ముంబై: టాటా గ్రూప్ రూపొందించిన మలీ్టపర్పస్ సూపర్ యాప్ టాటా న్యూ వచ్చే ఏడాది రెండో వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో డిజైన్‌ను సరికొత్తగా మార్చే యోచనలో ఉంది. అంతేకాకుండా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ)ను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ వివరాల ప్రకారం సాంకేతిక అంశాల కారణంగా యూజర్ ఇంటర్‌ఫేస్ (యూఐ)ను బ్లాక్ నుంచి వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి మార్చనుంది. 2022 ఏప్రిల్ 7న టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత క్లోజ్‌డ్ యూజర్ గ్రూప్‌తో టాటా న్యూ యాప్ ప్రారంభంకాగా.. రెండు నగరాల(బెంగళూరు, ఢిల్లీ)కే పరిమితమైంది.
ప్రస్తుతం ఓఎన్‌డీసీతోపాటు మ్యాజిక్‌పిన్ సహకారం ద్వారా ఫుడ్ డెలివరీ సరీ్వసులను ప్రవేశపెట్టనుంది. గతేడాది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా మ్యాజిక్‌పిన్ ఫుడ్ ఆర్డర్లు రెట్టింపయ్యాయి. కాగా.. గత నెలలో కొత్త సీఈవోగా సీఈవో నవీన్ తహిల్యానికి బాధ్యతలు అప్పగించడంతోపాటు పలు మార్పులకు టాటా న్యూ తెరతీసింది. వివిధ బిజినెస్ చీఫ్‌లతో నవీన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పరిస్థితులపై ఉద్యోగులతో సర్వే చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment