మార్కెట్లో క్రియేటివ్ ఔట్లియర్ హెడ్ఫోన్
న్యూఢిల్లీ: పానాసోనిక్ కొత్త బ్లూటూత్ హెడ్‌ఫోన్ సెట్ మార్కెట్‌లో హల్‌చల్ చేస్తే ఇపుడు దానికి పోటీగా, దానికంటే తక్కువ ధరకే సంగీత ప్రియులను మరో హెడ్ ఫోన్ అలరించనుంది. క్రియేటివ్ సంస్థ 'ఔట్లియర్' పేరిట ఓ కొత్త బ్లూటూత్ హెడ్‌ఫోన్ సెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. పానాసోనిక్ రిలీజ్ చేసిన లేటెస్ట్ హెడ్ పోన్ బీటీడీ5 కంటే ఒకింత తక్కువ రేటుకే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.6,499 ధరకు దీన్ని వినియోగదారులకు అందిస్తోంది. పోర్టబిలిటీ, సుపీరియర్ సౌండ్ క్వాలిటీ తమ హెడ్ఫోన్ ప్రత్యేకమని చెబుతోంది.
పట్టణప్రాంత వినియోగదారులు, ఫిట్‌నెస్ ప్రియులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ హెడ్‌ఫోన్లను రూపొందించినట్టు క్రియేటివ్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇందులో బిల్టిన్ ఎంపీ3 ప్లేయర్, మైక్రో ఎస్డీ కార్డ్ కోసం ప్రత్యేకమైన స్లాట్, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఆడియో ప్లేబ్యాక్, బిల్టిన్ హెచ్‌డీ మైక్రోఫోన్, 3.5 ఎంఎం ఆడియో సాకెట్ లాంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ హెడ్‌ఫోన్స్‌ను వినియోగదారులు అమెజాన్ సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.
ఇది బ్లూటూత్, ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) మద్దతుతో పనిచేస్తుంది. దీంట్లో ఉన్నఎంపీ 3 ప్లేయర్ సాయంతో మైక్రో ఎస్డీ కార్డ్ నుంచి నేరుగా పాటలు ప్లే చేస్తుంది. హెచ్డి కాల్ నాణ్యతతోపాటు, యాండ్రాయిడ్ ఫోన్‌కు వచ్చే మెసేజిలను చదివి వివినిస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే నిర్విరామంగా 10 గంటల వరకు పనిచేస్తుంది. గత నెలలో పానాసోనిక్ భారతదేశంలో రిలీజ్ చేసిన హెడ్ ఫోన్ ధర రూ. 9,490 అని చెబితే.. క్రియేటివ్ మాత్రం రూ.6,499కే అందిస్తామంటోంది.