Illusion
-
మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘భ్రమయుగం’ టైటిల్ ఖరారైంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్డూడియోస్ల సమర్పణలో ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. ‘భ్రమ యుగం’ సినిమా చిత్రీకరణ గురువారం ప్రారంభమైంది. ‘‘ఇప్పటివరకూ చేయని కొత్త పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాను’’ అని మమ్ముట్టి అన్నారు. ‘‘కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథ ‘భ్రమ యుగం’’ అన్నారు రాహుల్ సదాశివన్. ‘‘హారర్, థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికే మా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశాం. తొలి చిత్రాన్నే మమ్ముట్టీగారితో చేస్తుండడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. మమ్ముట్టీగారి ఇమేజ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్తుంది. దర్శకుడు రాహుల్ సృష్టించిన అద్భుత ప్రపంచం ‘భ్రమ యుగం’’ అన్నారు నిర్మాతలు. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. #Bramayugam - My next, shoot commences today ! Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @StudiosYNot pic.twitter.com/Qf9gRVwKzY — Mammootty (@mammukka) August 17, 2023 -
ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?
ఈ ఆప్టికల్ చిత్రాలు మన కంటికి నేరుగా కనపడిని చిత్రాలను వెతకి పట్టుకునేలా చేస్తుంది. ఒకరకంగా మన అంతర్ దృష్టి తట్టిలేపుతుంది. పైపైన చూసి నిర్ణయం తీసుకోకూడదనే విషయాన్ని నొక్కి చెబుతుంది. నెమ్మదిగా, తార్కికంగా మనసుపెట్టి చూస్తే అసలు చిత్రం బయటపడుతుంది. అప్పుడు మనం కూడా కనిపెట్టాశాం అని హ్యాపీగా ఫీలవుతాం. అలాగే మనకు ఎదురైన సమస్యలు కూడా అంతే. ఇలా జరిగితే కాస్త కష్టమే, పని అవ్వదు వంటి మాటలు తరుచుగా వింటుంటాం. అంతే సరిగ్గా మన విషయంలో అలా జరిగేటప్పటికీ..అందరూ అన్నారు కాబట్టి మనకు కూడా కష్టమే అని భావిస్తాం. ఇక ట్రై చేయను కూడా చెయ్యం. అసలు దాన్ని వేరేలా ఆలోచిస్తే ఏమవుతుంది. అని పరిపరి విధాలుగా ఆలోచించడానకి కూడా ట్రై చెయ్యం. నిజం చెప్పండి. ఇప్పటి వరకు మనం ఫేస్ చేసిన సమస్య నేరుగానే పరిష్కరించేశామా. మనం కాస్త ఆలోచించడమో లేదా ఎవ్వరికైనా ఇలా జరిగిందా?.. పెద్ద వాళ్లతో చర్చించి, అవసరమైతే వారి సాయం కూడా తీసుకుని సమస్య నుంచి బయటపడేందుకు యత్నించాం. ఔనా! మరి అలాంటప్పుడు సమస్య..సమస్య అంటూ కూర్చుంటే చిక్కుముడి వీడుతుందా. లేక పెడబొబ్బులు పెట్టి ఏడిస్తే తీరిపోతుందా చెప్పండి..దేనికైన ఓపికతో కూడిన సూక్ష్మబుద్ది దానికి కాస్త తెలివిని జోడిస్తే ఏ సమస్య అయినా చిటికెలో పరిష్కారమైపోతుంది. అలాగే ఇక్కడ ఆప్టికల్ చిత్రం చూస్తే ...అటు ఇటు కొరికేసిన ఆపిల్ పైకి కనిపిస్తుంది. నిజానికి ఇందులో ఇద్దరు చిన్నారులు ముఖాలు ఉన్నాయి. నేరుగా చూస్తే కనిపించదు. అలాగే మనం ఫేస్ చేసే సమస్యను కూడా నేరుగా సమస్య కోణంలో చూస్తే పరిష్కారం దొరకదు. బయటగా వచ్చి చూడాలి. ఉదహరణకు మన స్నేహితుడు లేదా మన బంధువో సమస్యలో ఉంటే ఉచిత సలహాలిచ్చేస్తాం. అదే మనమే ఆ సమస్య ఫేస్ చేస్తే ఇక అంతే. అందుకనే "సమస్యను సవాలుగా తీసుకుంటే అదినీకు దాసోహం అవుతుంది" అని ఊరికే అనలేదు పెద్దలు. అలానే ఇక్కడ ఈ బొమ్మలో ఇద్దరు చిన్నారులు ముఖాలను దాగి ఉన్నాయి కనిపెట్టయండి ఐదు సెకన్లో. కూల్‌గా! డేగ వంటి కన్నులతో వెతికి మరీ కనిపెట్టేయండి. ఇందాక నేను చెప్పినట్లే సమస్యలో కూర్చొకుండా అంటే ఇక్కడ కేవలం యాపిల్ని చూస్తే అర్థం కాదు. రెండు ముఖాలు అన్నాను కాబట్టి బయట దిశగా అంటే వాటిని తిన్న ఆకారం బాహ్య నుంచి ఏదైన ఆకృతి వస్తుందా అని చూడండి. ఈజీగా కనిపెట్టగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం తొందరగా కనిపెయండి గురు!. (చదవండి: ఒక్కరి మరణం తెచ్చిన కార్చిచ్చు..ఏకంగా 700 మందికి జైలు శిక్ష!) -
స్టేజీమీదే.. 60 సెకన్లలో.. 65 డ్రెస్సులు మార్చింది
కౌలాలంపూర్: సాధారణంగా మనం డ్రెస్ వేసుకోవడానికి ఎంత లేదన్న ఐదు నిమిషాల సమయం అయినా పడుతుంది. అదే ఇక ఆడవారు చీర కట్టుకోవాలంటే 15-30 నిమిషాల సమయం తీసుకుంటారు. కొత్తగా చీర కట్టడం నేర్చుకునేవారు అంతకన్నా ఎక్కువ సమయం కూడా తీసుకుంటారు. కానీ నిమిషం వ్వవధిలో అనగా.. 60 సెకన్ల కాలంలో 65 డ్రెస్సులు మార్చి ప్రపంచ రికార్డు సృష్టించి వారిని ఎక్కడైనా చూశారా.. లేదా అయితే ఇది చదవండి మలేషియాకు చెందిన ఓ మహిళ నిమిషం వ్యవధిలో 65 డ్రెస్సులు మార్చి.. ఔరా అనిపించింది. అది కూడా స్టేజీ మీద. అదేలా సాధ్యం అంటే.. మ్యాజిక్. ఎవరీ చిన్, సిల్వియా లిమ్ అనే ఈ జంట చేసిన ప్రదర్శన ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఈ ప్రదర్శనలో భాగంగా మహిళ స్టేజీ మీద నిల్చుని ఉంటుంది. ఆమె భర్త మ్యాజిక్ చేసే వాళ్లు ఉపయోగించే పెద్ద వస్త్రాన్ని ఆమె మీద కప్పుతాడు. దాన్ని కిందకు తీయగానే ఆమె ఒంటి మీద డ్రెస్ మారుతూ ఉంటుంది. ఇలా నిమిషం వ్యవధిలో ఈ జంట 65 డ్రెస్సులు మార్చినట్లు ఇల్యూషన్ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. -
వైరల్ వీడియో: ముఖం మొత్తం మేకప్.. చూస్తే గానీ తెలియదు!
