smart ring
-
స్మార్ట్ కే‘రింగ్’! మంత్రదండంలాంటి ఉంగరం
ఇప్పటికే మార్కెట్లోకి కొన్ని రకాల స్మార్ట్రింగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఆరోగ్య సమాచారాన్ని చేరవేస్తుంటాయి. తాజాగా చైనాకు చెందిన ‘కుమీ టెక్నాలజీస్’ మిగిలిన స్మార్ట్రింగులను మించిన ఫీచర్లతో ‘కుమి రింగ్ హెచ్1’ పేరుతో మంత్రదండంలా పనిచేసే స్మార్ట్రింగును అందుబాటులోకి తెచ్చింది.దీని తయారీకి మన్నికైన మైక్రోక్రిస్టలిన్ జిర్కోనియమ్ నానో సిరామిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించడం విశేషం. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్రింగు బ్లూటూత్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, గుండె పనితీరు, రక్తపోటు వంటి వివరాలను ఇది ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది.వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని మార్పుల వివరాలను కూడా ఇది తెలియజేస్తుంది. ఇందులో ‘ఎస్ఓఎస్’ బటన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ‘ఎస్ఓఎస్’ బటన్‌ను నొక్కితే, వెంటనే ముఖ్యమైన కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని అప్రమత్తం చేస్తుంది. దీని ధర 199.99 డాలర్లు (రూ.16,788) మాత్రమే! -
అద్భుతమైన ఫీచర్లతో బోట్ ‘స్మార్ట్ రింగ్’ లాంచ్.. ధర ఎంతంటే..
ఇప్పటివరకూ స్మార్ట్ వాచీలను ఎక్కువగా చూస్తున్నాం.. ఇప్పుడిప్పుడే చేతి వేళ్లకు ధరించగలిగే 'స్మార్ట్ రింగ్'లు సైతం మార్కెట్లోకి వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఇలాంటి స్మార్ట్ రింగ్‌ను ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ తాజాగా లాంచ్ చేసింది. ఆరోగ్య పర్యవేక్షణ నుంచి సింగిల్ హ్యాండ్ కదలికల ద్వారా చేసే స్మార్ట్ ట్రాకింగ్ యాక్టివిటీ వరకూ పలు రకాల ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ధరను రూ. 8,999లుగా కంపెనీ ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ వెబ్సైట్లలో ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల తర్వత నుంచి ఈ స్మార్ట్ రింగ్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అందరి వేళ్లకూ సరిపోయేలా ఈ రింగ్ మూడు సైజ్‌లలో వస్తుంది. బోట్ స్మార్ట్ రింగ్ ఫీచర్లు స్టైలిష్, ప్రీమియం, మెటాలిక్ లుక్ స్వైప్ నావిగేషన్‌తో ఇతర డివైజ్‌ల కంట్రోల్ ప్లే/పాజ్ మ్యూజిక్, ట్రాక్ చేంజ్, పిక్చర్ క్లిక్, అప్లికేషన్ల నావిగేట్ హార్ట్ రేటు, బాడీ రికవరీ, శరీర ఉష్ణోగ్రత, స్లీప్ మానిటరింగ్, ఋతుక్రమ ట్రాకర్ సొంత బోట్ రింగ్ యాప్‌కు కనెక్ట్ స్టెప్ కౌంట్, కరిగిన కేలరీలు, ప్రయాణించిన దూరం వంటి స్మార్ట్ యాక్టివిటీ ట్రాకింగ్ అత్యవసర పరిస్థితుల్లో ఇతరులను అప్రమత్తం చేసే ఎస్‌వోఎస్ ఫీచర్ 5 ఏటీఎం వరకు వాటర్ రెసిస్టెన్స్ -
ఈ స్మార్ట్ రింగ్ ఫింగర్లో ఉంటే ఫికర్ లేదు!
ఫిట్నెస్ ట్రాకర్‌గా పనిచేసే స్మార్ట్ రింగ్‌ను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్ భారతదేశంలో విడుదల చేసింది. చేతి వేళ్లకు ధరించగలిగేలా తయారు చేసిన రింగ్ యూజర్ల బయోమెట్రిక్స్, రోజువారీ ఫిజికల్ యాక్టివిటీస్‌ను పర్యవేక్షిస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ నీరు, చెమట నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వ్యాయామ సెషన్లు లేదా నీళ్లలో యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా ధరించవచ్చు. స్టెప్ కౌంట్, నడిచిన దూరం, కేలరీలు ఎంత మేర కరిగాయి, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలతో సహా అనేక రకాల ఆరోగ్య కొలమానాలను ఈ స్మార్ట్ రింగ్ ట్రాక్ చేస్తుంది. ఇందులో బాడీ రికవరీ ట్రాకింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇది హార్ట్ బీట్ వేరియబిలిటీ అనాలిసిస్‌తో పాటు ఓవరాల్ యాక్టివిటీ రికార్డులను ఉపయోగించి యూజర్ల మొత్తం ఆరోగ్య స్థితి గురించి తెలియజేస్తుంది. శారీరక శ్రమను ట్రాక్ చేయడంతో పాటు నిద్రను కూడా ఈ స్మార్ట్ రింగ్ పర్యవేక్షిస్తుంది. మొత్తం నిద్ర వ్యవధి, వివిధ నిద్ర దశలలో గడిపిన సమయం సంభావ్య నిద్ర భంగం వంటి అంశాలను కవర్ చేస్తూ సమగ్ర స్లీప్ డేటాను అందిస్తుంది. ఇక రుతుక్రమం ఉన్న మహిళల కోసం రుతు చక్రాలను ట్రాక్ చేసే, అంచనా వేసే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ సమాచారాన్ని నేరుగా యూజర్ల ఫోన్‌కు నోటిఫికేషన్లు, రిమైండర్ రూపంలో అందిస్తుంది. ఈ మొత్తం డేటా బోట్ రింగ్ యాప్‌లో స్టోర్ అవుతుంది. దీంతో యూజర్లు తమ ఆరోగ్య ప్రమాణాలను, పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది. అయితే ఈ స్మార్ట్ ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని బోట్ సంస్థ పేర్కొంది. -
ఈ స్మార్ట్రింగ్తో కరోనాను ముందుగానే గుర్తించండి!
కరోనా వైరస్ మన శరీరంలో ఉందో లేదో నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు స్మార్ట్ రింగ్‌ను కొనుగొన్నారు. దాని పేరు ‘ఆరా రింగ్’. దీన్ని మన వేలికి పెట్టుకుంటే అది నిత్యం మన శరీర ఉష్ణోగ్రతను లెక్కగట్టి కరోనా గురించి అంచనా వేస్తుంది. లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాకూడా వైరస్ వచ్చే అవకాశాలను గుర్తించి చెప్పగలదు. 50 మందిపై అధ్యయనం ఫిన్లాండ్కు చెందిన టెక్ స్టార్టప్ రూపొందించిన ఈ ఆరా రింగ్.. శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన, శ్వాసరేటు తదితర అంశాలను నమోదుచేస్తుంది. ఈ రింగ్ పనితీరును అంచనావేసేందుకు 65వేల మందికి ఇచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఎంఐటీ లింకన్ లాబ్ నిపుణులు ఈ రింగ్ ధరించిన 50 మందిపై అధ్యయనం చేశారు. అందులో నమోదైన ఉష్ణోగ్రతలను బట్టి జ్వరం వచ్చే అవకాశాలను అంచనావేస్తుందని, దీన్నిబట్టి కరోనా వచ్చే అవకాశాన్ని ముందే గుర్తించగలదని పరిశోధకులు చెప్పారు. అయితే, ఈ రింగ్ సామర్థ్యం గురించి పూర్తిస్థాయిలో కచ్చితమైన వివరాలు రావాలంటే మరి కొంత మందిని అధ్యయనం చేయాలని తెలిపారు. ఈ వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి. స్వల్ప లక్షణాలను కూడా.. స్వల్ప జ్వరం లాంటి మనం గుర్తించలేని లక్షణాలను కూడా ఈ రింగ్ గుర్తించగలదని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన బెంజమిన్ స్మార్ చెప్పారు. మొత్తం 65వేల మంది వివరాలను అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది చివరినాటికి దీన్ని పూర్తిచేస్తామన్నారు. కరోనాను అంచనావేసే ఈ పరికరం ఎంతో దోహదం చేస్తుందని, దీనివల్ల ఆర్యోగ శాఖ అధికారులు వేగంగా స్పందించి వైరస్‌ను వీలైనంత త్వరగా కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ‘ఈ రింగ్ వల్ల కోవిడ్–19ను త్వరగా గుర్తించవచ్చు. దీంతో ఆయా వ్యక్తులు వెంటనే ఐసొలేషన్‌లోకి వెళ్లి ఇతరులకు వైరస్ వ్యాప్తించకుండా నిరోధించవచ్చు’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ ఆష్లే మాసన్ చెప్పారు. -
ఉంగరమండీ.. మహిమ గల ఉంగరం!
వెనుక జేబులో పర్సు.. అందులో బోలెడన్ని కార్డులు. ముందు జేబులో ఇంటి తాళంచెవితోపాటు ఆఫీసుకు సంబంధించినవి మరికొన్ని కీస్! ఆఫీసులో పీసీ ఆన్ చేసేందుకు ఓ పాస్వర్డ్, కారు డోర్ తెరిచేందుకు, ఆన్ చేసేందుకు ఇంకో తాళం చెవి వీటికి అదనం. క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు పాస్‌వర్డ్‌ల సంగతి సరేసరి.. ఈ కాలంలో ఆఫీసుకెళ్లే వారందరి వద్ద ఇవి కామన్. ఇలా ఒక్కో పనికి ఒక్కోటి కాకుండా... అన్నింటికీ ఒకటే గాడ్జెట్ ఏదైనా ఉంటే? అబ్బో.. రోజూ బోలెడంత స్ట్రెస్ తగ్గిపోతుందంటున్నారా? అయితే ఫొటోలో ఉన్న ఉంగరం మీ కోసమే! తాళం చేతులు, క్రెడిట్, డెబిట్, మెంబర్షిప్పు కార్డుల వివరాలు మోసుకెళ్లడం నుంచి గాడ్జెట్ల పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం వరకూ అన్ని పనులూ ఈ ఉంగరమే చక్కబెట్టేస్తుంది. ఇంకో విషయం.. ఇది పనిచేయాలంటే మన స్మార్ట్‌ఫోన్ దగ్గరుండాల్సిన అవసరమూ లేదు. ఒకసారి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా మన వివరాలన్నింటినీ నమోదు చేసుకుంటే చాలు... ఆ తరువాత అన్ని ఇదే చూసుకుంటుంది. టోకెన్‌ను కొనుక్కున్న తరువాత ఒక్కసారి మన వేలిముద్రను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తాళమున్న చోట ఈ ఉంగరాన్ని చూపిస్తే తలుపు తెరుచుకుంటుంది.. రెండుసార్లు చిన్నగా నొక్కితే కంప్యూటర్ / ల్యాప్‌టాప్ అన్‌లాక్ అయిపోతుంది. షాపింగ్ తరువాత స్వైపింగ్ చేసే పని లేకుండా ఓ రిసీవర్‌పై మన చేయి ఉంచితే చాలు. సెకన్లలో మన బ్యాంకు నుంచి బిల్లులు జమైపోతాయి. బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు రెండింటితో ఇవన్నీ అలా అలా జరిగిపోతాయన్నమాట. ఒకవేళ చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని ఎవరైనా తొలగిస్తే.. ఆ విషయాన్ని వెంటనే గుర్తించేందుకు ఇందులో ఓ ఆప్టికల్ సెన్సర్ కూడా ఉంది. ఒకసారి ఉంగరం వేలినుంచి తీయడం ఆలస్యం.. మన వివరాలన్నీ ప్రత్యేకమైన కోడ్ భాషలోకి మారిపోతాయి. దీంతో మన సమాచారం భద్రంగా ఉంటుందన్నమాట. ఇంకో ఏడాదిలోపు ఈ హైటెక్ ఉంగరాన్ని మార్కెట్లోకి తీసుకొస్తామని అంటోంది దీన్ని తయారు చేసిన అమెరికన్ కంపెనీ టోకనైజ్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్