inter exam
-
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2025 మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.వచ్చే ఏడాది మార్చి 3 తేదీ నుంచి మార్చి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. -
‘నిమిషం నిబంధన వద్దు’.. దీని కారణంగానే ఇప్పుడిలా..
ఆదిలాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధన తొలగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఐఈవో రవీందర్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బీ రాహుల్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి టేకం శివకుమార్ ‘నిమిషం’ నిబంధన కారణంగా పరీక్షకు దూరమై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేస్తూ శివకుమార్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్డీఎస్ జిల్లా కార్యదర్శి కుంటాల నవీన్‌కుమార్, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్, ఏఎస్యూ జిల్లా కార్యదర్శి అశోక్, టీఎస్ఎఫ్ నాయకుడు సత్యనారాయణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సిడం సాయికుమార్, ఎస్వీఏ జిల్లా అధ్యక్షుడు గొప్లే సుజయ్, నాయకులు ఇఫ్తెఖార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి.. ఇంటర్ విద్యార్థి శివకుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీలో శివకుమార్ మృతదేహాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఆయన కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షకు సంబంధించి నిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. నిమిషం నిబంధన వెంటనే ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆత్రం కిష్టన్న, లక్ష్మణ్ తదితరులున్నారు. ఇవి చదవండి: హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్! -
‘క్షమించు నాన్నా..’ ఆదిలాబాద్‌లో విషాద ఘటన
సాక్షి, ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షల వేళ.. జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు మిస్ అయ్యాయననే మనస్థాపంతో ఓ విద్యార్థి బలవనర్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి సాత్మల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలు మిస్ చేసినందుకు తనను క్షమించాలంటూ తండ్రికి అతను రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘‘నాకోసం.. మీరు ఎంతో చేశారు.. మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయా. జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ చవి చూడలేదు.. క్షమించు నాన్నా..’’ అని నోట్లో ఉంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్క నిమిషం నిబంధన వల్లే.. ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కేంద్రంలో పరీక్షకు వెళ్లాడు శివ. అయితే.. అప్పటికే మూడు నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. పరీక్షకు అనుమతించరాదనే నిబంధన ఉందని అధికారులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో శివ అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే మనోవేదనతో.. తండ్రికి లేఖ రాసి సాత్నాల ప్రాజెక్టు డ్యాం లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ,విద్యార్థి చేతి వాచి,పెన్ను లభించింది. తండ్రికి రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యేందుకు ఒక నిమిషం నిబంధన విధించిన కారణంగానే నిండు ప్రాణం బలైందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కష్టపడి చదివి.. ఆందోళనగా పరీక్షకు వెళ్లిన కొడుకు శవమై తిరిగొచ్చేసరికి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం (2023–24) ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియెట్ విద్యా మండలి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే మార్చిలో జరిగే బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు నిర్ణీత గడువులోగా విద్యార్థులు తమ తమ కళాశాలల్లో ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ మంగళవారం తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 30వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ♦ మొదటి/ రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకటి, రెండో ఏడాది ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. ♦ ఇంటర్మీడియెట్ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1,100, ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి. ♦ ఇప్పటికే ఇంటర్మీడియెట్ పాసై ఇంప్రూవ్మెంట్ రాసేవారు రెండేళ్లకు ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,240, సైన్స్ విద్యార్థులు రూ.1,440 చెల్లించాల్సి ఉంటుంది. -
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఎగ్జామ్ రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థి
సాక్షి, ఖమ్మం : గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. గూగుల్ మ్యాప్‌లో తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించడంతో తప్పుడు అడ్రస్‌కు వెళ్లాడు. గూగుల్ తప్పిదాన్ని గ్రహించిన విద్యార్థి.. మళ్లీ సరైన పరీక్షా కేంద్రానికి వచ్చినా.. అప్పటికే ఆలస్యం కావడంతో తొలిరోజు పరీక్ష రాయలేకపోయాడు. దీంతో చేసేదేం లేక బాధతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం చోటుసుకుంది. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్ హాలుకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్లో వెళ్లాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో ప్లేస్‌కు గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్లింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అది తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ కాదని తెలిసింది. దీంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్ అడుక్కుంటూ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. కానీ వినయ్ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు. నిమిషం నిబంధన కఠినంగా ఉండటంతో విద్యార్థినిపరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బాధతో వినయ్ ఇంటికి చేరుకున్నాడు. -
ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. కరోనా కారణంగా సెలవులు పొడిగించడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని గతంలో పేర్కొంది. తాజాగా ఈ గడువును ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించారు. ప్రథమ సంవత్సరం ఆర్ట్స్, అండ్ సైన్స్ గ్రూపులకు, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ గ్రూపులకు రూ.490, ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపులకు రూ.690 ఫీజును నిర్ణయించారు. ఒకేషనల్ కోర్సులకు ఫస్టియర్‌కు రూ.690, సెకండియర్‌కు రూ.840 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్షకు..
ఘట్‌కేసర్‌టౌన్: ఓ పక్క ఇంటిలో తండ్రి శవం.. మరో పక్క పరీక్ష కేంద్రంలో కూతురు.. ఈ హృదయవిదారక దృశ్యం మండలంలోని యంనంపేట్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి ఆరముల్ల శ్రీనివాస్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశాడు. శ్రీనివాస్ భార్య 12 ఏళ్ల క్రితం మృతిచెందింది. వీరి ఏకైక కుమార్తె లావణ్య. తల్లి చనిపోవడంతో శ్రీనివాస్ అన్నీ తానై లావణ్యను పెంచుతున్నాడు. ఇప్పుడు తండ్రి మృతితో రెక్కలు తెగిన పక్షిలా అయింది లావణ్య. ఘట్కేసర్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న లావణ్య బుధవారం పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. దుఃఖాన్ని దిగమింగుకొని బంధువుల సహకారంతో అన్నోజీగూడ నారాయణ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరైంది. అనంతరం తలకొరివి పట్టి తండ్రి చితికి నిప్పంటించింది. -
విద్యార్థి డీబార్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ద్వితీయìæ సంవత్సరం గణితం, బాటనీ, సివిక్స్, ఒకేషనల్ పరీక్షల్లో ఒక విద్యార్థి డీబార్ అయ్యాడు. కదిరి పట్టణం స్పేస్ జూనియర్ కళాశాల కేంద్రంలో ఓ విద్యార్థి కాపీ కొడుతూ డీబార్ అయ్యాడు. మొత్తం 31,871 మంది విద్యార్థులకు గానూ 31,092 మంది హాజరయ్యారు. 779 మంది గైర్హాజయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 29,510 మంది విద్యార్థులకు గానూ 28,794 మంది హాజరయ్యారు. 716 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 2,361 మంది విద్యార్థులకు గానూ 2,298 మంది హాజరయ్యారు. 63 మంది గైర్హాజరయ్యారు. -
రేపటి ఇంటర్ పరీక్ష 19కు వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 9న జరగాల్సిన గణితశాస్త్రం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్ష ఈనెల 19కు వాయిదా వేశారు. 9న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉండటంతో ప్రభుత్వం ఈ మార్పు చేసిందని ఆర్ఐఓ వెంకటేశులు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు. -
డీబార్ ‘150’
♦ ఇంటర్ పరీక్షల్లో ఇదీ పరిస్థితి ♦ జంటజిల్లాల్లో గణనీయంగా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు ♦ విస్మయం వ్యక్తం చేస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఇంటర్మీడియెట్ పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో డిబార్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే కాపీ కొడుతూ దాదాపు 150 మంది పట్టుబడ్డారు. సెకండియర్‌కు సంబంధించి మరో పరీక్ష మిగి లి ఉండగానే ఈ స్థాయిలో డిబార్ కావటం చర్చ నీయాంశంగా మారింది. నిత్యం డిబార్ అవుతున్న విద్యార్థుల సంఖ్యను చూసి అధికారులు సైతం విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి భారీ సంఖ్యలో స్క్వాడ్లకు దొరకడం తమ అనుభవంలో ఇదే తొలిశారని అంటున్నారు. ఎటువంటి తప్పిదాలకు, కాపీయింగ్ తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డ్ నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో పరీక్షల ప్రారంభం నుంచి పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహిం చడంపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సాధ్యమైనన్ని కేంద్రాల్లో 11 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. జంట జిల్లాల్లో ఒక్కో పరీక్షకు 50కి పైగా కేంద్రాల్లో తనిఖీ బృందాలు తిరిగాయి. ద్వితీయ భాష మినహా అన్ని పరీక్షల్లోనూ విద్యార్థులు డిబార్ అయ్యారు. ఒకేరోజు గరిష్టంగా 24 మంది కాపీ కొడుతూ పట్టుబడటం... కాపీయింగ్ తీవ్రతను తెలియజేస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 71, హైదరాబాద్ జిల్లాలో 75 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. ఇందులో నలుగురు విద్యార్థులు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికారు. ఇవన్నీ కలుపుకుంటే.. పట్టుబడిన వారి సంఖ్య 146కు చేరింది. వీరందరిపై ఆయా పోలీస్స్టేషన్లలో మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైటెక్ కాపీయింగ్‌కు యత్నించిన ఫస్టియర్ విద్యార్థి ఎజాజ్ ఈనెల 12న సనత్‌నగర్‌లో ఇన్విజిలెటర్‌కు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు నగరంపై పడింది. ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారు. ముగిసిన ఫస్టియర్ పరీక్షలు ఈనెల 2న ప్రారంభమైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ కట్టిన విద్యార్థులు.. పరీక్షలు ముగియడంతో చిరునవ్వుతో ఇంటిముఖం పట్టారు. చివరి పరీక్షలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఫస్టియర్ ప్రధాన సబ్జెక్టులన్నీ పూర్తికాగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా శనివారంతో ముగియనున్నాయి. బుధవారం జరిగే పరీక్షతో సెకండియర్ పరీక్షలు పూర్తవుతాయి. పట్టుబడ్డ విద్యార్థుల వివరాలు పరీక్ష రంగారెడ్డి హైదరాబాద్ ఫస్టియర్ 32 32 సెకండియర్ 39 39 -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
కంబాలచెరువు (రాజమండ్రి) : వచ్చేనెల రెండు నుంచి జరగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎ.వెంకటేష్ శుక్రవారం వివరాలను తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 48,330 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరిలో వృత్తి విద్యాకోర్సుల వారు 5,892 మంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 49,178 మంది రాయనుండగా వీరిలో వృత్తివిద్యాకోర్సుల వారు 5,237 మంది. జిల్లావ్యాప్తంగా 128 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా వాటిలో 57 ప్రైవేట్ కళాశాలల్లో ఏర్పాటు కానున్నాయి. 8 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అడ్డతీగల, కూనవరం కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన రంపచోడవరం, రాజోలు కేంద్రాల్లోనూ సీసీ కె మెరాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను జి ల్లా ఇంటర్‌బోర్డు అధికారులు ఉన్నతాధికారుల కు పంపారు. వచ్చేనెల రెండున ప్రథమ, మూ డున ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమౌతాయి. పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. -
వాల్యూయేషన్‌లో తప్పిదాలకు మూల్యం
-
ఆల్ ది బెస్ట్..
కడప ఎడ్యుకేషన్ : నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 44, 728 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల్లో బల్లులు, తాగు నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 15 నిమిషాలు ముందుగా సెంటర్లకు చేరుకోవాలని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని జిల్లా ఇంటర్మీడియేట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ప్రసాద్‌రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20 మంది సిట్టింగ్ స్క్వాడ్‌తోపాటు ఐదు ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 92 మంది సూపర్ వైజర్లు, 92 మంది డిపార్టుమెంటల్ అధికారులతోపాటు రాష్ట్ర పరిశీలకులు, హైపవర్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాలపై జీపీఎస్ సిస్టమ్ ఆన్‌లో ఉంటుందని.. ఇన్విజిలేటర్లు, సూపర్వైజర్లు, స్వ్కాడ్ బృందాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను జీపీఎస్ నిర్వాహకులకు అందజేశామని చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు పరిశుభ్రమైన , ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సమయానికి తినటం, నిద్రించటంతోపాటు మంచి విషయాలను మాత్రమే ఆలోచించాలి. ఇలా చేస్తే శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగం. పరీక్షల సమయంలో షోషక పదార్థాల పాత్ర కీలకం. పళ్లు, పళ్ల రసాలు చాలా అవసరం. స్వీట్లు, చాక్లెట్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తినకూడదు. చదవడం ప్రారంభించే ముందు ఒక లవంగం, లేదా యాలుక పలుకు బుగ్గన పెట్టుకుంటే మంచిది. ఆలోచన ఎటో వెళ్లినప్పుడు దాన్ని ఒకసారి కొరకాలి. చదువు మధ్యలో ఒకసారి పంచదార కలపని పళ్లరసం, గంట తరువాత సోయాబీన్ కలిసిన మజ్జిగ తాగితే నిద్ర మత్తు ఉండదు. పైగా శక్తి వస్తుంది. సాత్విక అహారం తీసుకోవాలి. పరీక్షల సమయంలో మాంసాహారం తింటే.. దాన్ని జీర్ణం చేయడానికి అక్సిజన్ ఎక్కువగా అవసరం అవుతుంది. దీంతో మెదడుకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందక నిద్ర వస్తుంది. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్సు, రాత్రి 7 గంటలకు భోజనం చేసి 10 గంటల సమయంలో పాలు తాగాలి. అహారంలో మసాలాలు లేని కూరలు తినాలి. టిఫిన్, బోజనానికి మధ్యలో బిస్కెట్ లాంటివి తీసుకోవాలి. కనీసం 6 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. మెదడును ఒత్తిడికి గురి చేయకుండా మధ్య మధ్యలో విశ్రాంతినిస్తూ చదవాలి. ఉదయం పది నిమిషాల పాటు చిన్న పాటి వ్యాయామాలు చేయాలి. తరచూ మంచి నీళ్లు తీసుకోవాలి. రోజుకొక అరటి పండు తింటే ఏకాగ్రత పెరుగుతుంది. -
అన్నకు బదులుగా ఇంటర్ పరీక్ష రాస్తూ..
తల్లాడ, న్యూస్‌లైన్: అన్నకు బదులు ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడో తమ్ముడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని రెడ్డిగూడెంకు చెందిన శీలం వెంకటరమణారెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పరీక్షకు స్థానిక సూర్యజూనియర్ కళాశాలలో ఫీజు కట్టాడు. అనంతరం ఏపీసీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్‌గా ఎంపికై ఐదు నెలల క్రితం శిక్షణ కోసం కేరళకు వెళ్లాడు. కాగా, డిగ్రీ చదువుతున్న అతని తమ్ముడు సురేందర్‌రెడ్డి అన్న పేరుమీద క్రీస్తుజ్యోతి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలోకి వెళ్లాడు. పరీక్ష రాస్తుండగా అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ హాల్‌టికెట్‌ను పరీక్షించగా ఫొటో మార్పు ఉన్నట్లు గుర్తించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై మాల్ ప్రాక్టీస్ కేసుతో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా, సురేందర్‌రెడ్డి బుధవారం బీఎస్సీ సెకండ్ ఇయర్ పరీక్ష రాయాల్సి ఉంది. -
అటు పెళ్లి సందడి.. ఇటు ఇంటర్ పరీక్ష
పూండి, న్యూస్‌లైన్ : మధ్యాహ్నం 12 గంటలకు నిశ్చితార్ధం.. రాత్రి 9 గంటలకు పెళ్లి ముహూర్తం.. ఇంట్లో మేళతాళాలు.. బంధువుల సందడే సందడి. అయినా చదువుకు ప్రాధాన్యమిచ్చింది ఆ నవ వధువు. ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూపు విద్యార్థినైన ఆమె శనివారం ఉదయం పూండిలోని శ్రీసాయి వినీత్ జూనియర్ కళాశాలలో జరిగిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్ష రాసింది. ఆమె పేరు పనపాన మీనా. స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ. నిశ్చితార్థ సమయం ముంచుకొస్తున్నా కంగారు పడకుండా పరీక్ష రాసిన ఆమెను చీఫ్ సూపరింటెం డెంట్ కె.అప్పారావు, డిపార్ట్మెంటల్ అధికారి ఎస్.షణ్ముఖరావు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్ ఎస్.దివాకర్, ఇన్విజిలేటర్లు అభినందించారు.