వాషింగ్టన్: కాలం వేగంగా మారిపోతోంది. దాంతో పాటు మనుషుల అలవాట్లు మారుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వయసు దాచుకోవాలని చూస్తున్నారు. అందుకే బ్యూటీ పార్లర్లకు ఫుల్ గిరాకీ. మరోవైపు అందంగా కనిపించాలంటే చాలా సమయం, శ్రమ వెచ్చించాలనుకుంటారు చాలా మంది అమ్మాయిలు. అయితే తాజాగా ఓ అమ్మాయి వేసుకున్న మేకప్ నెటిజన్లకు పరీక్ష పెడుతోంది. చూస్తే గానీ ఏది ముక్కు, ఏవి పెదాలు, ఏవి కళ్లు తెలియడం లేదు. ఈ వీడియోలోని ముఖం మొత్తం కళ్లు, పెదాలు, చెవులు ఉన్నాయి. ఈ వీడియోను అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరలవుతోంది. మేకప్ వేసుకున్న అమ్మాయి పెదవులపై లిప్‌స్టిక్‌ను పెట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ, కళ్లు తెరిచే సరికి అసలు విషయం తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 4.70 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ ఈ వీడియో నన్ను కాసేపు అయోమయంలో పడేసింది. ఏంటి ఈ పరీక్ష?’’ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ ‘‘మేకప్ అదిరిపోయింది. అరే ఏవి ఎక్కడ వున్నాయో తెలియడం లేదు.. గోడపై పెయింటింగ్‌లా భలే ఉంది.’’ అంటూ చమత్కరించాడు. When the edibles hit… pic.twitter.com/BSeBnAAES9 — Rex Chapman🏇🏼 (@RexChapman) July 15, 2021 -
మతిస్థిమితం లేకనే చంపేసింది
అక్కన్నపేట(హుస్నాబాద్): తల్లికి మతిస్థిమితం సరిగా లేకనే కూతుర్ని రోకలిబండతో కొట్టి చంపిందని అడిషనల్ ఎస్పీ సందేపోగు మహేందర్ అన్నారు. అక్కన్నపేట మండలం మల్‌చెర్వుతండాలో తొమ్మిదేళ్ల ‘కూతురునే కడతేర్చిన కన్నతల్లి’ జరిగిన దారుణ సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం హుస్నాబాద్‌లోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తల్లి మమత అలియాస్ రాణిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన వివరాలు వెల్లడించారు. భూక్య తిరుపతి, మమత దంపతుల పెద్ద కూతురు భూక్య సోని(09) వంట చేసేందుకు ఇంట్లో బియ్యం తీస్తున్న క్రమంలో కోపోద్రికురాలై తల్లి రోకలిబండతో కూతురి తలపై బలంగా కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిందన్నారు. తల్లికి సరిగ్గా మతిస్థిమితం లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని విచారణలో తెలిందన్నారు. ఈ సమావేశంలో సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి, ఎస్సై కొత్తపల్లి రవి పాల్గొన్నారు. -
ఈ వీడియోను చూసిన వాళ్లు ఊరికే ఉంటారా?
-
వైరల్ వీడియో : మీరు ఓ సారి ప్రయత్నించండి
ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను తెగ షేక్ చేస్తోంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియోకు వస్తోన్న రెస్పాన్స్ మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల వ్యూస్, వేల కొద్ది కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన వాళ్లంతా, వీడియోలో చూపించినట్లు చేయడానికి తాము ప్రయత్నించాం, కానీ సక్సెస్ కాలేకపోతున్నామంటున్నారు. ఇంతలా చెప్తున్నామంటే అది ఎంత కష్టమైనదో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఇది ‘ఇల్యూషన్’ అంటే భ్రాంతికి సంబంధించిన వీడియో. ఇంటర్నెట్లో మనం అప్పుడప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్స్‌కు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది కూడా అలాంటి వీడియోనే. ఈ వీడియోలో ఓ యువతి ఒక చేతిని ముందుకు చాచి, మరో చేతితో ముందుకు చాచిన చేతిని వెనకవైపు నుంచి లాక్ చేస్తుంది. అంటే ముందుకు చాపిన చేతిని మరో చేయ్యి గట్టిగా పట్టుకొని ఉంటుంది. అలా పట్టుకున్న వెంటనే ముందుకు చాచిన చేతితో పంచ్ ఇవ్వడానికి వచ్చినట్లు ముందుకు తెస్తుంది. ఈ వీడియో చూసినప్పుడు కాస్తా గందరగోళంగా అనిపించడమే కాక ప్రయత్నించినప్పుడు కూడా అంత సులువుగా చేయలేకపోతున్నామంటున్నారు నెటిజన్లు. ఈ వీడియోను చిడెరా కెమకోలమ్ అనే ఓ ట్విట్టర్ యూజర్ ఆగస్టు 22 న పోస్ట్ చేసింది. ఈ వెరైటీ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు 3.3 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియోను చూసిన వాళ్లు ఊరికే ఉంటారా? ఉండరు. అందుకే వాళ్లు ట్రై చేసిన వీడియోలను ట్విట్టర్లో షేర్ చేశారు. మీరు ఈ వీడియో చూసి ఓ సారి ప్రయత్నించండి. -
కృష్ణశక్తి అభూతకల్పనేనా?
లండన్: మొత్తం విశ్వంలో దాదాపు 68 శాతం ఆవరించి ఉందని చెబుతున్న కృష్ణశక్తి(డార్క్ ఎనర్జీ) అభూతకల్పన అయి ఉండవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 1920 నుంచి గెలాక్సీల వేగాన్ని గమన్నిస్తున్న శాస్త్రవేత్తలు విశ్వం తన పరిధిని విస్తరిస్తుందని కనుగొన్నారు. విశ్వం చిన్న బిందువు దగ్గర ప్రారంభమైందని వారంటున్నారు. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో శాస్త్రవేత్తలు గెలాక్సీల్లోని నక్షత్రాల కదలికలకు అవసరమైన కంటికి కనిపించని కృష్ణ పదార్థాన్ని(డార్క్ మేటర్) కనుగొన్నారు. మొత్తం విశ్వంలో 27 శాతం కృష్ణపదార్థం ఉందని అంచనా. 1990ల్లో మరుగుజ్జు నక్షత్రాల పేలుళ్లపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మొత్తం విశ్వంలో 68 శాతం కృష్ణశక్తి ఉందని, విశ్వం తన పరిధిని పెంచుకోవడంలో ఇదే సహాయపడుతుందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఖగోళ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు కృష్ణశక్తి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. -
ఈ కొమ్మల్లో ఎంతమంది ఉన్నారో చెప్పగలరా?
కళ్లను కనికట్టు చేస్తూ నెటిజన్ల మెదళ్లకు పదును పెడుతున్న పజిల్‌లాంటి ఈ చిత్రం చాలాకాలంగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. చాలాకాలంగా ఈ కనికట్టు చిత్రానికి నెట్టింట్లో ఆదరణ లభిస్తూనే ఉంది. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఛాయాచిత్రం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చూడటానికి చెట్టులానే కనిపిస్తూ కాస్తా పరిశీలించి చూస్తే.. కొమ్మల ఆకృతుల్లో ఎందరో మహానేతల ముఖాలు దర్శనమివ్వడమే ఈ చిత్రంలోని ప్రత్యేకత. ఈ చిత్రం ఎప్పటిది.. ఏ చిత్రకారుడు దీనిని వేశారనే చర్చ చాలాకాలంగా నడుస్తున్నది. దీని చిత్రకారుడు ఎవరన్నది ఇదమిత్థంగా తెలియకపోయినా.. 1880లో హార్పర్స్ బొమ్మల పత్రిక కోసం దీనిని చిత్రించి ఉంటారనే వాదన వినిపిస్తున్నది. అయితే, ఈ చిత్రంలో కనిపిస్తున్న మహా నాయకులంతా భారతీయులే. మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, బాలాగంగాధర్ తిలక్, భగత్‌సింగ్, నేతాజీ సుభాష్‌చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వంటి ప్రముఖ నాయకుల ముఖాలను ఇందులో చూడవచ్చు. కాబట్టి భారతీయ చిత్రకారుడు వేసిన చిత్రం అయి ఉంటుందని, 1880 నాటి చిత్రం కాకపోవచ్చునని మరికొందరు భావిస్తున్నారు. ఇందులో మార్గరేట్ థాచర్, మైఖేల్ గోర్భచేవ్ వంటి విదేశీ నాయకుల ముఖాలు కూడా ఉన్నాయని ఫారిన్ నెటిజన్లు భావిస్తున్నారు. మొత్తానికి ఈ చెట్టు కొమ్మల్లో ఎంతమంది ముఖాలు ఉన్నాయన్నది ఇప్పటికీ ఆన్లైన్లో చర్చనీయాంశమే. నెటిజన్లు చాలామంది 10, 11 మంది ముఖాలు ఉన్నాయంటూ ఊహించి చేసి చెప్పారు. మరీ మీరు కనుక్కొనగలరా? ఈ చెట్టు కొమ్మల్లో ఎంతమంది ఉన్నారో..! సమాధానం తెలియకుంటే కింది చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఇందిరాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ, భగత్‌సింగ్, నేతాజీ సుభాష్‌చంద్రబోస్, మహాత్మాగాంధీ, బాలాగంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్‌గాంధీ తదితర 11 మంది ముఖచిత్రాలు కలవు. -
‘నడిచే శవం’ పేరున్న వ్యాధి... కోటార్డ్ డెల్యూషన్!
