ప్రశాంతమైన నిద్ర ప్రతి మనిషికి అవసరం. అయితే, ప్రపంచంలో నిద్రలేమితో బాధపడేవాళ్ల చాలామందే ఉన్నారు. ఒక్కోసారి చక్కగా నిద్రపట్టడానికి చిట్కాలు పాటించినా ఫలితం ఉండని పరిస్థితి ఉంటుంది. నిద్ర పట్టడం లేదంటూ డాక్టర్ల దగ్గరకు వెళితే యథాలాపంగా నిద్రమాత్రలు రాస్తారు. నిద్రమాత్రలు వాడితే తాత్కాలికంగా నిద్రపట్టినా, దీర్ఘకాలంలో వాటి దుష్పరిణామాలను ఎదుర్కొని ఇబ్బందిపడక తప్పదు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నిద్రపట్టేలా చేసేందుకు దక్షిణ కొరియా కంపెనీ ‘లీసాల్ బ్రెయిన్’ ఇటీవల ‘స్లీపిసాల్’ పేరుతో ఒక హెడ్‌సెట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
(ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..)
దీనిని తలకు తొడుక్కుని, మొబైల్‌ఫోన్‌లో దీనికి సంబంధించిన యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నాలుగు మోడ్స్ ఉంటాయి. అవి: స్లీప్ మోడ్, స్ట్రెస్ మోడ్, కాన్సంట్రేషన్ మోడ్, రెస్ట్ మోడ్. కోరుకున్న మోడ్‌ను యాప్ ద్వారా ఎంపిక చేసుకుంటే, ఈ హెడ్‌సెట్ దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఇది నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. నిద్రపట్టక ఇబ్బందిపడేవారికి నిమిషాల్లోనే ప్రశాంతమైన నిద్రనిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. మెలకువగా ఉన్నప్పుడు ఏకాగ్రత పెంచుతుంది. అలసి సొలసి ఉన్నప్పుడు విశ్రాంతినిస్తుంది. దీని ధర 199 డాలర్లు (రూ.16,377) మాత్రమే!
(ఎయిర్ కూలర్ కమ్ హీటర్: చల్లగా.. వెచ్చగా.. ఎలా కావాలంటే అలా..)
Comments
Please login to add a commentAdd a comment