blue tooth
-
హలో చలో.. గ్రేటర్లో 71.7 శాతం మంది హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): గ్రేటర్ వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగే కాదు.. ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్లలో లేదా హెల్మెట్ లోపల మొబైల్లో మాట్లాడుతూ (హ్యాండ్స్ ఫ్రీ) వాహనాలను నడుపుతున్నారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), కరుణ ట్రస్ట్, యాక్షన్ ఇన్ డిస్ట్రెస్ ఎన్జీఓలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. 11,787 డ్రైవర్లపై అధ్యయనం చేయగా.. 16.5 శాతం మంది సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని, ఇందులో 71.7 శాతం మంది హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నారని వెల్లడించింది. ♦మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్‌పేట బిజినెస్ ఏరియా, మేడ్చల్ హైవే ఇండ్రస్టియల్ ప్రాంతాలలో ఈ అధ్యయనం నిర్వహించాయి. 15 నిమిషాల పాటు వాహనాల రాకపోకలు, వాహనదారుల వీడియోను రికార్డ్ చేశారు. కరుణ ట్రస్ట్‌కు చెందిన సంధ్య, యాక్షన్ ఇన్ డిస్ట్రెస్కు చెందిన లక్ష్మి అర్చన, ఐఐపీహెచ్ నుంచి మెలిస్సా గ్లెండా లూయిస్, తేటాలి శైలజలు ఈ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయాన్ని క్లినికల్ ఎపిడిమియాలజీ, గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. ♦రోజు, సమయంతో పాటూ రోడ్డు పరిస్థితిని బట్టి సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లో తేడాలను అధ్యయన బృందం విశ్లేషించింది. సాధారణ రోజులలో కంటే వారాంతాలలో, రద్దీ ఉన్న రోడ్ల మీద కంటే లేని రహదారులలో హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్ ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. ♦డ్రైవింగ్‌లో హ్యాండ్స్ ఫ్రీ కమ్యూనికేషన్ పరికరాలను వినియోగించడం ప్రమాదకరని జాబితాలో ఉన్నప్పటికీ.. జరిమానాలు విధించడం లేదు. అందుకే ఈ తరహా డ్రైవింగ్‌లను కూడా ఎంవీ యాక్ట్‌లో చేర్చాలని పరిశోధకలు సూచించారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్–184 ప్రకారం ప్రమాదకరమైన రీతిలో వాహనాలను డ్రైవింగ్ చేసే వారికి రూ.5 వేల జరిమానా, 6– 12 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు. ♦గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 35,425, అంతకు క్రితం ఏడాది 26,984 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. 2021లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,788 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. -
టీచర్ల ఎంపిక పరీక్షలో హైటెక్ కాపీయింగ్.. ఏకంగా చెప్పులో..
జైపూర్: రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ బట్టబయలయ్యింది. ‘బ్లూటూత్ చెప్పుల’ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాజస్తాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్((రీట్)ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. తొలుత అజ్మీర్‌లోని ఓ కేంద్రంలో పరీక్ష రాసేటప్పుడు అనుమానాస్పదంగా వ్యవహరించిన ఓ అభ్యర్థిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడు ధరించిన చెప్పు లోపల కనిపించకుండా సెల్‌ఫోన్‌ను అమర్చినట్లు గుర్తించారు. అలాగే చెవిలో బయటకు కనిపించని బ్లూటూత్‌తో కూడిన సూక్ష్మమైన రిసీవర్ ఉంది. పరీక్ష కేంద్రం బయట ఉన్న వ్యక్తులు అతడికి సమాధానాలు చేరవేస్తున్నట్లు కనిపెట్టారు. వాటిని సదరు అభ్యర్థి చెప్పులోని సెల్‌కు అనుసంధానించిన బ్లూటూత్ రిసీవర్ ద్వారా వింటున్నట్లు తేల్చారు. దీంతో అధికారులు అన్ని ఎగ్జామ్ సెంటర్లను అప్రమత్తం చేశారు. బికనెర్, సికార్ పట్టణాల్లోనూ ఇలాంటి బాగోతాలే బయటపడ్డాయి. మూడు పట్టణాల్లో మొత్తం ఐదుగురు చీటర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చీటింగ్ చెప్పులను చాలా తెలివిగా తయారు చేశారని, ఇది కుటీర పరిశ్రమను తలపిస్తోందని వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ‘రీట్’ తదుపరి దశ పరీక్షకు అభ్యర్థులెవరూ స్లిప్పర్స్, బూట్లు, సాక్సులు ధరించి రావొద్దని అధికారులు ఆదేశించారు. ఆదివారం రీట్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను 12 గంటలపాటు ఆపారు. రాష్ట్రంలో 31 వేల టీచర్ పోస్టులకు 16 లక్షల మంది పోటీ పడుతున్నారు. (చదవండి: యూపీ బరిలో ఒవైసీ అలజడి) -
మార్కెట్లో క్రియేటివ్ ఔట్లియర్ హెడ్‌ఫోన్
న్యూఢిల్లీ: పానాసోనిక్ కొత్త బ్లూటూత్ హెడ్‌ఫోన్ సెట్ మార్కెట్లో హల్చల్ చేస్తే ఇపుడు దానికి పోటీగా, దానికంటే తక్కువ ధరకే సంగీత ప్రియులను మరో హెడ్ ఫోన్ అలరించనుంది. క్రియేటివ్ సంస్థ 'ఔట్లియర్' పేరిట ఓ కొత్త బ్లూటూత్ హెడ్‌ఫోన్ సెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పానాసోనిక్ రిలీజ్ చేసిన లేటెస్ట్ హెడ్ పోన్ బీటీడీ5 కంటే ఒకింత తక్కువ రేటుకే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.6,499 ధరకు దీన్ని వినియోగదారులకు అందిస్తోంది. పోర్టబిలిటీ, సుపీరియర్ సౌండ్ క్వాలిటీ తమ హెడ్‌ఫోన్ ప్రత్యేకమని చెబుతోంది. పట్టణప్రాంత వినియోగదారులు, ఫిట్నెస్ ప్రియులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ హెడ్ఫోన్లను రూపొందించినట్టు క్రియేటివ్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇందులో బిల్టిన్ ఎంపీ3 ప్లేయర్, మైక్రో ఎస్డీ కార్డ్ కోసం ప్రత్యేకమైన స్లాట్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ, యూఎస్బీ ఆడియో ప్లేబ్యాక్, బిల్టిన్ హెచ్డీ మైక్రోఫోన్, 3.5 ఎంఎం ఆడియో సాకెట్ లాంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ హెడ్‌ఫోన్స్‌ను వినియోగదారులు అమెజాన్ సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లూటూత్, ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) మద్దతుతో పనిచేస్తుంది. దీంట్లో ఉన్నఎంపీ 3 ప్లేయర్ సాయంతో మైక్రో ఎస్డీ కార్డ్ నుంచి నేరుగా పాటలు ప్లే చేస్తుంది. హెచ్డి కాల్ నాణ్యతతోపాటు, యాండ్రాయిడ్ ఫోన్‌కు వచ్చే మెసేజిలను చదివి వివినిస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే నిర్విరామంగా 10 గంటల వరకు పనిచేస్తుంది. గత నెలలో పానాసోనిక్ భారతదేశంలో రిలీజ్ చేసిన హెడ్ ఫోన్ ధర రూ. 9,490 అని చెబితే.. క్రియేటివ్ మాత్రం రూ.6,499కే అందిస్తామంటోంది.