ఇప్పటివరకూ స్మార్ట్ వాచీలను ఎక్కువగా చూస్తున్నాం.. ఇప్పుడిప్పుడే చేతి వేళ్లకు ధరించగలిగే 'స్మార్ట్ రింగ్'లు సైతం మార్కెట్‌లోకి వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఇలాంటి స్మార్ట్ రింగ్‌ను ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ తాజాగా లాంచ్ చేసింది.
ఆరోగ్య పర్యవేక్షణ నుంచి సింగిల్ హ్యాండ్ కదలికల ద్వారా చేసే స్మార్ట్ ట్రాకింగ్ యాక్టివిటీ వరకూ పలు రకాల ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ధరను రూ. 8,999లుగా కంపెనీ ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ వెబ్‌సైట్‌లలో ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల తర్వత నుంచి ఈ స్మార్ట్ రింగ్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అందరి వేళ్లకూ సరిపోయేలా ఈ రింగ్ మూడు సైజ్‌లలో వస్తుంది.
బోట్ స్మార్ట్ రింగ్ ఫీచర్లు
- స్టైలిష్, ప్రీమియం, మెటాలిక్ లుక్
- స్వైప్ నావిగేషన్‌తో ఇతర డివైజ్‌ల కంట్రోల్
- ప్లే/పాజ్ మ్యూజిక్, ట్రాక్ చేంజ్, పిక్చర్ క్లిక్, అప్లికేషన్‌ల నావిగేట్
- హార్ట్ రేటు, బాడీ రికవరీ, శరీర ఉష్ణోగ్రత, స్లీప్ మానిటరింగ్, ఋతుక్రమ ట్రాకర్
- సొంత బోట్ రింగ్ యాప్‌కు కనెక్ట్
- స్టెప్ కౌంట్, కరిగిన కేలరీలు, ప్రయాణించిన దూరం వంటి స్మార్ట్ యాక్టివిటీ ట్రాకింగ్
- అత్యవసర పరిస్థితుల్లో ఇతరులను అప్రమత్తం చేసే ఎస్‌వోఎస్ ఫీచర్
- 5 ఏటీఎం వరకు వాటర్ రెసిస్టెన్స్
Comments
Please login to add a commentAdd a comment