కంబాలచెరువు (రాజమండ్రి) : వచ్చేనెల రెండు నుంచి జరగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎ.వెంకటేష్ శుక్రవారం వివరాలను తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 48,330 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరిలో వృత్తి విద్యాకోర్సుల వారు 5,892 మంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 49,178 మంది రాయనుండగా వీరిలో వృత్తివిద్యాకోర్సుల వారు 5,237 మంది. జిల్లావ్యాప్తంగా 128 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా వాటిలో 57 ప్రైవేట్ కళాశాలల్లో ఏర్పాటు కానున్నాయి.
8 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అడ్డతీగల, కూనవరం కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన రంపచోడవరం, రాజోలు కేంద్రాల్లోనూ సీసీ కె మెరాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను జి ల్లా ఇంటర్‌బోర్డు అధికారులు ఉన్నతాధికారుల కు పంపారు. వచ్చేనెల రెండున ప్రథమ, మూ డున ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమౌతాయి. పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
Published Sun, Feb 28 2016 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM
Advertisement