![Summer Weather in Hyderabad here is some tips](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Summer.jpg.webp?itok=e0knLbD9)
నిన్నామొన్నటి వరకు గజ గజ వణింకించిన చలించింది. ఇపుడిక ఎండలు దంచికొడుతున్నాయి. జనవరి మాసం అలా వెళ్లిందో లేదో ఫిబ్రవరి మాసం ఆరంభంనుంచి క్రమంగా వాతావరణ వేడెక్కడం మందలైంది. ఇపుడిక ఎండలు మండిస్తున్నాయి. ఎండ ప్రభావం, ఉక్కపోత మొదలైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
సాధారణంగా శివరాత్రితో శివ..శివా అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కానీ శివరాత్రి కంటే ముందే ఎండల ప్రభావం కనిపిస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవిలో ఎండల బాధలు, తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకూడదు. ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు.
ముదురుతున్న ఎండలు- జాగ్రత్తలు
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి.
అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.
బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్ఫ్‌లు ధరించాలి.
మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి.
కొబ్బరి నీళ్లు, నీళ్ల కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.
కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.
ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగ్గిపోతాయి.
ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment