ఇప్పటికే మార్కెట్‌లోకి కొన్ని రకాల స్మార్ట్‌రింగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఆరోగ్య సమాచారాన్ని చేరవేస్తుంటాయి. తాజాగా చైనాకు చెందిన ‘కుమీ టెక్నాలజీస్’ మిగిలిన స్మార్ట్‌రింగులను మించిన ఫీచర్లతో ‘కుమి రింగ్ హెచ్1’ పేరుతో మంత్రదండంలా పనిచేసే స్మార్ట్‌రింగును అందుబాటులోకి తెచ్చింది.
దీని తయారీకి మన్నికైన మైక్రోక్రిస్టలిన్ జిర్కోనియమ్ నానో సిరామిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపయోగించడం విశేషం. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌రింగు బ్లూటూత్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, గుండె పనితీరు, రక్తపోటు వంటి వివరాలను ఇది ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది.
వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని మార్పుల వివరాలను కూడా ఇది తెలియజేస్తుంది. ఇందులో ‘ఎస్‌ఓఎస్’ బటన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ‘ఎస్‌ఓఎస్’ బటన్‌ను నొక్కితే, వెంటనే ముఖ్యమైన కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని అప్రమత్తం చేస్తుంది. దీని ధర 199.99 డాలర్లు (రూ.16,788) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment