మ్యాజికల్ ఇల్యూజన్.. మెంటలిజం మదిని చదివే కళ సాక్షితో ముచ్చటించిన సుహానీ షా..
మెంటలిజం, ఇల్యూజన్ వంటి వినూత్న మ్యాజిక్ మాయాజాలాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. సోషల్ మీడియాలో మెంటలిస్టులకు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇదే తరహాలో ప్రముఖ భారత మెంటలిస్ట్, ఇల్యూజనిస్ట్, ఇంద్రజాలికురాలు సుహానీ షా సోషల్ సెలిబ్రిటీగా మారింది. ఒక మనిషిని చూసి తన మనసులో ఏమనుకుంటున్నారో ఇట్టే చెప్పేయగల ప్రముఖ మెంటలిస్ట్ సుహానీ. ఇలా తన మైండ్ రీడింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలతో హాలీవుడ్, బాలీవుడ్ తారలతో పాటు క్రికెటర్లు, వ్యాపార దిగ్గజాలను మెస్మరైజ్ చేస్తోంది. నగరంలోని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ‘ది మ్యాజిక్ ఆఫ్ మెంటలిజం’ కార్యక్రమంలో ఈ మానసిక మాంత్రికురాలు మరోసారి తన స్కిల్‌తో వావ్ అనిపించింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మెంటలిజం, ఇల్యూజన్ తదితర అంశాల గురించి సుహానీ చెప్పిన కహానీలు ఆమె మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో
మెంటలిజం మనుషులను, వారి ఆలోచనలను పసిగట్టగల మైండ్ రీడింగ్ టెక్నిక్. దీనికి మాతృక మాత్రం మ్యాజిక్కే. మ్యాజిక్‌లో సబ్ జానర్ ఈ మెంటలిజం. మ్యాజిక్‌లో దాగున్న విభిన్న రూపాల్లో ఇల్యూజన్, బ్లైడ్ ఫోల్డ్, స్ట్రీట్ మ్యాజిక్, పాలో మ్యాజిక్, ఎస్కూలోపోలాజీ, పిక్ పాకెటింగ్ తదితరాలు ఉన్నాయి. ఒకరి ఆలోచనలను చదవగలగడం, గతాన్ని, భవిష్యత్తును సైకలాజికల్‌గా ఊహించగలగడం. దీనికి కొన్ని రకాల కోర్సులు ఉన్నాయి. నిపుణులు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
20 ఏళ్ల ప్రయాణంలో..
నేను ఏడేళ్ల వయసు నుంచి ఈ రంగంలో ఉన్నాను. దాదాపు 20 ఏళ్ల ప్రయాణంలో మొదట ఇల్యూజనిస్ట్‌గా చేశాను. ట్రెడిషనల్ ఇండియన్ మ్యాజిక్ నా మూలం. నేను గొప్ప గొప్ప చదువులు చదువుకోలేదు.. 14 ఏళ్ల వరకూ నాకు అంతగా చదవడం, రాయడం రాదు. కానీ 15వ ఏట ‘సైకాలజీ అండ్ హ్యూమన్ బిహేవియర్’ అనే పుస్తకాన్ని రాశాను. స్వీయ అనుభవాలతో రాసిన ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకూ 35 నుంచి 40 దేశాల వరకూ తిరిగి మెంటలిస్టుగా షోలు చేశాను. భారత్‌లో ప్రముఖ మహిళా మెంటలిస్ట్‌గా సహానీ షా ప్రయాణం మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. 200 మంది ఫిక్కీ లేడీస్‌ను సుహానీ మాయ చేసి మంత్రముగ్ధుల్ని చేసింది.
ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్‌ప్రైజ్ గిప్ట్
Comments
Please login to add a commentAdd a comment