magical power
-
మంత్రదండంలాంటి ఉంగరం..!
ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ రింగులు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో చాలా రకాలు శరీర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి యాప్ ద్వారా అప్రమత్తం చేస్తాయి. తాజాగా చైనాకు చెందిన ‘టు ఆల్ టెక్’ తయారు చేసిన ‘ఎల్–రింగ్2’ అనే ఈ ఉంగరం దాదాపు మంత్రదండం మాదిరిగానే పనిచేస్తుంది. ఇది వెనువెంటనే అనువాదం చేస్తుంది. లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు వంటివి ఉపయోగించేటప్పుడు ఇది ఎయిర్ మౌస్లా ఉపయోగపడుతుంది. మాటలను ఎంపిక చేసుకున్న భాషలోని అక్షరాల్లోకి మారుస్తుంది. ప్రపంచంలోని ప్రధాన భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచ్, చైనీస్, జపానీస్, కొరియన్, జర్మన్, స్పానిష్, అరబిక్, పోర్చుగీస్, ఇటాలియన్ భాషల్లో ఇది తక్షణ అనువాద సేవలను అందిస్తుంది. ఇది జెశ్చర్ మోడ్‌లో కూడా పనిచేస్తుంది. అరచేతి ద్వారా చేసే పదహారు రకాల సంజ్ఞలకు అనుగుణంగా ఇది కర్సర్ కదలికలను నియంత్రిస్తుంది. దీనిని ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్, విండోస్, హార్మొనీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా వాడుకోవచ్చు. ఈ ఉంగరంతో పాటు ఇచ్చే పెట్టె చార్జింగ్ చేసుకోవడానికి, రకరకాల మోడ్స్‌ను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. పెట్టెతో కలిపి దీని బరువు 33 గ్రాములు. ఉంగరం బరువు 2.8 గ్రాములు. దీని ధర 99 డాలర్లు (రూ.8,354) మాత్రమే! (చదవండి: అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!) -
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
ఫోటోషాప్ జిమ్మిక్కులు మామూలుగా ఉండవు. టెక్నాలజీమీద పట్టు ఉంటే చాలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు. అలాంటి వారిలో జేమ్స్ అనే ఫోటోషాపర్ది అందె వేసిన చేయి. ఆయన కొంచెం చమత్కారి కూడా. మన ఆర్టిస్టు మోహన్‌లా...ఫోటోషాప్‌లో కనికట్టు చేయడంలో చాలా ఫేమస్.అందుకే జేమ్స్‌కు రోజూ కొన్ని రిక్వెస్ట్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. మా ఫోటో కొంచెం ఎడిట్ చేసి ఇవ్వొచ్చు కదా అని అడుగుతారు. జేమ్స్ ఇచ్చే ట్విస్ట్‌కి ఎలాంటి వారైనా ఫిదా కావాల్సిందే. ఒరిజనల్ ఫోటో చూసేదాకా అది ఎడిట్ చేసిన ఫోటో అని ఎవరూ గుర్తుపట్టలేనంత. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే మచ్చుకు కొన్ని మీరే చూడండి.Some Hilarious Photoshop Requests that will make your day😂😂A Thread 🧵😂 pic.twitter.com/DpZi3krCrH— ✨🤍 (@Phillipong3) May 7, 2024 -
మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి: వైరల్ వీడియో
Monkeys Reaction To Zoo Visitors Magic Trick: మ్యాజిక్ అంటే పెద్దలు పిల్లలు అనే తారతమ్యం లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు కొంతమందికి రకరకాల మ్యాజిక్‌లు గురించి తెలుసుకోవడమే కాక నేర్చుకుంటుంటారు కూడా. అయితే ఇక్కడోక జూలోని కోతి మ్యాజిక్‌ని చూసి ఏ చేసిందో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే... మెక్సికోలోని చాపుల్టెపెక్ జూని సందర్శించడానికి వచ్చిన మాక్సిమిలియానో ఇబర్రా అనే వ్యక్తి ఆ జూలో కోతి ముందు సరదాగా ఒక మ్యాజిక్ ట్రిక్ ప్లే చేయాలని అనుకున్నాడు. అయితే ఆ కోతి మొదటగా ఆ మ్యాజిక్‌ని అంతగా పట్టించుకోకుండా తన ఆహారాన్ని వెతుకుతున్నట్లుగా అటు ఇటూ చూస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వ్యక్తి చేస్తున్న మ్యాజిక్‌ని ఆసక్తిగా తిలకించడం మొదలు పెట్టింది. అంతే ఆ వ్యక్తి ఆ ఆకుని ఎలా మాయం చేస్తున్నాడో అర్థం కాక మనుషులు ఎలా అయితే తెల్లబోయి చూస్తుంటారో అలానే ఆశ్చర్యంగా చూసింది. పైగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఏంటో అన్నట్లుగా విచిత్రమైన హావాభావాలను ఇచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!! ఆపై ఏం జరిగిందో చూడండి..) -
ఇత్తడి పాత్రకు అద్భుత శక్తి ఉందంటూ..
