డీఎడ్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: గత నవంబర్‌లో నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. మార్కుల మెమోలను తమ వెబ్‌సైట్‌లో (bse.telangana.gov.in) అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు రీకౌంటింగ్ కావాలనుకుంటే ఎం.పద్మావతి, అడిషనల్ జాయింట్ సెక్రటరీ పేరుతో నేరుగా లేదా పోస్టు ద్వారా వచ్చే నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి సబ్జెక్టుకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.