Headset
-
మెల్లను నయంచేసే హెడ్సెట్.. కళ్లద్దాలు, ఆపరేషన్లు అవసరం లేదు!
కంటి సమస్యల్లో మెల్ల చిన్నప్పుడే ఏర్పడి, జీవితాంతం వేధిస్తుంది. లావాటి కళ్లద్దాలతో మెల్ల వల్ల ఏర్పడే దృష్టిలోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. శస్త్రచికిత్సతో మెల్లకన్నును పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. అయితే, ఇవి కొంత ఇబ్బందికరమైన ప్రక్రియలు. మెల్లను నయం చేయడానికి ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన త్రీడీ విజువల్ డిజైనర్ హేచాన్ ర్యు ఒక ప్రత్యేకమైన హెడ్‌సెట్‌ని రూపొందించారు. ‘సింప్లిసిటీ విత్ ప్రొఫెషనలిజం’ (ఎస్‌డబ్ల్యూపీ) పేరుతో రూపొందించిన ఈ హెడ్‌సెట్‌ని కళ్లను కప్పి ఉంచేలా తయారు చేశారు. ఇందులోని లెన్స్ దీనిని ధరించిన వారి లోపానికి అనుగుణంగా సర్దుకుని, సౌకర్యవంతంగా చూసేందుకు వీలు కల్పిస్తాయి. ఈ హెడ్‌సెట్‌లోని మోటరైజ్డ్ ప్రిజమ్ లోపల తిరుగుతూ కళ్లకు తగిన వ్యాయామం కల్పిస్తుంది. ఇది క్రమంగా మెల్లకంటిని సరైన కోణంలోకి తీసుకొస్తుంది. లోపం పూర్తిగా నయమయ్యేంత వరకు దీనిని కొన్ని వారాల నుంచి నెలల పాటు వాడాల్సి ఉంటుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే హెడ్సెట్..
ఐపీఎల్ వీక్షకుల కోసం జియో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించే జియో డైవ్ (JioDive) అనే కొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఇదీ చదవండి: WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్ జియో సినిమా (JioCinema) యాప్‌లో ఐపీల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీఆర్ హెడ్‌సెట్‌ని ఉపయోగించవచ్చు. ఇందులో 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ ఉన్నాయి. దీంతో నేరుగా స్టేడియంలోనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ హెడ్‌సెట్‌ను జియో సినిమా యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జియోడైవ్ హెడ్సెట్ ధర రూ. 1,299. జియో మార్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే హైజనిక్ కారణాల వల్ల ఈ ఒక సారి కొనుగోలు చేసిన ఈ వీఆర్ హెడ్‌సెట్‌ను రిటర్న్ చేసే వీలు లేదని కంపెనీ పేర్కొంది. జియోడైవ్ వీఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీల వీక్షణ 4.7 నుంచి 6.7 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్, iOS ఫోన్లకు సపోర్ట్ లెన్స్ ఫోకస్, ఫైన్ ట్యూన్ అడ్జెస్ట్మెంట్ కోసం ఏర్పాటు. హెడ్‌సెట్‌ను సౌకర్యవంతంగా పెట్టుకునేందుకు 3వే అడ్జస్టబుల్ స్ట్రాప్ Android 9+, iOS 15+కి సపోర్ట్ ఉపయోగించడం ఎలా? బాక్స్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జియో ఇమ్మెర్స్ (JioImmerse) యాప్‌ను ఇన్స్టాల్ చేయండి సూచనలకు అనుగుణంగటా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయండి. ఇందుకోసం జియో నెట్వర్క్కి కనెక్ట్ అయిఉండాలి. జియోడైవ్ (JioDive) ఆప్షన్‌ను ఎంచుకుని ‘Watch on JioDive’పై క్లిక్ చేయండి హెడ్సెట్లో ఫ్రంట్ కవర్ని తీసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్‌ల మధ్య ఫోన్‌ను పెట్టిన తర్వాత ఫ్రంట్ కవర్‌ను మూసివేయండి హెడ్‌సెట్‌ను పెట్టకుని స్ట్రాప్స్‌ను సరిచేసుకోండి ఉత్తమ వీక్షణ అనుభవం, పిక్చర్ క్వాలిటీని అడ్జస్ట్మెంట్ వీల్స్‌ను సరిచేయండి ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. Bringing you a stadium-like experience at home with #JioDive. - Watch cricket in 360 immersive view - Enjoy #TATAIPLonJioCinema on a 100-inch virtual screen - Experience #360cricket from multiple camera angles Buy now https://t.co/1azFVIwqfR#EnterANewReality #IPL2023 pic.twitter.com/PxplF0SAz9 — JioDive (@jiodiveofficial) April 30, 2023 -
ఈ హెడ్సెట్ పెట్టుకుంటే నిమిషాల్లో నిద్రొచ్చేస్తుంది!