సాక్షి, రాజేంద్రనగర్: ఇత్తడి పాత్రకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని.. ఇంట్లో ఉంచి పూజ చేస్తే కోటీశ్వరులు అవుతారని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అమాయకులను నమ్మించి అంటగట్టేందుకు యత్నించిన ఓ రైస్ పుల్లింగ్ ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈమేరకు 14 మంది నిందితులను అరెస్టు చేసి రూ. 1.30 లక్షల నగదు, 16 సెల్ఫోన్లు, హోండా యాక్టివా వాహనంతో పాటు ఇత్తడి పాత్రను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇత్తడి పాత్రకు అద్భుత శక్తులు ఉన్నాయని దానిని రూ. 15 లక్షలకు విక్రయిస్తామంటూ ఒక ముఠా రాజేంద్రన గర్‌లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులతో పాటు ఎస్ఓటీ సిబ్బంది తాము కొనుగోలు చేస్తున్నట్లు ముఠా సభ్యులతో సంప్రదింపులు జరిపారు. వారం రోజుల పాటు నిందితులతో మాట్లాడి రూ. 15 లక్షలకు కొంటామని నమ్మబలికారు. రాజేంద్రనగర్ కిషన్‌బాగ్ ప్రాంతానికి వచ్చి పాత్రను తీ సుకోవాలని ముఠా సభ్యులు సమాచారం ఇవ్వడంతో రా జేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది సంయుక్తంగా దాడి చేశాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామానికి చెందిన ఏ.శ్రీనివాస్‌గౌడ్, ఎమిగనూ రు గ్రామానికి చెందిన వడ్డె ఇరుకుండ, హన్మకొండ ని వాసి సి.భాస్కర్ , బేలగాల గ్రామానికి చెందిన బి.రాములు, నందవరం మండలాని చెందిన బి.జయ రాముడు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నివాసి ప్రవీణ్‌కుమార్, కుత్బుల్లాపూర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ బిలాల్, మహ్మద్ ఆలీమ్పాషా, రాజేంద్రనగర్ సిక్చౌనీ నివాసి కుల్దీప్సింగ్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన సి.రాకేష్, బహదూర్‌పురాకు చెందిన నాగరాజు, దోమలగూడకు నివాసి సంతోష్‌కుమార్, నాంపల్లివాసి మహ్మద్ అబ్దుల్ హసన్, అత్తాపూర్‌కు చెందిన సర్ధార్ డీదర్సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు పద్నాలుగు మంది ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను నమ్మించి ఇత్తడిపాత్రను విక్రయించేందుకు ప్రయత్నించారు. ఇత్తడి పాత్రకు ఎలాంటి శక్తులు లేవని, అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేసుకొని పారిపోతారని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితులను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పోలీసులకు పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న ఇత్తడి పాత్ర రెట్టింపు డబ్బులు ఇస్తామని టోకరా పోలీసులకు ఫిర్యాదు యాలాల: ఐదేళ్ల తర్వాత రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం తోగాపూర్కు చెందిన మ్యాతరి వెంకటేష్ ఎస్ఆర్జీసీ అనే సంస్థలో డబ్బులు పొదుపు చేస్తే ఐదేళ్ల తర్వాత రెట్టింపు ఇస్తామని అప్పట్లో యాలాల మండలంలోని రాస్నం గ్రామంలోని పలువురిని నమ్మించాడు. దీంతో గ్రామానికి చెందిన గాజుల ఖైరూన్ బేగం, అబ్దుల్ కరీం, షేక్ ఖైసర్ బాను, గురదోట్ల విజయ్, గాజుల మ హ్మద్ ముస్తఫా తదితరులు రూ.25,300 చొప్పున చెల్లించారు. తీ రా గడువు పూర్తయిన తరువాత డబ్బులు ఇవ్వాలని మ్యా తరి వెంకటేష్‌ను కోరగా రేపు, మాపు అంటూ తప్పించు కొని తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితు లు తమకు ఇచ్చిన బాండ్లపై ఉన్న చిరునా మాలో ఆరా తీ యగా ఎలాంటి సంస్థ లేదని గుర్తించారు. దీంతో ఆది వారం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మ్యా తరి వెంకటేష్ నారాయణపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.2 కోట్ల మేర బాధితుల నుంచి సేకరించి మోసం చేసినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయాన్ మృతదేహం లభ్యం గగన్‌పహాడ్ చౌరస్తా సమీపంలో రాళ్లలో గుర్తింపు శంషాబాద్: వరదలో కొట్టుకుపోయిన మరో మృతదేహం ఆదివారం లభ్యమైంది. వరద నీటిలో కొట్టుకుపోయి మృతిచెందిన ఖరీమాబేగం కుమారుడు ఆయాన్(7) మృతదేహం నాలుగురోజులుగా లభ్యం కాలేదు. గగన్‌పహాడ్ చౌరస్తా సమీపంలోని సెలబ్రేషన్ కన్వెన్షన్ దగ్గర రాళ్లలో చిక్కుకుపోయిన మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వరదలో కొట్టుకుపోయిన ఆయాన్‌గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
నా నరాల్లో పామురక్తం...మాజికల్ పవర్ నా సొంతం
హంగరీ: బాక్సింగ్ లో బారతీయ ఆటగాడిని ఎలాగైనా ఓడించాలనే తపనతో హంగేరియన్ బాక్సర్ అష్టకష్టాలు పడుతున్నాడు. భారత బాక్సర్ ఒలంపిక్ విజేత, పద్మశ్రీ, విజయేంద్ర సింగ్ ను ఎదర్కోవడానికి హంగరీ బాక్సర్ అలెగ్జాండెర్ హోర్వాత్(20) తన డైట్ లో సాంప్రదాయ పద్ధతులను ఫాలో అవుతున్నాడట. పాము రక్తాన్ని తాగుతున్నానని, దీంతో తన పవర్ పంచ్ లతో ఇక అతనికి సరైన గుణపాఠం చెబుతానంటున్నాడు. బాక్సింగ్ రింగ్ లో విజయేంద్ర సింగ్ తో తలపడేందుకు పాము రక్తాన్ని తాగుతున్నాడు. పాము తాజా రక్తాన్ని తాగడం ద్వారా తన శరీరాన్ని మరింత ధృఢంగా శక్తివంతంగా తయారు చేసుకోవాలని అతని ప్లాన్. పాము రక్తాన్ని సేవించడం వల్ల అద్భుతమైన శక్తి సామర్ధ్యాలను సాధించ వచ్చని హంగేరియన్లు నమ్ముతారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం సైనికుల్లో కూడా అమల్లో ఉంది. అనేక శతాబ్దాలుగా తన కుటుంబంలో తాజా పాము రక్తాన్ని తాగడం సంప్రదాయం గా కొనసాగుతోందని స్వయంగా అలెగ్జాండర్ తెలిపాడు. ఇది తనకు చాలా గర్వకారణమని, దాని మాజికల్ పవర్ ను మాటల్లో చెప్పలేనన్నాడు. పాము రక్తం తన నరాల్లో ప్రవహిస్తున్నంతసేపు తనకిక ఎదురే ఉండదని, తన ప్రధాన ప్రత్యర్థి విజయేందర్ ను మట్టికరిపిస్తానని వ్యాఖ్యానించాడు. కాగా మార్చి 12 న భారతీయ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తో హంగేరియన్ బాక్సర్ అలెగ్జాండర్ తలపడనున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో మూడు విజయాల తర్వాత విజయేందర్ కు ఇది నాల్గవ పోటీ. అటు అలెగ్జాండర్ తనకు గట్టి పోటి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అతణ్ని ఓడించడం పెద్దకష్టం కాదని విజయేందర్ ఇప్పటికే ప్రకటించాడు.