
సాక్షి, విజయవాడ: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2025 మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.
వచ్చే ఏడాది మార్చి 3 తేదీ నుంచి మార్చి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి 20 వరకు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment