ఈ ఆప్టికల్ చిత్రాలు మన కంటికి నేరుగా కనపడిని చిత్రాలను వెతకి పట్టుకునేలా చేస్తుంది. ఒకరకంగా మన అంతర్ దృష్టి తట్టిలేపుతుంది. పైపైన చూసి నిర్ణయం తీసుకోకూడదనే విషయాన్ని నొక్కి చెబుతుంది. నెమ్మదిగా, తార్కికంగా మనసుపెట్టి చూస్తే అసలు చిత్రం బయటపడుతుంది. అప్పుడు మనం కూడా కనిపెట్టాశాం అని హ్యాపీగా ఫీలవుతాం. అలాగే మనకు ఎదురైన సమస్యలు కూడా అంతే. ఇలా జరిగితే కాస్త కష్టమే, పని అవ్వదు వంటి మాటలు తరుచుగా వింటుంటాం. అంతే సరిగ్గా మన విషయంలో అలా జరిగేటప్పటికీ..అందరూ అన్నారు కాబట్టి మనకు కూడా కష్టమే అని భావిస్తాం. ఇక ట్రై చేయను కూడా చెయ్యం. అసలు దాన్ని వేరేలా ఆలోచిస్తే ఏమవుతుంది. అని పరిపరి విధాలుగా ఆలోచించడానకి కూడా ట్రై చెయ్యం.
నిజం చెప్పండి. ఇప్పటి వరకు మనం ఫేస్ చేసిన సమస్య నేరుగానే పరిష్కరించేశామా. మనం కాస్త ఆలోచించడమో లేదా ఎవ్వరికైనా ఇలా జరిగిందా?.. పెద్ద వాళ్లతో చర్చించి, అవసరమైతే వారి సాయం కూడా తీసుకుని సమస్య నుంచి బయటపడేందుకు యత్నించాం. ఔనా! మరి అలాంటప్పుడు సమస్య..సమస్య అంటూ కూర్చుంటే చిక్కుముడి వీడుతుందా. లేక పెడబొబ్బులు పెట్టి ఏడిస్తే తీరిపోతుందా చెప్పండి..దేనికైన ఓపికతో కూడిన సూక్ష్మబుద్ది దానికి కాస్త తెలివిని జోడిస్తే ఏ సమస్య అయినా చిటికెలో పరిష్కారమైపోతుంది.
అలాగే ఇక్కడ ఆప్టికల్ చిత్రం చూస్తే ...అటు ఇటు కొరికేసిన ఆపిల్ పైకి కనిపిస్తుంది. నిజానికి ఇందులో ఇద్దరు చిన్నారులు ముఖాలు ఉన్నాయి. నేరుగా చూస్తే కనిపించదు. అలాగే మనం ఫేస్ చేసే సమస్యను కూడా నేరుగా సమస్య కోణంలో చూస్తే పరిష్కారం దొరకదు. బయటగా వచ్చి చూడాలి. ఉదహరణకు మన స్నేహితుడు లేదా మన బంధువో సమస్యలో ఉంటే ఉచిత సలహాలిచ్చేస్తాం. అదే మనమే ఆ సమస్య ఫేస్ చేస్తే ఇక అంతే. అందుకనే "సమస్యను సవాలుగా తీసుకుంటే అదినీకు దాసోహం అవుతుంది" అని ఊరికే అనలేదు పెద్దలు.
అలానే ఇక్కడ ఈ బొమ్మలో ఇద్దరు చిన్నారులు ముఖాలను దాగి ఉన్నాయి కనిపెట్టయండి ఐదు సెకన్లో. కూల్‌గా! డేగ వంటి కన్నులతో వెతికి మరీ కనిపెట్టేయండి. ఇందాక నేను చెప్పినట్లే సమస్యలో కూర్చొకుండా అంటే ఇక్కడ కేవలం యాపిల్‌ని చూస్తే అర్థం కాదు. రెండు ముఖాలు అన్నాను కాబట్టి బయట దిశగా అంటే వాటిని తిన్న ఆకారం బాహ్య నుంచి ఏదైన ఆకృతి వస్తుందా అని చూడండి. ఈజీగా కనిపెట్టగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం తొందరగా కనిపెయండి గురు!.
(చదవండి: ఒక్కరి మరణం తెచ్చిన కార్చిచ్చు..ఏకంగా 700 మందికి జైలు శిక్ష!)
Comments
Please login to add a commentAdd a comment