టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించడంలో యాపిల్ దిట్ట. ఫింగర్ ప్రింట్, స్మార్ట్‌వాచ్, నాచ్ డిస్‌ప్లే .. ఇలా ఏదైనా సరే యాపిల్ ప్రవేశ పెడితే వెంటనే ఫాలో కావడానికి అనేక మంది కస్టమర్లు రెడీగా ఉంటారు. తదనంతర కాలంలో మిగిలిన కంపెనీలు అదే టెక్నాలజీని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.
యాపిల్ సంస్థ తాజాగా స్మార్ట్ వాటర్ బాటిళ్లను మార్కెట్‌లోకి తెస్తోంది, యాపిల్ ఆన్‌లైన్ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఈ బాటిళ్లు అమ్మకానికి పెడుతోంది. ఈ స్మార్ట్ వాటర్ బాటిళ్లు యాపిల్ స్మార్ట్ వాచ్‌తో సింక్రనైజ్ అవుతాయి. ఆ తర్వాత నిత్యం మనం తీసుకుంటున్న నీరు. మనం చేస్తున్న శారీరక శ్రమ తదితర వాటిని బేరీజు వేస్తుంది. ఈ డేటా ఆధారంగా ఎంత నీరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌ను హిడ్రేట్‌స్పార్క్ సంస్థ తయారు చేసింది. హిడ్రేట్ స్పార్క్ ప్రో, హిడ్రేట్ ప్పార్క్ ప్రో స్టీల్ రెండు వెర్షన్లలో లభిస్తోంది. స్పార్క్ ప్రో ధర రూ.4,500 (59.95 డాలర్లు), స్పార్క్ ప్రో స్టీల్ ధర రూ. 6,000 (79.95 డాలర్లు)గా ఉన్నాయి. గతంలో యాపిల్ సంస్థ స్మార్ట్‌వాచెస్.. గుండె పోటుతో ఇబ్బంది పడుతున్న వారినికి సంబంధించి అలెర్ట్‌లు పంపించి ప్రాణాలు కాపాడిన వార్తలు చక్కర్లు కొట్టాయి. రేపు ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ గురించి ఎన్ని విశేషాలు బయటకు వస్తాయో చూడాలి.
చదవండి: రోబో ఎలుక
Comments
Please login to add a commentAdd a comment