ప్రశాంతమైన నిద్ర ప్రతి మనిషికి అవసరం. అయితే, ప్రపంచంలో నిద్రలేమితో బాధపడేవాళ్ల చాలామందే ఉన్నారు. ఒక్కోసారి చక్కగా నిద్రపట్టడానికి చిట్కాలు పాటించినా ఫలితం ఉండని పరిస్థితి ఉంటుంది. నిద్ర పట్టడం లేదంటూ డాక్టర్ల దగ్గరకు వెళితే యథాలాపంగా నిద్రమాత్రలు రాస్తారు. నిద్రమాత్రలు వాడితే తాత్కాలికంగా నిద్రపట్టినా, దీర్ఘకాలంలో వాటి దుష్పరిణామాలను ఎదుర్కొని ఇబ్బందిపడక తప్పదు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నిద్రపట్టేలా చేసేందుకు దక్షిణ కొరియా కంపెనీ ‘లీసాల్ బ్రెయిన్’ ఇటీవల ‘స్లీపిసాల్’ పేరుతో ఒక హెడ్‌సెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) దీనిని తలకు తొడుక్కుని, మొబైల్ఫోన్లో దీనికి సంబంధించిన యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నాలుగు మోడ్స్ ఉంటాయి. అవి: స్లీప్ మోడ్, స్ట్రెస్ మోడ్, కాన్సంట్రేషన్ మోడ్, రెస్ట్ మోడ్. కోరుకున్న మోడ్‌ను యాప్ ద్వారా ఎంపిక చేసుకుంటే, ఈ హెడ్సెట్ దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఇది నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. నిద్రపట్టక ఇబ్బందిపడేవారికి నిమిషాల్లోనే ప్రశాంతమైన నిద్రనిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. మెలకువగా ఉన్నప్పుడు ఏకాగ్రత పెంచుతుంది. అలసి సొలసి ఉన్నప్పుడు విశ్రాంతినిస్తుంది. దీని ధర 199 డాలర్లు (రూ.16,377) మాత్రమే! (ఎయిర్ కూలర్ కమ్ హీటర్: చల్లగా.. వెచ్చగా.. ఎలా కావాలంటే అలా..) -
పాడుతా తీయగా చల్లగా...
జనాభాలో దాదాపు ముప్పయి శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఒక అంచనా. నిద్రలేమిని జయించడానికి ఎన్నో చిట్కాలు పాటిస్తున్నా, వాటి వల్ల దక్కే ఫలితాలు అంతంత మాత్రమే! అయితే, నిద్రలేమికి చెక్ పెట్టడానికి సరికొత్త సాధనం అందుబాటులోకి వచ్చేసింది. ఇది బ్లూటూత్ సాయంతో పనిచేసే హెడ్‌ఫోన్స్ సెట్. ‘మ్యూజికోజీ హెడ్‌ఫోన్స్’గా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో కోరుకున్న సంగీతం కావలసినంత ధ్వనితో వింటూ తేలికగా నిద్రలోకి జారుకోవచ్చని తయారీదారులు చెబుతున్నారు. ‘పాడుతా తీయగా చల్లగా...’ అంటూ ఈ హెడ్‌ఫోన్స్ వినిపించే సంగీతాన్ని వింటూ హాయిగా నిద్రలోకి జారుకోగలుగుతున్నామని వినియోగదారులు కూడా చెబుతున్నారు. ఈ ‘మ్యూజికోజీ హెడ్‌ఫోన్స్’కు ఆన్లైన్లో రివ్యూలు బాగానే వస్తుండటంతో వీటికి గిరాకీ పెరుగుతోంది. ఈ హెడ్‌ఫోన్స్ ధర 25.70 డాలర్లు (రూ.2032) మాత్రమే! -
హెడ్సెట్ విసిరితే గాయం అవుతుందా?
