second year
-
ఫుడ్ డెలివరీలోకి టాటా న్యూ
ముంబై: టాటా గ్రూప్ రూపొందించిన మలీ్టపర్పస్ సూపర్ యాప్ టాటా న్యూ వచ్చే ఏడాది రెండో వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో డిజైన్‌ను సరికొత్తగా మార్చే యోచనలో ఉంది. అంతేకాకుండా ఆన్లైన్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాల ప్రకారం సాంకేతిక అంశాల కారణంగా యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)ను బ్లాక్ నుంచి వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి మార్చనుంది. 2022 ఏప్రిల్ 7న టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌తో టాటా న్యూ యాప్ ప్రారంభంకాగా.. రెండు నగరాల(బెంగళూరు, ఢిల్లీ)కే పరిమితమైంది. ప్రస్తుతం ఓఎన్డీసీతోపాటు మ్యాజిక్‌పిన్ సహకారం ద్వారా ఫుడ్ డెలివరీ సరీ్వసులను ప్రవేశపెట్టనుంది. గతేడాది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా మ్యాజిక్‌పిన్ ఫుడ్ ఆర్డర్లు రెట్టింపయ్యాయి. కాగా.. గత నెలలో కొత్త సీఈవోగా సీఈవో నవీన్ తహిల్యానికి బాధ్యతలు అప్పగించడంతోపాటు పలు మార్పులకు టాటా న్యూ తెరతీసింది. వివిధ బిజినెస్ చీఫ్‌లతో నవీన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పరిస్థితులపై ఉద్యోగులతో సర్వే చేపట్టారు. -
బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్..ముకేశ్ అంబానీ టాప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్‌లో వరుసగా రెండో ఏడాది ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2024 వివరాలు విడుదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ టిమ్ కుక్, టెస్లా ఎలాన్ మస్‌్కను ముకేశ్ అంబానీ వెనక్కి నెట్టేశారు. టెన్సెంట్ హూతెంగ్మా తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇదే సూచీలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గతేడాది ఉన్న 8వ స్థానం నుంచి ఈ ఏడాది 5వ స్థానంలోకి వచ్చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా 6వ స్థానం, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 16వ స్థానంలో నిలిచారు. 2023 ర్యాంకుల్లోనూ ముకేశ్ అంబానీ అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉండడం గమనార్హం. డైవర్సిఫైడ్ దిగ్గజ కంపెనీల పరంగా చూస్తే అంతర్జాతీయంగా 2024 సంవత్సరానికి ముకేశ్ అంబానీ మొదటి స్థానంలోఉన్నారు. -
చైనా జనాభా రెండో ఏడాదీ తగ్గింది
బీజింగ్: అధిక జనాభాతో మన దేశం జనభారత్గా దూసుకుపోతుంటే పొరుగుదేశం చైనా జనాభా క్షీణతను చవిచూస్తోంది. వరసగా రెండో ఏడాదీ అక్కడ జనాభా క్షీణత నమోదైంది. గత ఏడాదితో చూస్తే 2023 ఏడాదిలో చైనా జనాభా 20.8 లక్షలు తగ్గి 140.97 కోట్లకు పడిపోయింది. వార్షిక గణాంకాలను బుధవారం చైనా విడుదలచేయడంతో ఈ విషయం వెల్లడైంది. జనాభా నియంత్రణే లక్ష్యంగా ఒకే బిడ్డ విధానాన్ని కఠినంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అమలుచేయడంతో చైనాలో గత ఆరు దశాబ్దాల్లో ఎరుగని జనాభా క్షీణతను 2022 ఏడాది ఎదుర్కొంది. 2022లో చైనాలో 95.6 లక్షల మంది జని్మస్తే 2023లో 90.2 లక్షల మంది పుట్టారు. జననాల రేటు అత్యంత కనిష్టానికి పడిపోవడమూ ఇందుకు ఒక కారణం. కోవిడ్ కారణంగా 2023 ఏడాదిలో ఎక్కువ మంది చనిపోవడమూ జనాభా తగ్గుదలకు మరో కారణమైంది. గత ఏడాది ఏకంగా 1.11 కోట్ల మంది చైనాలో చనిపోయారు. -
Russia-Ukraine War: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్‌పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి...? ఎస్ రాజమహేంద్రారెడ్డి: పూర్వపు సోవియట్ యూనియన్ రిపబ్లిక్కులన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. బెలారస్‌తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్‌లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్‌కు పేచీ అల్లా ఉక్రెయిన్‌తోనే! ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్ ఒకే దేశమన్నదే పుతిన్ గట్టి నమ్మకం. లోగుట్టు వేరే నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్‌లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది. ‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్ పుతిన్’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్ దృష్టిలో పుతిన్ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ విన్యాసాల్లో పుతిన్ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్ ఎంచుకున్న మార్గమిది. అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్ లక్ష్యం. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్ను ఓ దారికి తెస్తే బాహుబలి పుతిన్ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్ థింక్‌టాంక్ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం... తర్వాత ఉక్రెయిన్ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని తప్పుగా పుతిన్ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు! దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో అడుగుపెట్టారు! ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు! ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆపద్ధర్మ పాత్రతో మొదలై... 1999లో బోరిస్ యెల్సిన్ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్ 2000–2004, 2004–08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 దాకా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. తర్వాత 2012 నుంచి 2018 దాకా, 2018 నుంచి ఇప్పటిదాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు. ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్‌కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 దాకా ఆయనే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే! చెరిగిపోని మచ్చే!! కొసమెరుపు ఏడాది యుద్ధం బాహుబలిగా వ్లాదిమిర్ పుతిన్‌కున్న పేరుప్రతిష్టలను బలి తీసుకుంటే, పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్ పాత్రలు పోషించిన వొలోదిమిర్ జెలెన్స్కీని మాత్రం నిజజీవితంలో హీరోను చేసింది! -
సెకండియర్‌కు ప్రమోట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యాసంవత్సరాన్ని నష్టపోయిన 2019 బ్యాచ్ మెడికల్ విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసి బ్యాక్‌లాగ్స్ రాసుకునే అవకాశం కల్పించాలని ఏపీ మెడికల్ విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కోరారు. ఈ మేరకు ఏపీకి చెందిన బాధిత విద్యార్థులు, తల్లిదండ్రుల బృందం ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. శనివారం మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు అండర్ గ్రాడ్యుయేట్ విభాగం ప్రెసిడెంట్ అరుణ వానికర్‌ను కలిసిన ఈ బృందం కోవిడ్ కారణంగా 2019 మెడికల్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జరిగిన నష్టాన్ని వివరించింది. జాతీయస్థాయిలో నీట్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మొదటి సంవత్సర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టతరం కాదని తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పరంగా, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరంగా తీసుకున్న విధానపరమైన లోపాల కారణంగా విద్యార్థులు నష్టపోయారని చెప్పారు. పరీక్షా పేపర్ సెట్టింగ్ విధానంలో వర్సిటీ చేసిన తప్పు కారణంగా విద్యార్థులు 20 మార్కులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కోవిడ్ కారణంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం జరగాలంటే విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసి బ్యాక్‌లాగ్స్ రాసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. లేదా కరోనా ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని గ్రేస్ మార్కులను కలిపి విద్యార్థులను పాస్ చేయాలని బోర్డు ప్రెసిడెంట్ అరుణ వానికర్‌కు, ప్రధాని కార్యాలయంలో, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయంలో లేఖ అందించారు. -
నేడే ఇంటర్ ఫలితాలు
-
నేడే ఇంటర్ ఫలితాలు
ఒకేసారి ప్రథమ, ద్వితీయ ఫలితాలు సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలి తాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధిం చిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉద యలక్ష్మి పేర్కొన్నారు. విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘సాక్షిఎడ్యుకేషన్.కామ్’లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. -
ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 33, 563 మంది విద్యార్థులకుగాను 32,824 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 739 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైట్లు ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి తెలిపారు. వాస్తవానికి జిల్లాలో పరీక్షకు హాజరుకావాల్సింది 37,912 మంది అని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పరీక్ష జరిగిన రోజున మాత్రం ఆదే అధికారులు 33,563 మంది మాత్రమే పరీక్షకు అర్హులని చెబుతున్నారు. రికార్డు పరంగా ఇచ్చిన వివరాల ప్రకారం సుమారు 4,349 మంది విద్యార్థులు తక్కువ చూపుతున్నారెందుకని ఆర్‌ఐఓను అడిగితే మిగతా వారు ఫీజులు కట్టని వారు, హాజరు శాతం తక్కువగా ఉన్న వారు ఉంటారని చెబుతున్నారు. -
వెబ్సైట్లో డీఎడ్ సెకండియర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: గత నవంబర్‌లో నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. మార్కుల మెమోలను తమ వెబ్సైట్లో (bse.telangana.gov.in) అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు రీకౌంటింగ్ కావాలనుకుంటే ఎం.పద్మావతి, అడిషనల్ జాయింట్ సెక్రటరీ పేరుతో నేరుగా లేదా పోస్టు ద్వారా వచ్చే నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి సబ్జెక్టుకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
కంబాలచెరువు (రాజమండ్రి) : వచ్చేనెల రెండు నుంచి జరగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎ.వెంకటేష్ శుక్రవారం వివరాలను తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 48,330 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరిలో వృత్తి విద్యాకోర్సుల వారు 5,892 మంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 49,178 మంది రాయనుండగా వీరిలో వృత్తివిద్యాకోర్సుల వారు 5,237 మంది. జిల్లావ్యాప్తంగా 128 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా వాటిలో 57 ప్రైవేట్ కళాశాలల్లో ఏర్పాటు కానున్నాయి. 8 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అడ్డతీగల, కూనవరం కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన రంపచోడవరం, రాజోలు కేంద్రాల్లోనూ సీసీ కె మెరాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను జి ల్లా ఇంటర్‌బోర్డు అధికారులు ఉన్నతాధికారుల కు పంపారు. వచ్చేనెల రెండున ప్రథమ, మూ డున ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమౌతాయి. పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. -
ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు 29న
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు ఈ నెల 29న విడుదలయ్యే అవకాశముంది. తొలి ఏడాది ఫలితాల్ని 25న విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీ ఇంటర్ తొలి ఏడాది ఫలితాలను 24 లేదా 25 తేదీల్లో, ద్వితీయ సంవత్సర ఫలితాల్ని 28 లేదా 29 తేదీల్లో విడుదల షెడ్యూల్‌ను అధికారులు సిద్ధం చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన ఒకట్రెండు రోజుల తర్వాతే ఏపీ ఇంటర్‌ఫలితాల్ని విడుదలచేయాలని భావిస్తున్నారు. ఒక వేళ తెలంగాణ ఫలితాల తేదీల్లో మార్పులు జరిగితే వాటినిబట్టి ఇవీ మారతాయి. కాగా ప్రైవేటు వర్సిటీల బిల్లుపై ఈనెల 22న సీఎం వీసీలతో సమీక్షించనున్నారు. -
సర్కారీ విద్యార్థులూ సూపరే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థుల్లో 65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 62.43 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 68.21 శాతం మంది పాస్ అయ్యారు. 73 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు మొదటి స్థానంలో నిలువగా, 72 శాతంతో విజయనగరం రెండో స్థానంలో ఉంది. ఇక ఎయిడెడ్ కాలేజీల్లో 53 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 62.2 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లు తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీల్లో.. ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు(జనరల్) ఇంటర్మీడియెట్‌లో చక్కని ఫలితాలు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 14 జూనియర్ కళాశాలల్లో 1,597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,483(93 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని సంస్థ కార్యదర్శి బి.శేషుకుమారి తెలిపారు. 1,175 మంది ఎ-గ్రేడ్, 243 మంది బి-గ్రేడ్, 58 మంది సి-గ్రేడ్, ఏడుగరు డి-గ్రేడ్ సాధించినట్టు వివరించారు. జనరల్ కాలేజీల్లో 98 శాతం మంది, మైనార్టీ కాలేజీల్లో 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. సంస్థ పరిధిలో గరిష్టంగా ఎంపీసీలో 981 మార్కులు(రెడ్డి ప్రవీణ్‌కుమార్, నాగార్జునసాగర్ కాలేజ్), బైపీసీలో 973 మార్కులు(ఎం.చక్రవర్తి, సర్వేల్ కాలేజ్), ఎంఈసీలో 974 మార్కులు(ఎస్.హరీష్, నాగార్జునసాగర్ కాలేజ్), సీఈసీలో 956 మార్కులు(కె.ప్రవీణ్‌కుమార్, నాగార్జునసాగర్ కాలేజ్) సాధించినట్టు వెల్లడించారు. నాగార్జునసాగర్‌లో నిర్వహించిన ప్రత్యేక తరగతుల్లో పాల్గొన్న 60 మంది విద్యార్థులకు గాను 13 మంది ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో అర్హత పొందారని తెలిపారు. అమ్మో.. ఆంగ్లం! ఇంగ్లిష్‌లోనే ఎక్కువమంది ఫెయిల్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో చాలామంది విద్యార్థులు ఆంగ్ల పరీక్షలోనే ఫెయిలయ్యారు. ఈ పరీక్షకు 9,53,609 మంది హాజరుకాగా, 1,07,874 మంది ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత 1,05,672 మంది సివిక్స్‌లో ఫెయిల్ కాగా, కెమిస్ట్రీలో 93,326 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. గతేడాది కూడా ఇంగ్లిష్‌లోనే ఎక్కువమంది ఫెయిలయ్యారు. జేఈఈ మెయిన్‌కు 13 మంది ‘గురుకుల’ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 13 మంది విద్యార్థులు శుక్రవారం ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో అర్హత సాధించారు. సీబీఎస్ఈ కటాఫ్ మార్కులను ఈసారి ఓసీలకు 115, ఓబీసీలకు 74, ఎస్టీలకు 47, ఎస్సీలకు 53గా నిర్ణయించింది. వీటిప్రకారం అర్హత సాధించిన వారిలో గురుకుల జూనియర్ కళాశాలలకు చెందిన 13 మంది విద్యార్థులున్నారు. నాగార్జునసాగర్ గురుకులంలో చదువుతున్న ఎం.సాయితేజ 159, తులసిరాములు 120, దినేష్ రిషి 92, నర్సింగరావు 85, భరత్‌కుమార్ 60 మార్కులతో అర్హత సాధించగా.. నిమ్మకూరులో చదువుతున్న తిరుమలరెడ్డి 124, వి.మనోజ్‌కుమార్ 99, సీహెచ్ భాస్కర్ 87, సాయిపవన్ 86, రాజాకృష్ణ 111 మార్కులు సాధించారు. హసన్‌పర్తి ఏపీఆర్ జేసీలో చదువుతున్న ఎల్.స్వాతి, 64, వెంకటగిరిలో చదువుతున్న వెంకటసాయిప్రసాద్ 65, గ్యారంపల్లి కాలేజీలో చదువుతున్న నాగరాజు 60 మార్కులతో జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించారు. కంప్యూటర్ ఇంజినీర్‌గా పేరు తెచ్చుకుంటా ‘కంప్యూటర్ ఇంజినీర్‌గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకొని తల్లిదండ్రుల కల నిజం చేస్తా’- అని సీనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథముడుగా నిలిచిన కేతిని నిఖిల్ బాబు ‘న్యూస్‌లైన్’కు తెలిపాడు. వరంగల్ జిల్లా మంగపేట మండలం నడిగూడెం గ్రామానికి చెందిన కేతిని శ్రీనివాస్, పుష్పవతి దంపతుల కుమారుడు నిఖిల్ బాబు. అమ్మమ్మగారి ఊరైన ఖమ్మం జిల్లా అశ్వాపురం గ్రామంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకొని 9.78 జీపీఏ సాధించాడు. చిన్ననాటి నుంచి మంచి ఇంజినీర్‌గా ఎదగాలనే కోరిక ఉండేదని, దీనిని సాకారం చేసుకుంటాన ని నిఖిల్ తెలిపాడు. - కేతిని నిఖిల్‌బాబు (ఎంపీసీ-994) ప్రఖ్యాత ఇంజినీర్‌గా ఎదుగుతా ‘మా నాన్న కోటేరు వెంకట్‌రెడ్డి, అమ్మ కృష్ణవేణి. తల్లాడలో మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న చిన్నప్పటి నుంచి ఇంజినీర్‌గా పేరు తెచ్చుకోవాలి అనేవాడు. ఆయన కల నిజం చేయాలనే పట్టుదలతో చదివాను. మంచి మార్కులు సాధించాను’అని కోటేరు ఆషా ‘న్యూస్‌లైన్‌కు చెప్పింది. తల్లాడ యూనివర్సల్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన ఆషా టెన్త్‌లో 9.5జీపీఏ సాధించింది. ఇంజినీర్‌గా ఎదిగి దేశానికి ఉపయోగపడాలన్నదే తన ధ్యేయమని ఆమె చెప్పింది. - కోటేరు ఆషా (ఎంపీసీ- 994 మార్కులు) డాక్టర్‌ను అవుతా.. ఈమె అభిప్రాయం..: స్టేట్ ఫస్ట్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, లెక్చరర్ల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించాను. బాగా చదువుకుని డాక్టర్ అయి పేదలకు సేవలందించాలన్నది నా లక్ష్యం. - నాగూరు దివ్య (బైపీసీ 989 మార్కులు) కార్డియాలజిస్ట్ నవుతా.. ఎంబీబీఎస్ చేసి కార్డియాలిజిస్ట్ కావాలనేదే తన జీవిత లక్ష్యమన్నారు. డాక్టర్ కోర్సు చదివితే ఎంతోమంది పేదలకు సర్వీసు అందించవచ్చన్నారు. అందుకోసం కష్టపడుతానని వివరించారు. పాఠ్యపుస్తకాలను ఇష్టపడి అర్ధం చేసుకుంటూ చదివినందువల్లనే ఫలితం దక్కిందన్నారు. - మొదలి రిషిత (బైపీసీ-989 మార్కులు) సీఏ కావటమే లక్ష్యం చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలన్నదే నా లక్ష్యం. నాన్న ఐనంపూడి కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి. అమ్మ నాగరాజకుమారి గృహిణి. పదదో తరగతి చదివి 9. 8 గ్రేడ్ సాధించా. అదే స్పూర్తితో ఇంటర్‌లోనూ చదివి మొదటిర్యాంక్ సాధించా. తల్లిదండ్రులు, అధ్యాపకులు నన్ను చదువులో ఎంతగానో ప్రోత్సహించారు.-ఐనంపూడి సాయిస్పందన (ఎంఈసీ- 984 మార్కులు) -
రెండో ఏడాది ఎలా?
జిల్లాలోని మెడికల్ కళాశాలకు రెండో సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టంభన తొలగడం లేదు. మొదటి విద్యా సంవత్సరానికి షరతులపై అనుమతి ఇచ్చిన ఎంసీఐ రెండో ఏడాది కొనసాగింపుపై మెలిక పెట్టింది. ఆకస్మిక పరిశీలన చేపట్టిన ఎంసీఐ బృందం ప్రధాన సమస్యలను ఎత్తి చూపుతూ అనుమతిని నిరాకరించింది. దీంతో కంగుతిన్న అధికారులు దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా రెండవసారి పరిశీలన చేపట్టేందుకు ఎంసీఐ సిద్ధమైంది. మే మొదటి వారంలో ఎప్పుడైనా పరిశీలన చేపడతామని ఎంసీఐ బృంద సభ్యులు మెడికల్ కళాశాల అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించారు. నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ఆస్పత్రిలోని ఇంటెన్సీవ్ కార్డియాక్ కేర్ సెంటర్, పాథలాజికల్ క్లీనిక్ సక్రమంగా లేవని, మైక్రోబయోలాజీ విభాగంలో పైకప్పు ఉడిపోయే దశలో ఉందని కళాశాల ప్రారంభంలో ఎంసీఐ బృందం తన నివేదికలో పేర్కొంది. సెంట్రల్ ఫొటోగ్రాఫి యూని ట్, విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బందికి వసతి గృహాలు లేకపోవడం, గ్రంథాలయంలో అసౌకర్యాలపై బృం ద సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మొద టి సంవత్సరానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఫిబ్రవరిలో మరోసారి వైద్య కళాశాలలో తనిఖీలు చేపట్టిన ఎంసీఐ బృంద సభ్యులు సౌకర్యా ల మెరుగులో ఎలాంటి పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు.కళాశాలను కొనసాగించేందుకు అభ్యం తరం వ్యక్తం చేశారు. దీంతో రెండో సంవత్సరం వైద్య విద్యకు ఎంసీఐ నుంచి అనుమతి రాలేదు. ఈ పరిణామాలతో కంగుతిన్న జిల్లా అధికారులు కళాశాలతో వసతుల కల్పనపై దృష్టి సారించా రు. ఆస్పత్రి విభాగం అసౌకర్యాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, మెడికల్ కళాశాల సమస్యలపై కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకుంటున్నారు. వీరి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎంసీఐ ఎత్తిచూపిన అంశాలను సమగ్రంగా పరిశీలించి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది వరకే గ్రంథాలయంలో 80 శాతం పుస్తకాలు అందుబాటులో ఉంచారు. భవనాల నిర్మాణం, గదుల కేటాయింపు పూర్తిచేశారు. మరికొన్ని పనులను త్వరితగతిన పూర్తిచేయడానికి కృషిచేస్తున్నారు. ఎలాగైనా ఈసారి ఎంసీఐ బృందం సంతృప్తి చెందేలా..ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఉండాలని అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండవ సంవత్సరం అనుమతి తప్పనిసరి అయినందున డెరైక్టర్ ఆఫ్ మెడికల్ కళాశాల అధికారులు సైతం ఇక్కడి లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ల గైర్హాజరు, వైద్య సిబ్బంది నియామకాలపై అధికారుల్లో ఆందోళన నెలకొంది. పలుమార్లు హెచ్చరించినా ప్రొఫెసర్లు విధులకు హాజరుకావడం లేదు. ఎంసీఐ పరిశీలనలో ఇది కీలకమైన అంశంగా ఉంది. ఈ సమస్య పరిష్కారంపై వైద్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టిసారించారు. మే మొదటి వారంలోగా కళాశాల అభివృద్ధి పనులు పూర్తిచేయడానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు. కాగా వైద్య కళాశాలలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కూడా అనుమతిపై ఆందోళ నగా ఉన్నారు. పనులు చేపట్టాం - జిజియాబాయి, కళాశాల ప్రిన్సిపాల్ మేలో ఎంసీఐ బృందం వస్తున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం. బృందం వచ్చేలోగా కళాశాల, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం. అభివృద్ధి పనులను పూర్తిచేస్తాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. తప్పనిసరి అనుమతి వస్తుందనే నమ్మకం ఉంది. -
ఇంజనీరింగ్ కోర్సుకు పునాది.. ద్వితీయ సంవత్సరం
మంచి ఇంజనీర్‌గా పేరుతెచ్చుకోవడం.. కోరుకున్న కంపెనీలో ఉద్యోగం సంపాదించడం.. ఇవీ ఇంజనీరింగ్‌లో చేరిన ప్రతి విద్యార్థి కనే కలలు.. శ్రమ, పట్టుదల, అంకిత భావం వంటి సద్గుణాలను ఆయుధాలుగా మల్చుకున్నప్పుడే అనుకున్న కలలను సాకారం చేసుకోవచ్చు.. ఈ క్రమంలో ఇంజనీరింగ్‌లో ప్రతి ఏడాది కీలకం అనే అంశాన్ని గమనించాలి.. ఒక సంవత్సరం బాగా చదివి, మరో ఏడాదిని నిర్లక్ష్యం చేయడానికి కుదరదు.. ఒకరకంగా నాలుగేళ్లు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉంటాయి.. ముఖ్యంగా రెండో ఏడాదిలో అడుగుపెట్టిన విద్యార్థులు.. మొదటి సంవత్సరానికి రెండో సంవత్సరానికి తేడాను గుర్తించి తదనుగుణంగా అడుగులు వేయాలి.. అప్పుడే కోర్సులోని మూడు, నాలుగు సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు చక్కని కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలు.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు సబ్జెక్టులు కామన్‌గా ఉంటాయి. ఇందులో హ్యుమానిటీస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ అంశాలను బోధిస్తారు. ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్‌ను కూడా మొదటి సంవత్సరంలోనే పరిచయం చేస్తారు. ఇంటర్మీడియెట్‌తో పోల్చితే.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌లు అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్మీడియెట్‌కు కొనసాగింపుగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరాన్ని పేర్కొనవచ్చు. కాబట్టి ద్వితీయ సంవత్సరం నుంచే ఎంచుకున్న బ్రాంచ్‌కు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడడం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. కోర్-ఇంటర్ డిసిప్లినరీ: ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ఎంచుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు అనుగుణంగా.. ఆయా బ్రాంచ్‌లలోని ప్రాథమిక అంశాలతోపాటు, ఇతర బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో కంప్యూటర్ ప్రోగ్రామ్, లాంగ్వేజ్ ప్రోగ్రామ్, డిజిటల్ లాజిక్ డిజైన్ వంటి సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంతేకాకుండా కోర్ సబ్జెక్ట్‌లు, ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంటే ఒక బ్రాంచ్ విద్యార్థికి మరో బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు మెకానికల్ విద్యార్థికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలను బోధిస్తారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. రెండో సంవత్సరంలో థియరీ ఎక్కువగాను, ప్రాక్టికల్ వర్క్ తక్కువగా ఉంటుంది. ఇంటరాక్షన్: రెండో సంవత్సరంలో ప్రతి రోజూ తరగతులకు హాజరు కావాలి. ఏరోజు పాఠాలను ఆరోజే సాధన చేయాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. సాధారణంగా మొదటి సంవత్సరం అంతా కామన్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. అంటే రెండో సంవత్సరంలో మాత్రమే విద్యార్థులు తాము ఎంచుకున్న బ్రాంచ్‌ల్లోకి అడుగుపెడతారని చెప్పొచ్చు. ఇక్కడే బ్రాంచ్‌ల వారీగా ఆయా సబ్జెక్ట్‌ల ప్రొఫెసర్స్ చెప్పే లెక్చర్స్ వినే, వారితో మాట్లాడే అవకాశం లభిస్తుంది. కాబట్టి సంబంధిత ప్రొఫెసర్స్‌తో ఇంటరాక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. సందేహాలను ఎప్పటికప్పుడూ నివృత్తి చేసుకోవాలి. కాన్సెప్ట్-ప్రాక్టికల్: తరగతి గదిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు ల్యాబ్స్‌లో కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా సాధన చేస్తేనే పరీక్షల్లో ఎక్కువ స్కోరింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కేవలం తరగతులకు హాజరైతే సరిపోతుంది.. ప్రాక్టికల్స్ అవసరం లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఏదైనా అంశాన్ని ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే సంపూర్ణ విషయ పరిజ్ఞానం సొంతమవుతుంది. ప్రయోగాత్మక పరిజ్ఞానం లేకుండా కేవలం పుస్తక విజ్ఞానం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి పరీక్షలకు పక్కాగా సిద్ధం కావాలంటే ఈరెండు విభాగాల్లోనూ పట్టు సాధించాలి. ఒకరకంగా చెప్పాలంటే.. ద్వితీయ సంవత్సరంలోని ఆరు సబ్జెక్టులు, రెండు ల్యాబ్స్‌పై సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. అన్నీ ముఖ్యమే: మరో విషయం.. ఇంజనీరింగ్‌లో ఒక సబ్జెక్టు తేలిక, మరొకటి కష్టంగా ఉండదు. అన్ని సబ్జెక్టులూ ముఖ్యమే. దేనికీ తక్కువ ప్రాధాన్యత ఇవ్వలేం. అందుకే ద్వితీయ సంవత్సరంలోని సబ్జెక్టులపై పట్టు సాధిస్తే.. తృతీయ సంవత్సరాన్ని సులువుగానే గట్టెక్కవచ్చు. ఒకరకంగా ల్యాబ్స్‌లో విద్యార్థి ప్రాక్టికల్స్‌ను ఎంత సమర్థంగా నేర్చుకుంటే ఇంటర్నల్స్, మిడ్ ఎగ్జామ్స్‌లో అంత మంచి స్కోరింగ్ చేయవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన ఇంజనీర్‌గా రూపొందవచ్చు. అవగాహనకు ప్రాధాన్యత: ఇంజనీరింగ్‌లో స్కోరింగ్‌లో ఇంటర్నల్స్దీ ప్రధానపాత్ర. కోర్సు మధ్యలో నిర్వహించే ఇంటర్నల్స్‌లో విద్యార్థులు సులువుగా మార్కులు సాధించొచ్చనే ధోరణితో వ్యవహరించొద్దు. ఇంటర్నల్స్‌ను పక్కాగా ప్రిపేరైతేనే సెమిస్టర్ పరీక్షల్లోనూ సులువుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్ మార్కులపై దృష్టిసారించి తద్వారా మంచి మార్కుల శాతాన్ని పొందడానికి కృషిచేయాలి. ఇంటర్నల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటిని తేలిగ్గా తీసుకోరాదు. ప్రాబ్లమ్ ఓరియంటెడ్‌గా ప్రిపరేషన్ సాగిస్తే వీటిల్లో విజయం సాధించడం సులభం. ఒకరకంగా చెప్పాలంటే ద్వితీయ సంవత్సరంలోని సబ్జె క్టులను చదవడం కంటే.. ఆయా పాఠ్యాంశాల మూల భావన (కాన్సెప్ట్)ను అవగాహన చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే.. బీటెక్‌లో ప్రశ్నలను మార్చిమార్చి అడుగుతుంటారు. మనకు బాగా అవగాహన ఉన్న అంశాన్ని సైతం జటిలం (ట్విస్ట్) చేసే విధంగా ప్రశ్నలు సంధిస్తుంటారు. అందుకే సబ్జెక్టును చదివి అవగాహన చేసుకోవడంతోపాటు ల్యాబ్‌లో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తేనే ద్వితీయ సంవత్సరంలోని రెండు సెమిస్టర్లలో మంచి స్కోరింగ్ చేయవచ్చు. మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్, ఇంజనీరింగ్ మ్యాగజైన్లను చదువుతూ సబ్జెక్టుపై పట్టు సాధించాలి. విద్యార్థులు మొదటి సంవత్సరంలో సీ- ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, రెండో సంవత్సరంలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్‌లలో ఎక్కువగా ఫెయిల్ అవుతుంటారు. కాబట్టి ప్రారంభం నుంచే ఈ సబ్జెక్ట్లపై దృష్టి సారించి.. ఎక్కువ శ్రమ చేయడం లాభిస్తుంది. పరీక్షలలో మంచి మార్కులు సాధించాలంటే.. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఏ టాపిక్ మీద ఎటు వంటి ప్రశ్నలు వస్తున్నాయో క్షుణ్నంగా తెలుసుకోవాలి. కనీసం 60 శాతం సిలబస్‌ను క్షుణ్నంగా చదవాలి. ప్రణాళిక ప్రకారం: ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరడంతోనే అపరిమిత స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తుంటారు. దాంతో చదువు ద్వితీయ ప్రాధాన్యతగా మారిపోతుంది. దీంతో కొన్ని బ్యాక్‌లాగ్స్ మిగిలి పోతాయి. దాంతో రెండో సంవత్సరం ప్రారంభమయ్యేసరికి ఈ బ్యాక్‌లాగ్స్ కారణంగా విద్యార్థులు ఒత్తిడికి లోనవుతుంటారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమించాలి. మరో ప్రధాన సమస్య ర్యాగింగ్. రెండో సంవత్సరానికి చేరడంతో సీనియర్ అయిపోయామనే భావంతో వ్యవహరిస్తుంటారు. జూనియర్లను ర్యాగింగ్ చేయాలని ఉత్సాహపడుతుంటారు. సుప్రీంకోర్ట జడ్జిమెంట్ ప్రకారం ర్యాగింగ్ చేయడం శిక్షార్హం. కాబట్టి ఈ అంశానికి దూరంగా ఉండడం మంచిది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే.. ద్వితీయ సంవత్సరాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేసుకుని తృతీయ సంవత్సరంలోకి అడుగుపెట్టొచ్చు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. మొదటి రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వారిని మార్గదర్శనం చేస్తుండాలి. పునాది: మరో కీలకాంశం.. ఇంజనీరింగ్ కోర్సులోని చివరి రెండేళ్లూ (మూడు, నాలుగు సంవత్సరాలకు) చదివే పాఠ్యాంశాలకు.. ద్వితీయ సంవత్సరంలోని సబ్జెక్ట్‌లు పునాదుల వంటివని చెప్పొచ్చు. కాబట్టి రెండో సంవత్సరం సబ్జెక్ట్లపై ఎంత పట్టు సాధిస్తే.. మిగతా రెండేళ్లు