‘గుడ్ మార్నింగ్.... ఇదొక అంద మైన మార్నింగ్’ అంటూ 16 ఏళ్ల క్రితం తెలుగు లోగిళ్లను.. తాకిన ‘సాక్షి’ని తెలు గు ప్రజలందరూ అభిమానపూర్వకంగా మీ మనసుల్లో నిలుపుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వార్తా ప్రపంచంలో ఒంటెత్తు పోకడకు ఫుల్‌స్టాప్ పెడుతూ నాణేనికి మరోవైపును చూపుతూనే ఉంది ‘సాక్షి’.
ఆల్‌కలర్ పేజీలు, ఏకకాలంలో 23 ఎడిషన్లతో మొదలైన సాక్షి తరువాతి కాలంలో దినదిన ప్రవర్ధమానమై శాటి లైట్ చానల్, డిజిటల్ మీడియాకూ విస్తరించింది. పాఠకుల అవసరాలు.. మనోభావాలకు తగ్గట్టుగా తనను తాను మలచుకోవడంలో సాక్షి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంది. అంత ర్జాతీయ ప్రమాణాలు, డిజైన్లతో ‘సాక్షి’ చానల్ ఇటీవలే సరికొత్త రూపు సంతరించుకున్న విషయం మీకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు... "Sakshi.com''కు కూడా కొత్త సొబగులు అద్దుతున్నాం.
జర్నలిజం విలువలలో ఏమాత్రం రాజీ పడకుండా... డిజైనింగ్, నావి గేషన్ విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మీకోసం మరింత అందంగా తయారైంది మీ వెబ్‌సైట్! కంటికి ఇంపుగా... వార్తలు చదివేందుకు మరింత సులభతరంగా ఉంటుంది ఇది.
ఇంటర్నెట్ తాజా పోకడలను ప్రతిబింబించే లుక్ అండ్ ఫీల్, సులభంగా నావిగేట్ చేసుకునే యూజర్ ఇంటర్‌ఫేస్, ఏ డివైజ్‌కైనా అనుకూలంగా మారే రెస్పాన్సివ్ వెబ్‌సైట్, నచ్చిన కంటెంట్‌ను సిఫార్సు చేసే టూల్స్, అంతే కాదు.. వార్తలు చదువుకోవడంతోపాటు హాయిగా మల్టీ మీడియాలో ఫొటోలు, వీడియో లు చూడవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు.
వీటితోపాటే సాక్షి మొబైల్ అప్లికేషన్ ను కూడా ఆధునికీకరించాం. మీరు మొబైల్ యాప్‌లో సాక్షిని ఫాలో అవుతుంటే (ఆండ్రాయిడ్ లేదా iOS ) యాప్‌ను ఒక్కసారి అప్‌డేట్ లేదా రీఇన్ స్టాల్ చేసుకోవడమే తరువాయి. సరికొత్త డిజైన్, లుక్స్‌తో సాక్షి.కామ్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది.
దశాబ్ద కాలంగా sakshi.comని ఆదరిస్తున్న పాఠకదేవుళ్లు మాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. డిజిటల్ ప్లాట్‌ఫాంల రీడర్‌షిప్‌ను లెక్కించే ఆధీకృత వ్యవస్థ comscore ప్రకారం.. తెలుగు న్యూస్ వెబ్‌సైట్లలో www.sakshi.com అత్యధిక యూనిక్ విజిటర్స్‌తో చాలాకాలంగా మొదటి స్థానంలో ఉంది.
(··Source: comscore).
సాక్షి కుటుంబంలో మీరంతా సభ్యులైనందుకు గర్విస్తున్నాం. కొత్త రూపంలో మీ ముందుకొచ్చిన www.sakshi.com ను ఆశీర్వదించండి. – ఎడిటర్, సాక్షి మీడియా గ్రూప్
Comments
Please login to add a commentAdd a comment