న్యూఢిల్లీ: ‘హెడ్సెట్ విసిరితే కంటికి గాయం అయ్యే పరిస్థితి ఎక్కడైనా ఉందా..?’అని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్సెట్ వల్ల, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రామాకు తెరలేపారని ఆయన విమర్శించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజజీవితంలోనే కేసీఆర్ సినిమా చూపిస్తున్నాడు. టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలను ప్రజలు విశ్వసించరు. కేసీఆర్ ఇన్ని నాటకాలు ఆడతాడని ముందే తెలిసుంటే యూత్‌కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే కేసీఆర్ మెడలు వంచేవాడిన’ని వీహెచ్ తెలిప. -
మార్కెట్లో క్రియేటివ్ ఔట్లియర్ హెడ్‌ఫోన్
న్యూఢిల్లీ: పానాసోనిక్ కొత్త బ్లూటూత్ హెడ్‌ఫోన్ సెట్ మార్కెట్లో హల్చల్ చేస్తే ఇపుడు దానికి పోటీగా, దానికంటే తక్కువ ధరకే సంగీత ప్రియులను మరో హెడ్ ఫోన్ అలరించనుంది. క్రియేటివ్ సంస్థ 'ఔట్లియర్' పేరిట ఓ కొత్త బ్లూటూత్ హెడ్‌ఫోన్ సెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పానాసోనిక్ రిలీజ్ చేసిన లేటెస్ట్ హెడ్ పోన్ బీటీడీ5 కంటే ఒకింత తక్కువ రేటుకే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.6,499 ధరకు దీన్ని వినియోగదారులకు అందిస్తోంది. పోర్టబిలిటీ, సుపీరియర్ సౌండ్ క్వాలిటీ తమ హెడ్‌ఫోన్ ప్రత్యేకమని చెబుతోంది. పట్టణప్రాంత వినియోగదారులు, ఫిట్నెస్ ప్రియులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ హెడ్ఫోన్లను రూపొందించినట్టు క్రియేటివ్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇందులో బిల్టిన్ ఎంపీ3 ప్లేయర్, మైక్రో ఎస్డీ కార్డ్ కోసం ప్రత్యేకమైన స్లాట్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ, యూఎస్బీ ఆడియో ప్లేబ్యాక్, బిల్టిన్ హెచ్డీ మైక్రోఫోన్, 3.5 ఎంఎం ఆడియో సాకెట్ లాంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ హెడ్‌ఫోన్స్‌ను వినియోగదారులు అమెజాన్ సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లూటూత్, ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) మద్దతుతో పనిచేస్తుంది. దీంట్లో ఉన్నఎంపీ 3 ప్లేయర్ సాయంతో మైక్రో ఎస్డీ కార్డ్ నుంచి నేరుగా పాటలు ప్లే చేస్తుంది. హెచ్డి కాల్ నాణ్యతతోపాటు, యాండ్రాయిడ్ ఫోన్‌కు వచ్చే మెసేజిలను చదివి వివినిస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే నిర్విరామంగా 10 గంటల వరకు పనిచేస్తుంది. గత నెలలో పానాసోనిక్ భారతదేశంలో రిలీజ్ చేసిన హెడ్ ఫోన్ ధర రూ. 9,490 అని చెబితే.. క్రియేటివ్ మాత్రం రూ.6,499కే అందిస్తామంటోంది. -
ఆరోగ్యాన్ని కనిపెట్టే హెడ్సెట్
వాషింగ్టన్: హాయిగా పాటలు వింటూ వ్యాయామం చేస్తున్నారా? ఆ వ్యాయామం మీ శరీరానికి ఎంతవరకూ ఉపయోగపడిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎన్ని కేలరీల శక్తి ఖర్చయిందో గుర్తించగలిగితే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఐరివర్ సంస్థ తయారు చేసిన హెడ్‌సెట్‌ను కొనుక్కోండి. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని, పాటలూ వినొచ్చు.. అలాగే, గుండెకొట్టుకునే వేగం, రక్తపోటు తెలుసుకోవచ్చు. నడుస్తూనో, జాగింగ్ చేస్తూనో మీరు ప్రయాణించిన దూరం, వ్యాయామంతో శరీరంలో ఖర్చయిన కేలరీలను కూడా ఈ హెడ్‌సెట్‌తో తెలుసుకోవచ్చు. ఈ వివరాలన్నింటినీ హెడ్‌సెట్‌ను అనుసంధానించిన స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చు. ఇందులో ఇన్ఫ్రారెడ్ లైట్, యాక్సిలరోమీటర్లను అమర్చామని, దీనిద్వారా ఈసీజీతో తీసినంత కచ్చితత్వంతో ఫలితాలు వస్తాయని ఐరివర్ సంస్థ ప్రకటించింది.