రాణించడం అంత సులభమవుతుంది. దాంతోపాటు కోర్సు పూర్తయ్యాక హాజరయ్యే వివిధ పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నల్లో అధిక శాతం ప్రశ్నలకు ఆధారం ద్వితీయ సంవత్సరం పాఠ్యాశాలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి రెండో సంవత్సరాన్ని మొత్తం నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యకే తలమానికంగా పేర్కొనవచ్చు. రెండో సంవత్సరం కోర్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఈ దశలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రయత్నించాలి. కోర్సు మొత్తానికి దిశానిర్దేశం జరిగేది ఇక్కడే. మంచి మార్కులు సాధించాలన్నా..పూర్తి కోర్సుపై అవగాహన ఏర్పడాలన్నా ఈ ద్వితీయ సంవత్సరమే కీలకమనే విషయాన్ని గమనించాలి. ఇక్కడే ప్రారంభించాలి: చాలా మంది విద్యార్థులు నాలుగో సంవత్సరం వచ్చే వరకు కూడా కెరీర్ పట్ల ఒక అవగాహనను ఏర్పర్చుకోరు. ఉద్యోగం.. ఉన్నత విద్య అనే రెండు అంశాల్లో ఎప్పుడూ సందిగ్ధతలో ఉంటారు. అలా కాకుండా రెండో సంవత్సరం నుంచే భవిష్యత్ దిశగా ఆలోచనలు చేయడం శ్రేయస్కరం. స్వదేశం, విదేశాల్లో పీజీ చేయడమా? మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకోవడమా? ఉద్యోగం దిశగా ప్రయత్నం చేయడమా? ఇలా ఒక అంశంపై స్పష్టత తెచ్చుకోవాలి. తర్వాత దానికనుగుణంగా సన్నాహాలను ఈ రెండో సంవత్సరం నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే.. మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్, నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలతో సమయం సరిపోదు. విదేశాల్లో పీజీ చేసే ఉద్దేశం ఉంటే మూడో సంవత్సరంలోనే అందుకు సంబంధించిన పరీక్షలను పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే విదేశీ వర్సిటీల్లో చేరేందుకు నిర్వర్తించాల్సిన సన్నాహాలకు ఏడాదికి పైగా పడుతుంది. కాబట్టి సదరు పరీక్షల ప్రిపరేషన్, కోచింగ్ వంటి వ్యవహారాలను రెండో ఏడాది నుంచే ప్రారంభించాలి. గేట్, ఐఈఎస్, క్యాట్ తదితర పోటీ పరీక్షల గురించి కూడా ఈ సంవత్సరంలోనే దృష్టి సారించడం మంచిది. అకడమిక్ కార్యకలాపాలతో సమాంతరంగా వీటికి సమయం కేటాయించాలి. సాఫ్ట్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, ఆంగ్ల భాషపై పట్టు సాధించడం వంటి అంశాలను మెరుగుపరుచుకోవడానికి తగినంత ప్రాధాన్యతనివ్వాలి. వృథా కాకుండా : ప్రతీ యూనివర్సిటీలో రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరంలో మూడు లేదా ఆరు వారాల పాటు ఏదైనా పరిశ్రమలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ఇండస్ట్ట్రియల్ ట్రైనింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో తనకు ఆసక్తి ఉన్న పరిశ్రమ గురించి ఇంటర్నెట్ లేదా మరే మాధ్యమం ద్వారానైనా అవగాహన ఏర్పర్చుకుని అందులో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయడం మంచిది. చాలా మంది విద్యార్థులు ఈ అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ఒకవేళ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లేకపోయినా వేసవి సెలవులను వృథా కానీయకుండా ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ చేయడం మంచిది. దీని వల్ల చదివిన సబ్జెక్ట్లపై పట్టు చిక్కుతుంది. ఇంజనీరింగ్ విద్యకే కీలకమైన అన్వయించే సామర్థ్యం (అప్లికేషన్ స్కిల్స్) అలవడుతుంది. తరగతిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు ల్యాబ్స్‌లో కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా సాధన చేయాలి. ఉద్యోగం.. ఉన్నత విద్య అనే రెండు అంశాల్లో రెండో సంవత్సరంలోనే ఒక స్పష్టతకు రావాలి. రెండేళ్లూ (3, 4 సంవత్సరాలకు) చదివే పాఠ్యాంశాలకు.. ద్వితీయ సంవత్సరంలోని సబ్జెక్ట్‌లు పునాదుల వంటివి. ఇంజనీరింగ్ పోటీ పరీక్షల్లోని అధిక శాతం ప్రశ్నలకు ఆధారం ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశాలే. బ్యాక్‌లాగ్స్ లేకుండా, ర్యాగింగ్ వంటి అంశాలకు దూరంగా ఉండాలి. ప్రొ. పి.ఎస్. అవధాని, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం.