‘నడిచే శవం’ పేరున్న వ్యాధి... కోటార్డ్ డెల్యూషన్!
మెడి క్షనరీ
జీవన్మృతుడు అనే మాట వినే ఉంటారు. బతికి ఉండీ, చచ్చిపోయినవాడితో సమానం అనే సామెతనూ చదివే ఉంటారు. ఇలాంటి మాటలు కేవలం అతిశయోక్తులు కాదు. నిజంగానే కొందరు బతికి ఉండీ చచ్చినవారిలాగే ఉంటారు. జీవించి ఉన్నప్పటికీ తాము ఎప్పుడో మరణించినట్లుగా ఈ జబ్బుకు గురైనవారు వారు నమ్ముతుంటారు. ఈ వ్యాధికి గురైన వారు చాలా విచిత్రమైన భ్రమకు గురవుతారు. తమ ఉనికి నిజం కాదని వాళ్లు బలంగా విశ్వసిస్తుంటారు. అందుకే ఈ వ్యాధిని ‘నడిచే శవం సిండ్రోమ్’ (వాకింగ్ కార్ప్స్ సిండ్రోమ్) అని పిలుస్తుంటారు.
జ్యూలెస్ కోటార్డ్ ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ 1840లో ఈ వ్యాధిని ఆధునిక కాలంలో మొదటిసారి గుర్తించారు. ఆయన పేరిట ఈ వ్యాధిని ‘కోటార్డ్ డెల్యూషన్’గా పేర్కొంటుంటారు. అయితే ఆయన ఈ వ్యాధిని అధ్యయనం చేసే సమయంలో దీన్ని ‘ద డెలీరియమ్ ఆఫ్ నెగేషన్’గా ల్యూలెస్ కోటార్డ్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన పేరుతో ‘కోటార్డ్ డెల్యూషన్’ అన్న పదమే ఆ తర్వాత ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది.