ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ రింగులు మార్కెట్‌లోకి వచ్చాయి. వాటిలో చాలా రకాలు శరీర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి యాప్ ద్వారా అప్రమత్తం చేస్తాయి. తాజాగా చైనాకు చెందిన ‘టు ఆల్ టెక్’ తయారు చేసిన ‘ఎల్–రింగ్2’ అనే ఈ ఉంగరం దాదాపు మంత్రదండం మాదిరిగానే పనిచేస్తుంది. ఇది వెనువెంటనే అనువాదం చేస్తుంది.
లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు వంటివి ఉపయోగించేటప్పుడు ఇది ఎయిర్ మౌస్‌లా ఉపయోగపడుతుంది. మాటలను ఎంపిక చేసుకున్న భాషలోని అక్షరాల్లోకి మారుస్తుంది. ప్రపంచంలోని ప్రధాన భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచ్, చైనీస్, జపానీస్, కొరియన్, జర్మన్, స్పానిష్, అరబిక్, పోర్చుగీస్, ఇటాలియన్ భాషల్లో ఇది తక్షణ అనువాద సేవలను అందిస్తుంది. ఇది జెశ్చర్ మోడ్‌లో కూడా పనిచేస్తుంది.
అరచేతి ద్వారా చేసే పదహారు రకాల సంజ్ఞలకు అనుగుణంగా ఇది కర్సర్ కదలికలను నియంత్రిస్తుంది. దీనిని ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్, విండోస్, హార్మొనీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా వాడుకోవచ్చు. ఈ ఉంగరంతో పాటు ఇచ్చే పెట్టె చార్జింగ్ చేసుకోవడానికి, రకరకాల మోడ్స్‌ను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. పెట్టెతో కలిపి దీని బరువు 33 గ్రాములు. ఉంగరం బరువు 2.8 గ్రాములు. దీని ధర 99 డాలర్లు (రూ.8,354) మాత్రమే!
(చదవండి: అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!)
Comments
Please login to add a commentAdd a comment