మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘భ్రమయుగం’ టైటిల్ ఖరారైంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్డూడియోస్‌ల సమర్పణలో ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. ‘భ్రమ యుగం’ సినిమా చిత్రీకరణ గురువారం ప్రారంభమైంది. ‘‘ఇప్పటివరకూ చేయని కొత్త పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాను’’ అని మమ్ముట్టి అన్నారు. ‘‘కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథ ‘భ్రమ యుగం’’ అన్నారు రాహుల్ సదాశివన్.
‘‘హారర్, థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికే మా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశాం. తొలి చిత్రాన్నే మమ్ముట్టీగారితో చేస్తుండడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. మమ్ముట్టీగారి ఇమేజ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్తుంది. దర్శకుడు రాహుల్ సృష్టించిన అద్భుత ప్రపంచం ‘భ్రమ యుగం’’ అన్నారు నిర్మాతలు. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
#Bramayugam - My next, shoot commences today !
— Mammootty (@mammukka) August 17, 2023
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @StudiosYNot pic.twitter.com/Qf9gRVwKzY
Comments
Please login to add a commentAdd a comment