 న భారతీయ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తో హంగేరియన్ బాక్సర్ అలెగ్జాండర్ తలపడనున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో మూడు విజయాల తర్వాత విజయేందర్ కు ఇది నాల్గవ పోటీ. అటు అలెగ్జాండర్ తనకు గట్టి పోటి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అతణ్ని ఓడించడం పెద్దకష్టం కాదని విజయేందర్ ఇప్పటికే ప్రకటించాడు.