user interface
-
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
‘గుడ్ మార్నింగ్.... ఇదొక అంద మైన మార్నింగ్’ అంటూ 16 ఏళ్ల క్రితం తెలుగు లోగిళ్లను.. తాకిన ‘సాక్షి’ని తెలు గు ప్రజలందరూ అభిమానపూర్వకంగా మీ మనసుల్లో నిలుపుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వార్తా ప్రపంచంలో ఒంటెత్తు పోకడకు ఫుల్స్టాప్ పెడుతూ నాణేనికి మరోవైపును చూపుతూనే ఉంది ‘సాక్షి’. ఆల్కలర్ పేజీలు, ఏకకాలంలో 23 ఎడిషన్లతో మొదలైన సాక్షి తరువాతి కాలంలో దినదిన ప్రవర్ధమానమై శాటి లైట్ చానల్, డిజిటల్ మీడియాకూ విస్తరించింది. పాఠకుల అవసరాలు.. మనోభావాలకు తగ్గట్టుగా తనను తాను మలచుకోవడంలో సాక్షి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంది. అంత ర్జాతీయ ప్రమాణాలు, డిజైన్లతో ‘సాక్షి’ చానల్ ఇటీవలే సరికొత్త రూపు సంతరించుకున్న విషయం మీకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు... "Sakshi.com''కు కూడా కొత్త సొబగులు అద్దుతున్నాం.జర్నలిజం విలువలలో ఏమాత్రం రాజీ పడకుండా... డిజైనింగ్, నావి గేషన్ విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మీకోసం మరింత అందంగా తయారైంది మీ వెబ్సైట్! కంటికి ఇంపుగా... వార్తలు చదివేందుకు మరింత సులభతరంగా ఉంటుంది ఇది. ఇంటర్నెట్ తాజా పోకడలను ప్రతిబింబించే లుక్ అండ్ ఫీల్, సులభంగా నావిగేట్ చేసుకునే యూజర్ ఇంటర్ఫేస్, ఏ డివైజ్‌కైనా అనుకూలంగా మారే రెస్పాన్సివ్ వెబ్సైట్, నచ్చిన కంటెంట్‌ను సిఫార్సు చేసే టూల్స్, అంతే కాదు.. వార్తలు చదువుకోవడంతోపాటు హాయిగా మల్టీ మీడియాలో ఫొటోలు, వీడియో లు చూడవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. వీటితోపాటే సాక్షి మొబైల్ అప్లికేషన్ ను కూడా ఆధునికీకరించాం. మీరు మొబైల్ యాప్‌లో సాక్షిని ఫాలో అవుతుంటే (ఆండ్రాయిడ్ లేదా iOS ) యాప్‌ను ఒక్కసారి అప్డేట్ లేదా రీఇన్ స్టాల్ చేసుకోవడమే తరువాయి. సరికొత్త డిజైన్, లుక్స్‌తో సాక్షి.కామ్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది.దశాబ్ద కాలంగా sakshi.comని ఆదరిస్తున్న పాఠకదేవుళ్లు మాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. డిజిటల్ ప్లాట్‌ఫాంల రీడర్‌షిప్‌ను లెక్కించే ఆధీకృత వ్యవస్థ comscore ప్రకారం.. తెలుగు న్యూస్ వెబ్సైట్లలో www.sakshi.com అత్యధిక యూనిక్ విజిటర్స్‌తో చాలాకాలంగా మొదటి స్థానంలో ఉంది. (··Source: comscore).సాక్షి కుటుంబంలో మీరంతా సభ్యులైనందుకు గర్విస్తున్నాం. కొత్త రూపంలో మీ ముందుకొచ్చిన www.sakshi.com ను ఆశీర్వదించండి. – ఎడిటర్, సాక్షి మీడియా గ్రూప్ -
ఫుడ్ డెలివరీలోకి టాటా న్యూ
ముంబై: టాటా గ్రూప్ రూపొందించిన మలీ్టపర్పస్ సూపర్ యాప్ టాటా న్యూ వచ్చే ఏడాది రెండో వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో డిజైన్‌ను సరికొత్తగా మార్చే యోచనలో ఉంది. అంతేకాకుండా ఆన్లైన్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాల ప్రకారం సాంకేతిక అంశాల కారణంగా యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)ను బ్లాక్ నుంచి వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి మార్చనుంది. 2022 ఏప్రిల్ 7న టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌తో టాటా న్యూ యాప్ ప్రారంభంకాగా.. రెండు నగరాల(బెంగళూరు, ఢిల్లీ)కే పరిమితమైంది. ప్రస్తుతం ఓఎన్డీసీతోపాటు మ్యాజిక్‌పిన్ సహకారం ద్వారా ఫుడ్ డెలివరీ సరీ్వసులను ప్రవేశపెట్టనుంది. గతేడాది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా మ్యాజిక్‌పిన్ ఫుడ్ ఆర్డర్లు రెట్టింపయ్యాయి. కాగా.. గత నెలలో కొత్త సీఈవోగా సీఈవో నవీన్ తహిల్యానికి బాధ్యతలు అప్పగించడంతోపాటు పలు మార్పులకు టాటా న్యూ తెరతీసింది. వివిధ బిజినెస్ చీఫ్‌లతో నవీన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పరిస్థితులపై ఉద్యోగులతో సర్వే చేపట్టారు. -
హింట్ ఇచ్చేసిందిగా, ఇండియన్ రోడ్లపై టెస్లా చక్కర్లు
దేశియ రోడ్లపై టెస్లాకార్లు రయ్.. రయ్ మంటూ ఎప్పుడు తిరుగుతాయా అని ఎదురు చూస్తున్న అభిమానులకు టెస్లా శుభవార్త చెప్పింది. యూజర్ ఇంటర్ ఫేస్‌లో హిందీ లాంగ్వేజ్‌ను యాడ్ చేసింది. దేశంలో చమురు ధరలు పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఈవీ మార్కెట్ పై కన్నేసిన ఆటోమొబైల్ సంస్థలు ఈవీ వాహనాల్ని తయారు చేసి, భారత్ లో విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రముఖ ఈవీ వెహికల్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ త్వరలో భారత్‌లో టెస్లా కార్యకలాపాల్ని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూఐలో హిందీ లాంగ్వేజ్ ఇప్పటికే భారత్ లో ఐటీహబ్ గా పేరొందిన బెంగళూరు కేంద్రంగా టెస్లా ఇండియా పేరుతో ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి హెడ్ గా ప్రశాంత్ ఆర్.మీనన్ ను ఎంపిక చేశారు. ప్రశాంత్ మీనన్ సైతం టెస్లా కార్లను ఇండియాలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా టెస్లా కార్ యూజర్ ఇంటర్ ఫేస్(UI)లో రష్యన్,గ్రీక్,ఫిన్నిష్ క్రొయేషియన్ లాంగ్వేజ్‌తో పాటు హిందీ లాంగ్వేజ్‌ను యాడ్ చేసింది. దీంతో ఇండియన్ ఆటోమొబైల్ నిపుణులు టెస్లా కారు ఇండియన్రోడ్లపై తిరిగే సమయం దగ్గరలోనే ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో టెస్లా మోడల్ 3 కొద్ది రోజుల క్రితం భారత్‌లో టెస్లా మోడల్ 3 కార్ ట్రయల్స్ నిర్వహించారు.ఈ ట్రయల్స్‌లో రోడ్లపై టెస్లా కార్ల డ్రైవింగ్ సులభంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధులు నిర్ధారించారు. దీంతో టెస్లా మోడల్-3 రెడ్ కలర్ కార్‌ను బెంగళూరులో డెలివరీ చేసింది. భారత్‌లో తొలిసారి విడుదల చేయనున్న ఈ కారు ధర రూ.70 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. టెస్లా మోడల్ -3 అమెరికన్ మార్కెట్లో ప్రారంభ ధర సుమారు రూ .30 లక్షలు ($ 39,990) కు విక్రయిస్తున్నారు. కార్లపై అధిక కస్టమ్స్ సుంకం విధించడం వల్ల, భారత్ కు వచ్చే టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ .70 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. -
పేటీఎం ఇకపై తెలుగులోనూ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాలె ట్, ఈ కామర్స్ సంస్థ పేటీఎం తెలుగు సహా పది ప్రాంతీయ భాషల వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆయా భాషల్లో యూజర్ ఇంటర్ఫేస్ను అంబుబాటులోకి తెచ్చింది. పేటీఎం ఆండ్రారుుడ్ యూజర్ ఇంటర్ఫేస్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుం దని, దీంతో దేశంలోని 10 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్లకు చేరువ కానున్నట్టు కంపెనీ పేర్కొంది.