మెడి క్షనరీ జీవన్మృతుడు అనే మాట వినే ఉంటారు. బతికి ఉండీ, చచ్చిపోయినవాడితో సమానం అనే సామెతనూ చదివే ఉంటారు. ఇలాంటి మాటలు కేవలం అతిశయోక్తులు కాదు. నిజంగానే కొందరు బతికి ఉండీ చచ్చినవారిలాగే ఉంటారు. జీవించి ఉన్నప్పటికీ తాము ఎప్పుడో మరణించినట్లుగా ఈ జబ్బుకు గురైనవారు వారు నమ్ముతుంటారు. ఈ వ్యాధికి గురైన వారు చాలా విచిత్రమైన భ్రమకు గురవుతారు. తమ ఉనికి నిజం కాదని వాళ్లు బలంగా విశ్వసిస్తుంటారు. అందుకే ఈ వ్యాధిని ‘నడిచే శవం సిండ్రోమ్’ (వాకింగ్ కార్ప్స్ సిండ్రోమ్) అని పిలుస్తుంటారు. జ్యూలెస్ కోటార్డ్ ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ 1840లో ఈ వ్యాధిని ఆధునిక కాలంలో మొదటిసారి గుర్తించారు. ఆయన పేరిట ఈ వ్యాధిని ‘కోటార్డ్ డెల్యూషన్’గా పేర్కొంటుంటారు. అయితే ఆయన ఈ వ్యాధిని అధ్యయనం చేసే సమయంలో దీన్ని ‘ద డెలీరియమ్ ఆఫ్ నెగేషన్’గా ల్యూలెస్ కోటార్డ్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన పేరుతో ‘కోటార్డ్ డెల్యూషన్’ అన్న పదమే ఆ తర్వాత ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. -
వీడియో గేమ్స్‌తో దృశ్యభ్రమ!
లండన్: తరచూ వీడియోగేమ్స్ ఆడేవారు తీవ్రమైన దృశ్య భ్రమకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల నిద్ర కరువవడం, పనులు సరిగా చేసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన నాటింగ్హమ్ ట్రెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై విస్తృతంగా పరిశోధన చేశారు. తరచూ వీడియోగేమ్‌లు ఆడే 483 మంది మానసిక పరిస్థితిని విశ్లేషించి.. ‘గేమ్ ట్రాన్స్ఫర్ ఫెనోమినా (జీటీపీ)’యే దానికి కారణమని గుర్తించారు. వీరందరికీ సాధారణ సమయాల్లో కూడా వీడియోగేమ్స్లోని చిత్రాలు, దృశ్యాలు కళ్ల ముందు మసగ్గా కనిపించడం.. చుట్టూ ఉన్న పరిసరాలు, వస్తువులన్నీ ఆకారాలు, స్థానం మారుతున్నట్లుగా భ్రమ కలగడం.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ల ముందు వీడియోగేమ్ల్లోని మెనూలు, ఆప్షన్స్ మసగ్గా కనిపించడం వంటి భ్రమలు కలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. అయితే, అందరిలోనూ ఈ ప్రభావం ఒకేతీరులో కనిపించడం లేదని.. కొందరిలో అతికొద్ది సమయం పాటు కనిపించి మాయమవుతున్నాయని వారు చెబుతున్నారు. కొందరిలో మాత్రం పనులు సరిగా చేసుకోలేనంతగా, నిద్ర సరిగా పట్టనంతగా ఇబ్బంది కలుగుతోందని పేర్కొంటున్నారు.