వైరల్‌ వీడియో : మీరు ఓ సారి ప్రయత్నించండి | Chidera Kemakolam Optical Illusion Video Has Gone Viral On Twitter | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో : మీరు ఓ సారి ప్రయత్నించండి

Published Tue, Aug 28 2018 11:21 AM | Last Updated on Tue, Aug 28 2018 12:09 PM

Chidera Kemakolam Optical Illusion Video Has Gone Viral On Twitter - Sakshi

ఓ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను తెగ షేక్‌ చేస్తోంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియోకు వస్తోన్న రెస్పాన్స్‌ మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల వ్యూస్‌, వేల కొద్ది కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన వాళ్లంతా, వీడియోలో చూపించినట్లు చేయడానికి తాము ప్రయత్నించాం, కానీ సక్సెస్‌ కాలేకపోతున్నామంటున్నారు. ఇంతలా చెప్తున్నామంటే అది ఎంత కష్టమైనదో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఇది ‘ఇల్యూషన్‌’ అంటే భ్రాంతికి సంబంధించిన వీడియో. ఇంటర్‌నెట్‌లో మనం అప్పుడప్పుడు ఆప్టికల్‌ ఇల్యూషన్స్‌కు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతుంది కూడా అలాంటి వీడియోనే.

ఈ వీడియోలో ఓ యువతి ఒక చేతిని ముందుకు చాచి, మరో చేతితో ముందుకు చాచిన చేతిని వెనకవైపు నుంచి లాక్‌ చేస్తుంది. అంటే ముందుకు చాపిన చేతిని మరో చేయ్యి గట్టిగా పట్టుకొని ఉంటుంది. అలా పట్టుకున్న వెంటనే ముం‍దుకు చాచిన చేతితో పంచ్‌ ఇవ్వడానికి వచ్చినట్లు ముందుకు తెస్తుంది. ఈ వీడియో చూసినప్పుడు కాస్తా గందరగోళంగా అనిపించడమే కాక ప్రయత్నించినప్పుడు కూడా అంత సులువుగా చేయలేకపోతున్నామంటున్నారు నెటిజన్లు.

ఈ వీడియోను చిడెరా కెమకోలమ్‌ అనే ఓ ట్విట్టర్ యూజర్ ఆగస్టు 22 న పోస్ట్ చేసింది. ఈ వెరైటీ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు 3.3 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియోను చూసిన వాళ్లు ఊరికే ఉంటారా? ఉండరు. అందుకే వాళ్లు ట్రై చేసిన వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మీరు ఈ వీడియో చూసి ఓ సారి ప్రయత్నించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement