Smart gadget
-
మొబైల్లో ఆర్డర్‌చేసి కిచెన్‌లోకి వెళితే వంట రెడీ!
వై-ఫైతో అనుసంధానమయ్యే గ్యాడ్జెట్లు మన హాల్ నుంచి తిన్నగా వంట గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఎలాగంటారా.. కిచెన్‌లోనూ స్మార్ట్ పరికరాల సంఖ్య పెరుగుతోంది. హాల్లో ఎక్కువగా స్మార్ట్ టీవీ, స్మార్ట్ హోం థియేటర్, స్మార్ట్ ఫ్యాన్, సెన్సార్ డోర్లు.. వంటి పరికరాలు వాడుతుంటాం. మరి కిచెన్‌లోనూ వై-ఫైతో అనుసంధానమయ్యే ఏఐ పరికరాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరెంట్ లేకపోయినా ఇండక్షన్ కుకర్ పనిచేస్తే.. మనకేం కావాలో మొబైల్లో ఆర్డర్ పెట్టి కిచెన్‌లోకి వెళితే వంట సిద్ధంగా ఉంటే.. మైక్రోఓవెన్లో పెట్టే పదార్థాలు ఎంత సమయంలో వేడి అవుతాయో ముందుగానే తెలిస్తే.. ఊహించుకుంటేనే ఆహా అనిపిస్తుంది కదా. ఇటీవల సీయాటెల్లో జరిగిన స్మార్ట్ కిచెన్ సమ్మిట్(ఎస్కేఎస్)లో కంపెనీలు ఇలాంటి పరికరాలనే ప్రదర్శించాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.మొబైల్లో ఆర్డర్‌పెట్టి కిచెన్‌లోకి వెళితే..స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో చెఫీ అనే కంపెనీ కొత్తరకం పరికరాన్ని పరిచయం చేసింది. కంపెనీకు చెందిన యాప్‌లో మనకు కావాల్సిన వంటను ఆర్డర్‌పెట్టి కాసేపయ్యాక కిచెన్‌లోకి వెళితే ఆ వంట సిద్ధంగా ఉంటుంది. ఎలాగంటారా.. కిచెన్‌లో వంటచేసే స్మార్ట్ పరికరాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో వంటకు కావాల్సిన కూరగాయలు, పప్పులు, ఇతర ధాన్యాలు, బియ్యం..వంటివాటిని ఏర్పాటుచేసుకోవాలి. ట్రేల్లో వాటికి కేటాయించిన ప్రత్యేక సెటప్‌లో పెట్టుకోవాలి. కిచెన్‌లోని పరికరం వై-ఫైకు అనుసంధానమై ఉంటుంది. దాంతో యాప్ ద్వారా మనకు కావాల్సిన పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే అందుకు తగ్గట్టుగా ముందే ఉంచిన ట్రేల్లోని ముడి పదార్థాలను ఉపయోగించుకుని వంట సిద్ధం చేస్తుంది. ఈమేరకు కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Chefee Robotics (@chefeerobotics)బ్యాటరీతో పనిచేసే ఇండక్షన్ కుకర్ఇంపల్స్ ల్యాబ్స్ తయారుచేసిన ఇండక్షన్ కుక్‌టాప్ కరెంట్ లేకపోయినా పనిచేస్తుంది. ముందుగా వినియోగించినపుడు విద్యుత్ ద్వారా కుకర్‌లో ఉండే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. కరెంటులేని సమయంలో తిరిగి ఆ బ్యాటరీల ద్వారా కుకుర్ను వేడిచేసి వంట చేసుకునే వీలుంటుంది.ముందే సమయాన్ని చెప్పే థర్మామీటర్మైక్రోఓవెన్లో ఏదైనా పదార్థాన్ని వేడి చేయాలనుకున్నప్పుడు కంబషన్ కంపెనీ తయారుచేసిన థర్మామీటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా మనం వేడి చేయాలనుకున్న ఆహారంపై థర్మామీటర్ ఉంచాలి. అందులోని ఎనిమిది సెన్సార్లు అది ఎలాంటి పదార్థమే గుర్తించి తినడానికి అనువుగా వేడి అవ్వాలంటే ఎంతసమయం పడుతుందో తెలియజేస్తుంది.ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో కలినరీ టెక్నాలజిస్ట్ స్కాట్ హెమెండెంగర్ మాట్లాడుతూ..‘ఈ సమ్మిట్‌లో ఎన్నో అద్భుతమైన ప్రాడక్ట్స్ ప్రదర్శించారు. ఇవన్నీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మన కిచెన్లు స్మార్ట్గామారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Wife అయితే గరిటెను ఎలా అయినా వాడుతుంది. కానీ Wi-Fi మాత్రం గరిటెను స్మార్ట్ కిచెన్ కోసమే వాడుతుంది’ అన్నారు. -
ఈ గాడ్జెట్స్ గురించి విన్నారా!
నుబియా జెడ్ అల్ట్రా ఫొటోగ్రాఫర్ ఎడిషన్ నుబియా జెడ్ 60 అల్ట్రా కెమెరా ఫోన్ 2023 ఆఖరులో ప్రత్యేకమైన 35 ఎంఎం ప్రైమరీ కెమెరా, స్లైడ్ ఆల్‌రౌండ్ స్పెసిఫికేషన్లతో విడుదలైంది. ఈ ఫోన్ ఇప్పుడు కొత్త డిజైన్, అదనపు ఏఐ కెమెరా ఫీచర్లతో కొత్త వెర్షన్‌గా వస్తోంది. దీనికి నూబియా జెడ్ 60 అల్ట్రా ఫొటోగ్రాఫర్ ఎడిషన్‌గా పిలుస్తున్నారు. గెలాక్సీ ఏఐ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఆఫ్ స్మార్ట్ఫోన్లతో గత ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్లను ప్రీవియస్ జనరేషన్ ఫ్లాగ్షిప్స్కు (ఫోల్డబుల్ అండ్ నాన్–ఫోల్డబుల్ డివైజ్)కు అందుబాటులోకి తీసుకురానుంది. ‘ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎకోసిస్టమ్ అంతటా మరింత మంది వినియోగదారులకు గెలాక్సీ ఏఐ ఫీచర్లను తీసుకువస్తోంది’ అని అధికారిక ప్రెస్‌నోట్‌లో శాంసంగ్ తెలియజేసింది. ప్రొఫిసీ ల్యాప్‌టాప్ స్టాండ్ బ్రాండ్: ప్రొఫిసీ కలర్ : స్పేస్ గ్రే ఎత్తు పెంచడానికి, సరిౖయెన యాంగిల్లో కనిపించడానికి సులభంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంపాటబుల్: 11–17 అంగుళాల ల్యాప్టాప్స్ బరువు: 950 గ్రా. లెనోవా ట్యాబ్ ఎం 11 లెనోవా కొత్త బడ్జెట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఎం 11ను విడుదల చేసింది. కొన్ని వివరాలు... సైజ్: 11.0 అంగుళాలు స్క్రీన్ రిజల్యూషన్: 1200్ఠ1920 పిక్సెల్స్ ర్యామ్: 8జీబి ఇంటర్నల్ మెమోరీ: 128 జీబి బరువు: 465 గ్రా. బ్యాటరీ: 7040 ఎంఏహెచ్ ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను' -
అద్భుతమైన ఫీచర్లతో బోట్ ‘స్మార్ట్ రింగ్’ లాంచ్.. ధర ఎంతంటే..
ఇప్పటివరకూ స్మార్ట్ వాచీలను ఎక్కువగా చూస్తున్నాం.. ఇప్పుడిప్పుడే చేతి వేళ్లకు ధరించగలిగే 'స్మార్ట్ రింగ్'లు సైతం మార్కెట్లోకి వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఇలాంటి స్మార్ట్ రింగ్‌ను ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ తాజాగా లాంచ్ చేసింది. ఆరోగ్య పర్యవేక్షణ నుంచి సింగిల్ హ్యాండ్ కదలికల ద్వారా చేసే స్మార్ట్ ట్రాకింగ్ యాక్టివిటీ వరకూ పలు రకాల ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ధరను రూ. 8,999లుగా కంపెనీ ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ వెబ్సైట్లలో ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల తర్వత నుంచి ఈ స్మార్ట్ రింగ్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అందరి వేళ్లకూ సరిపోయేలా ఈ రింగ్ మూడు సైజ్‌లలో వస్తుంది. బోట్ స్మార్ట్ రింగ్ ఫీచర్లు స్టైలిష్, ప్రీమియం, మెటాలిక్ లుక్ స్వైప్ నావిగేషన్‌తో ఇతర డివైజ్‌ల కంట్రోల్ ప్లే/పాజ్ మ్యూజిక్, ట్రాక్ చేంజ్, పిక్చర్ క్లిక్, అప్లికేషన్ల నావిగేట్ హార్ట్ రేటు, బాడీ రికవరీ, శరీర ఉష్ణోగ్రత, స్లీప్ మానిటరింగ్, ఋతుక్రమ ట్రాకర్ సొంత బోట్ రింగ్ యాప్‌కు కనెక్ట్ స్టెప్ కౌంట్, కరిగిన కేలరీలు, ప్రయాణించిన దూరం వంటి స్మార్ట్ యాక్టివిటీ ట్రాకింగ్ అత్యవసర పరిస్థితుల్లో ఇతరులను అప్రమత్తం చేసే ఎస్‌వోఎస్ ఫీచర్ 5 ఏటీఎం వరకు వాటర్ రెసిస్టెన్స్ -
బోలెడు ఉపయోగాలతో.. స్మార్ట్ వాషింగ్ మెషీన్
ఇది స్మార్ట్ వాషింగ్ మెషిన్. ఇందులో ఒకే అర ఉంటుంది. ఈ అరలోనే బట్టలు ఉతకడం, ఆరవేయడం ప్రక్రియలు చాలా తేలికగా పూర్తయిపోతాయి. అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘పారాడిమ్ ఎవర్గ్రీన్’ కంపెనీ ఇటీవల ఈ స్మార్ట్ వాషింగ్ మెషిన్‌కు రూపకల్పన చేసింది. ఇంట్లో ఎక్కడైనా దీన్ని సౌకర్యవంతంగా పెట్టుకోవచ్చు. ఒక చోటు నుంచి మరో చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. మామూలు వాషింగ్ మెషిన్ల మాదిరిగా ఇది ఎక్కువ చోటు ఆక్రమించుకోదు. అందువల్ల చిన్న చిన్న ఇళ్లలోనూ దీనిని సులువుగా వాడుకోవచ్చు. ‘ఈవీ స్మార్ట్ లాండ్రీ సొల్యూషన్’ పేరుతో ‘పారాడిమ్ ఎవర్గ్రీన్’ దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో కేవలం 90 నిమిషాల్లోనే బట్టలను శుభ్రంగా ఉతికి, ఆరేసుకోవచ్చు. దీని ధర 1199 డాలర్లు (రూ.98,675) మాత్రమే! చదవండి: సూపర్ గ్యాడ్జెట్ : బట్టతలపై వెంట్రుకలు కావాలా నాయనా! -
దోమల దాడి తట్టుకోలేకపోతున్నారా..? ఇది చేతికి తొడుక్కుంటే...
ఇది చూడటానికి ఫ్యాషన్ రిస్ట్బ్యాండ్లా కనిపిస్తుంది. దీనిని చేతికి తొడుక్కుంటే, దోమలు ఆమడదూరం పరారైపోతాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంజినీర్ కర్ట్ స్టోల్ రూపొందించిన ఈ పరికరాన్ని స్విస్ కంపెనీ ‘నోపిక్స్గో’ త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇదీ చదవండి: ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు! దోమల నుంచి రక్షణ కల్పించే ఈ హైటెక్ రిస్ట్‌బ్యాండ్, పరిసరాల్లో దోమలను గుర్తించగానే, విద్యుత్ తరంగాలను విడుదల చేస్తుంది. ఇందులోంచి వెలువడే విద్యుత్ తరంగాల తాకిడికి ఏదో తుఫాను ముంచుకొస్తున్నట్లుగా దోమలు గందరగోళంలో పడి, వెంటనే పారిపోతాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా దీని ఉత్పత్తి ప్రారంభించాలని ‘నోపిక్స్గో’ భావిస్తోంది. దీని ధర 70 యూరోల (రూ.6,255) వరకు పెట్టవచ్చని అంచనా! ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఈ హెడ్సెట్ పెట్టుకుంటే నిమిషాల్లో నిద్రొచ్చేస్తుంది!
ప్రశాంతమైన నిద్ర ప్రతి మనిషికి అవసరం. అయితే, ప్రపంచంలో నిద్రలేమితో బాధపడేవాళ్ల చాలామందే ఉన్నారు. ఒక్కోసారి చక్కగా నిద్రపట్టడానికి చిట్కాలు పాటించినా ఫలితం ఉండని పరిస్థితి ఉంటుంది. నిద్ర పట్టడం లేదంటూ డాక్టర్ల దగ్గరకు వెళితే యథాలాపంగా నిద్రమాత్రలు రాస్తారు. నిద్రమాత్రలు వాడితే తాత్కాలికంగా నిద్రపట్టినా, దీర్ఘకాలంలో వాటి దుష్పరిణామాలను ఎదుర్కొని ఇబ్బందిపడక తప్పదు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నిద్రపట్టేలా చేసేందుకు దక్షిణ కొరియా కంపెనీ ‘లీసాల్ బ్రెయిన్’ ఇటీవల ‘స్లీపిసాల్’ పేరుతో ఒక హెడ్‌సెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) దీనిని తలకు తొడుక్కుని, మొబైల్ఫోన్లో దీనికి సంబంధించిన యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నాలుగు మోడ్స్ ఉంటాయి. అవి: స్లీప్ మోడ్, స్ట్రెస్ మోడ్, కాన్సంట్రేషన్ మోడ్, రెస్ట్ మోడ్. కోరుకున్న మోడ్‌ను యాప్ ద్వారా ఎంపిక చేసుకుంటే, ఈ హెడ్సెట్ దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఇది నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. నిద్రపట్టక ఇబ్బందిపడేవారికి నిమిషాల్లోనే ప్రశాంతమైన నిద్రనిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. మెలకువగా ఉన్నప్పుడు ఏకాగ్రత పెంచుతుంది. అలసి సొలసి ఉన్నప్పుడు విశ్రాంతినిస్తుంది. దీని ధర 199 డాలర్లు (రూ.16,377) మాత్రమే! (ఎయిర్ కూలర్ కమ్ హీటర్: చల్లగా.. వెచ్చగా.. ఎలా కావాలంటే అలా..) -
స్మార్ట్ వాచెస్ ఓల్డ్ ట్రెండ్.. ఇప్పుడొచ్చాయ్ స్మార్ట్ గ్లాసెస్
స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగాక రిస్ట్ వాచెస్ కనుమరుగై పోయాయి అనుకున్నాం. కానీ అవి స్మార్ట్ వాచెస్గా రూపాంతరం చెంది టైం సంగతి పక్కన పెడితే కాల్స్, మెసేజ్‌లను కంట్రోల్ చేయడంతో పాటు హెల్త్‌కి సంబంధించి వాకింగ్ మొదలు హార్ట్‌బీట్ వరకు సమస్త సమాచారం చెప్పేస్తున్నాయ్. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. స్మార్ట్ వాచెస్కి తోడుగా స్మార్ట్ గాగుల్స్ కూడా రంగంలోకి దిగాయి. లైఫ్ స్టైల్ అంటే నిన్నా మొన్నటి వరకు ట్రెండీ గార్మెంట్స్‌ను బట్టి అంచనా వేసే వారు కానీ ఇప్పుడు కాలం మారింది. ఓ వ్యక్తి లైఫ్‌స్టైల్‌ని అంచనా వేయాలంటే ఉపయోగించే గ్యాడ్జెట్స్, టెక్నాలజీకి ఎంతగా అడాప్ట్ చేసుకుంటున్నారనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యాయి. ఈ ట్రెండ్‌ని అంచనా వేసిన ఇండియాకి చెందిన నాయిస్ సంస్థ తొలిసారిగా స్మార్ట్ గ్లాసెస్‌ని ఐ వేర్ ఐ1 పేరుతో ఇండియాలో రిలీజ్ చేసింది. లెటెస్ట్ టెక్నాలజీలో నాయిస్ల్యాబ్స్ రూపొందించిన ఈ గాస్లెస్ స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం అవుతాయి. ఫోన్‌తో సంబంధం లేకుండానే కాల్స్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంది. బ్లూటూత్ 5.0 ద్వారా ఈ గ్లాసెస్ మొబైల్‌తో కనెక్ట్ అవుతాయి. ఇందులో ప్రత్యేకంగా మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్ టెక్నాలజీను ఉపయోగించారు. దీంతో ఇయర్‌ఫోన్స్ లేకుండా సౌకర్యవంతంగా కాల్స్‌ను మాట్లాడుకునే వీలుంది. మ్యూజిక్ మ్యాజిక్ ఫోన్ కాల్ మేనేజ్మెంట్తో పాటు నాయిస్ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా చక్కని మ్యూజిక్ హియరింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. ఇయర్‌బడ్స్ లేకుండానే మ్యూజిక్ చక్కగా ఆస్వాదించేలా ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను డిజైన్ చేశారు. వైర్లెస్ టెక్నాలజీ ద్వారా ఈ గ్లాసెస్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల పాటు పని చేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు 120 పాటలు వినవచ్చు. ఒత్తిడి తగ్గిస్తుంది ఇక స్మార్ట్‌గ్లాసెస్ ఉపయోగించడం వల్ల కళ్లపై పడే ఒత్తడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ / ల్యాప్‌ట్యాప్‌ల ముందు పని చేసే సమయంలో కంటిపై పడే అదనపు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆల్ట్రావైలెట్ కిరణాల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తుంది. ఇంత స్మార్ట్ గ్లాసెస్ అయినా ఇందులో కెమెరాలు లేకపోవడం ఒక లోటుగానే చెప్పుకోవచ్చు. కెమెరాతో పాటు మరికొన్ని సెన్సార్లను అమర్చినట్టయితే ఫ్యూచర్ టెక్నాలజీ మెటావర్స్‌కి కూడా ఉపయోగకరంగా ఉండేది. ధర ఎంతంటే నాయిస్ సంస్థ మార్కెట్లోకి తెచ్చిన స్మార్ట్ గ్లాసెస్ gonoise.com వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్పీ రూ.12,999లు కాగా ప్రారంభ ఆఫర్‌గా 53 శాతం డిస్కౌంట్‌తో రూ. 5,999లకే లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లో పెద్దగా లేవు. నాయిస్ కంటే ముందు బోస్ సంస్థ మ్యూజిక్ లవర్స్ కోసం స్మార్ట్‌గ్లాసెస్ మార్కెట్లోకి తీసుకొచ్చినా అవి పూర్తిగా ప్రీమియం కేటగిరిలో అందుబాటులో ఉన్నాయి. చదవండి: పోకో సరికొత్త స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఫీచర్లతో -
యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే?
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించడంలో యాపిల్ దిట్ట. ఫింగర్ ప్రింట్, స్మార్ట్‌వాచ్, నాచ్ డిస్ప్లే .. ఇలా ఏదైనా సరే యాపిల్ ప్రవేశ పెడితే వెంటనే ఫాలో కావడానికి అనేక మంది కస్టమర్లు రెడీగా ఉంటారు. తదనంతర కాలంలో మిగిలిన కంపెనీలు అదే టెక్నాలజీని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. యాపిల్ సంస్థ తాజాగా స్మార్ట్ వాటర్ బాటిళ్లను మార్కెట్లోకి తెస్తోంది, యాపిల్ ఆన్లైన్ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఈ బాటిళ్లు అమ్మకానికి పెడుతోంది. ఈ స్మార్ట్ వాటర్ బాటిళ్లు యాపిల్ స్మార్ట్ వాచ్‌తో సింక్రనైజ్ అవుతాయి. ఆ తర్వాత నిత్యం మనం తీసుకుంటున్న నీరు. మనం చేస్తున్న శారీరక శ్రమ తదితర వాటిని బేరీజు వేస్తుంది. ఈ డేటా ఆధారంగా ఎంత నీరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌ను హిడ్రేట్‌స్పార్క్ సంస్థ తయారు చేసింది. హిడ్రేట్ స్పార్క్ ప్రో, హిడ్రేట్ ప్పార్క్ ప్రో స్టీల్ రెండు వెర్షన్లలో లభిస్తోంది. స్పార్క్ ప్రో ధర రూ.4,500 (59.95 డాలర్లు), స్పార్క్ ప్రో స్టీల్ ధర రూ. 6,000 (79.95 డాలర్లు)గా ఉన్నాయి. గతంలో యాపిల్ సంస్థ స్మార్ట్‌వాచెస్.. గుండె పోటుతో ఇబ్బంది పడుతున్న వారినికి సంబంధించి అలెర్ట్‌లు పంపించి ప్రాణాలు కాపాడిన వార్తలు చక్కర్లు కొట్టాయి. రేపు ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ గురించి ఎన్ని విశేషాలు బయటకు వస్తాయో చూడాలి. చదవండి: రోబో ఎలుక -
ఈ గొడుగు చాలా స్మార్ట్ గురూ!
స్మార్ట్ గాడ్జెట్ వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదనేది కాలం చెల్లిన సామెత. ప్రాణం పోకడ సంగతలా ఉంచితే, ఇక్కడి ఫొటోలో కనిపిస్తున్న గొడుగు వాన రాకడను ఇంచక్కా గంట ముందే చెప్పేయగలదు. ‘వెజూ’ అనే ఫ్రెంచి కంపెనీ ఈ గొడుగును రూపొందించింది. దీనిని ‘ఊంబ్రెల్లా’ బ్రాండ్ పేరిట మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. వాతావరణంలో రాబోయే మార్పులను ఇది గంట ముందే చెప్పేస్తుంది. ఈ గొడుగు పైభాగంలో ఏర్పాటు చేసిన సెన్సర్లు వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తాయి. ఎండ తీవ్రత, వాతావరణంలోని తేమ, గాలి పీడనం వంటి ప్రతి అంశాన్నీ స్మార్ట్ ఫోన్‌కు చేరవేస్తాయి. రాబోయే గంట వ్యవధిలో వాతావరణంలో తలెత్తబోయే మార్పులను ముందుగానే అంచనా వేసి, స్మార్ట్‌ఫోన్‌కు హెచ్చరికలు జారీచేస్తాయి. మరో విశేషం ఏమిటంటే, దీనిని ఎక్కడైనా మర్చిపోయినా మరేమీ ఫర్వాలేదు. జీపీఎస్ ఆధారంగా ఇది ఎక్కడ ఉన్నదీ వెంటనే స్మార్ట్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. అందువల్ల దీన్నెవరైనా కొట్టేస్తారేమోననే బెంగ కూడా అక్కర్లేదు. దీని రిటైల్ ధర 86 డాలర్లు (రూ.5,725) మాత్రమే. అంటే దాదాపు ఒక సగటు స్మార్ట్‌ఫోన్ ధరకు సమానం. ఎండ నుంచి, వాన నుంచి తలకు రక్షణ ఇచ్చే గొడుగుకు ఇది పెద్దమొత్తం అనిపించవచ్చు కానీ, ఇది మొబైల్ వాతావరణ కేంద్రంలా పనిచేస్తుంది మరి.