sakshi media
-
ఉద్యోగాల ఎర.. ‘సైబర్’ వెట్టిలో చెర!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్స్టర్లు ఆన్లైన్లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.విమాన టికెట్ పంపి మరీ..కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్‌లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్‌రెడ్డి పాస్‌పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.గత్యంతరం లేకపోవడంతో..అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్‌రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. అయితే పాస్‌పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్‌లో పరిస్థితులు మారడంతో స్కామ్స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్‌కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్‌లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్‌కు, థాయ్‌లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.కాపాడాలని వేడుకోలు..అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్‌ను సంపాదించిన మధుకర్‌రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్‌కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు. -
నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
‘సాక్షి’కి ఎందుకు చెప్పారు?
సాక్షి, అమరావతి: ‘‘ఏమనుకుంటున్నారు మీరంతా..? కరెంట్ గురించి, బిల్లుల గురించి ‘సాక్షి’ వాళ్లకు ఎందుకు చెప్పారు..? ఎవరు చెప్పమన్నారు..? ఇలా అయితే చాలా ఇబ్బంది పడతారు..! మరోసారి ఇలా ఎవరికైనా చెబితే సహించేది లేదు..!’’ అంటూ విద్యుత్ బిల్లుల బాధితులపై కూటమి నేతలు, అధికార యంత్రాంగం బెదిరింపులకు దిగాయి. ఏమిటీ నిరంకుశం?ఏలూరు జిల్లా మల్కీ మహ్మద్‌పురం (పల్లపూరు)లో విద్యుత్ బిల్లుల బాధితుల వద్దకు మంగళవారం వచ్చిన భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ) గోపాలకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శివాజీ, లైన్మెన్ శేషగిరితో పాటు దాదాపు పది మంది అధికారులు, సిబ్బంది, కూటమి నేతలు వారిపై విరుచుకుపడ్డారు. ‘సాక్షి’తో ఎందుకు మాట్లాడారని గద్దించారు. పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తామంటూ హెచ్చరించారు. ఇకపై విద్యుత్ బిల్లులు, చార్జీల గురించి ఎక్కడా నోరు విప్పవద్దని తమను బెదిరించినట్లు బాధితులు వెల్లడించారు. ఇకపై తమను వేధింపులకు గురి చేస్తారని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఏమిటీ నిరంకుశత్వమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమే కానీ.. మీరెలా రాసేస్తారు?దీనిపై ఏఈ శివాజీని వివరణ కోరగా.. ‘‘మావైపు తప్పు ఉన్న మాట వాస్తవం.. అయినా మీరు ఎలా రాసేస్తారు?’’ అంటూ ‘సాక్షి’ ప్రతినిధిని సైతం బెదిరించే ధోరణిలో మాట్లాడారు. లైన్ మెన్ శేషగిరికి ప్రతి నెలా విద్యుత్ బిల్లు నిమిత్తం డబ్బులిస్తున్నా తమకు రసీదు ఇవ్వడం లేదని ఎంఎంపురం వాసి పాపమ్మ ‘సాక్షి’కి తెలిపారు. దీన్ని లైన్మెన్ దృష్టికి తేగా రసీదు ఎక్కడో పడేశానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. గోడు ఆలకించకుండా బెదిరింపులా..!పేదలకు సంక్షేమ పథకాలిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో తమ నడ్డి విరుస్తుండటంతో హాహాకారాలు చేస్తున్నారు. వారి గోడును తెలుసుకుని వాస్తవాలను ‘సాక్షి’ అందరి దృష్టికి తెస్తోంది. వారి కష్టాలను ‘గ్రౌండ్ రిపోర్ట్’ రూపంలో ప్రచురిస్తోంది. అయితే ఇదంతా ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. కరెంటు చార్జీలు పెంచినా, పేదలకు ఉచిత విద్యుత్‌ను దూరం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణితో పాలకులు వ్యవహరిస్తున్నారు. అనుమతి ప్రకారమే చార్జీలు: ఇంధన శాఖఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితోనే ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. ‘కరెంటు కోత.. చార్జీల మోత’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆ శాఖ స్పందించింది. ఎం.ఎం.పురంలో పాచిపని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు సిగారపు పాపమ్మకు పాత బకాయిల వల్లే రూ.1,345 విద్యుత్ బిల్లు వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల బిల్లుల్లో కొంత, వచ్చే నెల బిల్లుల నుంచి మరికొంత మేర సర్దుబాటు చార్జీలు విధిస్తున్నట్లు వెల్లడించింది. ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ వినియోగదారుడికీ సబ్సిడీ తొలగించలేదని, ఎవరికైనా సబ్సిడీ రాకుంటే సంబంధిత ధృవపత్రాలతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే అర్హతను పరిశీలించి మంజూరు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎలాంటి లోడ్ రిలీఫ్ అమలు చేయడం లేదని పేర్కొంది. -
ఉమెన్ పవర్ 2024: కాలాన్ని కట్టడి చేశారు
కాలం.. మరో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. జారిపోతున్న కాలపు క్షణాలను అపురూపంగా ఒడిసిపట్టుకొని ఉన్నతంగా ఎదిగినవారు కొందరు... ఉదాత్తంగా జీవనాన్ని మలుచుకున్నవారు ఇంకొందరు ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా వెనక్కి లాగే పరిస్థితులు ఏవైనా కాలానికి ఎదురు నిలిచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ అత్యున్నతంగా ఎదిగిన కొందరు మహిళా మణుల కృషిని ఈ ఏడాది ‘సాక్షి ఫ్యామిలీ’ ఆవిష్కరించింది. ఆ గాథలను మరోమారు గుర్తుచేసుకుందాం. ఎదనిండా స్ఫూర్తిని నింపుకుందాం.డాక్టరమ్మ క్రీడా శిక్షణనిజామాబాద్ పట్టణంలో బాలికల క్రీడానైపుణ్యాలను చూసి, వారి కోసం తన పేరుతోనే 2019లో ఫుట్‌బాల్ అకాడమినీ ఏర్పాటు చేశారు డాక్టర్ శీలం కవితారెడ్డి. ఈ అకాడమీలో 41 మంది బాలికలకు కోచ్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు ఈ అకాడమీ లో ఉచిత వసతి, ఆహారం, దుస్తులు, వైద్యసేవలను అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన ఖర్చులన్నీ భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి జాతీయ–అంతార్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉన్నారు.అమ్మాయిలను కాపాడుకుందాం..గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణారావు. హైదరాబాద్ వాసి అయిన ఈ సామాజిక కార్యకర్త డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్‌గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయ వేదిక ‘మకాం’ సహ వ్యవస్థాపకురాలిగానూ ఉన్నారు. నారీశక్తి పురస్కార గ్రహీత అయిన రుక్మిణీరావు ముప్పై ఏళ్లుగా ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్’ ద్వారా తెలంగాణలోని ఆరు మండలాలో 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఆడపిల్లల పెంపంకం పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి కృషి చేస్తున్నారు.అమ్మలాంటి అన్నదాత కోసంసాయి ప్రియాంక చదువుకున్నది హైదరాబాద్‌లో. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్తులో పాల్గొనే అవకాశాన్ని పొందింది. ఖమ్మంవాసి అయిన పగడాల సాయి ప్రియాంక తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కూతురికి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తెలంగాణలోని రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలలో రైతులను కలిసి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను పరీక్షించింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్‌డి చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది. విభిన్న ఆలోచనలు గల సాయి ప్రియాంక కొత్త దారిలో ప్రయాణించడమే కాదు, తన తోటివారి స్ఫూర్తిగా నిలుస్తోంది.సవాళ్లే పట్టాలెక్కించేదిదక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్)గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారిగా కె.పద్మజ ఈ ఏడాది ఆగస్టులో నియమితులయ్యారు. 1991 ఐఆర్సిఆర్లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ఉద్యోగంలో మహిళగా ఎదుర్కొన్న వివక్షను వివరించారు. ‘సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే ఆ పని కూడా సులువు అవుతుంది’ అని తెలిపారు‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!జీవనశైలిని మార్చుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాసెస్ట్ మారథాన్ రన్నర్‌గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి. 50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తి చేసి, స్టార్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి పదేళ్ల క్రితం వరకు గృహిణిగా బాధ్యతల నిర్వహణలో ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం జిమ్‌లో చేరి, అటు నుంచి మారథాన్ రన్నర్‌గా దేశ విదేశాల్లో మహిళల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతున్నారు.అన్నీ తానై... తానే నాన్నయివ్యవసాయం చేసే తండ్రి అనారోగ్యంతో చనిపోతే డిగ్రీ చదువుతున్న అతని చిన్న కూతురు అఖిల రైతుగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామ వాసి అఖిల ఉన్న రెండెకరల భూమిని సాగు చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తల్లినీ, నాయినమ్మనూ సంరక్షిస్తోంది. ΄÷లం పనులకు ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం చేసుకుంటూ, పోటీ పరీక్షలకు సిద్ధపడుతోంది. తండ్రిలేని లోటును తీర్చుతూ కుటుంబానికి అండగా నిలబడింది. నానమ్మ గురించి రాస్తా!పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల అమ్మాయి గురించి కథలుగా రాసి, దానిని బుక్‌గా అందరికి ముందుకు తీసుకువచ్చింది ఏడవ తరగతి చదువుతున్న అక్షయినీ రెడ్డి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలైన అక్షయినీ తాతయ్యలా ‘లా’ చేస్తాను, సమాజంలో ఉన్న గాధలను కథలుగా పరిచయం చేస్తాను, నానమ్మ గురించి రాస్తాను.. అంటూ తన భవిష్యత్తు లక్ష్యాలను మన ముందుంచింది. ఆటపాటలతో రోజులు గడిపేసే ఎంతో మంది పిల్లల మధ్య ఉంటూనే ప్రపంచంలో పేరొందిన రచయితల పుస్తకాలు చదువుతూ, క్రీడల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్నపిల్లలైనా పెద్ద కలలు కనవచ్చు అంటూ తన పుస్తకాన్ని చూపుతూ భావితరానికి చెబుతోంది.నీ ఆటే బంగారం శ్రీవల్లికరీంనగర్ వాసి శ్రీవల్లికి క్రికెట్ అంటే ఇష్టం. ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే హై స్కూల్ అబ్బాయిలతో కలిసి క్రెకెట్ ఆడటానికి వెళ్లింది. అందరూ ఆమెను చూసి వెటకారం గా నవ్వారు. వారి నవ్వులకు వెనకడుగు వేయకుండా విషయం పీటీటీ సర్‌కు చెప్పింది. శ్రీవల్లి ఇష్టం చూసిన పీఈటీ రహీం శ్రీవల్లి ఉత్సాహానికి మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రులూ తమ ఆమోదం తెలిపారు. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో చేరి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. జాతీయ స్థాయి మహిళా క్రికెట్ జట్టులో తన సత్తా చాటుతోంది. చైతన్య లహరి బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. కరాటేలో బ్లాక్‌బెల్ట్, కిక్ బాక్సింగ్‌లో ప్రావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్‌గా సత్తా చాటింది. అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవారికి అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసింది. నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. తోటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ‘హోప్ హౌజ్ ఫౌండేషన్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. తండ్రిలాగే సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనేది లహరి లక్ష్యం.బస్తీ దొరసానిచెత్తను సేకరించే అమ్మాయి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ హోదాలో ఒక రోజు అధికారిణిగా పలు శాఖల విధులను స్వయంగా సందర్శించి, తెలుసుకుంది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని పిల్లిగుడెసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బస్తీల పిల్లల బాగు కోసం కృషి చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు చేత్త సేకరణ పనిచేస్తూ, కాలేజీ చదువులు చదువుతూ, బస్తీ పిల్లలకు చదువులు చెబుతుంటుంది. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్‌గా పనిచేసింది. ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకుంది. గాంధీ కింగ్ స్కాలర్షిప్కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో జయలక్ష్మి ఒకరు. ఇందులో భాగంగా కిందటేడాది అమెరికా వెళ్లి వచ్చింది. ఇప్పుడు డిగ్రీ చేస్తూ యుపీఎస్సీ సాధించాలని కృషి చేస్తోంది.టీచర్ కొలువిచ్చిన సి‘విల్’ పవర్వనపర్తి వాసి అయిన హుమేరా బేగం తండ్రి రోజువారీ కూలీగా హైదరాబాద్‌లో ఒక మదర్సాలో పనిచేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంత కాలం పనిచేసింది. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. పదవ తరగతి లో ఉండగా తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణించాడు. హుమేరాకు సివిల్స్ సాధించాలన్నది కల. ఆర్థిక స్థితి లేక చదువును వదిలేయాల్సిన స్థితి. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ సంస్థ దృష్టికి చేరింది. ఆ సంస్థ ఆమె చదువుకు అండగా నిలబడింది. డీఎడ్పూర్తి చేసి ఎస్జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయ్యింది. దయనీయమైన పరిస్థితుల నుంచి టీచర్‌గా ఎదిగిన హుమేరా కృషి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. -
సాక్షిపై కేసు.. కన్నబాబు రియాక్షన్
-
కూటమి కక్ష సాధింపు.. సాక్షి పై కేసు నమోదు
-
‘సాక్షి’పై చంద్రబాబు అక్కసు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అరాచకాలు, వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్నందుకే ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు మంత్రి మండలి సమావేశం మాటున అక్కసు వెళ్లగక్కారు. వైఎస్సార్సీపీ హయాంలో ‘సాక్షి’కి ప్రభుత్వ ప్రకటనల జారీని వక్రీకరిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. గతంలో శాసనసభ వేదికగా వక్రీకరణలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన చంద్రబాబు.. ఈసారి కూడా అవే అవాస్తవాలను వినిపించారు. నాడు నిబంధనల మేరకే అన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి శాసనసభలో లిఖిత పూర్వకంగా సమాధానమివ్వడం గమనార్హం. అయినాసరే చంద్రబాబు పదే పదే సాక్షి పత్రికపై బురదజల్లేందుకు యత్నిస్తుండటం ఆయన దిగజారుడుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారతి చైర్పర్సన్ కాదు.. డైరెక్టరూ కాదువైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి చైర్‌పర్సన్‌గా ఉన్న సాక్షి పత్రికకు అక్రమంగా అధికంగా ప్రకటనలు ఇచ్చారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే వైఎస్ భారతి సాక్షి పత్రికకు చైర్పర్సన్ కాదు.. డైరెక్టరూ కాదు. ఏబీసీ మార్గదర్శకాల మేరకే ప్రకటనలు వైఎస్సార్సీపీ హయాంలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా రూ.443 కోట్ల ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇతర పత్రికలన్నింటికీ కలిపి కూడా అంత విలువైన ప్రకటనలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. వాస్తవం ఏమిటంటే నాడు సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) గణాంకాలను పరిగణలోకి తీసుకునే సాక్షి, ఈనాడుతోపాటు ఇతర పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో సాక్షి పత్రికకు ఐదేళ్లలో రూ.443 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు చెప్పింది అవాస్తవం. సాక్షి పత్రికకు ఆ ఐదేళ్లలో మొత్తం రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ అయ్యాయి. ఈనాడు పత్రికకు కూడా మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చారు. అయితే మూడున్నరేళ్ల తరువాత తమకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని ఈనాడు యాజమాన్యం సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటలు ఇవ్వలేదు. ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు పత్రిక యాజమాన్యం ప్రకటనలు తీసుకొని ఉంటే ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడా ప్రకటనల బడ్జెట్ కేటాయించినట్టు అయ్యేది. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈనాడు పత్రికకు ప్రకటనల బిల్లులు పూర్తిగా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. వాస్తవమేమిటంటే.. ఈనాడుకే కాదు.. సాక్షి పత్రికకు కూడా ప్రకటనల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటనల బకాయిలు రూ. 51 కోట్లు ఉండగా నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ సాక్షి పత్రికకు రూ.104.85 కోట్ల యాడ్స్ బకాయిలు పెండింగులోనే ఉన్నాయి. -
‘సాక్షి’లో చూసి సాయమందించాం
ఖమ్మం మయూరిసెంటర్: స్పందించే మనసుంటే ఎక్కడి వారికైనా సాయం చేయొచ్చని నిరూపించారు నిజామాబాద్ జిల్లా యువకులు. ఇటీవలి వరదలతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వీరి కష్టా లపై ఈనెల 6న సాక్షిలో ‘భూమి రాళ్లపాలు.. బతుకు రోడ్డుపాలు’శీర్షికన ప్రచురితమైన కథనం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్ (కె) గ్రామ యువకులను కది లించింది. దీంతో వారు బాధితులను ఆదు కునేందుకు నడుం బిగించి రూ. లక్ష విరాళాలు సేకరించారు. ఖమ్మం్లలో పరిచ యం ఉన్న వారిని తోడ్కొని బుధవారం రాకాసితండాకు వచ్చారు. దీంతో యువకులు 77 కుటుంబాలకు 77 సీలింగ్ ఫ్యాన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్నెల్ (కె) గ్రామ యువకులు అర్గుల శ్రీకాంత్, మచ్చేందర్, అనంతుల శ్రీను, డాక్టర్ సాయి, గజానంద్, జి.హనుమాను పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని తేజశ్రీకి కూడా... ఈనెల 4న ‘సరి్టఫికెట్లు మున్నేరు పాలు’.. ‘చదువుల తల్లులకు ఎంత కష్టం’శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో వచి్చన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌కు చెందిన మహిళలు స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఆధ్వర్యంలో తేజశ్రీని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. హైమావతి ట్యాబ్ అందించగా, కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మహిళలు రూ.10 వేలు, కొల్లు జ్యోతి రూ.5 వేలు, పారిజాతం కమలం ప్రసాద్ రూ.5 వేలు అందజేశారు. తేజశ్రీ మాట్లాడుతూ అండగా నిలిచిన సాక్షికి, దాతలకు ధన్యవాదాలు చెప్పారు. సాక్షిలో చూసి చలించిపోయానురాకాసితండా పజలు పడిన ఇబ్బందులను సాక్షి పత్రిక లో చూశాను. వారికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో మా కొంతమంది యువకులను సంప్రదించి, విరాళాలు సేకరించాం. ఖమ్మంలో ఉన్న మిత్రుల ద్వారా ప్రజలకు అందించాం. – అర్గుల శ్రీకాంత్ -
పరిశోధనలతో సమాజానికి మేలు
పరిశోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టం చేశారు. యువత పరిశోధన రంగంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఎంత ఎక్కువ మంది పరిశోధనా రంగంలోకి వస్తే అంత ఎక్కువ దేశానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు.సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ అన్నారు. వీరి నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి నాణ్యమైన పరిశోధనలు ఆశించలేమని. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారు నిబద్ధతతో పని చేయలేరని అభిప్రాయ పడ్డారు. విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి తగిన విధంగా ఉంటే పరిశోధనల్లో ఆటోమేటిక్‌గా నాణ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. చాలా వర్సిటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు కదా! అనే ప్రశ్నకు బదులిస్తూ..ఇది చాలా పెద్ద సమస్య అని, రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాలకు ఈ విషయంలో తాము చాలాసార్లు లేఖలు రాశామని చెప్పారు. తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ప్రయత్నిస్తున్నామని, గత వారంలో కూడా దీనిపై చర్చించామని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగం కోసం పీహెచ్డీ చేయకూడదు పరిశోధనా రంగంలోకి ఎక్కువ మంది యువత రావాలనే ఉద్దేశంతోనే.. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్డీ చేసే వెసులుబాటు కల్పించామని జగదీశ్‌కుమార్ వెల్లడించారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో విజయవంతంగా అమలవుతోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్డీ చేసిన వారికి జీవనోపాధి కష్టమవుతోందనే అభిప్రాయంపై మాట్లాడుతూ..‘పీహెచ్డీ అంటే ఏదో ఉద్యోగం కోసం చేసే కోర్సు కాదు. రీసెర్చ్‌పై ఆసక్తి (ప్యాషన్) ఉంటేనే ఈ రంగంలోకి రావాలి. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పీహెచ్డీ చేయాలి. అంతేకానీ ఉద్యోగం కోసం మాత్రం రావొద్దు. ఉద్యోగమే కావాలనుకుంటే పీజీ తర్వాత ఏదైనా వేరే కోర్సు చేసి స్థిరపడటం మంచిదని నా అభిప్రాయం..’ అని చెప్పారు. న్యాక్ గుర్తింపు తీసుకోవాలి తెలంగాణ సహా ఎక్కడైనా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందే విషయంలో ఎప్పటికప్పుడూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జగదీశ్‌కుమార్ తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం ముందుకు రావాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలా రాకపోతే సమాజానికి మేలు చేయని వారిగానే పరిగణించాల్సి వస్తుందని, నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. -
‘సాక్షి’పై ఇన్ని అబద్ధాలా?.. కూటమి కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు అదే పనిగా అబద్ధాలు చెబుతూ... వైఎస్ జగన్ ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికకు అడ్డగోలుగా దోచిపెట్టేసిందని ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కూటమి ఇపుడు అసెంబ్లీలో నిజాలు చెప్పక తప్పటం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏ పత్రికకూ అడ్డగోలుగా ప్రకటనలివ్వటం వంటివి జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పటంతో... మరి ‘సాక్షి’ విషయంలో చేసిన ఆరోపణలన్నీ తప్పేనా? ఇలాంటి అబద్ధాలు ఇంకెన్ని చెప్పారో...!! అని ముక్కున వేలేసుకోవటం జనం వంతవుతోంది... ఇవిగో నిజానిజాలు...ఐదేళ్లలో‘సాక్షి’కిచ్చిన ప్రకటనల వివరాలివీ... వాస్తవానికి సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) గణాం కాలను పరిగణనలోకి తీసుకునే వైఎస్సార్సీ ప్రభుత్వం వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి పార్థసారథి ఇదే విషయాన్ని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల సమయంలో సమాచార శాఖ ద్వారా సాక్షి పత్రికకు రూ.293 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.78 కోట్లు. మొత్తం రూ.371 కోట్ల మేర ప్రకటనలు ఇచ్చినట్టు తెలిపారు.నిజానికి ఇక్కడే వాస్తవ సమాచారాన్ని కాస్త వక్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సాక్షికి రూ.371 కోట్ల విలువైన ప్రకటనలిచ్చినా ‘ఈనాడు’ పత్రికకు తక్కువగా ఇచ్చారని. వాస్తవానికి ‘సాక్షి’ పత్రికలో ఐదేళ్లూ ప్రభుత్వ ప్రకటనలు ప్రచురితమయ్యాయి. కానీ ‘ఈనాడు’లో మూడున్నరేళ్లు మాత్రమే ప్రచురితమయ్యాయి. ఈ వాస్తవాన్ని మాత్రం కాస్తంత గోప్యంగా ఉంచారు మంత్రి పార్థసారథి. ఈ మూడున్నరేళ్ల వ్యవధిలోనే... ఈనాడుకు సమాచారశాఖ ద్వారా రూ.190 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.53 కోట్లు.. మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చింది. మూడున్నరేళ్ల తరువాత ఈనాడు యాజమాన్యం తమకు ప్రభుత్వ ప్రకటనలు తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు. అదీ.. ఈనాడు పత్రిక యాజమాన్యం స్వచ్ఛందంగా వద్దని లేఖ రాయడంతోనే, ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు పత్రిక యాజమాన్యం ప్రకటనలు తీసుకొని ఉంటీ ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటనలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడాప ప్రకటనల బడ్జెట్ కేటాయించినట్లు అయ్యేది.‘సాక్షి’కి బకాయిలు ‘ఈనాడు’కన్నా ఎక్కువే...బాబు ప్రభుత్వం మరో అబద్ధాన్ని కూడా తెరమీదికి తేబోయింది. అదేంటంటే ‘ఈనాడు’ పత్రికకు ప్రకటనల బిల్లులు పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, అందుకే ‘ఈనాడు’ మూడున్నరేళ్ల తరవాత ప్రకటనలు తీసుకోలేదని. నిజానికి ‘ఈనాడు’కు ప్రభుత్వ ప్రగతిని తన పత్రికలో ప్రకటనల రూపంలో కూడా ప్రచురించటం ఇష్టం లేదు. అందుకే ప్రకటనలు వెయ్యలేమని లిఖితపూర్వకంగా చెప్పేసింది. వాస్తవానికి ‘ఈనాడు’కే కాదు. ‘సాక్షి’ పత్రికకు కూడా ప్రకటనల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటన బకాయిలు రూ.51 కోట్లు ఉండగా, వైఎస్సార్సిపీ ప్రభుత్వం అయినప్పటికీ సాక్షి పత్రికకు రూ.104.85 కోట్ల యాడ్స్ బకాయిలు పెండింగులో ఉన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రయత్నించబోయి బొక్కబోర్లా పడింది. నిజానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో ప్రచురితమయ్యే 22 పెద్ద పత్రికలతో పాటు ఎన్నో చిన్న పత్రికలు, మేగజైన్లకు కూడా ప్రకటనలు ఇచ్చింది. మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించకుండా, వివక్షకు తావు లేకుండా ప్రకటనలు ఇచ్చింది. -
అనపర్తిలో ‘పచ్చమూక’ అరాచకం.. ‘సాక్షి’కి బెదిరింపులు
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో టీడీపీ నేతలు అరాచకాలు ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకలో వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన రెండు షెడ్లను కూల్చేశారు. అదే ప్రాంతంలో ఇంకా షెడ్లు, పక్కా భవనాలు ఉన్నప్పటికీ పచ్చబ్యాచ్.. వాటి జోలికి పోలేదు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ విలేకరిపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు. పోలీసులు చోద్యంగురజాలలో రాళ్ల దాడి..పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. గోగులపాడులో గ్రామం విడిచి ఎందుకు వెళ్లలేదంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో వెంకట చలమయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.విశాఖలో వైఎస్సార్ ఫ్లెక్సీ చించివేతవిశాఖలో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరుగుపోతున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదిన సందర్భంగా 43వ వార్డులో కార్పొరేటర్ ఉషశ్రీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ నేతలు చించివేశారు. ఫ్లెక్సీని చించవద్దంటూ స్థానికులు చెబుతున్న కానీ టీడీపీ నేతలు పట్టించుకోలేదు. పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన వైఎస్సార్ ఫ్లెక్సీని ధ్వంసం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అప్ టు డేట్‌గా ఉండటమే ఏఐ రంగంలో సవాలు!
కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగం కావాలని చూస్తున్నారా? అయితే మీరు ఎప్పటికప్పుడు ఆ రంగంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఉండాల్సిందే అంటున్నారు జయతి మూర్తి. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఈ తెలుగింటి ఆడపడుచు యూనివర్శిటీ వ్యవహారాలు, పరిశోధనల వివరాలను ‘సాక్షి.కామ్’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. అప్-టు-డేట్‌గా ఉండటమే కృత్రిమ మేధ రంగంలో ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న వారు ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య అని అంటున్నారు జయతి మూర్తి. కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగావకాశాలు మొదలుకొని పలు ఇతర అంశాలపై జయతి మూర్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే..సాక్షి: కృత్రిమ మేధతో ఉద్యోగాల అవకాశాలు దెబ్బతినవు అని చాలా మంది చెబుతున్నారు. మీరేమంటారు? జయతి: కొన్ని రకాల ఉద్యోగాల్లో కోత పడుతుంది.. అదే సమయంలో కొన్ని కొత్త రకాలు ఉద్యోగాలు పట్టుకొస్తాయి కూడా. ఏఐ విస్తృత వాడకం తరువాత కూడా అన్ని రకాల ఉద్యోగాలు భద్రంగా ఉంటాయని చెప్పలేము. కొంత మార్పు అనివార్యం. కొందరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కూడా. కొందరికి ఏఐ వల్ల లాభం చేకూరితే మరికొందరికి నష్టమూ, బాధ జరగొచ్చు. నష్టపోయే వారికి కొత్త నైపుణ్యాలను అందించేందుకు ప్రయత్నాలు జరగాలి. మార్పు తాలూకూ దుష్ప్రభావం తక్కువగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినప్పుడు గతంలోనూ కొందరు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. సాక్షి: రీస్కిల్లింగ్ అనేది అందరికీ సాధ్యమవుతుందా? కృత్రిమ మేధతో ఉద్యోగాలు కోల్పోయే వారికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి? జయతి: స్పష్టమైన ఆర్థిక విధానాల అవసరం ఏర్పడవచ్చు. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తాలూకూ ఫలితాలు అందాలి. లేదంటే అంతరాలు పెరిగిపోతాయి. ఇంకోలా చెప్పాలంటే ఇప్పటికే ఆ అంతరం ఉంది. మనలో చాలామంది కంప్యూటర్లతో పని చేస్తూ సంపాదించుకుంటున్నాం. పేదలకు ఆ అవకాశం లేదు. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్ స్క్రీన్లు, ల్యాప్‌టాప్‌లూ ఉంటే కొన్నింటిలో కనీస వసతులు కూడా లేకపోవడం వాస్తవం. ఈ అంతరాన్ని తగ్గించేలా కొత్త ఆర్థిక విధానాలు రూపొందితే ప్రయోజనం ఉంటుంది. సాక్షి: డిజిటల్ అంతరాలను తగ్గించేందుకు ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ ఏం చేస్తోంది? జయతి: మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ మా యూనివర్శిటీలో మూడొంతుల మంది విద్యార్థులు మొట్ట మొదటిసారి కాలేజీలోకి అడుగుపెడుతున్న వారు. వీరందరికీ కూడా కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై బోధన జరుగుతోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులు రెండింటిలోనూ కోర్సులు అందిస్తున్నాం. సాక్షి: కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? జయతి: ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం చెప్పడం కూడా తొందరపాటు అవుతుందని అనుకుంటున్నాను. ఎల్ఎల్ఎంలు, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ టెక్నాలజీల్లో ఉద్యోగాలకు ఉపయోగపడవచ్చు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సమీప భవిష్యత్తులో కృత్రిమ మేధ అనేది కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. మెకానికల్ వంటి ఇతర బ్రాంచ్‌లకూ విస్తరిస్తుంది. వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఏం జరగబోతుంది అని ఇప్పుడే చెప్పడం కష్టం. అవకాశాలు బోలెడు వస్తాయని మాత్రం చెప్పవచ్చు. సాక్షి: మరి... కృత్రిమ మేధ రంగంలో ఉపాధి పొందాలని అనుకునే వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది? జయతి: మొట్టమొదటి సవాలు. అప్-టు-డేట్‌గా ఉండటం. ఎందుకంటే ఈ టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతూంటుంది. ఈ రోజు ఉన్న ఛాట్‌జీపీటీ రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. బహుశా సమీప భవిష్యత్తులో ఏఐ కోర్సులు ఏడాదికోసారి మార్చాల్సి వస్తుందేమో. అటువంటి పరిస్థితుల్లో ఏఐలో ఉపాధి వెతుక్కునే వాళ్లు.. అప్-టు-డేట్‌గా ఉండటం చాలా కీలకం అవుతుంది. సాక్షి: మీరు స్వతహాగా మెకానికల్ ఇంజినీర్. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు మెకానికల్ ఇంజినీరంగ్ పరిష్కారాలు సాధ్యమని భావిస్తున్నారా? జయతి: ఇంజినీరింగ్ రంగం ఒక్కదానితోనే వాతావరణ మార్పుల సమస్యను అధిగమించలేము. ఇంజినీరింగ్ కొన్ని రకాల సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలను అందివ్వవచ్చు. కానీ.. అసలు సమస్యలు సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నవి. వాతావరణం నుంచి కర్బన ఉద్గారాలను నేరుగా పీల్చేసే టెక్నాలజీలపై కొంతవరకూ ఏకాభిప్రాయం కుదిరినా.. ఆయా దేశాల స్థాయిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రభావం చూపుతాయి. దేశాలన్నీ కలిసికట్టుగా ముందకు కదిలినప్పుడే వాతావరణ మార్పుల వంటి సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుందని నేను భావిస్తున్నాను. సాక్షి: రోబోలు మనకు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వస్తున్న కృత్రిమ మేధ ఈ రోబోటిక్స్‌తో ఎప్పుడు కలసిపోతాయి? జయతి: ఇప్పటికే కలిసిపోయాయని చెప్పాలి. ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు ప్రతిపాదించిన న్యూరల్ లింక్ వంటివి ఇప్పటికే మొదలయ్యాయి. నిజానికి రొబోటిక్స్, కృత్రిమ మేధ రెండూ వేర్వేరు కాదు. ఒక్కటే అని చెప్పాలి. చూపు మొదలుకొని, ఇతర అన్ని మానవ సంబంధిత ఇంద్రియ జ్ఞానాలను రోబోట్లకు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంప్యూటర్ విజన్ వంటివాటిని రొబోటిక్స్, డ్రైవర్ల అవసరం లేని కార్లలో ఇప్పటికే ఏఐతో కలిపి వాడుతున్నారు. ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్లూ అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ రొబోటిక్స్, ఏఐ రెండూ కీలకం. ఇందుకు తగ్గట్టుగా ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ వాతావరణం, సుస్థిరాభివృద్ధి, కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తి, రొబోటిక్స్, బయాలజీ, ఆరోగ్యం వంటి రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సాక్షి: ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో విద్యార్థులు ఎంతమంది? ఏయే దేశాల వారు ఉన్నారు? జయతి: విదేశీ విద్యార్థులు రెండు వేల మంది వరకూ ఉన్నారు. భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 400. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ అబ్రహాం లింకన్ కాలంలో ఏర్పాటైన లాండ్ గ్రాంట్ యూనివర్శిటీ. రైతులు, పశు పోషకుల వంటివారికి సాయం చేసే లక్ష్యంతో ఏర్పాటైన వర్శిటీలు లాండ్ గ్రాంట్ యూనివర్శిటీలంటారు. అందుకే మా యూనివర్శిటీ అటవీ, వ్యవసాయ, ఇంజినీరింగ్ రంగాల్లో బలంగా ఉంది. ర్యాంకింగ్‌ల విషయానికి వస్తే సముద్ర శాస్త్రం, వాతావరణ శాస్త్రాల్లో వర్శిటీకి మంచి పేరుంది. అంతేకాకుండా... కంప్యూటర్స్ సైన్స్ రంగలో దేశంలోనే అతిపెద్ద అండర్గ్రాడ్యుయేట్ సంస్థ మాది. సాక్షి: ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో కృత్రిమ మేధ సాయంతో వ్యవసాయ రంగంపై ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? జయతి: రెండేళ్ల క్రితం ఓఎస్‌యూ పూర్వ విద్యార్థి, ఎన్విడియా అధిపతి జెన్సెంగ్ హువాంగ్ ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీకి భారీ విరాళం అందించారు. ఇందులో అత్యాధునిక ఎన్విడియా జీపీయూ సూపర్ కంప్యూటర్ కూడా ఉంది. దీని సాయంతో ప్రస్తుతం మేము కృత్రిమ మేధను వాడుకుని వ్యవసాయంపై పలు పరిశోధనలు చేస్తున్నాం. యూనివర్శిటీ పరిధిలోని అటవీ ప్రాంతం, వ్యవసాయ క్షేత్రాల ద్వారా సమాచారం సేకరించి ఈ సూపర్ కంప్యూటర్ ద్వారా పెద్ద ఎత్తున కంప్యూటేషన్ చేస్తున్నాం. విసృ్తత సమాచారాన్ని కంప్యూటర్ మోడళ్లుగా మలచడంలో కృత్రిమ మేధ చాలా ఉపయోగకరమైంది. ఎన్విడియా వద్ద ఉన్న అతిపెద్ద గ్లోబల్ ఎర్త్ సిములేటర్‌ను కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రపంచస్థాయి మోడళ్ల ఆధారంగా.. స్థానిక వాతావరణంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది అర్థం చేసుకుంటున్నాము. రానున్న వందేళ్లలో వాతావరణ మార్పులను తట్టుకుని మనగలిగే పంటలు ఏవి? పంటల నీటి అవసరాలు, నేల సారం, చీడపీడల బెడద వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాం. ఒరెగాన్ యూనివర్శిటీ సముద్రతీరంలో ఉన్న నేపథ్యంలో మత్స్య, ఇతర జలచరాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. వ్యవసాయ సమస్యలు తీర్చేందుకు ఇంజినీరింగ్ సెన్సర్ల రూపంలో కొంతవరకూ సాయపడవచ్చు కానీ.. జీవ, రసాయన శాస్త్రాల అవసరమూ ఉంటుంది.సాక్షి: యూనివర్శిటీలో సుమారు 130 ఏళ్లుగా వ్యవసాయ పరిశోధన ఒకటి కొనసాగుతోందని విన్నాము. దాని వివరాలు? జయతి: ఒరేగాన్ రాష్ట్రం తూర్పు ప్రాంతంలో సీబార్క్ అనే వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఉంది. అక్కడ గోధుమ, బార్లీ, చిక్కుళ్లు, కాయధాన్యాలపై, నేల, చీడపీడలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఏఐ సాయంతో ఈ సమాచారాన్ని విశ్లేషించేందుకు తద్వారా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాము. అలాగే వర్శిటీలోని ఒక ప్రాంతంలో ఉన్న చెట్లు అన్నింటికీ సెన్సర్లు ఏర్పాటు చేశాము. అవి పంపే సమాచారాన్ని... వాతావరణ వివరాలతో సరిచూసుకుని భవిష్యత్తులో ఏ పరిస్థితిలో ఏమవుతుందనే విషయాలను అంచనా కట్టగలుగుతున్నాము. సాక్షి: ఛాట్‌జీపీటీ వంటి ప్రస్తుత జనరేటివ్ ఏఐ మోడళ్లు ట్యూరింగ్ టెస్ట్‌ను పాస్ అయ్యాయా? జయతి: నాకు తెలిసి ఏవీ పాస్ కాలేదు. వాస్తవం చెప్పాలంటే ట్యూరింగ్ టెస్ట్ అంటే ఏదో ఒక్కటి మాత్రమే కాదు. చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుత జనరేటివ్ ఏఐ మోడళ్లు ఏదో ఒక టెస్ట్ పాస్ అయ్యే ఉంటాయి. అయితే వీటి పరిధి చాలా పరిమితమైంది. ఛాట్బోట్లను సేల్స్, మార్కెటింగ్ వంటి పరిమిత ప్రయోజనాలకు వాడుకునేలా టెస్ట్‌లు ఉంటాయి. సంక్లిష్టమైన, జనరల్ ఇంటెలిజెన్స్ దిశగా ఉండవు. అయితే మనం మాట్లాడుతున్నది కృత్రిమ మేధతో అన్న విషయాన్ని సమర్థంగా కప్పిపుచ్చగల ట్యూరింగ్ టెస్ట్‌తో పరీక్షలు చేశారా లేదా అన్నది అస్పష్టం. సాక్షి: కృత్రిమ మేధ మానవజాతిపై పెత్తనం చెలాయించే రోజు వస్తుందా? జయతి: లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల వంటి కృత్రిమ మేధ టెక్నాలజీలు చాలా బాగున్నాయి. కానీ ఇవేవీ ఆర్టిఫిషల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)కు చాలా చాలా దూరం. అయితే ఒక్క విషయం. ఐదేళ్ల క్రితం ఛాట్‌జీపీటీ వంటిది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ రంగంలో మార్పులు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదకరమా? కాదా? అన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేము. కాకపోతే మానవజాతిపై పెత్తనం చెలాయిస్తుందా? వంటి ప్రశ్నలు రావడం మంచిదే. ప్రజల్లో కృత్రిమ మేధపై అవగాహన మరింత పెరుగుతుంది. తద్వారా జాగ్రత్తగా ఉండేందుకు అవకాశమూ ఏర్పడుతుంది. -
‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేత రాజ్యాంగ ఉల్లంఘనే: ఎన్బీడీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడంపై ‘బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్’ (ఎన్బీడీఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలనూ ఏపీలోని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నిలిపివేయడానికి సరైన కారణాలు చూపకపోవడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని ఎన్బీడీఏ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్బీడీఏ సోమవారం(జూన్24) మీడియా ప్రకటన విడుదల చేసింది.మీడియాతో పాటు ప్రజల ప్రయోజనాలకు భంగం..ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీపై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేయడం వల్లనే ఆయా టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు చెబుతున్నారని, కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు తీసుకున్న ఈ చర్యలు బ్రాడ్కాస్టర్లు, మీడియా, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ప్రకటించింది. కొన్ని టీవీ ఛానళ్ల ప్రసారాలు ఆపడం ప్రమాదకరమైన సంకేతాలు పంపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..ఛానెళ్లలో ఎలాంటివి ప్రసారం చేయాలన్నది బ్రాడ్కాస్టర్ల ఇష్టమన్నది రాజకీయ పార్టీలు గుర్తించాలని, మీడియా స్వేచ్ఛలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా పేర్కొంది. ఇతరుల జోక్యంతో మీడియా తన స్వతంత్రతను కోల్పోయే పరిస్థితి కల్పిస్తుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ), ఆర్టికల్ 19(1)(జీ)లను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. మీడియా స్వేచ్ఛపై ప్రభావం..ఛానళ్లపై నిషేధం సరైన పద్ధతి కాదని,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేదని ఎన్బీడీఏ పునరుద్ఘాటించింది. ఏకపక్ష నిర్ణయాలు బ్రాడ్కాస్టర్ల వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తాయని, వ్యూయర్షిప్పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇది చివరికి ఛానళ్ల రేటింగ్ తద్వారా ఆదాయంపైనా ప్రభావం చూపుతుందని వివరించింది. ప్రభుత్వానిదే బాధ్యత..దీర్ఘకాలంలో బ్రాడ్కాస్టర్లు, ప్రకటనకర్తల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు చర్యలు కారణమవుతాయని తెలిపింది. ఏపీలో మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించేలా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్బీడీఏ అభ్యర్థించింది. ఇతరుల జోక్యం ఏమాత్రం లేకుండా మీడియా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చూడాలని కోరింది.సమాచారం పొందడం ప్రజల హక్కు..ప్రజాస్వామ్య వ్యవస్థలో వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం పొందే హక్కు ప్రజల మౌలిక హక్కు అని, మీడియా నోరు నొక్కేందుకు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా వెంటనే అడ్డుకోవాలని సూచించింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కొందరు కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే సమీక్షించి ఘర్షణ పూర్వక పరిస్థితిని నివారించాలని ఎన్బీడీఏ కోరింది. -
టీడీపీ ఒత్తిళ్లతో సాక్షి, మరికొన్ని వార్తా ఛానెళ్ల నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ఒత్తిళ్లతో మీడియా ప్రసారాలు నిలిపివేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పలు వార్తా ఛానళ్ల ప్రసారాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆ పార్టీ యత్నిస్తోందని పేర్కొంది. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతి, విధానపరమైన సమ్మతిలేకుండా అధికార టీడీపీ ఒత్తిళ్ల కారణంగా సాక్షి, టీవీ–9.. ఎన్టీవీ, 10టీవీల ప్రసారాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ తీర్మానం చేసినట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్. నిరంజన్‌రెడ్డి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్, ప్రమోషన్–2019 2ఎస్సీసీ 104 కేసులో సుప్రీంకోర్టు ఎయిర్‌వేవ్, ఫ్రీక్వెన్సీలు పబ్లిక్ ప్రాపర్టీగా తన తీర్పులో పేర్కొందని, తద్వారా వాటిని వినియోగించుకోవడం ప్రతీ పౌరుడి హక్కు అనే విషయాన్ని ట్రాయ్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. చట్టానికి లోబడి సహేతుకమైన ఆంక్షలు విధించొచ్చని, అయితే ఎలాంటి కారణాలు లేకుండా ఏజెన్సీలు ఛానెళ్లను ఏకపక్షంగా తొలగించడం ఉల్లంఘన కిందకి వస్తుందని ఆయన స్పష్టంచేశారు. ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనే విషయాన్ని ఫిర్యాదులో ఉటంకించారు.నోటీసు ఇవ్వకుండా సిగ్నల్ ఆపకూడదు..ప్రతిపాదిత డిస్కనెక్షన్కు కారణాలు స్పష్టంగా పేర్కొంటూ ప్రభావిత సర్వీస్ ప్రొవైడర్‌కు కనీసం మూడు వారాల నోటీసు ఇవ్వకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ టెలివిజన్ ఛానళ్ల సిగ్నల్‌ను డిస్కనెక్ట్ చేయరాదని 2017 నిబంధనల్లోని 17వ నిబంధన స్పష్టంచేస్తోందని.. కానీ, ప్రస్తుతం ఏపీలో ఈ నిబంధన తుంగలో తొక్కారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. నూతంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం పలు వార్తా ఛానళ్లపై ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. నోటీసు జారీచేయకుండానే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రంపై ప్రత్యక్షంగా దాడిచేసినట్లేనన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావించే వార్తా ఛానళ్లను ఏకపక్షంగా నిరోధించడం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై స్వతంత్ర నివేదికలు, విమర్శనాత్మక విశ్లేషణలు అందించే ప్రతికా స్వేచ్ఛను హరిస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ తరహా జోక్యం ప్రతికా స్వేచ్ఛను నిరుత్సాహపరచడమేనని.. ఇది పాత్రికేయ స్వేచ్ఛను అణచివేయడమేనన్నారు. పౌరులకు భిన్నమైన, అవసరమైన సమాచారం అందించే అవకాశం మీడియా కోల్పోతుందన్నారు. ఛానెళ్లు మ్యూట్ చేయడమంటే అసమ్మతి గళం సహించబోమనే సందేశం ప్రజల్లోకి పంపుతోందన్నారు. దీనిద్వారా జర్నలిస్టులు, మీడియా సంస్థలు వివాదాస్పద అంశాలు కవర్ చేయడం తగ్గుతుందని, కేవలం ప్రభుత్వ అనుకూల కథనాలే ప్రసారమవుతాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తరహా చర్యలవల్ల ప్రతికా స్వేచ్ఛపై పడే ప్రభావాలను ట్రాయ్ తక్షణమే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నిరంజన్‌రెడ్డి కోరారు.సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి..ఇక ట్రాయ్ నిబంధనలు అమలుచేయడంతోపాటు ప్రభుత్వ ప్రభావం నుంచి మీడియాను రక్షించడానికి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ న్యూస్ ఛానళ్లను అక్రమంగా బ్లాక్ చేయడంపై సమగ్ర విచారణ జరపాలని, ట్రాయ్ 2017 నిబంధనల్లోని 17వ నిబంధన ఉల్లంఘించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రెస్ స్వతంత్ర సూత్రాలను సమర్థించి మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌లపై ప్రభుత్వ ప్రభావం లేకుండా చూడాలని ఆ ఫిర్యాదులో నిరంజన్‌రెడ్డి కోరారు. తన ఫిర్యాదులోని అంశాన్ని అత్యవసరంగా తీసుకుని వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
సాక్షి ఉద్యోగులతో పీయూష్ చావ్లా
-
సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్
సాక్షి, న్యూఢిల్లీ: పచ్చమీడియా విషప్రచారాన్ని అండగా చేసుకుని చెలరేగిపోయి, రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించాలని చూసిన చంద్రబాబు నాయుడికి దిమ్మదిరిగే షాక్ నీతి ఆయోగ్ రూపంలో తగిలింది. ఎన్నికల ప్రచారంలో దూషణలు, పనికిమాలిన అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించాలని చూసిన ఈ పచ్చపార్టీ అధినేతకు ఇది శరాఘాతమే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు గణం చేసిన దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ ఫుల్స్టాప్ పెట్టింది. ఈ చట్టానికి సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయని... భూ పరిపాలన మరింత సులువవుతుందని పేర్కొంది. భూములపై రైతులకు సర్వహక్కులూ లభిస్తాయని... ఈ చట్టంతో పటిష్ఠమైన భూ యాజమాన్య నిర్వహణ సాధ్యమవుతుందని వెల్లడించింది.సమాచార హక్కు చట్టం కింద సాక్షి టీవీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ నాగిళ్ల వెంకటేష్ అడిగిన ప్రశ్నలకు నీతి ఆయోగ్‌లోని జల, భూవనరుల శాఖ ఈ విషయమై స్పష్టతను ఇచ్చింది. ఆ శాఖ అండర్ సెక్రటరీ రవీందర్ కౌర్ గురువారం ఒక లేఖ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు సంబంధించిన ముసాయిదాను కేంద్ర భూవనరుల శాఖతో పాటు అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే పంపించామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. -
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
‘గుడ్ మార్నింగ్.... ఇదొక అంద మైన మార్నింగ్’ అంటూ 16 ఏళ్ల క్రితం తెలుగు లోగిళ్లను.. తాకిన ‘సాక్షి’ని తెలు గు ప్రజలందరూ అభిమానపూర్వకంగా మీ మనసుల్లో నిలుపుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వార్తా ప్రపంచంలో ఒంటెత్తు పోకడకు ఫుల్స్టాప్ పెడుతూ నాణేనికి మరోవైపును చూపుతూనే ఉంది ‘సాక్షి’. ఆల్కలర్ పేజీలు, ఏకకాలంలో 23 ఎడిషన్లతో మొదలైన సాక్షి తరువాతి కాలంలో దినదిన ప్రవర్ధమానమై శాటి లైట్ చానల్, డిజిటల్ మీడియాకూ విస్తరించింది. పాఠకుల అవసరాలు.. మనోభావాలకు తగ్గట్టుగా తనను తాను మలచుకోవడంలో సాక్షి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంది. అంత ర్జాతీయ ప్రమాణాలు, డిజైన్లతో ‘సాక్షి’ చానల్ ఇటీవలే సరికొత్త రూపు సంతరించుకున్న విషయం మీకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు... "Sakshi.com''కు కూడా కొత్త సొబగులు అద్దుతున్నాం.జర్నలిజం విలువలలో ఏమాత్రం రాజీ పడకుండా... డిజైనింగ్, నావి గేషన్ విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మీకోసం మరింత అందంగా తయారైంది మీ వెబ్సైట్! కంటికి ఇంపుగా... వార్తలు చదివేందుకు మరింత సులభతరంగా ఉంటుంది ఇది. ఇంటర్నెట్ తాజా పోకడలను ప్రతిబింబించే లుక్ అండ్ ఫీల్, సులభంగా నావిగేట్ చేసుకునే యూజర్ ఇంటర్ఫేస్, ఏ డివైజ్‌కైనా అనుకూలంగా మారే రెస్పాన్సివ్ వెబ్సైట్, నచ్చిన కంటెంట్‌ను సిఫార్సు చేసే టూల్స్, అంతే కాదు.. వార్తలు చదువుకోవడంతోపాటు హాయిగా మల్టీ మీడియాలో ఫొటోలు, వీడియో లు చూడవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. వీటితోపాటే సాక్షి మొబైల్ అప్లికేషన్ ను కూడా ఆధునికీకరించాం. మీరు మొబైల్ యాప్‌లో సాక్షిని ఫాలో అవుతుంటే (ఆండ్రాయిడ్ లేదా iOS ) యాప్‌ను ఒక్కసారి అప్డేట్ లేదా రీఇన్ స్టాల్ చేసుకోవడమే తరువాయి. సరికొత్త డిజైన్, లుక్స్‌తో సాక్షి.కామ్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది.దశాబ్ద కాలంగా sakshi.comని ఆదరిస్తున్న పాఠకదేవుళ్లు మాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. డిజిటల్ ప్లాట్‌ఫాంల రీడర్‌షిప్‌ను లెక్కించే ఆధీకృత వ్యవస్థ comscore ప్రకారం.. తెలుగు న్యూస్ వెబ్సైట్లలో www.sakshi.com అత్యధిక యూనిక్ విజిటర్స్‌తో చాలాకాలంగా మొదటి స్థానంలో ఉంది. (··Source: comscore).సాక్షి కుటుంబంలో మీరంతా సభ్యులైనందుకు గర్విస్తున్నాం. కొత్త రూపంలో మీ ముందుకొచ్చిన www.sakshi.com ను ఆశీర్వదించండి. – ఎడిటర్, సాక్షి మీడియా గ్రూప్ -
అరచేతిలో మీ ఆరోగ్య నేస్తం! సాక్షి లైఫ్..
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం.. సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక.. అల్లోపతి నుంచి ఆయుర్వేదం దాకా.. ఆక్యుపంచర్ నుంచి యునానీ వరకు.. హోమియోపతి నుంచి యోగా వరకు.. అన్ని రకాల వైద్య విధానాలను గురించి ఎప్పటికప్పుడు ఆరోగ్య సమాచారం మీకోసం అందిస్తున్నాయి సాక్షిలైఫ్ www.life.sakshi.com వెబ్ సైట్, https://www.youtube.com/@life.sakshi/videos సాక్షి లైఫ్ యూట్యూబ్ ఛానెల్. సాక్షిలైఫ్ హెల్త్ ఏమేం అందిస్తుందంటే..? హెల్త్ న్యూస్ ఎప్పటికప్పుడు తాజా హెల్త్ అప్డేట్స్ తోపాటు.. ఫిజికల్ హెల్త్: దీనికి సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారాలు,నివారణామార్గాలు. మెంటల్ హెల్త్: మానసిక సమస్యల నుంచి ఎలా బయటపడాలి..? అసలు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? అనేవాటి గురించి మానసిక నిపుణుల ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూలు అందుబాటులో ఉంటాయి. ఉమెన్ హెల్త్: మహిళల్లో ఎక్కువగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? అవి రాక ముందు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశాలను గురించిన సమాచారం విపులంగా ఉంది. కిడ్స్ హెల్త్: చిన్నారుల్లో సీజనల్ వ్యాధులు, ముందు జాగ్రత్తలపై వైద్య నిపుణులు అందించే అద్భుతమైన సలహాలు, సూచనలు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్: యునానీ , ఆయుర్వేదం, యోగా, ఆక్యుపంచర్, హోమియోపతి వంటి పలురకాల వైద్య విధానాలను గురించి టాప్ డాక్టర్స్ ద్వారా అవసరమైన ఆరోగ్య సమాచారం కోసం ఈ లింక్‌ల పై క్లిక్ చేయండి. https://www.youtube.com/@life.sakshi/videos , www.life.sakshi.com ఇవి రెండూ మీకు ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయి. రీసెర్చ్: పలురకాల వ్యాధుల గురించిన పరిశోధనలు, అధ్యయనాలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది మీ సాక్షిలైఫ్. హెల్త్ టిప్స్: ఆరోగ్యంగా ఉండాలంటే ఏమీ చేయాలి..? ఏమి చేయకూడదు..? అనే అంశాలపై డాక్టర్లు ఏమంటున్నారో ఆర్టికల్స్ రూపంలో www.life.sakshi.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మారుమూల గ్రామంలో ఉండే వారికిసైతం అర్థమయ్యేలా ప్రముఖ డాక్టర్ల విలువైన వైద్య సలహాలు, సూచనలను సాక్షి లైఫ్ వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్ అందిస్తున్నాయి. ప్రతి విభాగంలో ఒక్కో టాప్ డాక్టర్ల ఇంటర్వ్యూలను వీడియోల రూపంలో https://www.youtube.com/@life.sakshi/videos సాక్షి లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందిస్తోంది. అంతేకాదు వారు అందించిన సమాచారాన్ని ఆర్టికల్స్ రూపంలో www.life.sakshi.com వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తోంది. ఇలా ఫాలో అవ్వండి.. మరింత ఆరోగ్య సమాచారం కోసం www.life.sakshi.com వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి..అలాగే https://www.youtube.com/@life.sakshi/videos యూట్యూబ్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.. లైక్ చేయండి.. షేర్ చేయండి. ► "సాక్షి లైఫ్" గురించి ప్రముఖ వైద్యనిపుణుల మాటల్లో.. "సాక్షి లైఫ్ లో ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నారు. అదికూడా ప్రముఖ డాక్టర్ల ద్వారా అందించడం అభినందనీయం." - డా.డి. నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ► "సమగ్రమైన ఆరోగ్య సమాచార వేదికగా సాక్షి లైఫ్‌ను తీర్చి దిద్దారు. సమాజానికి ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం." - డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ► "శరీరంలో గుండె ప్రధానమైన అవయవం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్‌లో చాలా బాగా తెలియజేశారు." - డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ► "వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ,వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్‌ను తీర్చిదిద్దారు." - డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇవి చదవండి: హెల్త్ టిప్స్: స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు.. -
చెంచుల చెంతకు అధికారులు
అమ్రాబాద్: నల్లమల అటవీ పరిధిలోని చెంచు పెంటల చెంతకు అధికార యంత్రాంగం తరలివచ్చింది. చెంచులకు విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారింది.ఆరు నెలలుగా గిరిపోషణ ముందుకు సాగడం లేదు. చిన్నపిల్లల నుంచి బాలింతల వరకు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారి వెతలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తూ ‘అడవే చెంచులకు అమ్మ’ శీర్షికన బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ స్పందించారు. చెంచు పెంటలను క్రమం తప్పకుండా సందర్శించి, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇన్చార్జ్ డీఎల్పీఓ వెంకటయ్య, పీఆర్ ఏఈ రుక్మాంగధ అమ్రాబాద్ మండలంలోని కొమ్మెనపెంట, కొల్లంపెంటను çసందర్శించారు. చెంచు కుటుంబాల బాధలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీఎల్పీఓ వెంకటయ్య మాట్లాడుతూ చెంచు కుటుంబాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, వారికి కావాల్సిన వసతులు, వారి అవసరాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి జన్మన్ కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉండే కొల్లంపెంట, కొమ్మెనపెంటలకు కనీస రవాణా సౌకర్యం కోసం 11.30 కిలోమీటర్ల మేర రోడ్డు మర మ్మతులు చేపడతామన్నారు. ఐటీ డీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థలం ఖరారు చెప్పారు. వారి వెంట ఎంపీడీఓ రామ్మోహన్, కార్యదర్శి మల్లేష్, ఉపాధి హామీ పథకం ఈసీ రేణయ్య, టీఏ అంజనేయులు తదితరులు ఉన్నారు. -
'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్ శంకర్
సాక్షి, ఆదిలాబాద్: ‘నన్ను ఆదరించి గెలిపించిన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తా. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ వార్డులో స్వయంగా పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకుంటా. ఎమ్మెల్యే నిధులతో పాటు అవసరమైతే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎమ్మెల్యేతో సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్‌ఇన్ నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వందలాది మంది ఫోన్ చేసి సమస్యలను ఎమ్మెల్యేకు నివేదించారు. వాటిని ఓపిగ్గా ఆలకించిన ఆయన పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు. ప్రశ్న: మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, ఎన్టీఆ ర్ చౌక్ ప్రాంతాల్లో తోపుడు బండ్లు రోడ్డుకు దగ్గరగా ఉంచడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి..? (చంద్రశేఖర్, రిటైర్డ్ టీచర్, న్యూహౌసింగ్ బోర్డు) ఎమ్మెల్యే: పట్టణంలో ఈ సమస్య ఉన్నది వాస్తవమే. గత పాలకుల హయాంలో రోడ్లు ఇరుకుగా నిర్మించారు. దీంతో చిరు వ్యాపారులు తో పుడు బండ్లను రోడ్లపైకి తీసుకొచ్చి విక్రయాలు జరిపిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులతో మాట్లాడుతాను. ప్రశ్న: తిర్పెల్లి కాలనీ సమీపంలో జాతీయ రహదా రిపై మురుగునీరు ప్రవహించడంతో పాటు గుంతలు ఉన్నాయి. దీంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారుతోంది. (కళ్యాణ్, శ్రీరాంకాలనీ) ఎమ్మెల్యే: మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కరించేలా చూస్తాను. ప్రశ్న: టాక్లీ నుంచి బేల వరకు గల రోడ్డు గుంతలతో అధ్వానంగా మారింది. మహారాష్ట్రకు చెంది న లంబాడాలు బేలలోని పలు గ్రామాలకు వలసవచ్చి రెవెన్యూ అధికారులకు ముడుపులిచ్చి అడ్డదారిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం పొందుతూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు.. (సంతోష్, టాక్లీ) ఎమ్మెల్యే: ఆర్అండ్బీ, రెవెన్యూ శాఖల అధికారులతో త్వరలోనే సమీక్ష నిర్వహించి వాటి పరిస్థితులను తెలుసుకుంటాను. అలాగే నకిలీ ధ్రువీ కరణ పత్రాలను జారీచేయకుండా రెవెన్యూ అధికారులను ఆదేశిస్తా. ప్రశ్న: నాకు నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. రూ.10లక్షలు ఖర్చైంది. ఉన్న ప్లాటు అమ్మేశాను. సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుని ఏడాది గడిచినా సాయం అందలేదు. (సాయికుమార్, హౌసింగ్‌బోర్డు ) ఎమ్మెల్యే: కొత్త ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేశాక వాటి ప్రకారం ఆర్థిక సాయమందించేందుకు తప్పకుండా కృషి చేస్తాను. ప్రశ్న: రాత్రి సమయంలో వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి వెళితే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లమని అక్కడి వైద్యులు సూచిస్తున్నారు. (హిదాయత్ పఠాన్, బొక్కల్గూడ) ఎమ్మెల్యే: రిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి, రాత్రి డ్యూటీలో డాక్టరేవరున్నారో, అక్కడి సమస్యలేంటో తెలుసుకుని ఇంకోసారి జరుగకుండా తగు చర్యలు తీసుకుంటాను. ప్రశ్న: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ పంచాయతీ పరిధిలో కొత్తగా ఏర్పడిన చిన్నమారుతిగూడలో తాగునీరు, రోడ్లు, కరెంట్ వంటి వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. సౌకర్యాలు కల్పించేలా చూడాలి.(గణపతి, సురేష్, సిడాం మారుతీ, చిన్నమారుతీగూడ, అంకాపూర్) ఎమ్మెల్యే: త్వరలోనే మండల అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శిస్తాను. అక్కడి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సాధ్యమైనంతవరకు కృషి చేస్తాను. ఇప్పటికే పాయల్ పౌండేషన్ ద్వారా బోరు వేయించాము. ప్రశ్న: మాకు ప్రభుత్వమిచ్చిన ప్లాట్లలో సీపీఐ నాయకులు గుడిసెలు వేయించారు. వాటిని తొలగించాలని కమిషనర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. (గాలిపెల్లి నాగన్న, మావల) ఎమ్మెల్యే: మున్సిపల్ అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకునేలా చూస్తాను. ఈ నెల చివరిలోగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. ప్రశ్న: ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మా పల్లెకు బస్సులు రావడం లేదు..? (సురేష్, అంకాపూర్ జీపీ) ఎమ్మెల్యే: ఈ విషయమై ఆర్టీసీ అధికారులతో త్వరలోనే సమీక్ష నిర్వహిస్తాం. రహదారి సౌకర్యం ఉండి ఆర్టీసీ సదుపాయం లేని గ్రామాలకు బస్సులు నడిపించేలా చర్యలు చేపడతాం. అన్ని గ్రామాలకు బస్సులు వచ్చేలా చూస్తాను. ప్రశ్న: టీచర్స్ కాలనీలోని అడాణేశ్వర్ మందిర్ ప్రాంతంలో రహదారి, నీటి సమస్య తీవ్రంగా ఉంది..? (మధుకర్, టీచర్స్‌కాలనీ) ఎమ్మెల్యే: మీ కాలనీ సమస్యలు ఇదివరకే నా దృష్టి కి వచ్చాయి. ఇటీవలే మున్సిపల్ అధికారులతో మాట్లాడాను. రోడ్ల నిర్మాణంతోపాటు నీటి సరఫరా అయ్యేలా చర్యలు చేపడతాం. ప్రశ్న: పట్టణంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించారు. దీంతో పాదాచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను పరిష్కరించాలి.. (కేతిరెడ్డి గంగారెడ్డి, కై లాస్‌నగర్) ఎమ్మెల్యే: ఈ విషయమై పోలీసు, మున్సిపల్ అధి కారులతో సమీక్ష నిర్వహిస్తాం. వారం పది రో జుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఆక్రమణల విషయమై, వీధి వ్యాపారుల సముదాయం గురించి కూడా రివ్యూచేస్తాం. ప్రశ్న: మా కాలనీలో సమస్యలు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. రహదారి సమస్యతో సతమతం అవుతున్నాం... (రాంరెడ్డి, టీచర్స్ కాలనీ) ఎమ్మెల్యే: త్వరలోనే వార్డును విజిట్ చేసి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తా. ప్రశ్న: మా కాలనీతో పాటు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుధ్యం లోపించింది. దీంతో జనం రోగాల బారిన పడుతున్నారు..?(శ్రీనివాస్, శాంతినగర్) ఎమ్మెల్యే: పట్టణంలోని శాంతినగర్‌తో పాటు అన్ని వార్డుల్లో పారిశుధ్య సమస్య తలెత్తకుండా మున్సిపల్ అధికారులను ఆదేశిస్తాం. అదనపు సిబ్బందిని సైతం నియమించైనా సమస్యను పరిష్కరిస్తాం. ప్రశ్న: కాలనీకి సంబంధించిన మురుగు నీరంతా నా ఇంటి ముందు వచ్చి చేరుతోంది. వాసన భరించలేకపోతున్నాం. మున్సిపల్ అధికారుల కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..( కార్తికేయ, కేఆర్కే కాలనీ) ఎమ్మెల్యే: మున్సిపల్ అధికారులతో మాట్లాడతాం. కేఆర్కే కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ సమస్యలు తలెత్తకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం. కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రశ్న: కాలనీలో ఎవరైన మరణించినప్పుడు అంతి మ యాత్ర కోసం అవస్థలు ఎదురవుతున్నా యి. శ్మశానవాటిక లేకపోవడంతో రోడ్డు పక్క న దహన సంస్కారాలు చేయాల్సి వస్తోంది.. ?(దోని జ్యోతి, శ్రీరాంకాలనీ) ఎమ్మెల్యే: కాలనీలో శ్మశానవాటిక ఏర్పాటు కోసం అధికారులతో మాట్లాడతాం. దీనికి సంబంధించి స్థల సేకరణ చేపట్టి నిర్మాణం కోసం కృషి చేస్తా. ప్రశ్న: మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో చాలా ఇబ్బందవుతుంది. కొత్త రోడ్డు నిర్మించాలి (రవీందర్, చిచ్దరి ఖానాపూర్) ఎమ్మెల్యే: సంబంధిత శాఖల అధికారులతో మాట్లా డి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా. త్వరలోనే రోడ్డును కూడా పరిశీలిస్తా. ఇవి చదవండి: ఇటు సీతక్కకు, అటు దుద్దిళ్లకు సవాలుగా లోక్‌సభ ఎన్నికలు! -
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసేలా!
నాగోజు సత్యనారాయణ: రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పూర్తిస్థాయిలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్టు టీఎస్ఎస్పీ(తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్) బెటాలియన్స్ అడిషనల్ డీజీ, కేంద్ర బలగాల భద్రత విధులకు సంబంధించి రాష్ట్ర నోడల్ అధికారి స్వాతి లక్రా వెల్లడించారు. స్థానిక శాంతిభద్రతల పరిస్థితుల ఆధారంగా సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఎన్నికల భద్రత విధుల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాల మోహరింపు, ప్రధాన విధులకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అడిషనల్ డీజీ స్వాతిలక్రా పంచుకున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ప్రధానంగా అప్పగించే ఎన్నికల విధులు...? ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడంలో అన్ని దశల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు స్థానిక పోలీసులకు సహకారంగా ఉంటాయి. ప్రధానంగా వాహన తనిఖీలు, రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు, ఇతర కీలక పాయింట్లలో పహారా, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు..ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద కీలకమైన భద్రత విధులు కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అప్పగిస్తాం. ఎన్నికల విధుల్లో కేంద్ర బలగాల మోహరింపు ఏ ప్రాతిపదికన ఉంటుంది..? స్థానికంగా ఎన్ని పోలింగ్స్టేషన్లు ఉన్నాయి..అందులో ఎన్ని సమస్యాత్మకమైనవి, సున్నితమైనవి ఉన్నాయన్న నివేదిక ఆధారంగా కేంద్ర బలగాలను పంపుతున్నాం. ప్రస్తుతానికి వంద కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రవ్యాప్తంగా పంపించాం. స్థానికంగా వాళ్లకు వసతి సదుపాయానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్స్టేషన్లు,, గత ఎన్నికల్లో నమోదైన ఘటనల ఆధారంగా సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అవసరం మేరకు అదనపు బలగాలను కేటాయిస్తున్నాం. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కేంద్ర బలగాలతో అన్ని ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించడానికి కారణం..? స్థానికంగా యూనిట్ ఆఫీసర్లు కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్‌లు చేస్తున్నారు. దీని ముఖ్యఉద్దేశం..మీ ప్రాంతంలో భద్రత కోసం పూర్తి సన్నద్ధంగా మేం ఉన్నాం అని పోలీసు నుంచి ప్రజలకు భరోసా ఇవ్వడమే. దీనివల్ల ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం. అదే సమ యంలో సంఘ విద్రోహశక్తులకు ఒక్కింత హెచ్చరిక మాదిరిగా ఈ కవాతులు చేయడం సర్వసాధారణమే. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు తోడు ఇతర రాష్ట్రాల పోలీసు సిబ్బంది బందోబస్తుకు వస్తారా..? ఇంకా కొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఉన్నందున అందుకు అనుగుణంగా విడతల వారీగా కేంద్ర సాయుధ బలగాల సర్దుబాటు ఉంటుంది. ఒక్కో కంపెనీలో సరాసరిన 80 నుంచి 100 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఈ లెక్కన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల నుంచే 30 వేల మందికిపైగా ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరికి అదనంగా ఎలక్షన్ పది రోజుల ముందు నుంచి పోలింగ్ తేదీన విధుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సాయుధ పోలీసు బలగాల సిబ్బందితో పాటు హోంగార్డులు సైతం ఉంటారు. 2018 ఎన్నికల భద్రత విధుల్లో 279 కంపెనీల కేంద్ర బలగాలే ఉన్నాయి. ఈసారి ఆ సంఖ్య పెరిగిందా..? గతంలో 279 కంపెనీల కేంద్ర బలగాలు ఉండగా, ఈసారి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మనం ఎక్కువ కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు కావాలని ప్రతిపాదనలు పంపించాం. ఈసారి మొత్తం 375 కంపెనీల బలగాలను మనం అడిగాం. ఇప్పటికే 100 కంపెనీలు వచ్చాయి. ఇంకో 275 కంపెనీలు వస్తాయి. -
జాతీయస్థాయిలో సత్తాచాటిన సాక్షి ఫొటోగ్రాఫర్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/ నాగాయలంక/తిరుపతి కల్చరల్: అంత ర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసి యేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటో కాంపిటీషన్ ఫలితాలను జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు విడుదల చేశారు. గురువారం విజయవాడలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏపీపీజేఏ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్ విజయ భాస్కర రావు, ప్రధాన కార్యదర్శి వి.రూబెన్ బెసాలి యల్‌తో కలిసి కలెక్టర్ ఫలితాలను విడుదల చేశారు. పోటీల్లో జనరల్ కేటగిరీలో ఎండీ నవాజ్ (సాక్షి, వైజాగ్) ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ఫొటో జర్నలిజం కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్లు పి.లీలా మోహన్‌రావు (వైజాగ్), వి. శ్రీనివాసులు (కర్నూలు), కందుల చక్రపాణి (విజయవాడ), పి.మను విశాల్ (విజయవాడ), కె.శివకుమార్ (యాదాద్రి), కె.జయ శంకర్ (శ్రీకాకుళం), కేతారి మోహన్‌కృష్ణ (తిరుపతి), ఎస్.లక్ష్మీ పవన్ (విజయవాడ) కన్సొలేషన్ బహుమ తులు గెలుచుకున్నారు. జనరల్ కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్ ఎస్ లక్ష్మీపవన్ (విజయ వాడ) కన్సొలేషన్ బహుమతి గెలుచుకు న్నాడు. ఈ సందర్భంగా ఏపీపీజేఏ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికా ఫొటోగ్రాఫర్ల నుంచి 700 ఎంట్రీలు వచ్చాయన్నారు. విజేతలకు ఈనెల 19న విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వ హించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. జాతీయ ఫొటో పోటీల్లో కృష్ణప్రసాద్‌కు మెరిట్ అవార్డు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా నిర్వ హించిన నేషనల్ ఫొటో కాంటె స్ట్–2023లో కృష్ణాజిల్లా నాగాయ లంకకు చెందిన ఫొటోగ్రాఫర్ సింహాద్రి కృష్ణప్రసాద్ పంపిన ఛాయా చిత్రానికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ), ఇండియా ఇంటర్నే షనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ (ఐఐపీసీ) ఆధ్వర్యంలో జాతీయస్థా యిలో నిర్వహించిన ఫొటో పోటీల్లో స్పెషల్ థీమ్ మ్యాని ఫెస్టేషన్స్ ఆఫ్ నేచర్‌లో అండర్ స్టాండింగ్ ది క్లౌడ్స్ విభాగంలో ఆయన పంపిన ‘క్లౌడ్స్ అంబరిల్లా టూ గాడ్’ ఛాయచిత్రం ప్రథమ సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కించుకుంది. -
సాక్షి డైరెక్టర్ పీవీకే ప్రసాద్‌కు పితృవియోగం
మంగళగిరి: సాక్షి దినపత్రిక డైరెక్టర్ పీవీకే ప్రసాద్ తండ్రి పాలడుగు మాధవరావు(92) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొండపనేని టౌన్షిప్లోగల కుమారుని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈయన స్వగ్రామం కృష్ణాజిల్లా ముస్తాబాద. పశ్చిమగోదావరి జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకులో కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మాధవరావు భార్య హైమావతి 2019లో కాలం చేశారు. ఆయనకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శనివారం మంగళగిరిలో పాలడుగు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
శిశువు దత్తత వ్యవహారంలో అనూహ్య ఘటన.. చివరికి విషాదం..
సాక్షి, వరంగల్: వరంగల్‌లో విదేశీ దంపతుల శిశువు దత్తత వ్యవహారంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హనుమకొండలోని శిశువిహార్‌కు చేరేంత వరకు చలాకీగా ఉన్న ఏడు నెలల పాప.. చివరికి మత్యుఒడికి చేరుకుంది. గురువారం ఉదయం పిల్లల డాక్టర్ నవీన్ వద్ద వైద్యపరీక్షలు చేస్తే అంతా సాఫీగానే ఉన్నా.. గురువారం రాత్రితోపాటు శుక్రవారం ఉదయం పాపకు పలుచటి విరేచనాలు కావడంతో మందులు ఇచ్చినా తగ్గలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లినా గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. అయితే ఇది శిశువిహార్ సిబ్బంది నిర్లక్ష్యమా లేదా దీని వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరముంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విదేశీ దంపతుల అక్రమ దత్తత కేసు ఇంకా విచారణ ఆరంభ దశలో ఉండగానే ఆ పాప చనిపోవడంతో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. ఏడు నెలల పాటు వారి వద్ద బాగానే ఉన్న పాప.. శిశువిహార్‌కు రాగానే చనిపోవడం వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ముఖ్య రాజకీయ నేతల ఒత్తిడి ఉండడం కూడా అనుమానాలను రేపుతోంది. ఇప్పటికే జేజే యాక్ట్ 81 సెక్షన్ కింద అక్రమ దత్తత వ్యవహారంలో అమెరికాలో స్థిరపడిన కొంపల్లి వాసి కరీమ్విరాణి, అమెరికా సిటిజన్ అయిన అశామావిరాణితో పాటు వరంగల్‌కు చెందిన రషీదాభాను భోజని, అమ్యన్అలీ భోజానిపై కేసు నమోదైంది. ఆ 36 గంటల్లో ఏం జరిగిందంటే.. ఏడు నెలల పాపను బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ, జిల్లా బాలల సంరక్షణ విభాగంలో పనిచేసే ఎన్ఐసీ పీఓ సరిత హనుమకొండలోని శిశు విహార్‌లో చేర్పించారు. అయితే, గురువారం రాత్రి 10.30 గంటలకు పాపకు పలుచటి విరేచనాలు కావడంతో అక్కడ విధుల్లో ఉన్న ఏఎన్ఎం పౌడర్ కలిపి తాగించడంతో 12 గంటలకు పడుకుంది. మళ్లీ శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మళ్లీ పలుచటి విరేచనాలు కావడంతో మెడిసిన్ ఇవ్వడంతో పడుకుంది. అప్పటివరకు విధుల్లో ఉన్న ఏఎన్ఎం 8.30 గంటలకు వెళ్లిపోగా.. 9.30 గంటలకు మరో ఏఎన్ఎం విధుల్లో చేరింది. అప్పటికే ఆ పాపను పరిశీలించగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా కనిపించడంతో గవర్నమెంట్ మెటర్నిటీ ఆస్పత్రి (జీఎంహెచ్)కు తీసుకెళ్లారు. అక్కడినుంచి 10.30 గంటల వరకు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇది 174 సీఆర్పీసీ (అసహజ మరణం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ తల్లి కన్నబిడ్డనో.. పాపం.. చివరికి అనాథగా మారిన ఆ పాపకు బల్దియా సిబ్బంది అంత్యక్రియలు జరిపారు. అనుమానాలెన్నో.. తేల్చాల్సినవెన్నో? ► కేసు నమోదైన 48 గంటల్లోనే అనారోగ్యంతో పాప మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయి. ►విదేశీ దంపతుల కారాకు దరఖాస్తు చేసుకున్న ఇన్కంట్రీ అడాప్షన్ నుంచి విత్ డ్రా ఎందుకయ్యారు అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అదే సమయంలో వీరిపై అక్రమ దత్తత కింద మట్టెవాడ ఠాణాలో కేసు నమోదైంది. ► ఆ పాప అనారోగ్యంతో బాధపడుతుంటే విరాణి దంపతులు ఎందుకు దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపారన్నది తేల్చాల్సి ఉంది. ► ఈ పాప దత్తత విషయంలో ఢిల్లీ నుంచి వరంగల్ వరకు కారా, సారా అధికారులనుంచి ఎందుకు ఒత్తిడి తెచ్చారన్నది తేల్చాల్సి ఉంది. ► అసలు వీళ్లకు నిజంగా సంతానం ఉన్నారా లేదా ఒకవేళ లేకుంటే ఆపా ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకొని కారా ద్వారా శిశు విహార్‌లో ఉంటున్న ఏ పాపనైనా దత్తత తీసుకుంటే ప్రొసీజర్ ప్రకారం ఉండేది కదా. అసలు ఈ పాపనే ఎందుకు దత్తత తీసుకున్నారు అన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ► ఇప్పటికే భోజాని దంపతులకు పాప ఇచ్చినట్లు చెబుతున్న మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే రాణితోపాటు కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆ పాప జాడ తెలుస్తుంది. ► అన్నింటికీ మూలమైన ఈ పాప తల్లిదండ్రుల ఆచూకీ దొరుకుతుందా.. లేదా దీని వెనుక ఉన్న అక్రమ రవాణా ముఠా మూలాలను వెలుగులోకి తెస్తారా.. లేదా పాప చనిపోయిందని కేసు పట్టించుకోకుండా ఉంటారా అన్నది ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. పాప కేసును వెలుగులోకి తెచ్చిన సాక్షి పాప అక్రమ దత్తత విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. పాప అడాప్షన్ విషయంలో ఉన్న లొసుగులు.. పాపను ఎవరు ఇచ్చారు.. మేడ్చల్ జిల్లానుంచి ఇక్కడికి ఉన్న లింకులు ఏమిటీ విషయాలను ‘సాక్షి’లో ఎక్స్‌క్లూజివ్‌గా ఇవ్వగా స్పందించిన పోలీస్, శిశు సంక్షేమ అధికారులు విచారణ జరిపి మరిన్ని విషయాలు రాబట్టారు. -
సాక్షి నేషనల్ న్యూస్
-
వాస్తవాలు కనలేరా.!
సాక్షి, అమరావతి: పసలేని కథనాలకు ఈనాడు కేరాఫ్‌గా మారింది. లేని వాటిని ఉన్నట్లుగా అవాస్తవాల అచ్చుతో పబ్బం గడుపుకుంటోంది. అలాంటి పనికిరాని కథనాల్లో ఒకటి ఈ విద్యుత్ కోతల కథనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఏ విధమైన విద్యుత్ కోతలు అమలులో లేవు. అయినా ప్రతి రోజూ 2 – 3 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈనాడు పదే పదే అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజలు నవ్వుతారనే కనీస ఇంగితం కూడా లేకుండా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ విద్యుత్ కోతలే లేవని మరో అబద్ధం చెబుతోంది. వేసవి కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రోజూ రూ.కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్‌ను కొని మరీ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సరఫరా చేస్తుంటే, కరెంటు కొనలేరా? అంటూ కళ్లుండీ గుడ్డిరాతలు అచ్చేసింది. అసలు వాస్తవాలను ఇంధన శాఖ ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఆరోపణ: డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మార్కెట్లో కొనాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ లేని కోతలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం: ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.3059.4 కోట్లు వెచ్చించి 3,633.81 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వంద శాతం కరెంటు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 నుంచి 45 శాతం ఏపీజెన్కో నుంచే సమకూరుతోంది. రోజూ దాదాపు 105 మిలియన్ యూనిట్లు జెన్కో అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ఏ ఒక్క రోజూ విద్యుత్ కోతలు విధించాలి్సన అవసరమే రావడంలేదు. ఆరోపణ: షెడ్యూల్ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. డిమాండ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత పెడుతున్నారు. వాస్తవం: విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చితే భారీగా పెరిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ యూనిట్ పది రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సర్దుబాటు అవసరమే లేదు. ఈనాడు చెబుతున్న 0.24 మిలియన్ యూనిట్లు, 0.19 మిలియన్ యూనిట్లు అనేది కేవలం గ్రిడ్ ఫ్రీక్వెన్సీని నిర్దిష్ట స్థాయిలో నిలిపి ఉంచడానికి చేసిన డిమాండ్ సర్దుబాటు మాత్రమే. విద్యుత్ కొరతో లేక కోతో కాదు. ఆరోపణ: రాత్రి వేళ అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్‌ను నియంత్రించలేని పరిస్థితి. ఆ సమయంలో కోతలకు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవం: వేసవి కారణంగా రాత్రి వేళ అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగి 11 కె.వి. పంపిణీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. 33 కె.వి. లైన్లపై, సబ్స్టేషన్లపై కూడా అధిక లోడు ప్రభావం ఉంటోంది. దీంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ సంస్థ (డిస్కం)లలో క్షేత్ర స్థాయిలో 33/11 కె.వి. సబ్‌స్టేషన్ పరిధిలో 24 గంటలు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధిక లోడు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల గాలివానల వల్ల కొన్ని చోట్ల స్వల్పకాలం ఏర్పడే విద్యుత్ అంతరాయాలను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉందని ఈనాడు కట్టు కథలు అల్లుతోంది. ఆరోపణ: ప్రకాశం జిల్లాలో 2, 3 గంటలు, విజయనగరం జిల్లాలో 2 నుంచి 4 సార్లు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవం: వేసవి ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడం, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడం జరుగుతోంది. వాటిని పునరుద్ధరించే క్రమంలో ఆ ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతే తప్ప విద్యుత్ కోతలు విధిస్తున్నారనేది అవాస్తవం. ఆరోపణ: లోడ్ అంచనా వేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. కానీ డిస్కంలు అలా చేయలేకపోయాయి. వాస్తవం: వేసవి కాలంలో రాత్రి వేళ ఏసీలు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. తద్వారా పెరిగే డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా కూడా జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో లోడును అంచనా వేసి దానికి తగ్గట్టుగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాడుకునేలా మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నాయి. -
‘వార్ధా’ అంచనాలు పెరగలేదు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టులో భాగంగా.. 2018లో బ్యారేజీ నిర్మాణానికి మాత్రమే రూ.750 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ పేర్కొంది. భూసేకరణ, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, ఫీల్డ్ చానళ్లు, కరకట్టలు, పంపుహౌజ్‌లు, విద్యుత్ సబ్స్టేషన్లు, రెగ్యులేటర్లు, క్రాస్ డ్రైనేజీ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, నిర్వాహణ ఖర్చులతోపాటు 18 శాతం జీఎస్టీ పన్నును కలిపితే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,550.73 కోట్లకు చేరిందని తెలిపింది. కేవలం జీఎస్టీ పన్ను వ్యయం రూ.622.40 కోట్లు కానుందని వెల్లడించింది. ‘వార్ధా ప్రాజెక్టు..భారీ బడ్జెట్’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగలేదని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టితో భారం తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా వార్ధా నదిపై బ్యారేజీని నిర్మించనుండటంతో వ్యయం గణనీయంగా తగ్గుతుందని నీటిపారుదల శాఖ పేర్కొంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పొడవు 6.45 కిలోమీటర్లు, గేట్ల సంఖ్య 102కాగా.. వార్ధా బ్యారేజీ పొడవు 1751 మీటర్లు, గేట్ల సంఖ్య 29కి తగ్గుతాయని వివరించింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీలో 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద గరిష్ట నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలు మాత్రమేకాగా.. వార్ధా బ్యారేజీలో 155 మీటర్ల వద్ద 2.94 టీఎంసీలను నిల్వ చేయవచ్చని తెలిపింది. -
పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక AAFA అవార్డు
ముంబై/హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. IAA ఆధ్వర్యంలో ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ AAFA.. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఎంపిక చేసి కార్పోరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్ సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల సమర్పణ కార్యక్రమంలో సాక్షి మీడియా తరుపున సాక్షి కార్పోరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డికి AAFA చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. ► ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్‌గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020-21లో ప్రారంభమై ఇప్పటికి మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్తు తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి ప్రధాన కారణం మనుష్యులే. ఈ భూమి మళ్లీ పునర్వైభవాన్ని దక్కించుకోవాలంటే .. ప్రతీ ఒక్కరు నిరంతరం చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ► ఏడాది పాటు ప్రతీ నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు అందరిని ఇందులో భాగస్వామ్యులను చేస్తోంది. దీంతో పాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటల పాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. ► పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు, తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. సాక్షి టీవీ ఔట్ పుట్ ఎడిటర్ నాగరాజు, మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిల్, సినీ నటుడు అలీ, CEO అనురాగ్ అగ్రవాల్, డైరెక్టర్ KRP రెడ్డి, బిజినెస్ కంట్రోల్ డైరెక్టర్ ALN రెడ్డి, కార్పోరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణీ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ YEPరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డిజిటల్ శ్రీనాథ్ ఇక AAFA అవార్డు సందర్భాన్ని పురస్కరించుకుని సాక్షి మీడియా హౌస్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా సినీనటుడు అలీ పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూపు సంకల్పాన్ని అలీ ప్రత్యేకంగా ప్రశంసించారు. పుడమి సాక్షికి గౌరవం.. సెలబ్రేషన్స్ ఫొటోల కోసం క్లిక్ చేయండి -
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్‌కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
‘సాక్షి’ రక్తదాన శిబిరానికి విశేష స్పందన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. సాక్షి సిబ్బందితోపాటు శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి సిబ్బందితోపాటు విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాల విద్యార్థులు, అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం, పటమట, ఆటోనగర్ తదితర ప్రాంతాలకు చెందిన శ్రేయోభిలాషులు కలిపి మొత్తం 60 మంది రక్తదానం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రక్తదాన శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని సాక్షి బ్రాంచి మేనేజర్ ఆర్.యశోదరాజ్, క్లస్టర్ ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి, బ్యూరో ఇన్చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరిస్తున్న సాక్షి సిబ్బంది విశాఖలో ఆర్కే బీచ్‌ను శుభ్రం చేసిన ‘సాక్షి’ సిబ్బంది బీచ్‌రోడ్డు: ‘సాక్షి’ దినపత్రిక 15వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం యూనిట్ ఆధ్వర్యాన ఆర్కే బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ‘సాక్షి’ అడ్మినిస్ట్రేటివ్, ఎడిటోరియల్, రిపోర్టింగ్, యాడ్స్, సర్క్యులేషన్, టీవీ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది గురువారం బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరించి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందించారు. విశాఖ సాగరతీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరింత అందంగా ఉంటుందని, పర్యాటకులను ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా విశాఖపట్నం యూనిట్ బ్రాంచి మేనేజర్ చంద్రరావు అన్నారు. -
సందడిగా ‘సాక్షి’ ప్రాపర్టీ షో (ఫొటోలు)
-
సాక్షి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
గుజరాత్లో మోదీ మేనియానా? లేక కమలం హవానా? ఫలితాలు ఏం చెబుతున్నాయి?
గుజరాత్లో బీజేపీ దుమ్మురేపింది. రికార్డు స్థాయిలో సీట్లను కొల్లగొట్టి ప్రభంజనాన్ని సృష్టించింది. మోదీ- షా సొంత రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకుంది కమల దళం. మోదీ మ్యాజిక్‌తో 156 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది. బీజేపీ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది. 20 సీట్లు కూడా గెలవలేక చతికిలపడింది. గుజరాత్లో ఎన్నికల ఆరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 12శాతం ఓట్లను కొల్లగొట్టింది. డిసెంబర్ 12న భూపేంద్ర పటేల్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో బీజేపీ గెలుపుకు దోహం చేసిన అంశాలేవీ?. గుజరాత్లో గెలిచింది బీజేపీనా? మోదీనా?. బలమైన నేతలను ఆకట్టుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందా?. రాబోయే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతోంది? రాహుల్ జోడో యాత్ర, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఖర్గే ప్రభావం ఎక్కడ? వంటి అనేక అంశాలపై సాక్షి విశ్లేషణ.. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2021: తారాలోక తోరణం
సకలజన మనోరంజకమైన సినీ రంగంలోని పాపులర్ చిత్రాలు, ఉత్తమ కళాకారులు, సృజనశీలురను గుర్తించి గౌరవించడం... సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో గత ఎనిమిదేళ్ళుగా అవిచ్ఛి్ఛన్నంగా సాగుతున్న సత్సంప్రదాయం. గడచిన 2021లో విడుదలైన తెలుగు చిత్రాలకు ఇచ్చిన ఈ 8వ ఎడిషన్ అవార్డుల వేదిక పలువురు తారలతో, జీవనసాఫల్య పురస్కారాలందుకున్న సీనియర్లతో కళకళలాడింది. ఆత్మీయంగా సాగిన ఈ అవార్డుల సందడిలో... వారంతా మనసు విప్పి మాట్లాడిన సంగతుల సమాహారం... సంక్షిప్తంగా... ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న భారతిగారికి కూడా ఒక అవార్డు ఇవ్వాలి. అవార్డులు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. విపత్కర పరిస్థితుల్లో మా సినిమాను(లవ్ స్టోరీ) విడుదల చేశాం. ముఖ్యంగా కులం, చైల్డ్ ఎబ్యూజ్ వంటి అంశాలను చూపించినందుకుగాను సాక్షి అవార్డు రావడం గర్వంగా ఉంది. మా ఇద్దరి (శేఖర్ కమ్ముల, సుకుమార్) ప్రయాణం ఒకేసారి మొదలైంది. ఇండస్ట్రీ గర్వించేలా సుకుమార్ సినిమాలు చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు(2020, 2021) సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉంది.. హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నా. ఈ అవార్డు అందించిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పురస్కారాన్ని ‘పుష్ప’ బృందానికి అంకితం ఇస్తున్నాను. తెరవెనుక వారి కృషి మాటల్లో చెప్పలేనిది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం సుకుమార్‌గారు. ఆయన వల్లే ఇంత మంచి సినిమా తీశాం. దేవిశ్రీతో ప్రయాణం గొప్పగా ఉంటుంది. నా మొదటి సినిమా నుంచి ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూట్యూబ్‌లో ఎక్కువ మంది వింటున్న ఆల్బమ్ వరకు పాటలు అందించిన చంద్రబోస్‌గారికి థ్యాంక్స్. 2021లో ‘పుష్ప’ తో పాటు బాలకృష్ణగారి‘అఖండ’, నాని ‘శ్యామ్‌సింగరాయ్’, ‘జాతిరత్నాలు’ వంటి మంచి మూవీస్ విడుదలయ్యాయి.. వాటన్నిటికీ అభినందనలు. కరోనా తర్వాత మళ్లీ వరుసగా సినిమాలు రావడం హ్యాపీ. ఈ మధ్యనే సినిమా ప్రయాణం మొదలుపెట్టిన ప్రతిభావంతులకు ఈ వేదికపై అవార్డు రావడం అభినందనీయం. ఈ అవార్డు అందుకోవడం ఎంతో ప్రత్యేకం. అవార్డు గ్రహీతలను సెలెక్ట్ చేసే కోర్ టీం గురించి నాకు తెలుసు.. ప్రతి విషయాన్ని గమనిస్తూ, సాహిత్యానికి ప్రాధాన్యమిస్తూ నిష్పాక్షికంగా ఎన్నుకుంటారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన సాక్షికి, భారతిగారికి థ్యాంక్స్. ‘పుష్ప’ విజయంలో బన్నీ, ర ష్మిక, దేవిశ్రీ, నిర్మాతలు ఎంతో సహకారాన్ని అందించారు. నా కోసం ‘ఊ అంటావా మావా..’ పాటని ఐదేళ్లుగా దాచిన చంద్రబోస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ‘సిరివెన్నెల’గారు సినిమాల్లో సాహిత్యాన్ని నింపగలిగారు. ఆయన మరణించినప్పుడు.. ‘సిరివెన్నెలగారు బతికే ఉన్నారు... కానీ, పాటే ప్రాణం పోగొట్టుకుంది’ అని రాసుకున్నాను. ఎక్కడ టాలెంట్ ఉన్నా గుర్తించి, వారికి అవార్డులతో ప్రోత్సాహం అందిస్తున్న సాక్షి సంస్థ ఆ పేరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఏ రంగంలోని వారికైనా సాక్షి అవార్డు వస్తే వారికి నిజమైన ప్రతిభ ఉందని గుర్తించవచ్చు. సమాజహితమైన వార్తలతో పాటు అవార్డులు అందించడం అద్భుతం. – ఎస్వీ కృష్ణా రెడ్డి, సీనియర్ డైరెక్టర్ ఎనిమిదేళ్లుగా సినిమాలతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ ఉన్న వారికి అంకితభావంతో, దిగ్విజయంగా అవార్డులు అందిస్తున్న సాక్షి యాజమాన్యానికి థ్యాంక్స్. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించాలనే నిబద్ధతతో సాక్షి సంస్థ పనిచేస్తోంది. వార్తలతో పాటు మరింత మెరుగైన సమాజం కోసం, పర్యావరణ హితం కోసం పుడమి సాక్షిగా వంటి కార్యక్రమాలను, రైతుల కోసం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. – అచ్చిరెడ్డి, సీనియర్ నిర్మాత ఈ వేదికలో సాక్షి అవార్డు పొందడం రెండవ సారి. మా మొదటి మూవీకి కూడా ఇక్కడే అవార్డు అందుకున్నాం. మా విజయంలో టీం కృషి మర్చిపోలేనిది. – నవీన్ ఎర్నేని, నిర్మాత (పుష్ప) గత కొంతకాలంగా మా అందరికీ సాక్షి సంస్థ అవార్డులతో ప్రోత్సాహం అందిస్తోంది. ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినందుకు సాక్షికి ధన్యవాదాలు. ఈ అవార్డు సుకుమార్ వల్లే అందుకోగలిగాను. తనకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మైత్రీ మూవీస్ నిర్మాతలు, బన్నీ ప్రోత్సాహం మర్చిపోలేను. ‘పుష్ప 2’ మీరు ఊహించని రేంజ్లో ఉంటుంది. ఈ సందర్భంగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారిని గుర్తు చేసుకోవాలి. ఆయనతో నాది కొడుకులాంటి అనుబంధం. సినిమా కోసం గొడవపడి అలిగేంత చనువు ఉండేది. ప్రతీ అక్షరంతో జనాల గుండెల్లోకి దూసుకుపోయేవారు ఆయన. ‘వర్షం, పౌర్ణమి’.. వంటి ఎన్నో మంచి సినిమాలు కలిసి చేశాం. ఆయన్ని చూసి జీవితాన్ని నేర్చుకున్నాను. ‘సిరివెన్నెల’ గారు మన మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. – దేవిశ్రీ ప్రసాద్, మోస్ట్ పాపులర్ సంగీత దర్శకుడు (పుష్ప) సాక్షి ఎక్స్‌లెన్స్ పురస్కారానికి నన్ను అర్హున్ని చేసిన న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు. ఎప్పటికైనా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వెలుగుతుంది, లోకాన్ని ఏలుతుందనే నమ్మకం ఉండేది. ఆ కోరిక ‘పుష్ప’ సినిమాతో నిజమైనందుకు ఆనందంగా ఉంది. ఇందులో దర్శకుడు సుకుమార్, సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ కృషి ఎనలేనిది. ఈ ప్రయాణంలో నా కృషి అణువంత.. అదృష్టం ఆకాశమంత. – చంద్రబోస్, మోస్ట్ పాపులర్ గీత రచయిత (పుష్ప) అవార్డులు గుర్తింపుతో పాటు మరింత బాధ్యతను పెంచుతాయి. సాక్షిలాంటి సంస్థ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ అవార్డు నా బాధ్యతను పెంచింది. ఈ అవార్డుల్లో భాగంగా జ్యూరీ విభాగంలో ఉన్నాను. ఇక్కడ ఎంపిక విధానం ఉన్నత ప్రమాణాలతో ఉంది. సాక్షి బృందానికి అభినందనలు. – పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ దిగ్గజం ముందుగా ఈ అవార్డును మా మావయ్య చిరంజీవిగారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేను. ఆ తర్వాత మా అమ్మగారికి. అమ్మా... ఈ అవార్డు నీ కోసమే..!. ఈ ఏడాది బెస్ట్ డెబ్యూడెంట్ యాక్టర్‌గా నేను అవార్డు తీసుకోవడానికి ఓ కారణం అయిన దర్శకుడు బుచ్చిబాబుకు ధన్యవాదాలు. అలాగే ‘ఉప్పెన’ సినిమాలో నటించిన విజయ్ సేతుపతిగారికి, నిర్మాతలు నవీన్, రవి శంకర్గార్లకు, డీఓపీ శ్యామ్దత్కు, డైరెక్టర్ సుకుమార్, ఆయన భార్య తబితగార్లకు థ్యాంక్స్. ఈ అవార్డును నాకు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు. – వైష్ణవ్‌తేజ్, ఉత్తమ తొలి చిత్ర నటుడు (ఉప్పెన). సాక్షి ఆధ్వర్యంలో మా చిత్రం ‘వైల్డ్ డాగ్’కు జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ‘వైల్డ్ డాగ్’లో నటించిన నాగార్జున గారికి ధన్యవాదాలు. – అన్వేష్‌రెడ్డి, నిర్మాత, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (వైల్డ్ డాగ్) మా అక్క మంగ్లీ (‘లవ్‌స్టోరీ’లోని ‘సారంగదరియా’ పాట), నేను (‘పుష్ప’లోని ‘ఊ అంటావా...’ పాట) పోటీపడి, సరిసమానంగా నిలిచి, ఇద్దరం ఈసారి అవార్డు గెల్చుకోవడం ఆనందంగా ఉంది. మా అక్క రాలేకపోయింది. అవార్డిచ్చిన భారతమ్మకు ధన్యవాదాలు. సుకుమార్, దేవీశ్రీ, చంద్రబోస్గార్లకు థ్యాంక్స్. – ఇంద్రావతి, మోస్ట్ పాపులర్ సింగర్ – ఫిమేల్ (పుష్ప) సామాజిక సేవ, విద్య, పర్యావరణం.. వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారికి సాక్షి అవార్డు అందించడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి ఎనిమిదేళ్లుగా భారతి సిమెంట్ తరపున సహకారం ఇస్తున్నాం.. ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుంది. – రవీందర్ రెడ్డి. డైరెక్టర్ మార్కెటింగ్, భారతి సిమెంట్స్. అవార్డు చాలా బరువుగా ఉంది.. థ్యాంక్యూ సాక్షి. సుకుమార్సర్ లేకుంటే నేను లేను. దర్శకుడిగా నాకంటూ ఏదొచ్చినా అది మీదే. ‘ఉప్పెన’ ఇంత బాగా రావడానికి కారకులైన నిర్మాతలు నవీన్, రవిగార్లకు థ్యాంక్స్. అలాగే విజయ్ సేతుపతి, వైష్ణవ్, కృతి, దేవిశ్రీలకు థ్యాంక్స్. టీమ్ అంతా కష్టపడితే ఈ అవార్డు నాకు ఇచ్చారు. – బుచ్చిబాబు, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు(ఉప్పెన) ‘నాంది’ సినిమా తీసినందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్’ రావడం సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లోని ప్రతిభావంతులను ఎంపిక చేసి అవార్డులతో సత్కరించి, ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవార్డులు మాలాంటి యువ దర్శకులు, యువతకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సాక్షి ఇచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్‌లో కూడా మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాను. – దర్శకుడు విజయ్ కనకమేడల, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (నాంది) ‘నాంది’ రిలీజ్ కాకముందే మా సినిమా.. విడుదల తర్వాత ప్రేక్షకుల చిత్రం. వారి సొంత సినిమాలా భావించి ఆదరించారు. ఈ వేదికపై మేం ఉండటానికి ప్రధాన కారణం ప్రేక్షకుల ఆదరణే. అందుకే ఈ అవార్డును ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నాను. అవార్డుకు ఎంపిక చేసిన సాక్షి జ్యూరీకి ధన్యవాదాలు. – సతీష్ వర్మ, నిర్మాత, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (నాంది) గత ఏడాది నా వర్క్‌ను గుర్తించి నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన సాక్షికి ధన్యవాదాలు. నా తొలి చిత్రం ‘జాంబీరెడ్డి’కి విశేష ఆదరణ లభించండం హ్యాపీ. నాపై నమ్మకం ఉంచిన దర్శక– నిర్మాతలకు థ్యాంక్స్. అలాగే ఓ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరించారు. నేను ఎంపిక చేసుకున్న కథలను ప్రేక్షకులు వారి ఆదరణ రూపంలో ప్రశంసించారు. ఇప్పుడు నా కష్టాన్ని కూడా గుర్తిస్తూ ఇలాంటి అవార్డులు రావడం నాకు కచ్చితంగా బోనస్‌లా అనిపిస్తోంది. – తేజా సజ్జా, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (జాంబీ రెడ్డి) ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి థ్యాంక్స్. ఈ అవార్డును మన మధ్యలేని (ఇటీవల మరణించారు) ఈ సినిమా (సూపర్ ఓవర్) దర్శకుడు ప్రవీణ్‌కు అంకితం ఇస్తున్నాను. అలాగే ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – సుధీర్‌వర్మ, మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ (సూపర్ ఓవర్) ఇది నా తొలి అవార్డు. నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు. ఆయన వల్లే ఇది సాధ్యమైంది. నేను ఈ అవార్డు అందుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన అందరికీ థ్యాంక్స్. అలాగే ‘పుష్ప’లాంటి అద్భుతమైన సినిమా తీసిన సుకుమార్‌గారికి, లిరిక్స్ రాసిన చంద్రబోస్‌గారికి ధన్యవాదాలు. – శివమ్, మోస్ట్ పాపులర్ సింగర్ (మేల్) (పుష్ప–1). కృష్ణవేణి లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డ్ చిత్తజల్లు కృష్ణవేణి... పదేళ్ళ వయసులో సినిమా రంగానికి వచ్చారామె. ఇండియాలోనే తొలి బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’లో అనసూయ పాత్రధారి ఆవిడే. బాల నటి నుంచి హీరోయిన్గా ఎదిగారు. గాయనిగా ప్రేక్షకులను పరవశింపజేశారు. శోభనాచల స్టూడియో అధినేత, దర్శక–నిర్మాత మీర్జాపురం రాజావారిని వరించారు. నిర్మాతగా మారారు. స్టూడియో అధినేత అయ్యారు. పదేళ్ళ వయసులో వచ్చి... 1935 నుంచి ఇప్పటికీ 86 ఏళ్ళుగా తెలుగు సినీ రంగంలో ఉన్న సీనియర్ మోస్ట్... నటి, నిర్మాత... బహుముఖ ప్రజ్ఞాశాలి... సి.కృష్ణవేణి. ‘సతీ అనసూయ, తుకారామ్, కచ దేవయాని, భోజ–కాళిదాసు, జీవనజ్యోతి, దక్షయజ్ఞం, భీష్మ, ధర్మాంగద, మదాలస, గొల్లభామ, శ్రీలక్ష్మమ్మ, మన దేశం, పల్లెటూరి పిల్ల’... ఇలా తెలుగు టాకీల తొలినాళ్ళలో ఆమెకు నటిగా, స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చిన చిత్రాలు అనేకం. అన్నమయ్య కీర్తన ‘జో అచ్యుతానంద జోజో ముకుంద...’ తెలుగు తెరపై తొలిసారిగా వినిపించింది కృష్ణవేణి గొంతులోనే. స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో తెలుగులో వచ్చిన తొలి చిత్రం ‘మనదేశం’. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించి, నటించడమే కాదు... ‘మనదేశం’తో ఎన్టీఆర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది. ఘంటసాల, రమేశ్ నాయుడులను మ్యూజిక్ డైరెక్టర్స్‌గా, పి.లీలను ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయం చేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘కీలుగుర్రం’ మొదలు పలు సినిమాలు నిర్మించారు. రాజ్‌కుమార్‌తో కన్నడలో ‘భక్త కుంభార’, శివాజీ గణేశన్ ద్విపాత్రాభినయంతో తెలుగు హిట్ ‘యమగోల’ రీమేక్ గా ‘యమనుక్కు యమన్’ చిత్రాలు నిర్మించారు. గతంలో వై.ఎస్.ఆర్. సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సి.కృష్ణవేణిని గౌరవించింది. ఆమె కుమార్తె ఎన్.ఆర్.అనూరాధా దేవి సైతం ప్రసిద్ధ నిర్మాతే. వందేళ్ళ వయస్సు దగ్గరపడుతున్న వేళ ఈ అవార్డుతో ఘనమైన కీర్తి అందించిన సాక్షి వారికి అభినందనలు. పదేళ్ల వయస్సులో ‘సతీ అనసూయ’ అనే సినిమాలో అనసూయ పాత్ర చేసే అవకాశాన్నిచ్చారు సి.పుల్లయ్య. ‘మనదేశం’ సినిమాని రామారావు కోసమే తీసినట్టు అనిపిస్తోంది. – సి. కృష్ణవేణి, తొలితరం నటి –గాయని గిరిబాబు లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డ్ అర్ధ శతాబ్ద కాలంగా తెలుగు సినీరంగంలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా... ఇలా వెండితెరపై బహుముఖ పాత్రధారి గిరిబాబు. చిన్నతనంలోనే నటనపై మక్కువతో నాటకాలతో మొదలుపెట్టి, మద్రాసులో సినిమా అవకాశాల కోసం పట్టుపట్టి, ఎన్టీఆర్, ఏయన్నార్ నుంచి చిరంజీవి, నాగార్జున దాకా మూడు తరాల అగ్ర హీరోలకు దీటుగా విలన్‌గా నటించిన ఖ్యాతి గిరిబాబుది. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన యర్రా శేషగిరిరావు... ఇలా గిరిబాబుగా పేరు సంపాదించుకున్న తీరు నేటి తరానికి ఒక స్ఫూర్తి పాఠం. 1973లో ‘జగమే మాయ’తో గిరిబాబు సినీరంగ ప్రవేశం చేశారు. స్వీయ అభిరుచికి అనుగుణంగా చిత్రాలు తీయాలని జయభేరి సంస్థను స్థాపించారు. తెలుగులో తొలి పూర్తి బ్లాక్ అండ్ వైట్ సినిమా స్కోప్ ‘దేవతలారా దీవించండి’తో 1977లో నిర్మాతగా మారి పది చిత్రాలు నిర్మించారు. అన్ని భాషల్లో కలిపి సుమారు 600లకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రపోషణ చేశారు. సాంఘికం, చారిత్రకం, పౌరాణికం, జానపదం – ఇలా అన్ని తరహా చిత్రాల్లోనూ మెప్పించారు. ‘రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్నా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిరిబాబు చిన్న కుమారుడు బోసుబాబు కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు. పెద్ద కుమారుడు రఘుబాబు సైతం తండ్రి బాటలో పయనించి, నటుడిగా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు. సినీరంగానికి సుదీర్ఘ కాలంగా గిరిబాబు అందించిన సేవలను గుర్తించి... ఆయన సినీజీవిత స్వర్ణోత్సవ వేళ...లైఫ్‌టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డుతో... సాదరంగా సత్కరించింది... సాక్షి మీడియా గ్రూప్. సినిమా రంగంలో 50 ఏళ్ల అనుభవం ఉంది.. దాదాపు ఆరువందల సినిమాల్లో నటించాను. ఇంతకాలానికి జీవిత సాఫల్య పురస్కారం అవార్డు రావడం, ఈ అవార్డును సాక్షి సంస్థ అందించడం అమితమైన ఆనందాన్నిచ్చింది. ఇప్పటికీ సాక్షి పేపర్ చదవడం నాకు అలవాటు. – గిరిబాబు, సీనియర్ నటులు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డ్ (మరణానంతరం) ఆయన పాట... చీకట్లో దారి చూపించే వెన్నెల. నిరాశలో వెన్నుతట్టి ముందుకు నడిపించే భరోసా. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక. ఆ పాట యువతరాన్ని ఉర్రూతలూగించింది... జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పింది... ప్రేమతత్వాన్ని బోధించింది. ఆ పాటల పూదోట ఎవరో కాదు... చేంబోలు సీతారామశాస్త్రి. తొలిసినిమా పేరే ఆయనకు ఇంటిపేరై, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా ప్రసిద్ధు లయ్యారు. కె.విశ్వనాథ్ ప్రోత్సాహంతో ‘జననీ జన్మభూమి’తో సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ‘విధాత తలపున ప్రభవించినది...’ అంటూ తొలినాటి పాటతోనే సినీ సాహిత్య ప్రియుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొంది, తొలి నంది అవార్డు సాధించారు. అక్కడి నుంచి సీతారామశాస్త్రి కలం విశ్రమించలేదు. మూడున్నర దశాబ్దాలపైచిలుకు ప్రయాణంలో 800కు పైగా చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాశారు. ఉత్తమ గీత రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 11 నంది అవార్డులు అందుకున్నారు సిరివెన్నెల. 2019లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రిని తెలుగు సినీ ప్రియులందరి తరఫున సగౌరవంగా స్మరిస్తూ, ఆ మరపురాని సాహితీమూర్తికి మరణానంతరం... సభక్తికంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది సాక్షి మీడియా గ్రూపు. సాక్షి మీడియా వారు ఆయన్ను (‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి) అభిమానంతో గౌరవించినందుకు మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. – పద్మావతి (‘సిరివెన్నెల’ సతీమణి) నాన్నగారిని ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఆయన మీద గౌరవంతో అవార్డు ఇచ్చిన భారతిగారికి, సాక్షి మీడియాకి ధన్యవాదాలు. ప్రస్తుతానికి ఇంత కన్నా నేను ఎక్కువ మాట్లాడలేను (భావోద్వేగంతో...) – యోగేశ్వర్ (‘సిరివెన్నెల’ పెద్దబ్బాయి) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2021: సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం
నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. తిండిలేని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... పిన్న వయస్సులోనే ప్రతిభ చూపే వారు కొందరైతే... తమ ప్రతిభ ను సమాజ హితం కోసం, దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు ఇంకొందరు. ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు మరికొందరు! ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... గౌరవించి సత్కరిస్తోంది. ఇందులో భాగంగా 2021 సంవత్సరానికి సంబంధించి సాక్షి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో అక్టోబర్ 21, శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు. మరుప్రోలు జస్వంత్ రెడ్డి : (తల్లి వెంకటేశ్వరమ్మ, తండ్రి శ్రీనివాసులురెడ్డి) – స్పెషల్ జ్యూరీ పురస్కారం (మరణానంతరం) బాపట్లలోని దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ 18 ఏళ్ల వయసులోనే మద్రాస్ రెజిమెంట్‌లో శిక్షణ పూర్తి చేశాడు. తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జమ్ముకాశ్మీర్‌కు వెళ్లాడు. 2021 జులై 8న జమ్మూకాశ్మీర్‌లోని సుందర్ బని సెక్టార్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద టెర్రరిస్టులతో తలపడ్డ జశ్వంత్, ఎదురు కాల్పులలో తీవ్రంగా గాయపడి తుది శ్వాస విడిచాడు. అమ్మా! కంగారు వద్దు... అవే చివరి మాటలు!! మా అబ్బాయి ఎప్పుడు ఫోన్ చేసినా ‘అమ్మా! నేను బాగున్నాను. మీరు జాగ్రత్త’ అని చెప్పేవాడు. గతేడాది సరిహద్దులో ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో... జూలై 6న ఫోన్ చేసినప్పుడు కూడా ‘ఇక్కడ (జమ్ము) బాగుంది. నా నుంచి ఫోన్ లేకపోయినా మీరేం కంగారు పడకండి. మీరు జాగ్రత్త’ అన్నాడు. అవే చివరి మాటలు. ఎనిమిదవ తేదీ ప్రాణాలు వదిలాడు. డాక్టర్ డి. పరినాయుడు : జట్టు సంస్థ – ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తూ పురుగుమందులు లేకుండా వ్యవసాయం ఎలా చేయాలో గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది జట్టు సంస్థ. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో 206 గ్రామాలకు చెందిన దాదాపు పదివేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడంతోపాటు స్కూల్ టు ఫీల్డ్ స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు నాచురల్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ. సేద్యానికి సేవ చేశాను: పదహారేళ్లుగా వ్యవసాయ పద్ధతుల్లో ఆచరణీయమైన ప్రయోగాలు చేశాను. అవార్డులు అందుకున్నాను. నాచురల్ ఫార్మింగ్‌కి ప్రచారం బాగానే ఉంది. కానీ రైతులు రావాల్సినంత స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇలాంటి గుర్తింపులు, అవార్డులు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. సహదేవయ్య–విక్టోరియా : ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ – నవజీవన్ సంస్థ, నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రంగా అణగారిన వర్గాలకు అండగా నిలవడం కోసం 1996లో ఏర్పడిన ఈ సంస్థ అణచివేతకు గురైన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు కృషి చేస్తోంది. సాధికారత, స్వయంసమృద్ధి, సహజ వనరుల సంరక్షణ, సమాన అవకాశాలు, రక్షిత మంచినీరు, బాలల హక్కులు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. నిరుపేదలు, నిస్సహాయుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తోంది. ప్రచారం లేకుండా పని చేశాం: ప్రచారం చేసుకోకుండా మా పని మేము చేసుకుంటూ ఉన్న సమయంలో సాక్షి మా సేవలను గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు ప్రోత్సాహాన్నిస్తాయి. మరింత ఉత్సాహంగా పని చేయడానికి దోహదం చేస్తాయి. బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి: ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీతో ఉన్న ప్రయోజనాల గురించి, సౌరశక్తి వినియోగం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో నివసించేవారికి పర్యావరణ పరిరక్షణ గురించి వర్క్‌షాప్‌లు నిర్వహించారు. యునైటెడ్ నేష¯Œ ్స ఆధ్వర్యంలో కౌన్సిల్ ఫర్ గ్రీ¯Œ రెవల్యూష¯Œ నిర్వహించే పలు సదస్సుల్లో పాల్గొన్నారు. ప్రకృతి విలువ తెలియచేయాలి: చిన్నప్పటి నుంచి ప్రకృతికి దగ్గరగా పెరిగాను. ప్రకృతి మీద ప్రత్యేకమైన మమకారం కూడా. అది కాలుష్యపూరితం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక దాని పరిరక్షణ కోసం చిన్నచిన్న కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ప్రకృతి విలువ తెలియజేయాలనేది నా ప్రయత్నం. అనిల్ చలమలశెట్టి, భార్య స్వాతి : గ్రీన్ కో గ్రూప్ – ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది గ్రీన్కోగ్రూప్. ఈ కంపెనీ అధినేతలు అనిల్ చలమలశెట్టి, ఆయన భార్య స్వాతి. 2030 నాటికి ఒక గిగా వాట్ సామర్థ్యం గల సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని, 2040 నాటికి పర్యావరణ సమతుల్యతను నెట్ జీరో కార్బన్ స్థాయికి తీసుకురావాలనేది వారి లక్ష్యం. ఈ సంస్థ కర్నూలులో 15 వేల కోట్ల వ్యయంతో 5,410 మెగావాట్ల విద్యుత్ కేంద్ర నిర్మాణం తలపెట్టింది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్‌ని ఉత్పత్తి చేయడం వీరి ప్రాజెక్టు ప్రత్యేకత. పర్యావరణం కోసం పనిచేస్తాం: ఈ పురస్కారం మా టీమ్‌లో అందరికీ కలిపి సంయుక్తంగా ఇచ్చిన గౌరవం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా కార్య క్రమాలను ఇంకా ఇంకా కొనసాగిస్తాం. తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి స్వస్థలం కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలంలోని జనగామ గ్రామం. తల్లిదండ్రులు సుశీల, నారాయణ రెడ్డి. భవన నిర్మాణ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన సుభాష్‌రెడ్డి ఆరు కోట్ల రూపాయలతో బీబీపేట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనాన్ని అత్యాధునికంగా పునర్నిర్మించి ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమానికి ప్రేరణగా నిలిచారు. సీతారాంపల్లిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. నాణ్యతకు నా పనే గీటురాయి: దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాటి నాయకులలా మనం జీవితాలను త్యాగాలు చేయలేకపోయినా సమాజానికి మనకు చేతనైనంత సహాయం చేయాలనేది నా అభిమతం. రోడ్డు, స్కూలు బిల్డింగ్... ఏ పని చేసినా సరే... నాణ్యతకు నేనే గీటురాయి అన్నట్లుగా చేశాను. ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది. ఈ సర్వీస్‌ని ఇలాగే కొనసాగిస్తాను. అక్షత్ సరాఫ్ : (రాధా టీఎమ్‌టీ) – బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ లార్జ్ స్కేల్ 1960లో శ్రీ రాధేశ్యామ్ జీ షరాఫ్ టి.ఎమ్.టి. సంస్థను స్థాపించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హై క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుతున్నారు రాధా టి.ఎమ్.టి. కంపెనీ డైరెక్టర్ అక్షత్ షరాఫ్.హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఈ సంస్థ శంకరంపేట్, చిన్న శంకరంపేట్ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పాటునందిస్తోంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మొక్కలు నాటించడం, స్టీల్ ప్లాంట్లలో కాలుష్య నివారణకు కృషి చేస్తోంది. ఇదే బాధ్యతను కొనసాగిస్తాం: మా వంతు సామాజిక బాధ్యతగా విద్యారంగానికి తోడ్పాటునందిస్తున్నాం. ఈ అవార్డు స్ఫూర్తితో... మా సేవలను నాణ్యత తగ్గకుండా ఇలాగే కొనసాగిస్తామని తెలియచేస్తున్నాను. పి.జ్ఞానేశ్వర్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ – ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్ జువాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. తాను పుట్టిపెరిగిన గ్రామంలో పచ్చదనం తగ్గిపోవడం, మంజీరా నదీతీరం కళ తప్పడం చూసి పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి వివరిస్తున్నారు. పిల్లలను గ్రీన్ బ్రిగేడ్‌గా తయారుచేసి వారి చేత మొక్కలు నాటిస్తున్నారు. ఎర్త్ లీడర్లను తయారు చేస్తాను: మంజీర నది ఎండిపోయి నీరు లేక పక్షులు చనిపోయాయి. చెట్లు ఎండిపోయాయి. నా వంతుగా పరిరక్షణ బాధ్యత చేపట్టాలనుకుని, పర్యావరణవేత్తల సహకారంతో పనిచేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మంది ఎర్త్ లీడర్లను తయారు చేయాలనేది నా లక్ష్యం. నిఖత్ జరీన్ : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ – స్పోర్ట్స్ బాక్సింగ్ రింగులో పవర్ ఫుల్ పంచ్‌లతో విజృంభిస్తూ ఒక్కో పతకాన్ని ఒడిసిపట్టుకుంటూ తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన నిఖత్ జరీన్ 1996 జూన్ 14న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించింది. 13 సంవత్సరాల వయసులో తండ్రి వద్ద బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న నిఖత్, ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాన్ని అందుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. తల్లిగా గర్వపడుతున్నాను: మా అమ్మాయికి అవార్డు రావడం తల్లిగా నాకు ఎంత సంతోషంగా ఉంది. తను హైదరాబాద్‌లో లేదు. ఆమె తరఫున నేను అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి : యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు సృష్టిస్తు్తన్న ఈ అమలాపురం కుర్రాడు అంతర్జాతీయ పోటీల్లో రాకెట్లా దూసుకుపోతూ పతకాల పంట పండిస్తున్నాడు. చిరాగ్ శెట్టితో కలిసి భారత పురుషుల డబుల్స్ టీమ్‌లో సత్తా చాటుతున్నాడు. 2022లో జరిగిన థామస్ కప్‌లో స్వర్ణ పతకాన్ని, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకాన్నీ గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పాడు. సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథం, తల్లి రంగమణి సాక్షి ప్రోత్సాహాన్ని మరువలేం: మా అబ్బాయికి అర్జున అవార్డు వచ్చినప్పుడు ఎంత సంతోషించానో, ఇప్పుడూ అంతే సంతోషిస్తున్నాను.. మా సాత్విక్ క్రీడాప్రస్థానంలో తొలి నుంచి సాక్షి పత్రిక అండగా వెన్నంటే ఉందని చెప్పాలి. మా బాబు ఫైల్ తిరగేస్తే సాక్షి పత్రికలో వచ్చిన వార్తలే ఎక్కువగా ఉంటాయి. షేక్ సాదియా అల్మాస్ : యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (స్పోర్ట్స్) మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతోంది. పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ చాంపియన్ అయిన తండ్రిని చూసి ప్రేరణ పొందిన సాదియా పదవ తరగతి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించి ఒక్కో పతకం గెలుచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. మన దేశంలో జరిగిన పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 2021లో టర్కీలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో 57 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మన నేల మీద నాకు వచ్చిన గుర్తింపు, అందుతున్న గౌరవం ఇది. ఎంతో మంది క్రీడాకారులున్నారు. అంతమంది నుంచి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.∙ డాక్టర్ రామారెడ్డి కర్రి : ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ రాజమండ్రిలో మానస ఆస్పత్రిని స్థాపించి మానసిక వైద్యుడిగా దాదాపు 40 ఏళ్లుగా వైద్యం చేస్తూనే మరోవైపు పలు సామాజిక, సాంస్కృతిక, విద్యా, కళాసంస్థల్లో వివిధ పదవులు నిర్వహించారు రామారెడ్డి. మానసిక సమస్యలు, వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలపై పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు రూపొందించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అవార్డులు శక్తినిస్తాయి: మానసిక రుగ్మతల గురించి మన సమాజంలో సరైన అవగాహన లేని రోజుల్లో నా సర్వీస్ మొదలుపెట్టాను. నలభై రెండేళ్లలో దాదాపుగా ఒకటిన్నర లక్షల మంది తెలుగు వాళ్లకు స్వస్థత చేకూర్చగలిగాను. తెలుగు మీడియా సంస్థ నుంచి గుర్తింపు లభించడం సంతోషం. అవార్డులు మనసు మీద మనిషి మీద చాలా సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా బాగా పని చేయడానికి శక్తిని ఇస్తాయి. సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ పిల్లి: యంగ్ అచీవర్ ఆఫ్ ఇది ఇయర్ (ఎడ్యుకేషన్) తెనాలికి చెందిన ప్రియ మానస, రాజ్‌కుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్థ్ శ్రీవాత్సవ్, పసి వయసులోనే కంప్యూటర్స్‌లో ఆరితేరడంతో మాంటెగ్న్ కంపెనీ ఏడో తరగతిలోనే నెలకు 25 వేల జీతంతో ఐటీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇన్ఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్టుగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూనే అమెరికన్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో భూకంపాల రాకను ముందుగానే పసిగట్టే ప్రాజెక్టులో సీనియర్ ప్రొఫెసర్లతో కలిసి పరిశోధనలు చేస్తున్నాడు. ఎంత శ్రద్ధ పెడితే అంత నేర్చుకుంటాం: డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఈ తరానికి చాలా అవసరం. మనం ఎంత నేర్చుకుంటామనేది... నేర్చుకోవడానికి మనం పెట్టిన శ్రద్ధాసక్తులను, ప్రాక్టీస్‌ని బట్టి ఉంటుంది. పేరెంట్స్ సపోర్టు, పిల్లల ఆసక్తి కలిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి : తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి ఒకవైపు పేషంట్లకు చికిత్సలు, మరోవైపు పరిశోధనలతో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్ జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణకు ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు ఎ.ఐ.జీలో అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇస్తున్నారు. వైద్యుల త్యాగాలకు అంకితం: ఈ గౌరవం నాకు మాత్రమే దక్కుతున్న గుర్తింపు కాదు. మా డాక్టర్లందరికీ అందిన పురస్కారం. కోవిడ్ సమయంలో లక్షలాది పేషెంట్లకు వైద్య సేవలందించడంలోనూ, వ్యాక్సిన్ తయారీకి సహకారంలోనూ డాక్టర్ల భాగస్వామ్యం మరువలేనిది. ఈ అవార్డు... కోవిడ్ విధుల్లో భాగంగా అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలిన డాక్టర్లకు, వారి త్యాగాలకు అంకితం. రవి పులి: తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన రవి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో వాషింగ్టన్లో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్‌కి వ్యవస్థాపక సీఈఓగా ఉన్నారు. అమెరికాలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇండియాలోని వారికి సేవలందిస్తున్నారు. వీటి ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం వేచి చూడకుండా.. ఎంట్రప్రెన్యూర్‌గా మారడానికి గైడె¯Œ ్స, మెంటార్షిప్ ఇవ్వడంతోపాటు కావాల్సిన పెట్టుబడి అందేలా సహకరిస్తున్నారు. కరోనా కాలంలో రవి చేసిన సాయం ఎంతోమంది తెలుగు వారిని సొంతగూటికి చేర్చింది. అంత కష్టం వద్దు: పాతికేళ్ల కిందట నేను యూఎస్‌కి వెళ్లినప్పుడు వీసా వంటి ఇతర వివరాల కోసం గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేక చాలా కష్టపడ్డాను. అందుకే విదేశాలకు వచ్చే విద్యార్థులకు ఇరవై ఏళ్లుగా సలహాలిస్తున్నాను. ప్రోత్సహిస్తున్నాను. దీన్ని గుర్తించి అవార్డు ఇవ్వడం మరికొందరికి స్ఫూర్తినిస్తుంది. సాక్షికి కృతజ్ఞతలు. కారింగుల ప్రణయ్: యంగ్ ఎచీవర్ ఆఫ్ ది ఇయర్ (సోషల్ సర్వీస్) అదిలాబాద్ జిల్లాకు చెందిన కారింగుల ప్రణయ్ సామాజిక స్పృహ కలిగిన తనలాంటి యువకులతో కలిసి స్వాస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా 11 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ...వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. పేద కుటుంబాల పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం.. వారి చదువులకు తగిన ఆర్థిక భరోసా కల్పించడం, దివ్యాంగులు తమ కాళ్లపై తాము నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ క్యాంపులు పెట్టి వారికి శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలతో తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. మా గ్రామాలకు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం: పోషకాహారలోపంతో బతుకీడ్చే ఆదివాసీ మహిళలు, పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనిపించి స్వాస్ను స్థాపించాం. మొదలు పెట్టేనాటికి మా బృందంలో ఉన్నది పదిమందికి లోపే. ఇప్పుడు 700 మంది సేవలందిస్తున్నారు. ఇది మా అందరి సేవలకు అందిన పురస్కారం. సుంకరి చిన్నప్పల నాయుడు, సుజాత : బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ (స్మాల్, మీడియమ్) షీమాక్స్ ఎక్స్పర్ టెక్నోక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఎండీ సుంకరి చిన్నప్పల నాయుడు. పట్టణ యువతతో సమానంగా గ్రామీణ యువతకూ ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటివరకు 300 మంది గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి, సామాజిక బాధ్యతను పంచుకుంటున్నారు. ఈ జ్ఞాపిక ఉత్తేజాన్నిస్తుంది: చిన్న చిన్న సంస్థలకు ఆదర్శంగా మమ్మల్ని చూపించాలనుకోవడమే ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ అవార్డు నాలో ఉత్సాహాన్ని పెంచింది. భవిష్యత్తులో ఎప్పుడైనా నైరాశ్యానికి లోనైనా సరే ఈ జ్ఞాపికను చూడగానే ఉత్తేజం వస్తుంది. కె. లీలా లక్షా్మరెడ్డి : ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఎన్జీఓ గ్రీన్ రివల్యూషన్) కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సంస్థ కె.లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన 2010లో ఏర్పాటైంది. నాటినుంచి మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. రెండు రాష్ట్రాల్లో 14 జిల్లాల్లో కలిపి 12,485 గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటించారు. ఇప్పటివరకు 3,500 పాఠశాలలు, సుమారు 9 లక్షల మంది విద్యార్థులు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సేవకు పట్టం కడుతోంది: సమాజంలో సేవ చేసే వాళ్లను గుర్తించి, గౌరవించడం చాలా కష్టమైన విషయం. క్లిష్టమైనది కూడా. అలాంటిది ‘సేవకు పట్టం’ కట్టడాన్ని బాధ్యతగా తలకెత్తుకుంది. ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా çకొనసాగిస్తున్న సాక్షికి అభినందనలు. చిన్నాలమ్మ: స్పెషల్ రికగ్నిషన్ ఇన్ ఫార్మింగ్ కొండ మీదినుంచి పారుతున్న నీటి ప్రవాహాన్ని తమ పొలాలకు మళ్లించిన 75 ఏళ్ల ఈ బామ్మ పేరు చిన్నాలమ్మ. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిమిడిపల్లి గ్రామంలో నివసిస్తున్న దాదాపు 500 కుటుంబాల కోసం తన పెన్షన్ డబ్బులతో పాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువపెట్టి తెచ్చిన సొమ్ముకు గ్రామస్థుల భాగస్వామ్యంతో కాలువకు ఇరువైపులా కాంక్రీట్‌తో గట్లు నిర్మించుకునేలా చేసింది చిన్నాలమ్మ. ఈ చెక్‌డ్యామ్ వల్ల ఆ పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. నీటిని నిలుపుకున్నాం: ఊరందరికీ వ్యవసాయమే ఆధారం. పంట పండేనాటికి తుపానులొచ్చి వరదలో పంట కొట్టుకుపోతూ ఉంటే ఎన్నాళ్లని చూస్తూ ఉంటాం; నీళ్లు నిలుపుకునే వీల్లేకపోవడంతో పొలాలు బీడు పెట్టాల్సి వచ్చేది. దాంతో మా సొంత డబ్బుతో చెక్ డ్యామ్‌లు కట్టుకున్నాం. మరో ఐదారు ఊళ్ల వాళ్ల పంటలూ నిలిచేటట్లు డ్యామ్‌లు కట్టాం. అందుకు గుర్తుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. కూరెళ్ళ విఠలాచార్య : జ్యూరీ ప్రత్యేక గుర్తింపు ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామం. పుస్తకాలు కొనలేక ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ఉద్యోగ విరమణ తరువాత 2014లో వెల్లంకి గ్రామంలో ప్రారంభించిన ఈ లైబ్రరీలో రెండు లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. విఠలాచార్య చేసిన కృషిని భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఆశ్చర్యం కలిగించింది: నేను స్థాపించిన ఈ గ్రంథాలయానికి రీసెర్చ్ స్కాలర్లు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వస్తుంటారు. ఎక్కడో మారుమూల పల్లెలో నా పని నేను చేసుకుంటూ ఉంటే ఆ సంగతి ఎలా తెలిసిందో ఏమో గానీ ప్రధాని నా గురించి మాట్లాడటం, సాక్షి పత్రిక వాళ్లు అవార్డుతో సత్కరించడానికి ఆహ్వానించడం ఆశ్చర్యంగా ఉంది. ఎనభై ఐదేళ్ల వయసులో ఇంతకంటే పెద్ద సంతోషాలు ఇంకేం కావాలి? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాలడుగు జ్ఞానేశ్వర్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
అమర జవాన్ జశ్వంత్ రెడ్డి ఫ్యామిలీకి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంబోడియాకు ఉద్యోగం కోసం వెళ్లిన తాము నరక కూపం నుంచి బయటపడ్డామని.. తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. ఇది తమకు పునర్జన్మ అని.. ఐదుగురు యువకులు వెల్లడించారు. గురువారం ఉదయం కరీంనగర్‌కు చేరుకున్నాక యువకులు ఉద్వేగానికి లోనయ్యారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా తమ ఆవేదనను పంచుకున్నారు. ఎన్నో ఆశలతో కాంబోడియాలో అడుగుపెట్టిన తమకు వెళ్లగానే ఆశలు ఆవిరయ్యాయన్నారు. అక్కడ కంపెనీ నిర్వాహకులు తమ పాస్‌పోర్టులు లాక్కుని, సైబర్ నేరాలు చేయాలని తొలిరోజే ఒత్తిడి తెచ్చారన్నారు. చేతిలో పాస్‌పోర్టులు లేక, ఎవరిని సంప్రదించాలో తెలియక, ఆకలితో నకనకలాడుతూ తాము ఎంతో మానసికవేదన అనుభవించామన్నారు. బయటికి వెళదామని ప్రయత్నించినా.. తమను చుట్టూ ఎత్తైన గోడలు, వాటికి కరెంటు కంచెలు, భారీ భద్రత నడుమ తమను బంధీ చేశారన్న విషయం తెలుసుకుని మరింత కుంగిపోయామని వాపోయారు. కానీ..‘సాక్షి’ చొరవతో ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేసి తిరిగి తమను మాతృభూమిని చేరేలా చేశాయన్నారు. ‘సాక్షి’కి తాము ఎంతో రుణపడి ఉంటామని వివరించారు. ఈ సందర్భంగా ఐదుగురు యువకులు కాంబోడియాలో చైనా సైబర్ స్కాం ముఠా చేతిలో అనుభవించిన బాధలను పంచుకున్నారు. భారతీయులు చాలామంది ఉన్నారు మాలాగే ఉపాధి ఆశతో అక్కడ సైబర్ నేరస్తుల ముఠా చేతిలో పడిన వారు చాలామంది ఉన్నారు. ఇండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన అనేకమంది అమాయకులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. అందరితో ఇవే పనులు చేయిస్తున్నారు. ఎదురుతిరిగితే ఇక అంతే సంగతులు. బంధీలకు ఆత్మహత్య తప్ప మరే గత్యంతరమే లేదు. –షారూఖ్‌ఖాన్ ఏజెంట్లు గోల్మాల్ చేశారు మా విషయంలో ఇద్దరు ఏజెంట్లు గోల్మాల్ చేశారు. మమ్మల్ని కాంబోడియా చేర్చగానే విషయం అర్థమైంది. మమ్మల్ని అబ్దుల్ నుంచి అమెరికన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశామని చైనీయులు చెప్పారు. వచ్చీరాని ఇంగ్లిష్‌లో తాము చెల్లించిన డబ్బులు కట్టే వరకు విడిచి పెట్టమంటూ ఒక గదిలో బంధించారు. – నవీద్ సెల్‌ఫోన్ తాకట్టుపెట్టాను మేం వెళ్లిన తొలిరోజు నుంచే చైనీయులు మమ్మల్ని నేరాలు చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. మేము ససే మీరా అంటే వారు వినిపించుకోలేదు. చివరికి మమ్మల్ని ఆ చెర నుంచి విడిపించిన రోజు మా చేతుల్లో చిల్విగవ్వలేదు. దీంతో నేను నా సెల్‌ఫోన్‌ను తాకట్టుపెట్టాను. ఆకలి ఇబ్బంది పెడుతున్నా మేం కడుపునింపుకోలేదు. ఆ డబ్బులతో మా చిన్నచిన్న ఖర్చులు భరించుకున్నాం. – షాబాజ్‌ఖాన్ మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది మేం వెళ్లగానే మా పాస్‌పోర్టులు లాగేసుకున్నారు. చెప్పినట్లు చేయాలని బెది రింపులకు దిగారు. ఉద్యోగానికి బదులు బెదిరింపులు రాగానే.. మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది. ఇక అక్కడ నుంచి బయటపడటం గగనమే అనుకున్నాం. సైబర్ నేరాలు చేయలేక, అక్కడ నుంచి బయటపడే మార్గం లేక నరక యాతన అనుభవించాం. – సలీమ్ హోటల్ వైఫైతో వీడియో పంపాం చైనీయుల ఆఫీసులో బంధీ కాగానే తొలుత ఆందోళన చెందాం. డబ్బులు కడితేగానీ పంపేదిలేదని చైనీయులు తెగేసి చెప్పడంతో భయపడ్డాం. తిరిగి ఇల్లు చూస్తామనుకోలేదు. హోటల్ వైఫై పాస్ వర్డ్ తెలుసుకుని వెంటనే మా దయనీయ స్థితి ని వివరిస్తూ వీడియో చేసి ‘సాక్షి’కి పంపించాం. అదే మమ్మల్ని కాపాడింది. – హాజీబాబా -
ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడడంలో ‘సీటు బెల్టు’ కీలక పాత్ర
మితిమీరిన వేగం.. సీటు బెల్టు ధరించడంలో నిర్లక్ష్యం.. ఇవీ స్థూలంగా కార్ల వంటి తేలికపాటి వాహన ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు వెనుక సీట్లో కూర్చున్నప్పటికీ సీటు బెల్టు ధరించకపోవడం వల్లే ఆయన దుర్మరణం చెందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీటు బెల్టు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాద సమయంలో సీటు బెల్టు పనితీరు, సీటు బెల్టు–ఎయిర్‌బ్యాగ్‌ల అనుసంధానం, ఒక్కోసారి సీటుబెల్టు పెట్టుకున్నా ప్రమాదాల్లో మృతిచెందేందుకు ఉన్న అవకాశాల వంటి వాటిపై కథనం. సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు.. కార్ల వంటి ఇతర వాహనదారులు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి. కానీ దేశంలో ఎక్కడా ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల జరిమానాలకు భయపడి సీటు బెల్ట్‌లు ధరిస్తున్నా హైవేలపై ప్రయాణాల్లో మాత్రం చాలా మంది సీటు బెల్ట్‌లు పెట్టుకోవడంలేదు. కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొనే వారు మినహా మిగిలిన వారు వాటిని ఉపయోగించట్లేదు. ఫలితంగా ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. సీటు బెల్ట్ ధరించకపోతే అలారం మోగేలా కార్ల తయారీ కంపెనీలు సాంకేతికతను అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి చాలా మంది సీట్ బెల్ట్ బకెల్ను దాని సాకెట్లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. దీని కోసం సీట్ బెల్ట్ అలారం స్టాపర్ బకెల్స్ను వినియోగిస్తున్నారు. వాటిని కార్ డెకార్స్ దుకాణాలు విక్రయిస్తున్నాయి. అయితే ఈ బకెల్స్ ద్వారా అలారం మోగకుండా ఆపినా ప్రమాదం జరగకుండా ఆపలేవని పోలీసులు చెబుతున్నారు. ప్రాణాలు నిలిపిన ‘బెల్ట్’... ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో సీటుబెల్ట్ పెట్టుకోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. బెల్ట్ వాడని ఫలితం.. వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరో ముగ్గురితో కలసి 4న అహ్మదాబాద్–ముంబై హైవేపై వెళ్తుండగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ హైఎండ్ కారు ప్రమాదానికి గురైంది. ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సీటు బెల్టు ధరించిన ముందు సీట్లోని ఇద్దరు గాయాలతో బయటపడగా వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ, మరొకరు సీటు బెల్టు ధరించకపోవడంతో మృతిచెందారు. సీటు బెల్ట్ ధరించకుంటే.. ► నిర్ణీత వేగంతో వెళ్తున్న కారులో ప్రయాణికులు స్థిరంగా కూర్చున్నప్పటికీ వాహనం దేన్నయినా గుద్దుకున్నా లేదా హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా అందులోని వారు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ► ఫలితంగా వాళ్లు డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు), ముందు సీట్ల మధ్యలో ఉన్న ఖాళీ నుంచి అద్దం తదితరాలను అత్యంత వేగంగా ఢీకొంటారు. ► ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి లేదా డోర్ ఊడిపోతే అందులోంచి బయటకు ఎగిరి పడతారు. ఫలితంగా తల, ముఖం తదితర చోట్ల తీవ్ర గాయాలై మరణిస్తుంటారు. సీటు బెల్ట్ ధరిస్తే.. ► సీటు బెల్ట్ ధరించి ప్రయాణిస్తుప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నా లేదా కారు పల్టీలు కొట్టినా లేదా ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వచ్చినా ప్రయాణికులు వాహనంలోంచి ఎగిరిపడిపోకుండా కాపాడుతుంది. ► ముఖ్యంగా ప్రయాణికులు డ్యాష్ బోర్డు లేదా ముందు సీట్లకు గుద్దుకోకుండా సీటు బెల్ట్ వ్యతిరేక శక్తిని ప్రయోగిస్తుంది. ► ఫలితంగా ప్రయాణికులు కేవలం గాయాలతో బయటపడేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ► 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన సతీమణి, డ్రైవర్ అక్కడికక్కడే కన్నుమూశారు. సీటు బెల్ట్ పెట్టుకున్న వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్కోసారి ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నా... అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ఉండే హైఎండ్ కార్లు సైతం కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల ప్రాణాలు కాపడలేవని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన వేగమే అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కొన్ని ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ సెన్సర్లు యాక్టివేట్ అయి, తెరుచుకోవడానికి కొంత సమయం పడుతుందని.. సాధారణంగా ఇది 0.05 సెకన్లుగా ఉంటుందని పేర్కొంటున్నారు. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయంలోపే డ్రైవర్ స్టీరింగ్ వరకు, పక్క సీటులో ఉన్న వారు డాష్‌బోర్డ్ వరకు ప్రయాణించి బలంగా ఢీకొనడం జరిగిపోతుందని వివరిస్తున్నారు. స్పందించేందుకు సమయం... ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఏవైనా ముప్పు కనిపించినప్పుడు స్పందించి బ్రేక్ వేయడానికో లేదా పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీన్నే సాంకేతికంగా రెస్పాన్స్ టైమ్ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి పట్టే సమయమింది. ఈ మధ్యలోనే వాహనం కొంత మేర ముందుకు ప్రయాణించేస్తుంది. ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీలు అనేకం.. హైఎండ్ కార్లలో ఎయిర్ బ్యాగ్‌కు–సీట్ బెల్ట్‌కు మధ్య లింకు ఉంటోంది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అవి తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. ఇవి ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ (ఏసీయూ)కు అనుసంధానమై ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒత్తిడి కారణంగా ఇవన్నీ యాక్టివేట్ అయి ఓ యాంగిల్ ఏర్పరుచుకుని ఏసీయూకు సందేశం ఇవ్వడంతో అది బెలూన్ను యాక్టివేట్ చేసి తెరుచుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ సెకనులోపు సమయంలోనే జరిగిపోతుంది. సీటు బెల్ట్‌లు పెట్టుకోకపోతే కొన్ని వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్ యాక్టివేట్ కావు. -
వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం..సాక్షి ఫోటో జర్నలిస్టులకు సన్మానం
-
commonwealth games 2022: ‘నా ఆనందానికి హద్దుల్లేవు’
శరత్ కమల్ తొలి కామన్వెల్త్ పతకం గెలిచినప్పుడు ఆకుల శ్రీజ వయసు 8 ఏళ్లు! ఇప్పుడు అలాంటి దిగ్గజం భాగస్వామిగా కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగిన శ్రీజ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పాల్గొన్న తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది తొలిసారి సీనియర్ స్థాయిలో జాతీయ చాంపియన్‌గా నిలిచిన శ్రీజ దురదృష్టవశాత్తూ సింగిల్స్ విభాగంలో నాలుగో స్థానానికే పరిమితమైనా... 24 ఏళ్ల వయసులోనే తొలి పతకంతో ఈ హైదరాబాద్ అమ్మాయి భవిష్యత్తుపై ఆశలు రేపింది. విజయం సాధించిన అనంతరం బర్మింగ్‌హామ్ నుంచి ‘సాక్షి’తో ఆనందం పంచుకుంటూ శ్రీజ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ‘సింగిల్స్ కాంస్య పతక పోరులో ఓటమితో చాలా బాధపడ్డాను. ఎంతో పోరాడిన తర్వాత ఓడిపోవడంతో విపరీతంగా ఏడ్చేశాను. ఈ సమయంలో శరత్ అన్నయ్య నన్ను సముదాయించారు. నువ్వు చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. మిక్స్‌డ్‌లో ఇంకా ఫైనల్ మిగిలే ఉంది. మనం స్వర్ణానికి గురి పెడదాం అని చెప్పారు. అప్పటికే సెమీస్ వరకు అన్న నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. తెలుగులోనే మేం మాట్లాడుకునేవాళ్లం. నాకంటే ఎంతో సీనియర్ అయిన ఆయన ప్రతీ మ్యాచ్‌లో, ప్రతీ పాయింట్‌కు అండగా నిలిచారు. ఏమాత్రం ఆందోళన వద్దు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చారు. చివరకు నేను పాయింట్ చేజార్చినా ఆయనే సారీ చెప్పేవారు. 2019లో ఒకసారి శరత్ అన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడాను. నా కోచ్ సోమ్‌నాథ్ ఘోష్‌కు శరత్ అన్నతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆ చొరవతోనే ఈ సారి కామన్వెల్త్ క్రీడలకు ముందు నాతో కలిసి ఆడితే బాగుంటుందని ఆయన అన్నకు సూచించారు. దీనికి ఆయన ఒప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తితో కలిసి ఇప్పుడు పతకమే గెలవడం చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా శరత్ అన్న... ఇప్పటి వరకు నాకు సరైన భాగస్వామి లేక మిక్స్డ్ పతకం లోటుగా ఉండేది. ఇప్పుడు నీతో కలిసి ఆడాక అది దక్కింది, థాంక్యూ అని చెప్పడం ఎప్పటికి మరచిపోలేను’ -
ఉల్లాసంగా సాక్షి నీట్ మాక్ టెస్ట్ (పోటోలు)
-
సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..?
-
ఉద్యోగులు అర్థం చేసుకున్నారు.. చంద్రబాబుకే బాధ
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారితో అతలాకుతలం అవుతున్నా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగులకు 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఉద్యోగులు సంతోషంగా స్వీకరించారని, తెగ బాధ పడుతున్నదల్లా చంద్రబాబు, ఆయన వర్గం మాత్రమేనని అన్నారు. జోగి రమేష్ మంగళవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 14.29 శాతం ఫిట్మెంట్ ప్రకటించినా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులు సంతోషంగా ఉండాలని 23 శాతం ఇచ్చిందన్నారు. అయినా చంద్రబాబు, పచ్చ మీడియాకు ఎందుకంత ఇబ్బంది అని ప్రశ్నించారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియా రెచ్చగొడుతున్నాయని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 1.35 లక్షల మందికి వారుండే ప్రాంతాల్లోనే ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు. ఉద్యోగాలిచ్చి, గౌరవించిన దేవుడు జగన్ అని వారు గర్వంగా చెబుతున్నారని చెప్పారు. ఎన్ని డిబేట్స్ పెట్టినా, చంద్రజ్యోతి, చంద్రనాడు పేపర్లలో వార్తలు రాసినా వారు రెచ్చిపోరని, అలా అనుకొంటే అది బాబు అవివేకమేనని చెప్పారు. ముందు హెరిటేజ్‌లో ధరలు తగ్గించండి ముందు హెరిటేజ్‌లో ధరలు తగ్గించి, తర్వాత నిత్యావసర వస్తువుల ధరలపై చంద్రబాబు రోడ్ల మీదకు రావాలని చెప్పారు. కేంద్రం రెండున్నరేళ్ళుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పోతే, రవాణా చార్జీలు పెరిగి, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. అసలు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు అండ్ కో ప్రశ్నించదని అన్నారు. పెరిగేది కొంత అయితే, చంద్రబాబు రెట్టింపు రేట్లు చెప్పారన్నారు. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు మార్కెట్‌ను విచ్ఛిన్నం చేస్తూ హెరిటేజ్, ప్రియా సంస్థల్లో వస్తువులు అధిక ధరలకు అమ్ముకుంటారని, మరోవైపు సిగ్గు లేకుండా ప్రభుత్వం మీద, సీఎం మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సంక్రాంతి వేళ అయినా పది నిజాలు చెబితే బాబుకు నరకంలో పడే శిక్షలో పది శాతం రిబేటు ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలతో సమ సమాజం కోసం సీఎం జగన్ తపన పడుతుంటే.., బాబు మాత్రం ఆయన సామాజికవర్గం కోసం ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. సాక్షి ఉండకూడదన్నది బాబు కోరిక సాక్షిలో పెట్టుబడుల్ని పెట్టుబడులుగా కాకుండా, ఆదాయంగా పరిగణిస్తున్నామని గతంలో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్ దుర్మార్గమైన వ్యవహారం చేసిందన్నారు. అది సరికాదని ఇన్‌కంట్యాక్స్ ట్రైబ్యునల్ అభిప్రాయపడితే, దాన్ని కూడా చంద్రబాబు విమర్శించారన్నారు. ట్రైబ్యునల్ అభిప్రాయంతో చంద్రబాబుకు వంట్లో గ్యాస్ తంతోందని, ఆ గ్యాస్‌తో ఊగిపోతున్నారని అన్నారు. చంద్రబాబు అక్కసంతా సాక్షి పత్రిక మీదనేనని, ఆ పత్రిక ఉండకూడదనే కోరిక అని అన్నారు. -
పుడమి సాక్షిగా..
-
‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ గా డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి
విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ రెడ్డి అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్.వి మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో యు.ఎస్.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. యు.ఎస్.లో టాప్–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. ఒక చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. -
Aligireddy Praveen Reddy: రైతు బిడ్డకు సాక్షి పురస్కారం..
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఫామింగ్’ అవార్డును ములుకనూరు సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అందుకున్నారు. ప్రవీణ్‌రెడ్డి రైతు బాంధవుడు. అరవై ఏళ్ల ‘యువ’ కర్షకుడు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామ రైతుబిడ్డ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి. వ్యవసాయంలో డిగ్రీ చదివారు. మేనేజ్మెంట్లో పీజీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రైతు సంక్షేమ సంస్థలకు ప్రవీణ్‌రెడ్డి ప్రెసిడెంటుగా, వైస్ ప్రెసిడెంటుగా ఉన్నారు. ఆసియాలోని ఉత్తమ సహకార సంఘాలలో ములుకనూరు సొసైటీ ఒకటి. ఆ సొసైటీకి 1987 నుంచీ ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. సొసైటీ తరఫున 18 గ్రామాల్లోని 7,600 మంది రైతులకు సమగ్ర సేవలు అందిస్తున్నారు. ఆ సొసైటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు ప్రవీణ్ రెడ్డి. రైతు సాయానికి భరోసా గత 62 ఏళ్ళ నుంచి రైతులకు అండదండగా ఉన్నాం. మా ప్రాంతంలో ఒక్క రైతు ఆత్మహత్య కూడా సంభవించలేదు. ఈ కృషిని సాక్షి గుర్తించడం ఎంతో సంతోషం సంతృప్తి ఇచ్చింది. ఈ స్ఫూర్తితో ఆర్ధికంగా బలోపేతం అయేందుకు గ్రామీణ ప్రాంత రైతులకి మరింతగా సహకారం అందిస్తాం. – అలిగెరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ప్రెసిడెంట్, ముల్కనూర్ కో ఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ -
‘మనం’ మారితేనే మనుగడ!
దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జఠిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో గ్రీన్ పార్టీ రాజకీయాలు మొదలయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దిశ మార్చు కుంటున్న సంధి కాలమిది! పునరుత్పాదక ఇంధనాలు, నికర శూన్య ఉద్గారాలు, పచ్చ పెట్టుబడులు, వాతావరణ బడ్జెట్లు, హరిత ఆర్థిక వ్యవస్థలు .... వంటి ఆధునిక పదజాలం తెరపైకి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్న సంక్లిష్ట సమయం. ప్రకృతిలో మానవ ప్రమేయపు అలజడి, భూగ్రహంపై మనిషి మనుగడ పెంచిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! అది సృష్టిస్తున్న అనేక రూపాల కాలుష్యం ‘వాతావరణ మార్పు’గా ఉపద్రవమై ముంచుకు వచ్చింది. భూతాపోన్నతి పెరుగుతూ ఎండలు, వానలు, వరదలు, కార్చిచ్చులు... అన్నీ పరిమితులు దాటి విలయం సృష్టిస్తు న్నాయి. సరికొత్త వైరస్లు మానవాళి ఉనికినే ఊగిసలాటలోకి నెడుతు న్నాయి. ఇందుకు కోవిడ్–19 తార్కాణం! ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. లోతట్టు దీవులతో పాటు తీర నగరాలూ ప్రమాదంలో పడ్డాయి. అంచనాకు మించిన వేగంతో విధ్వంసం కమ్ముకొస్తోంది. ‘వెనక్కి తిరిగి సరిదిద్దుకునే వీలులేని అన ర్థాలు జరిగిపోతున్నాయ’ని ఐక్యరాజ్యసమితి (యూన్) తాజా నివేదిక హెచ్చరించింది. దక్షిణాసియా దేశాలకు ముప్పు ఎక్కువుంది. పర్యా వరణం ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యకర్తలు.. అనే దశ దాటి అందరి నోళ్లలోనూ నిత్యం నానుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగి, కొడు తున్న దెబ్బలు ‘తమ దాకా వస్తే గాని...’ జనాల్లో కదలిక రాలేదు! పాలనాపీఠాలు అధిష్టించిన రాజకీయ వ్యవస్థలే ప్రాధాన్యాంశంగా ఇంకా ఎజెండాపైకి తేవటం లేదు. ఇప్పుడిక అనివార్యం! అభివృద్ది చెందుతున్న ఓ పెద్ద దేశంగా భారత్ నేడు కీలక స్థానంలో ఉంది. ఆరేళ్ల కిందటి పారిస్ ఒప్పందాల నుంచి సాగుతున్న ప్రయాణంలో... ఇచ్చిన హామీల అమలు, ఫలాలు, వైఫల్యాలు, మున్ముందరి సవాళ్లు– అవకాశాలను ప్రపంచమంతా సమీక్షించుకునే ‘భాగస్వాముల సదస్సు’ (కాప్26) వైపు అడుగులు పడుతున్నాయి. గ్లాస్గో (నవంబరు1–12)లో జరిగే ఈ సదస్సునాటికి చాలా విషయాల్లో మనం విధాన నిర్ణయాలతో సన్నద్ధం కావాలి. పరిష్కారంలో భాగమైతేనే... వాతావరణ సంక్షోభంలో మన పరిస్థితి సంక్లిష్టమే! భారత భూభా గంలో 65 శాతం కరువు ప్రభావిత ప్రాంతం, 12 శాతం భూమి వరదలు, 8 శాతం భూభాగం తుఫాన్ల ప్రభావితం. దీనికి తోడు భూతాపోన్నతికి కరుగుతున్న మంచు పర్వతశ్రేణి, హిమాలయాలు ఉత్తర సరిహద్దులుగా ఉన్న దేశం. మేఘ విచ్ఛిత్తితో కుండపోత వర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే విధ్వంసాలు ఇప్పటికే పెచ్చుమీరాయి. ‘వాతావరణ మార్పుల’పై యూఎన్ ఏర్పాటు చేసిన అంతర్ ప్రభుత్వ వేదిక (ఐపీసీసీ) ఆరో నివేదిక ప్రకారం మిగతా సముద్రాల కన్నా హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం మనకు అరిష్టం. వేడి గాలులే కాకుండా రుతుపవనాలను, వ్యవసాయ పరిస్థితుల్నీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. సుదీర్ఘ తీరం ఉండటంతో సముద్రమట్టాల పెరుగుదల ప్రమాదమౌతోంది. మన సముద్ర తీరంలోని ఖిదిర్పూర్ (కోల్‌కత), పారాదీప్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), ట్యూటీకొరిన్, చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), మంగళూరు (కర్ణాటక), మార్ముగోవా (గోవా), ముంబాయి (మహారాష్ట్ర), కండ్ల, ఓఖా, భావ్‌నగర్ (గుజరాత్) ఈ 12 నగరాలు/ పట్టణాలు జలమయమయ్యే ప్రమాద సంకేతాలున్నాయి. తాజా ఐపీసీసీ నివేదిక ఆధారంగా, ఈ శతాబ్ది అంతానికి ఇవి సుమారు మూడు అడుగుల మేర నీట మునిగే ప్రమాదముందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ విశ్లేషించింది. ‘వాతా వరణ మార్పు’ విశ్వవ్యాపితమైనా సమస్యలు, సంక్షోభాలు స్థానిక మైనవే! పరిష్కరాలను స్థానికంగా యోచించాలి. సమస్య తీవ్రత అధి కంగా ఉన్న దేశాల్లో ఉన్న మనం, బాధిత దేశమే అయినా.. సమస్యలో కన్నా పరిష్కారంలో భాగం కావాలి. పెద్దన్న పాత్ర పోషించాలి ప్రపంచంలో మనం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగాం. చైనా తర్వాత మనదే స్థానం! వాతావరణ కాలుష్యానికి, తద్వారా భూతాపో న్నతికి కారణమవుతున్న కర్భన ఉద్గారాల విడుదలలో మనది మూడో స్థానం. విద్యుత్ వినియోగంలో చైనా, అమెరికా, ఐరోపా సంఘం (ఈయూ) తర్వాత భారత్‌ది నాలుగో స్థానం! శిలాజ ఇంధనాల వినియోగమే 80 శాతం కర్బన ఉద్గారాలకు కారణం. ఆయా దేశాల ఇంధన విధానాలు, నూతన వైఖరులే వాతావరణ సంక్లిష్టతను నిర్దేశి స్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానం తరం, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత జరిగిన వాతావరణ నష్టమే అపారం. అభివృద్ధి చెందిన దేశాలు, ఆ క్రమంలో విడుదల చేసిన–చేస్తున్న ఉద్గారాలు, వెదజల్లిన కాలుష్యాలు, ప్రకృతివనరుల దోపిడీకి లెక్కేలేదు. ఇది నొక్కి చెబుతూ పారిస్ ఒప్పంద సమయంలో భారత్ క్రియాశీల పాత్ర పోషించింది. మారిన మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ రాజకీయార్థిక పరిణామాల నేపథ్యంలో, రానున్న కాలం లోనూ భారత్ పోషించాల్సింది కీలక భూమికే! మన వాణికి ఎక్కువ ఆదరణ! కర్బన ఉద్గారాల స్థాయిని బట్టి, అభివృద్ధి సమాజాల పాపమే అధికమైనప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలను ఆర్థికంగా, సాంకేతికంగా ఆదుకునేందుకు ఆయా దేశాలు ఉదారంగా ముందుకు రావడం లేదు. మన పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. మనం బాధితు లమైనా పరిష్కర్తలుగా ముందున్నాం. వాతావరణ సంక్షోభంలో... ‘కారణ’మైనదానికి నాలుగు రెట్లు ‘భారం’ మనం మోస్తున్నాం. విధానాలు మార్చుకోక తప్పదు! విద్యుదుత్పత్తి ఇంధన వనరుల వినియోగం తర్వాత కర్బన ఉద్గారా లకు, కాలుష్యానికి కారణమవుతున్న వాటిలో పౌర రవాణా, నిర్మాణ, ఉత్పత్తి, వస్తు రవాణా, సేవా తదితర రంగాలున్నాయి. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు ‘వాతావరణ మార్పు’ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉద్గారాలు, ఇతర కాలుష్యాల్ని నివారించేలా ప్రాధాన్య తలు మార్చాలి. ముఖ్యంగా శిలాజ ఇంధన వినియోగం తగ్గించాలి. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంతో కార్బన్డయాక్సైడ్ (సీవో2) విడుదలే కాక 80 శాతానికి మించి దిగుమతులే కనుక ఇదొక ఆర్థిక భారమే! ధరలు రమారమి తగ్గిన పరిస్థితుల్లో సౌర, పవన విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు మళ్లాలి. బొగ్గు వినియోగాన్నీ తగ్గించాలి. 2050 నాటికి కర్భన ఉద్గారాల నికర శూన్య స్థితి సాధిం చేందుకు మనం సంకల్పం తీసుకోవాలి. అవసరమైతే గ్లాస్గోలో ప్రకటించాలి. ఇప్పటికే 100 దేశాలు ప్రకటించాయి. ఇతర మెజారిటీ దేశాలు ఈ దిశలో నడిచేలా ఒత్తిడి పెంచాలి. శిలాజ ఇంధనాల వాడకం ఏటా 83 కోట్ల టన్నుల సీవో2 విడుదలకు కారణమవుతోంది. ఇది మారాలి! అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సూచించినట్టు సింగపూర్‌తో సహా ఇప్పటికే 40 దేశాలు కార్బన్ పన్ను విధిస్తున్నాయి. పన్ను ఏకరీతిలో ఉండాల్సిన పనిలేదు. ప్రపంచ సగటు కింద టన్ను సీఓ2 ఉత్పత్తికి 5 నుంచి 10 డాలర్లు పన్ను ఖరారు చేసి, భారత్‌లో (25), చైనాలో (50), అమెరికాలో (70 డాలర్లు) ఇలా, విభిన్నంగానూ ప్రతిపాదించవచ్చు. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహించాలి. వాతావరణ మార్పును తట్టుకునే సామ ర్థ్యాల కోసం వెచ్చిస్తున్న (ఎన్‌ఏఎఫ్‌సీసీ) నిధులు పెంచాలి. తమ వాటా చెల్లించి, రాష్ట్రాలు గరిష్టంగా వినియోగించుకునేలా చూడాలి. దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జటిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో హరిత పక్ష (గ్రీన్ పార్టీ) రాజకీయాలు మొద లయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ఈమెయిల్:dileepreddy@sakshi.com -
ఎస్ఆర్ఎం వర్సిటీ, ‘సాక్షి’ వెబినార్‌కు మంచి స్పందన
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్/సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సులకు దీటైన కెరీర్ అవకాశాలపై ఎస్ఆర్ఎం యూని వర్సిటీ – ఏపీ, ‘సాక్షి’ సంయుక్తంగా మంగళ వారం నిర్వహించిన వెబినార్‌కు మంచి స్పంద న లభించింది. ఇంటర్ తర్వాత అందుబాటు లో ఉన్న పలు కోర్సులపై వెబినార్‌లో విద్యా ర్థులకు నిపుణులు అవగాహన కల్పించారు. కోర్సుల ఎంపికలో జాగ్రత్తలు, వాటితో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థుల సందేహాలకు సమాధానాలిచ్చారు. వెబినార్‌లో ప్రముఖ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సత్య ప్రమోద్ జమ్మీ (మెకానికల్ ఇంజనీరింగ్), డాక్టర్ ఉమా మహేశ్వర్ ఆరేపల్లి (సివిల్ ఇంజనీరింగ్), డాక్టర్ సోమేశ్ వినాయక్ తివారీ (ఎలక్ట్రికల్అండ్ఎలక్ట్రానిక్స్ఇంజనీరింగ్), డాక్టర్ ఓంజీ పాండే (ఎల్రక్టానిక్స్–కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) పాల్గొన్నారు. ఈ పూర్తి వెబినార్‌ను https://youtube/db3Vh5L&u3o యూ ట్యూబ్ లింక్ ద్వారా చూడొచ్చు. -
‘సాక్షి ఎఫెక్ట్’.. ట్రాఫిక్ సమస్యకు చెక్..
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): వేములవాడలో రోడ్ల విస్తరణతోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం వస్తున్న భక్తులు, అవసరాల కోసం బయటకు వచ్చే స్థానికులతో వేములవాడ పట్టణంలోని రోడ్లు జన సమ్మర్థంగా మారుతున్నాయి. సోమవారం, పండుగల రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందలు అన్నీ.. ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘రోడ్ల విస్తరణ’ అంశంపై శుక్రవారం ‘జూమ్ డిబేట్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ చర్చలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తోపాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ హామీ ఇవ్వడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి చొరవ సమస్య పరిష్కారానికి ముందడుగు అని అభిప్రాయపడుతున్నారు. సమస్య పరిష్కారానికి ‘సాక్షి’ తీసుకున్న చొరవపై స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఆశలు చిగురించాయి వేములవాడలో ఇరుకైన రోడ్లతో బండిపై వెళ్లడం భయంగానే ఉంటుంది. ‘సాక్షి’ చేపట్టిన డిబేట్తోనైన పనులు చేపడతారని ఆశ చిగురించింది. ఎన్నో ఏళ్లుగా చెబుతున్నరు.. ఇప్పటికీ పనులు చేపట్టలేదు. – బి.నరేశ్, స్థానికుడు రోడ్లు వెడల్పు చేయాలి ఇరుకైన రోడ్లతో వేములవాడ ఎదుగుతలేదు. గుడితోని కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా.. రోడ్ల విస్తరణను పట్టించుకోవడం లేదు. – వి.రవి, చిరువ్యాపారి అధికారులు స్పందించాలి పెద్ద బజార్‌కు పోవాలంటేనే భయంగా ఉంటుంది. ఎటునుంచి ఎవరు వస్తరో అర్థం కాదు. ‘సాక్షి’ పేపరోళ్లు మంచి కార్యక్రమం ముందేసుకున్నరు. అధికారులు పనులు చేయాలి. – జి.మాధవి, గృహిణి, వేములవాడ ఎటు చూసినా సందులే.. నేను చిన్నగున్నప్పటి నుంచి సూత్తున్న ఈ రోడ్లు మారుతనే లేవు. కూరగాయలకు పోదామన్నా తిప్పలుగా ఉంది. – సీహెచ్.మల్లవ్వ, గృహిణి పాలకుల్లో మార్పు రావాలి నేను ఇక్కడే పుట్టి, పెరిగిన. రోడ్లు వెడల్పు చేస్తారని చిన్నప్పటి నుంచి అంటున్నరు. చాలా సార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినం. ‘సాక్షి’ చేపట్టిన డిబేట్ హర్షనీయం. ఇకనైన పాలకుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. – ఎండీ.ఖాజాపాషా, రిౖటైర్డ్ కండక్టర్, వేములవాడ కదలికలు మొదలయ్యాయి వేములవాడలో రోడ్ల విస్తరణపై ‘సాక్షి’లో కథనం చూసి ఆనందం వేసింది. అధికారుల్లో కదలికలు మొదలయ్యాయి. జూమ్ డిబేట్ ద్వారా ప్రజల అభిప్రాయాలను పాలకుల వద్దకు తీసుకొచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. వేములవాడలో వెంటనే రోడ్లు వెడల్పు చేపట్టాలి. – బింగి శ్రీనివాస్, ఎలక్ట్రీషియన్, వేములవాడ పేపర్ చూస్తే సంతోషమైంది వేములవాడ ప్రజలు, రాజన్న భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రోడ్ల విస్తరణ. ఈ సమస్యపై ఈరోజు ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనం చూస్తుంటే చాలా సంతోషమైంది. ఉమ్మడిరాష్ట్రంలో వేములవాడకు ఏమీ జరుగలేదు. కనీసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనైన రోడ్ల విస్తరణకు మోక్షం రాకపోవడం బాధాకరం. ఇప్పటికైన పాలకులు కాస్త స్పందించాలి. – చిలుక, రమేశ్, స్థానికుడు, వేములవాడ -
సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ ఓ ముందడుగు
సాక్షి, నెట్వర్క్: స్థానిక సమస్యల పరిష్కారానికి సాక్షి మీడియా గ్రూప్ మరో అడుగు ముందుకేసింది. అన్ని వనరులున్నా కాసింత చొరవ, ముందుచూపు లేకపోవటంతో కొనసాగుతున్న సమస్య లకు చెక్ చెప్పే ప్రయత్నంలో భాగంగా పౌర సమాజాన్ని, ప్రజాప్రతినిధులు, అధికారులను ఒకే వేదిక మీదకు తీసు కువచ్చింది. శుక్రవారం జూమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చర్చా వేదికలు నిర్వహించింది. ఆయా పట్టణాలు ఎదుర్కొంటున్న వరద ముంపు, చెత్త వంటి సమస్యల పరిష్కారం దిశగా చొరవ తీసుకుంది. పట్టణాల సమగ్ర అభివృద్ధితో పాటు కొత్త ఉపాధి అవకా శాలపై చర్చలు నిర్వహించింది. నిరుద్యోగుల ఉపాధికి ఇండస్ట్రియల్ పార్కులు: హరీశ్‌రావు సిద్దిపేటలో నిర్వహించిన డిబేట్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘వలసలు. కరువుల నుంచి బయటపడి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సస్యశ్యామల జిల్లాగా సిద్దిపేటను మార్చుకున్నాం. సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి పెట్టాం. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన నీరు, విద్యుత్, రవాణా లాంటి వసతులను ఒక్కొక్కటిగా కల్పిస్తున్నాం. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. అందుకు వెయ్యి ఎకరాల భూసేకరణ కూడా చేశాం. పరిశ్రమలకు ప్రత్యేక లేఔట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వర్గల్లో 1,200 ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం..’ అని హరీశ్‌రావు తెలిపారు. వరంగల్‌లో ‘ముంపు’పై ముందుచూపు గతేడాది ఇదే సీజన్లో భారీగా వచ్చిన వర్షాల కారణంగా వరంగల్ నగరంలో 33 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు సంభవించకుండా ఉండేందుకు వీలుగా ‘వరంగల్ ముంపు’పై శుక్రవారం చర్చ జరిగింది. న్యాయవాది పొట్లపల్లి వీరభద్రరావు, సామాజిక కార్యకర్తలు తిరునగర్ శేషు, పుల్లూరు సుధాకర్, రెడ్‌క్రాస్ చైర్మన్ విజయచందర్ రెడ్డి, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, గ్రేటర్ వరంగల్ సీఎంహెచ్వో రాజిరెడ్డి, గ్రేటర్ వరంగల్ డీఎఫ్ఓ కిశోర్ పాల్గొన్నారు. ప్రధానంగా వరంగల్ మహానగరంలో నాలాలు, గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాలు వెలియడం వల్ల చాలా కాలనీలు ముంపునకు గురవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. నగరంలో ఉన్న సుమారు 32 చెరువులు కుదించుకుపోగా, 12 వరకు నామరూపాలు లేకుండా పోయాయని వీరభద్రరావు, పుల్లూరు సుధాకర్ తదితరులు పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందించకుండా, ఆక్రమణలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు శాశ్యత ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ముంపునకు గురికాకుండా ఏమేమి చర్యలు చేపట్టాలో వెల్లడించారు. కాగా ముంపు ప్రాంతాల్లో గతేడాది ఎలాంటి చర్యల ద్వారా ప్రజలను ఆదుకున్నారు? ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నారు? తదితర అంశాలను సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, డీఎఫ్ఓ కిశోర్ వివరించారు. మౌలిక వసతులపైనా.. నిజామాబాద్ నగరంలో మౌలికవసతులు, నల్లగొండలో భూగర్భ డ్రైనేజీ, భువనగిరిలో ప్రధాన రహదారి , సంగారెడ్డిలో చెత్త డంపింగ్ యార్డు అంశాలపై, మహబూబ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ఉద్దేశించిన భారత్ మాల రహదారి నిర్మాణ అవాంతరాలపై చర్చ జరిగింది. -
ఇద్దరు సాక్షి ఉద్యోగుల మృతి
సాక్షి, దొండపర్తి (విశాఖదక్షిణ)/సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘సాక్షి’ దినపత్రిక ఉద్యోగులు ఇద్దరు శనివారం మృతి చెందారు. యాడ్స్ విభాగం ఏజీఎం అరుణ్‌కుమార్ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన పాతికేళ్లుగా ప్రధాన పత్రికల్లో యాడ్స్ విభాగంలో అనేక హోదాల్లో పనిచేశారు. సాక్షి దినపత్రిక ప్రారంభం నుంచి యాడ్స్ విభాగంలో పనిచేస్తూ ప్రస్తుతం ఏజీఎం హోదాలో ఉన్నారు. అరుణ్‌కుమార్ మృతి పట్ల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. అలాగే, జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ చెన్నై కార్యాలయంలో సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ మేనేజర్‌గా పనిచేస్తోన్న ఎస్.రాధాకృష్ణన్ (51) శనివారం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు డయాలసిస్ చేసుకోవాలని వైద్యులు సూచించారు. చెన్నైలోని ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో అది సాధ్యపడలేదు. కొందరి సహకారంతో పుదుచ్చేరి ఆసుపత్రిలో అపాయింట్మెంట్ తీసుకుని ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా పరిస్థితి విషమించింది. కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూశారు. -
ఎనీ డ్యూటీ.. వుయ్ డూ ఇట్
మహిళా పోలీసులు అంటే రిసెప్షన్, బందోబస్తులకే పరిమితం అనేది ఒకనాటి మాట. మహిళా పోలీసులు అంటే హోంగార్డు నుంచి డిజీ స్థాయి వరకు ఎక్కడ చూసినా వారే అనేది నేటి మాట. సెంట్రీ గార్డ్, పెట్రోలింగ్, డ్రైవర్ పోలీస్ స్టేషన్, సర్కిల్, సబ్‌డివిజన్ ‘ఎనీ డ్యూటీ.. వుయ్ డూ ఇట్’ అనే కాన్ఫిడెన్స్ మహిళా పోలీసుల్లో పెరిగిందని అంటూ పోలీసు శాఖలో మహిళా శక్తి గురించి ఐపీఎస్ ఆఫీసర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత ‘సాక్షి’కి వివరించారు. ‘‘గతంలో పోలీసు శాఖలో ఎక్కడో ఒక చోట మహిళా సిబ్బంది ఉండేవారు. ఏవైనా ఆందోళన ప్రదర్శనలు, వీఐపీల కార్యక్రమాలు ఉంటే మహిళల కోసం మహిళా పోలీసులను ఎక్కడెక్కడి నుంచో రప్పించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భద్రత విషయంలో వుమెన్ సేఫ్టీ వింగ్ తీసుకుంటున్న అనేక చర్యలు మహిళల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతున్నాయి. మహిళలు, విద్యార్థినులు, యువతులపై వేధింపులు, దాడులను నిరోధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘షీ టీం’ల ద్వారా పోలీసు శాఖ చాలా వరకు సక్సెస్ అయ్యింది. అలాగే వేధింపులు, దాడులకు గురైన మహిళలను చేరదీసి వారికి ధైర్యాన్ని కలిగించేందుకు ‘భరోసా’ కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. భారీగా మహిళల హాజరు ఇటీవల పోలీసు ఎస్సైతో పాటు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షకు భారీ సంఖ్యలో యువతులు హాజరయ్యారు. అందులో ఎంపికైన వారు ఎసై ్స, కానిస్టేబుల్ శిక్షణ కూడా పూర్తి చేసుకుని విధుల్లో చేరారు. మరోవైపు పోలీసు శాఖలో హోంగార్డు నుంచి అదనపు డీజీ స్థాయి వరకు మహిళా అధికారులు తమ పనితీరుతో గుర్తింపు పొందుతున్నారు. చాలా మంది మహిళా అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన శైలిలో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. శ్వేత, ఐపీఎస్ రాష్ట్రంలో అన్ని విభాగాలకు కలిపి 55 వేల మంది వరకు పోలీసులు ఉండగా, అందులో కానిస్టేబుల్ నుంచి అదనపు డీజీ స్థాయి వరకు 4,829 మంది ఉన్నారు. అలాగే 2 వేల మందికి పైగా హోంగార్డులుగా పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య ప్రస్తుతం 10 శాతానికి చేరింది. ఇంకా పెరగాల్సి ఉంది. ఇటీవల ప్రభుత్వం పోలీసు శాఖ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం కేటాయించిన మీదట వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో కొద్దిమంది మాత్రమే మహిళలు ఉన్న పోలీసు శాఖలో ఇప్పుడు దాదాపు ఏడు వేల పైచిలుకు మహిళా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. డ్రైవింగ్.. ఎనీ టైమ్.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైలు అందరికీ డ్రైవింగ్‌లో శిక్షణ ఉంటుంది. అవసరం ఏర్పడినపుడు వెహికిల్‌ను వారే స్వయంగా నడుపుకుని వెళ్లేలా శిక్షణ ఇస్తారు. మహిళా కానిస్టేబుళ్లు సెంట్రీ డ్యూటీతో పాటు బందోబస్తు డ్యూటీలు, డ్రైవింగ్, పెట్రోలింగ్, ట్రాఫిక్ డ్యూటీలన్నీ చేస్తున్నారు. ఏ డ్యూటీ అయినా చేయగలమని నిరూపిస్తున్నారు. అందుకు మానసికంగానూ సంసిద్ధులయ్యారు. అన్ని రకాల డ్యూటీలు మగవారితో సమానంగా చేసి సత్తా చాటుతున్నారు. మరింత ప్రోత్సాహం అవసరం మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింతగా దూసుకుపోతారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంతో మంది మహిళా ఉన్నతాధికారులు తమ సత్తా చాటుతున్నారు. పోలీసు డ్యూటీ అనగానే మగవారిదనే భావన సమాజంలో మెల్లమెల్లగా మాయమైపోతోంది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖలో చేరడానికి మహిళలూ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పది శాతం వరకు మహిళల సంఖ్య పెరిగింది. మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. మహిళలకు అండగా... పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటే మహిళలు జంకే పరిస్థితులు ఉండేవి. ఆపద ఉందని పోలీసు స్టేషన్‌కు వెళితే తమ గోడు వినేవారు ఉండకపోగా, వాళ్ల నుంచి వచ్చే ప్రశ్నలు ఇబ్బందిపెట్టేవిగా ఉండేవి. అయితే పోలీసు శాఖలో మహిళలు అధికారులుగా వచ్చిన తరువాత అనేక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కూడా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతీ ఠాణాలో మహిళా రిసెప్షనిస్టును ఉంచడం ద్వారా మహిళలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఏర్పడింది. అలాగే మహిళలపై దాడుల నిరోధానికి షీ టీమ్స్ ఏర్పాటు, మహిళపై జరిగే అఘాయిత్యాల్లో బాధితులకు ‘సఖి’ అండగా నిలవడం, ఇంకా ఎన్నో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మహిళా అధికారులు ఉన్న చోట బాధిత మహిళలు నేరుగా వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తద్వారా వారికి సత్వర న్యాయం అందుతోంది. పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా మహిళలకు కొండంత అండ దొరికినట్టయ్యింది’’ అని వివరించారు శ్వేత. – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
‘సాక్షి’కి అవార్డుల పంట
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘సాక్షి’ గ్రూప్ ప్రతినిధులకు అవార్డుల పంట పండింది. హైబిజ్ టీవీ శనివారం అందించిన మీడియా అవార్డులలో ‘సాక్షి’ ప్రతినిధులకు ఎక్కువ అవార్డులు లభించాయి. జర్నలిజం విభాగంలో పొలిటికల్ బెస్ట్ రిపోర్టర్‌గా పి.ఆంజనేయులు, బెస్ట్ బిజినెస్ రిపోర్టర్‌గా ఎన్.మహేందర్ కుమార్, బెస్ట్ క్రైం రిపోర్టర్‌గా శ్రీరంగం, సర్క్యులేషన్ విభాగంలో బెస్ట్ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ శ్రీకాంత్, బెస్ట్ ఇన్నోవేషన్‌గా ప్రదీప్ బట్టు, ఏడీవీటీ విభాగంలో బెస్ట్ ఇన్నోవేషన్‌గా ఎం.మహేందర్ కుమార్, బెస్ట్ ఈవెంట్స్‌గా జి.నాగరాజుగౌడ్, మధుపాపరావు, బెస్ట్ గ్రోత్‌గా ఎం.వినోద్ కుమార్, ఎల్రక్టానిక్ మీడియా విభాగంలో బిజినెస్ బెస్ట్ రిపోర్టర్‌గా ఆర్.రాజ్ కుమార్, ఏడీవీటీ విభాగంలో బెస్ట్ ఇన్నోవేషన్‌గా జె.గోవర్దన్‌రావు, కోవిడ్ సమయంలో పనిచేసిన టీవీ రిపోర్టర్ విక్రమ్ స్పెషల్ అవార్డులను అందుకున్నారు. కోవిడ్‌తో మృతి చెందిన సాక్షి జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు, మరో జర్నలిస్ట్ మనోజ్ కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జర్నలిజం, అడ్వర్టైజింగ్, సర్క్యులేషన్ విభాగంలో పనిచేసిన వివిధ సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులకు ‘మీడియా అవార్డులు–2021’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హైబిజ్ టీవీ ఎండీ రాజ్‌గోపాల్, సాక్షి ఏడీవీటీ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాతిక శాతం పాపం అమెరికాదే!
భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చని, పరిశుద్ధమైన, ఆరోగ్యదాయకమైన, జీవనయోగ్యమైన భూగోళాన్ని అందించాలంటే ఇప్పుడు మన ఆలోచన మారాలి. అనుదిన జీవనంలో గుణాత్మక మార్పు రావాలి. ప్రజల్లో ఈ స్పృహను కలిగించే దిశగా సాక్షి మీడియా గ్రూప్ కదులుతోంది. తన వంతు బాధ్యతగా ఓ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి అనంతమైనది. అత్యద్భుతమైనది. ప్రకృతి వనరులే ఏ జీవికైనా ప్రాణప్రదాలు. భూగోళం అంటే మట్టి మాత్రమే కాదు. శతకోటి జీవరాశులకు.. జీవవైవిధ్యానికి పుట్టిల్లు. మనుషులకు మాత్రమే కాదు.. మొక్కలు, జంతువులు, చేపలు, పక్షులు, వానపాములు, పురుగులు, సూక్ష్మజీవులు.. ఇంకా ఎన్నెన్నో జీవజాతులకు ఇదే ఆవాసం. మానవ జాతి సంతతి పెరుగుతున్న కొద్దీ.. ఆధునికతను సంతరించుకుంటున్న కొద్దీ ప్రకృతి వనరుల వినియోగం విచక్షణారహితంగా పెరిగిపోతోంది. ఈ లోటును ఏ యేటి కాఏడు తిరిగి పూడ్చుకునే శక్తిని సైతం భూగోళం కోల్పోయింది. 1970 నుంచి గాడి తప్పింది. ప్రకృతి వనరులపై మనుషుల వత్తిడి 1970–2014 మధ్యకాలంలో రెట్టింపైంది. ఎండలు, తుపానులు, వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాల సంఖ్య, తీవ్రత ఏటేటా పెరిగిపోతున్నాయి. జీవవైవిధ్యం గతమెన్నడూ లేనంత వేగంగా నశిస్తోంది. పక్షులు, చేపలు, ఉభయచరాలు తదితర జీవుల సంతతి ఇప్పటికే 68%కి పైగా ఈ కాలంలో నశించిందని ఒక అంచనా. ఇప్పటి మాదిరిగా ప్రకృతి వనరుల వాడకం తాకిడిని తట్టుకోవటానికి ఒక్క భూగోళం చాలదు, 1.6 భూగోళాలు కావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి మూలుగను పీల్చేయటం ఇదే రీతిలో కొనసాగితే 2050 నాటికి మనకు మూడు భూగోళాలు అవసరం అవుతాయి. కానీ, ఉన్నది ఒక్కటే! అందుకే, పెను ప్రమాదంలో పడిన పుడమిని రక్షించుకోవాలి. భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చని, పరిశుద్ధమైన, ఆరోగ్యదాయకమైన, జీవనయోగ్యమైన భూగోళాన్ని అందించాలంటే ఇప్పుడు మన ఆలోచన మారాలి. అనుదిన జీవనంలో గుణాత్మక మార్పు రావాలి. ప్రజల్లో ఈ స్పృహను కలిగించే దిశగా సాక్షి మీడియా గ్రూప్ కదులుతోంది. తన వంతు బాధ్యతగా ‘పుడమి సాక్షిగా..’ పేరిట చిరు ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ముచ్చటా మూడు లక్ష్యాలు.. 1. భూతాపం పెరగటం వల్ల కలుగుతున్న దుష్ఫలితాల గురించి తెలియజేయటం. 2. పర్యావరణ సంబంధమైన ముప్పు నుంచి బయటపడటానికి ఎవరి వారు చేయదగిన పనులను సూచించడం, సాధించగల లక్ష్యాలతో పనిచేయడానికి ప్రజలను ప్రేరేపించటం. 3. చేపట్టిన పనుల్లో పురోగతిని గురించి అందరం నిరంతరం అనుభవాలను పంచుకుంటూ, పరస్పరం ప్రోత్సహించుకునేందుకు దోహదపడటం. ఈ కృషిలో భాగమే మీ చేతుల్లో ఉన్న ప్రత్యేక ‘ఫన్డే’ సంచిక. పుడమిని ప్రభావితం చేసే వివిధ ఆలోచనలను, ప్రకృతికి అనుకూలమైన కొన్ని పనుల గురించి ఇందులో చర్చిస్తున్నాం. ‘సాక్షి’ టీవీలో ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్ కార్యక్రమం ఈ నెల 26న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రసారం అవుతుంది. భూగోళం క్షేమం కోసం పాటుపడే ఎందరో ఎర్త్ లీడర్స్, నిపుణులు, ప్రముఖులు, ప్రకృతి ప్రేమికులు తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకుంటారు.. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా దీక్షతో కొనసాగించాలని ‘సాక్షి’ కంకణం కట్టుకుంది. www.pudamisakshiga.com వెబ్సైట్ ప్రారంభమైంది.. మీరూ పాలుపంచుకోండి.. రండి.. ‘పుడమి సాక్షిగా..’ ప్రణామం చేద్దాం.. మన కోసం మారుదాం.. కలసి కట్టుగా కదులుదాం.. భూతాపం పెచ్చుమీరటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించుకోవటానికి ఉన్నంతలో పూనికతో పనిచేయాలని ప్రపంచ దేశాలు ప్రతిన బూని ‘పారిస్ ఒడంబడిక’ చేసుకొని ఐదేళ్లు గడచిపోయాయి. ఆ లక్ష్యాలు కూడా అరకొరే. అవి కూడా అమలవుతున్నది అంతంత మాత్రమే. తత్ఫలితంగా 2019 వరకు గడచిన ఐదేళ్లూ ఏటేటా భూతాపం అత్యధిక స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. కరోనా వచ్చి మనల్ని నెలలకొద్దీ ఇళ్లకే పరిమితం చేసింది కాబట్టి, 2020లో భూగోళాన్ని వేడెక్కించే కర్బన ఉద్గారాలు అంతకుముందు ఏడాది కన్నా 7% తగ్గాయి. అయితే, ఇది తాత్కాలికమే. ఈ గండం గడిస్తే, భూతాపోన్నతి కథ మళ్లీ మామూలేనా? వ్యక్తులు, ప్రభుత్వాల ప్రవర్తనలో ఏమైనా గుణాత్మకమైన మార్పు వచ్చే వీలుందా?? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. పారిస్ ఒడంబడికకు మించి.. పారిశ్రామిక విప్లవ యుగానికి ముందు అంటే.. 1880ల నుంచి ఇప్పటికి 1.2 డిగ్రీల సెల్షియస్ మేరకు భూగోళంపై ఉష్ణోగ్రత పెరిగింది. పారిస్ ఒడంబడికలో కుదిరిన అంగీకారం మేరకు ప్రపంచ దేశాలు ప్రకృతి వనరుల వాడకం తగ్గించుకుంటే ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు మించదని భావించారు. అయితే, వివిధ దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను బట్టి చూస్తే 2100 నాటికి 2.6 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరుగవచ్చంటున్నారు. అయితే, ఆయా దేశాల్లోని ప్రభుత్వ విధానాల్లో విప్లవాత్మక మార్పు తేకుండా ఇలాగే కొనసాగితే వచ్చే 80 ఏళ్లలో భూతలంపై ఉష్ణోగ్రత 3.2% (2.9–3.9%) వరకు పెరిగే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరి పాపం ఎంతెంత? 2020లో వెలువడిన ఉద్గారాలు కొంచెం తక్కువైనా.. ఇప్పటికే వాతావరణంలో పోగు పడి ఉన్న హరిత గృహ వాయువులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందువల్లనే, గడచిన ఏడాది కూడా అడవులు తగలబడటం, కరువులు, తుపానులు, మంచుకొండలు కరిగిపోవటం వంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరిగిందే గానీ తగ్గలేదు. అడవుల నరికివేత వంటి భూమి వినియోగ పద్ధతి మార్చటం వల్ల వెలువడిన ఉద్గారాలను ఇందులో కలపనే లేదు. ఎంత ‘అభివృద్ధి’ చెందిన వారమైతే ప్రకృతికి అంత ఎక్కువగా చేటు చేస్తున్నాం. ప్రపంచ జనాభాలో 50% ఉన్న పేదల మూలంగా వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాల కన్నా.. జనాభాలో 1% ఉన్న అతి సంపన్నులు చేస్తున్న ప్రకృతి వ్యతిరేక పనుల వల్ల వెలువడే ఉద్గారాలే ఎక్కువ అని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ (యుఎన్ఇపి) తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ నివేదిక చెబుతోంది. 2019 ఉద్గారాలు 59 బిలియన్ టన్నులు యుఎన్ఈపి ఎమిషన్స్ గ్యాప్ నివేదిక 2020 ప్రకారం.. 2019లో భూగోళం ఉపరితల వాతావరణంలోకి చేరిన (బొగ్గు పులుసు వాయువుతో సమానమైన) కర్బన ఉద్గారాలు 59.1 గిగా టన్నులు. 59.1 గిగా టన్నులంటే 59.1 బిలియన్ టన్నులు (ఇంకా విడమర్చి చెప్పాలంటే.. 5,910 కోట్ల టన్నులు). 2019లో ప్రపంచ ఉద్గారాలలో మన దేశం వాటా 7%. గత పదేళ్లలో విడుదలైన ఉద్గారాలలో 55% మన దేశంతోపాటు చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలే కారణమని యుఎన్ఇపి నివేదిక తెలిపింది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. ఇది జరగాలంటే.. ఇప్పటి కన్నా 25% తక్కువగా ఉద్గారాలు విడుదలయ్యేలా మానవాళి తన అలవాట్లను, జీవనశైలిని విప్లవాత్మకంగా మార్చుకోగలగాలి. కరోనా నేర్పిన గుణపాఠంతోనైనా ఇది సాధ్యమవుతుందా? ప్రకృతికి హాని కలిగించే నాలుగు పనుల్లో కనీసం ఒక్కదాన్నయినా మానుకోగలుగుతామా అని పర్యావరణ శాస్త్రవేత్తలు మన వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2050 నాటికి ఉద్గారాలను భూగోళానికి, మన జీవనానికి ప్రమాదం లేని స్థాయికి తగ్గించుకోవటానికి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటామని 51% ఉద్గారాలను వదులుతున్న 127 దేశాలు చెబుతున్నాయి. అయితే, ఈ మాటలు ఆయా దేశాల పారిశ్రామిక, ఇంధన, వ్యవసాయ తదితర తక్షణం అమల్లోకి తేగల విధానాల్లోకి ఎంతవరకు ప్రతిఫలిస్తాయో చూడాలి. ఏం చెయ్యగలం? ఆశ ఇప్పటికీ బతికే ఉంది. భారత్ సహా కాలుష్య కారక దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లో ప్రజలు తమ దైనందిన కార్యకలాపాల్లో పెనుమార్పులు చేసుకొని ఇప్పటికైనా ఏటా 7.2% మేరకు ఉద్గారాలు తగ్గించుకోవాలి. 2030 నాటికల్లా వార్షిక ఉద్గారాలు 25% తగ్గించుకోవాలి. తద్వారా వచ్చే పదేళ్లలో పెరిగే ఉష్ణోగ్రతను 3.2 డిగ్రీల నుంచి 2 డిగ్రీలకు పరిమితం చేసుకోగలిగే అవకాశాలు 66% మెరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది జరగాలంటే.. ప్రపంచ దేశాలు విద్యుత్తు వాడకంలో నైపుణ్యం పెంచుకోవాలి. సౌర, పవన విద్యుత్తుల వినియోగం వైపు మళ్లాలి. పరిశ్రమలు పునరుత్పాదక ఇంధనాల వాడకం దిశగా కదలాలి. మీథేన్ విడుదల తగ్గించాలి. వాహన కాలుష్యం తగ్గించడానికి రవాణా రంగంలో విద్యుత్తు, సౌర విద్యుత్తుతో నడిచే వాహనాల సంఖ్య పెంచాలి. వ్యవసాయ, నిల్వ పద్ధతులు ప్రకృతికి అనుగుణంగా మారాలి. ఆహార వృథాను తగ్గించాలి. మాంసాహారం తగ్గించి శాకాహారంపై ఎక్కువ ఆధారపడటం నేర్చుకోవాలి. అడవుల నరికివేత ఆపి, అడవుల విస్తీర్ణం పెంచాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని, నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలి. ప్రతి టెర్రస్పైనా సేంద్రియ ఇంటిపంటల సాగు విస్తరించాలి.. ఇలా చేస్తే నగరాల్లో గాలి నాణ్యత, నీటి లభ్యత పెరుగుతాయి. జీవవైవిధ్యం, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతాయి. ఏతావాతా చెప్పేదేమంటే.. ప్రభుత్వాలతో పాటు వ్యక్తిగా ప్రతి ఒక్కరి ఆలోచన, జీవనశైలి ప్రకృతికి అనుకూలంగా మారాలి. మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాస్తవికమైన ఉద్గారాల తగ్గింపు చర్యలను తక్షణం అమల్లోకి తేగలగాలి. అప్పుడే మనతోపాటు భూగోళంపై సమస జీవుల మనుగడ మరీ అధ్వాన్నమైపోకుండా మిగులుతుంది. ఇందుకోసం ‘పుడమి సాక్షిగా’ ప్రతిన బూని, పూనికతో కదులుదాం. - పంతంగి రాంబాబు భూతాపోన్నతి అంటే? మనం చేసే పనుల వల్ల పంచభూతాలు కలుషితం అయిపోతున్నాయి. బొగ్గు, పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించటం వల్ల కలుషిత వాయువులు (కర్బన ఉద్గారాలు) వాతావరణంలో విడుదలై భూగోళాన్ని అతిగా వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలోకి చేరిన ఉద్గారాలకు ప్రతి ఏటా మరికొన్ని ఉద్గారాలు తోడవుతున్నాయి. వాటి పరిమాణం అంతకుముందు ఏడాది కన్నా ఎక్కువగానే ఉంటున్నది. వాతావరణంలోకి చేరిన ఈ హరిత గృహ వాయువులు భూతాపానికి కారణమవుతున్నాయి. భూమి పై నుంచి వేడిని అనంత విశ్వంలోకి వెళ్లకుండా ఇవి అడ్డుకుంటూ ఉన్నాయి. అందువల్ల భూగోళం అంతకంతకూ వేడెక్కిపోతోంది. ఉష్ణోగ్రత అసహజంగా పెరిగిపోతోంది. దీన్నే భూతాపోన్నతి (క్లైమెట్ ఛేంజ్) అంటున్నాం. మనుషులందరూ భూతాపం పెరుగుదల నిదానించేలా చేయగలిగితేనే భవిష్యత్తులో మనతోపాటు సకల జీవరాశి మనుగడా బాగుంటుంది. ప్రకృతికి హాని కలిగిస్తున్న పనులేవో గుర్తించి, వాటిని తగ్గించుకోవటం ఒక్కటే మార్గం. కాలుష్య ప్రతాపం కనీసం 300 ఏళ్లు మనిషి సగటు జీవిత కాలం మహా అయితే వందేళ్లు. కానీ, మనిషి వల్ల భూమ్మీద ఏర్పడుతున్న కలుషిత వాయువుల జీవిత కాలం అంతకు 3 నుంచి 10 రెట్లు ఎక్కువ. ఏ ఏడాది భూతల వాతావరణంలోకి చేరే కర్బన ఉద్గారాలు ఆ యేడాదే అంతమైపోవు. కనీసం 300 నుంచి 1,000 ఏళ్ల పాటు వాతావరణంలోనే తిష్ట వేసి భవిష్యత్తు తరాలకు చుక్కలు చూపిస్తాయి. పారిశ్రామిక యుగం (క్రీ.శ.1750) ప్రారంభమైనప్పటి నుంచి కర్బన ఉద్గారాల విడుదల మొదలైంది. తొలి పారిశ్రామిక దేశం యునైటెడ్ కింగ్డమ్. కాలుష్య కారక తొలి దేశం కూడా ఇదే. క్రీ.శ. 1751లో మొదటి ఏడాది వాతావరణంలోకి యు.కె. వెలువరించిన కర్బన ఉద్గారాలు దాదాపు కోటి టన్నులు. ప్రపంచ దేశాలన్నిటి ఇప్పటి ఉద్గారాల కన్నా 3,600 రెట్లు తక్కువ. అప్పటి నుంచీ పారిశ్రామికీకరణ అన్ని దేశాలకూ విస్తరించింది. జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలూ పెరుగుతున్నాయి.. ఏటేటా అంతకు ముందెన్నడూ లేనంతగా కర్బన ఉద్గారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పాతిక శాతం కాలుష్య పాపం అమెరికాదే! యు.కె.తో ఉద్గారాల జాతర మొదలైనా ఆ తర్వాత కాలంలో పారిశ్రామికీకరణలో అమెరికా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అతి ఎక్కువగా కాలుష్య కారక వాయువులను విడుదల చేస్తూ వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ క్రీ.శ. 1751 నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకూ విడుదల చేసిన (క్యుములేటివ్ ఎమిషన్స్) ఉద్గారాల్లో 25% బాధ్యత అమెరికాదే. ఈ 269 ఏళ్లలో అమెరికా అత్యధికంగా దాదాపు 400 బిలియన్ టన్నుల ఉద్గారాలను వాతావరణంలోకి వదిలింది. అమెరికా ఉద్గారాల్లో సగం మేరకు వదిలిన చైనా రెండో స్థానంలో ఉంది. 22%తో 28 ఐరోపా దేశాల కూటమి మూడో స్థానంలో ఉంది. కాలుష్య పాపం చారిత్రకంగా చాలా తక్కువే అయినప్పటికీ, ఇవ్వాళ ఎక్కువగా ఉద్గారాలు వదులుతున్న దేశాల జాబితాలోకి భారత్, బ్రెజిల్ కూడా చేరుకున్నాయి. చైనా, అమెరికా, ఐరోపా యూనియన్‌లోని 28 దేశాల తర్వాత మన దేశమే అత్యధికంగా ఉద్గారాలను వెలువరిస్తోంది. గత దశాబ్ద కాలంలో వెలువడిన ఉద్గారాల్లో 55% ఈ 31 దేశాల నుంచి వెలువడినవే. అప్పుడు, ఇప్పుడూ కూడా అతి తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తున్న ఖండమేదైనా ఉందీ అంటే అది ఆఫ్రికా మాత్రమే. -
హైదరాబాద్‌లో సాక్షి ప్రతినిధులపై దాడి
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి అనుచరులు సాక్షి ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి తమ ప్లాట్‌ను కబ్జా చేశారని నల్లగొండకు చెందిన ఓ కుటుంబం ఆదివారం ధర్నా నిర్వహించింది. ఆయన ప్రచార రథాన్ని బాధిత కుటుంబం అడ్డుకుంది. కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులపై సామ తిరుమల్‌రెడ్డి అనుచరులు దాడి చేశారు. సాక్షి రిపోర్టర్ ఫోన్‌ను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
అడవిలోకి నడిచొచ్చిన ‘సంక్షేమం’
సాక్షి, తిరుపతి : అదంతా దట్టమైన అటవీ ప్రాంతం... అక్కడకు వెళ్లాలంటే రెండు కొండలు ఎక్కి దిగాలి. సుమారు 12 కి.మీ పైనే నడవాలి. జనావాసాలకు దూరంగా తరతరాలుగా కీకారణ్యంలో గడుపుతున్న నాలుగు ముస్లిం కుటుంబాలకు దాదాపు శతాబ్దం పాటు సర్కారు పథకాలు ఏవీ దరి చేరలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా వారు ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా ప్రతి నెలా పింఛన్ అందుకుంటున్నారు. రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తమకు ఇళ్లు కూడా ఇస్తుందని చెప్పినా ఎందుకనో ఆగిపోయిందని నిట్టూరుస్తున్నారు. ఇల్లు ఇస్తే తాము కూడా జనావాసాల్లోకి వస్తామని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం కల్లూరు రిజర్వు ఫారెస్టులో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం శ్రమించి అక్కడకు చేరుకుంది. నాలుగు తరాలుగా అక్కడే.. సుమారు వందేళ్ల క్రితం ముర్తుజాఖాన్ అనే వ్యక్తి చిట్లిగుట్టకు అటవీ ప్రాంతానికి చేరుకుని నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడే ఉంటూ వివాహం చేసుకున్నాడు. ఆయన కుమారుడు మల్కీఖాన్ కూడా అక్కడే నివసిస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఐదుగురు కుమారులు కూడా అడవితల్లి ఒడిలోనే పెరిగి పెద్దయ్యారు. ప్రస్తుతం వీరంతా పిల్లలతో కలసి అక్కడ ఉంటున్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో సయ్యద్‌ఖాన్ (16) పాముకాటుకు బలి కాగా మరో నలుగురు చిన్నారులు పాముకాటు, ఫిట్స్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఒకసారి అడవికి నిప్పు అంటుకున్న సమయంలో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. అడవి ఒడిలోనే చిన్నారులు.. చిట్లిగుట్టలో 18 మంది చిన్నారులుండగా వీరెవరూ పాఠశాల ముఖం చూసిన దాఖలాలు లేవు. బడికి పంపాలంటే సుమారు 12 కి.మీ. దూరం వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకపోవడంతో చిన్నారులు అడవికే పరిమితమయ్యారు. పంటలు, పండ్లతోటలు.. అక్కడ ఉంటున్న నాలుగు కుటుంబాలు రాళ్లు రప్పలు, చెట్లను తొలగించి సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో వరి, వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. మామిడి, కొబ్బరి చెట్లు పెంపకం ద్వారా పండ్లు, కాయలను సమీపంలోని కల్లూరులో విక్రయిస్తుంటారు. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లుకు అవార్డుల పంట
-
‘సాక్షి’ ఫొటో జర్నలిస్టుపై దాడి
సాక్షి, చార్మినార్ (హైదరాబాద్): సాక్షి దినపత్రిక ఫొటో జర్నలిస్టు గాలి అమర్‌పై బుధవారం సిటీ కాలేజీ చౌరస్తా వద్ద ఐదుగురు దుండగులు దాడి చేసి గాయపరిచారు. విధి నిర్వహణలో ఉన్న అమర్‌పై స్థానికులు అకారణంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. పేట్లబురుజు సిటీ కాలేజీ చౌరస్తా వద్ద సిగ్నల్స్ పనితీరు, వాహనాల రాకపోకలపై ఫొటోలు చిత్రీకరిస్తుండగా స్థానికంగా నివాసముంటున్న కొందరు అమర్‌ను అడ్డుకుని చితకబాదారు. కెమెరాతో పాటు సెల్‌ఫోన్ లాక్కున్నారు. అక్కడి వాహనదారులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆగలేదు. చదవండి: మాజీ ఎమ్మెల్యే ‘వరద’ కుమారుడు, అల్లుడిపై కేసు చార్మినార్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుల దాడి నుంచి ఫొటో జర్నలిస్టును కాపాడాడు. లాక్కున్న కెమెరాతో పాటు సెల్‌ఫోన్‌ను దుండగుల నుంచి తిరిగి ఇప్పించాడు. బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చార్మినార్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్ తెలిపారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: ‘సాక్షి’ బాల ఎడిటర్లు 301 మంది నిందితులపై చర్యలు తీసుకోవాలి.. ‘సాక్షి’ఫోటో జర్నలిస్టు గాలి అమర్‌పై అకారణంగా దాడికి పాల్పడిన దుండగులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిరిగిరి విజయ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, జనరల్ సెక్రటరీ కేఎన్ హరి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగు వెంకటేశ్ గౌడ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్ దాడిని ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సాక్షి ఆర్టిస్ట్ రమేష్ కన్నుమూత
సాక్షి, తిరుపతి: సాక్షి దినపత్రిక తిరుపతి ఎడిషన్‌లో డిప్యూటీ చీఫ్ ఆర్టిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కాట్పాడి రమేష్ (53) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో గత నెల18న ఆయన తిరుపతిలోని పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి కరోనా సోకినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి అక్కడే ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తీవ్రమైన అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రమేష్ కుటుంబ సభ్యులకు రూ.లక్ష సాయం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. -
వైఎస్ జగన్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు
సాక్షి, కాశీబుగ్గ : దీర్ఘకాలంగా జిల్లాలో పెండింగ్‌లో ఉండిపోయిన పనులపై రానున్న రోజుల్లో దృష్టి సారిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ, పాడి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో ముఖా–ముఖి మాట్లాడారు. సాక్షి : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు జిల్లా విషయానికి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు..? మంత్రి : నేను రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ ముందుగా పలాసకు ఎమ్మెల్యేను, శ్రీకాకుళం జిల్లా వాసిని. అందు చేత అనేక ప్రభుత్వాలు దాట వేస్తూ చేతులెత్తేసిన దీర్ఘకాల సమస్యలపై దృష్టి సారిస్తాను. జిల్లాలో ఉన్న మహేంద్రతనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు వంటి వాటిపై దృష్టి పెడతాను. సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టును ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు. నాన్నగారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు పూర్తి చేద్దామని అంటుంటారు. ఇప్పటికే పాత టెండర్‌ను రద్దు చేశారు. నెల రోజుల వ్యవధిలో కొత్త టెండర్లకు పిలుపునిచ్చి నిర్మాణ పనులు చేపడతారు. ఇలా జిల్లా విషయానికి వస్తే దీర్ఘకాలంగా సమస్యలుగా ఉన్న వాటిని గుర్తించి మన జిల్లా సీనియర్ నేతల ఆలోచనలు, సలహాలతో పూర్తి చేస్తాం. సాక్షి : తిత్లీ తుఫాన్‌తో నష్టపోయిన ఉద్దాన జీడి, కొబ్బరి రైతులను ఏవిధంగా ఆదుకోవాలనుకుంటున్నారు? మంత్రి : తిత్లీ సమయంలో టీడీపీ నాయకులే పరిహారాన్ని చాలావరకు మింగేశారు. దీనిపై పాదయాత్ర సమయంలోనే వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. అందుకే ఆయన అర్హుల ఎంపికతో పాటు పరిహారం రెట్టింపు చేశారు. టెక్నికల్ సమస్యలు పరిష్కరించి మూడు వారాల్లో పరిహారం అందజేస్తాం. జీడి విషయంలో కూడా సీఎం వద్ద ప్రస్తావిస్తే రూ.10వేల మద్దతు ధర ప్రకటించారు. పలా స పరిసర ప్రాంతాలలో హారీ్టకల్చర్ రీసెర్చ్ సెంటర్ ని ర్మించడానికి మంజూరు చేశారు. రానున్న రోజుల్లో ఉద్దానం రైతన్నలకు మేలు జరుగుతుంది. (రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే) సాక్షి : రాజకీయాల్లో మీకు అనుభవం తక్కువ. మంత్రిగా రాణించడానికి ఏం చేస్తారు? మంత్రి :మన జిల్లా అదృష్టమో, నా అదృష్టమో గానీ నేను ఏ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినా వారు కాదనడం లేదు. అందుకే మరింత ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సుభిక్షంగా జీవిస్తున్నప్పుడు అందకంటే కావాల్సింది ఏముంటుంది. సాక్షి : కిడ్నీ వ్యాధి బాధితుల కోసం చేస్తున్న పనులు? మంత్రి :గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డయాలసిస్‌కు ముందుకు వచ్చే వారు కాదు. అలా ఇంట్లోనే ఉండిపోయి చనిపోయేవారు. ఆ బాధలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో నూతనంగా డయాలసిస్ కేంద్రాలతో పాటు, డయాలసిస్ చేసుకుంటున్న వ్యక్తి ఇంటికి రూ.10వేలు వలంటీర్ ద్వారా అందిస్తున్నారు. క్రియాటిన్ తక్కువగా ఉన్నవారికి రూ.5వేలు పింఛన్ సైతం అందిస్తున్నారు. శుక్రవారం నాడు మందసలో పది బెడ్లతో నూతన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నాం. కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు వాటర్ గ్రిడ్‌ను నిర్మించనున్నాం. ఒక్క పలాస నియోజకవర్గంలో నాలుగు ప్రాంతాల్లో లక్షా యాభైవేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్ల నిర్మాణం జరగనుంది. వంశధార రిజర్వాయర్ నుంచి సుమారు 50 కిలోమీటర్లు పైపులైన్ పలాసకు రానుంది. ఇది పూర్తయితే ప్రజల గుండెల్లో నాయకులు నిలిచిపోవడం ఖాయం. సాక్షి : కరోనాపై ఓ డాక్టర్‌గా మీ సలహా? మంత్రి : కరోనాకు ఏ ఒక్కరూ అతీతం కాదు. అందరం కరోనాను చూడాల్సిందే. మన వద్ద కేసులతో పాటు రికవరీ కూడా పెరుగుతోంది. అందులోనూ ప్లాస్మా థెరపీ కూడా పనిచేస్తోంది. అందుకే ప్లాస్మా దానానికి ముందుకు రావాలి. దీనిపై అపోహలు అక్కర్లేదు. సాక్షి : పలాస ప్రాంతంలో వరుసగా అధికారుల సస్పెన్షన్‌పై మీ అభిప్రాయం? మంత్రి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ప్రజలకు సేవ చేయడానికి ఉన్న వారు తప్పుగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. సాక్షి : మూడు రాజధానులపై మీ వాదన? మంత్రి : అమరావతి కోసం రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టేయాలని గత ప్రభుత్వం చూసింది. అది సరికాదు. అలా గే అక్కడ చంద్రబాబు తన వర్గం వారిని మాత్రమే ఆలోచనలో పెట్టుకున్నారు. మూడు రాజధానుల వల్ల మూ డు ప్రాంతాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని రావడంతో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాల్లో సైతం వలసలు తగ్గుముఖం పడతాయి. -
సేవకు గుర్తింపు....
సాక్షి, హైదరాబాద్: కరోనా విపత్తులో సామాన్య జనానికి పలు సేవా కార్యక్రామాలు అందించినందుకుగాను సీనియర్ సబ్ ఎడిటర్, సామాజిక కార్యకర్త టి.గోపీనాథ్‌ను ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ‘కరోనా వారియర్ ఇంటర్నేషనల్ హానర్’ పేరుతో సత్కరించింది. కోవిడ్ కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదవారిని గుర్తించి వారికి నిత్యావసరాలు అందించడమేగాక, అలాంటి వారి ఉనికి వెలికి తీసి మరిన్ని సంస్థల సహకారం అందేలా గోపినాథ్ కృషి చేశారు. ఈ మేరకు ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఆయనకు సర్టిఫికెట్ ప్రదానం చేసింది. సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ ఈ మేరకు గోపీనాథ్‌ను అభినందించారు. తనకు అందిన పురస్కారం తాను మరిన్ని సేవాకార్యక్రమాలు చేసేందుకు బలాన్నిచ్చిందని గోపీనాథ్ పేర్కొన్నారు. గాయని పద్మశ్రీ త్యాగరాజుకు.. సుల్తాన్‌బజార్: ప్రఖ్యాత గాయని పద్మశ్రీ త్యాగరాజుకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వారు ‘కరోనా వారియర్ ఇంటర్నేషనల్ హానర్’ అవార్డును అందించారు. కరోనా కాలంలో పద్మశ్రీ త్యాగరాజు ‘కోవిడ్–19 మ్యూజిక్ ఛాలెంజ్’ శీర్షికన ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 100 పాటలు స్వయంగా పాడి రోజుకో పాట చొప్పున ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ తన గానం ద్వారా అందరినీ ఆనందపరిచారు. కరోనా కాలంలో ఆమె చేసిన కృషిని గుర్తించి ‘విశ్వగురు’ ఎండీ సత్యవోలు రాంబాబు స్వయంగా పద్మశ్రీ త్యాగరాజుకు అవార్డు ప్రదానం చేశారు. -
రక్షాబంధన్ ఫోటోలను సాక్షితో పంచుకోండి!
రక్షా బంధన్ రోజు సోదరి రక్ష కట్టగానే, సోదరుడు నీకు జీవితాంతం కష్టం రాకుండా తోడుగా ఉంటానంటూ ప్రమాణం చేస్తాడు. ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేసి రాఖీ కట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటారు. ఎంత దూరంలో ఉన్నా తన సోదరుడి దగ్గరకు వెళ్లి రాఖీని కట్టి తన మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమని చాటుకుంటారు. ఈ రోజు అన్నాచెల్లెళ్ల అల్లర్లకు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి పెట్టింది పేరు. అలాంటి ఉత్సవాన్ని మీ ఇంట్లో కూడా జరుపుకుంటే ఆ ఆనందాన్నిసాక్షితో పంచుకోండి. మీరు జరుపుకున్న రక్షాబంధన్ వేడుకల ఫోటోలను మాకు పంపించండి. మీ పేరుతో పాటు, మీ ఊరు పేరును కూడా మాకు పంపించండి. మీరు ఫోటోలు పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 9705456111. ఇంకెందుకు ఆలస్యం మీ ఫోటోలను వెంటనే మాకు పంపించండి . -
బాటసారులకు ‘సాక్షి’ బాసట
సాక్షి, రణస్థలం: కరోనా రక్కసి కాటుకు మహానగరాలు మూగబోయాయి. వలస కార్మికుల కష్టాలు తీర్చే కరుణ గల మనుషులు కరువయ్యారు. అక్కడ ఒక్క పూట అన్నం పెట్టే నాథుడే కానరాలేదు. సొంతూరు వెళ్లేందుకు రవాణా సాధనాలు లేకపోయె.. అయినా ప్రాణాలు నిలవాలంటే వెళ్లకతప్పదని నడకబాట పట్టారు. రోజుల తరబడి నడుస్తున్న ఈ బాటసారులకు ‘సాక్షి’ అండగా నిలిచింది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ దృష్టికి వలస కార్మికుల దీనగాథలను తీసుకువెళ్లింది. దీంతో ఆయన వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం నుంచి రాష్ట్ర సరిహద్దు ఇచ్ఛాపురం వరకు తీసుకువెళ్లేందుకు వారికి వాహనాలు సమకూర్చారు. బాటసారుల బాధలు తీర్చేందుకు బాసటగా నిలిచారు. వలస కార్మికులకు భోజనం ప్యాకెట్లు అందిస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ పైడిభీమవరం చెక్‌పోస్టు వద్దకు నడుచుకుంటూ వచ్చిన వలస కార్మికులకు ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ అండగా నిలిచారు. వారి బాధలను ‘సాక్షి’ దినపత్రిక తన దృష్టికి తేవడంతో ఆయన వెంటనే స్పందించారు. అరబిందో పరిశ్రమ, వెంకటేశ్వర విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థల సహకారంతో ఆదివారం 7 బస్సులు సమకూర్చారు. బస్సు ఎక్కే ముందు శానిటైజర్‌తో కార్మికుల చేతులను శుభ్రం చేయించారు. అనంతరం బస్సుల్లో ఇచ్ఛాపురం వరకు వలస కార్మికులను తరలించారు. వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇలా మరో వారం రోజులపాటు రోజు వలస కారి్మకులకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తొలి రోజు ఒడిశా, బీహర్, పశ్చిమ బెంగ రాష్ట్రాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వలస కారి్మకులకు బస్సులు ఏర్పాటు చేశారు. రామతీర్ధాలు కూడలి వద్ద వారికి భోజనం ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ వలస కార్మికుల కష్టాలు చూసి ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడే భోజన సదుపాయాలు చేస్తుందని, రాష్ట్ర సరిహద్దు వరకు బస్సుల్లో తరలిస్తోందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించి, శుచిగా, శుభ్రంగా ఉండాలని, అనారోగ్య సమస్యలుంటే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె.ఆర్.పురం సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎస్సై శ్రీనివాస్, అరబిందో జీఎం ఎన్.రాజారెడ్డి, డీజీఎం వెంకటరావు, వైఎస్సార్సీపీ నాయకులు లంకలపల్లి ప్రసాద్, ఆకుల శ్రీనివాసరావు, నారయప్పారావు, అల్లంపల్లి బాషా తదితరులు పాల్గొన్నారు. బస్సు ఎక్కేముందు వలస కార్మికులు చేతులు శుభ్రం చేసు కునేందుకు శానిటైజర్ ఇస్తున్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ ఏపీ ప్రభుత్వం ఆదుకుంది చెన్నైలో నాలుగు రోజుల క్రితం నడుచుకుంటూ బయలుదేరాం. కొంతదూరం వచ్చేసరికి ఏపీ ప్రభుత్వ పోలీసులు బస్సు ఎక్కించి కొంతవరకు సాగనంపారు. తరువాత కొంత నడిచాం. మరోచోట అక్కడ పోలీసులు లారీ ఎక్కించారు. మళ్లీ ఇక్కడ బస్సులో పంపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం బాగా చూసుకుంటోంది. –బిలాందాస్, పశ్చిమ బెంగ నేను చనిపోతే నా పిల్లలకు దిక్కెవరు? చెన్నైలో ఇనుపరాడ్ల బెండింగ్ పనికి మా ముఠావాళ్లతో ఐదు నెలల క్రితం వెళ్లాను. నేను కష్టపడి డబ్బు పంపిస్తేనే ఇల్లు గడుస్తుంది. మొదటి రోజు నడిచినడిచి అలిసిపోయి పడిపోయాను. నేను ఇక్కడే చనిపోతే నా పిల్లలకు దిక్కెవరని అల్లాకు నమాజ్ చేసుకున్నాను. ఏపీలోకి వచ్చాక బస్సులు, లారీలు దొరుకుతున్నాయి. – అబ్బాస్ అసాన్, పశ్చి బెంగ -
రెండు వారాల్లో కరోనా క్లియర్
సాక్షి, కడప : జిల్లాలో కరోనా వైరస్‌పై వారం రోజుల్లో పూర్తి గ్రిప్ వస్తుంది. 14 రోజులకు ప్రాబ్లమ్ క్లియరవుతుంది. 28 రోజులు లాక్డౌన్ పాటిస్తే నూటికి నూరు శాతం కరోనా వైరస్‌ను జిల్లా నుంచి పారదోలుతామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు.ప్రజల సహకారంతోనే లాక్డౌన్ విజయవంతమవుతోందని చెప్పారు. శుక్రవారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలనుంచి ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానాలు ఇచ్చారు. ప్రశ్న : లాక్డౌన్ ఆంక్షలు ఎలా అమలు చేస్తున్నారు? ఎస్పీ : లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేస్తున్నాం. కరోనా పాజిటివ్ ప్రాంతాలు, బయటి ప్రాంతాల్లో టూ వీలర్లో ఒకరికి చొప్పున అనుమతి ఇస్తున్నాం. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ఉదయం 6 నుంచి 9 గంటల్లోపు మాత్రమే బయటికి వచ్చి వెళ్లాలి. భౌతిక దూరం పాటించాలి. చదవండి: మీ నిస్వార్థ సేవలకు సెల్యూట్ ప్రశ్న : పనులు లేక ఆటోలు, ట్యాక్సీవాలాలు ఇబ్బందులు పడుతున్నారు? ఎస్పీ : ట్రాన్స్‌పోర్టు ఆగడంతో ఇబ్బందులు తప్పలేదు. అయితే సరుకుల డెలివరీకి ఆటోలు, ట్యాక్సీలు వాడుతున్నాం. బయటి వారికి అనుమతి లేదు. ఎక్కడి ఆటోలు అక్కడ సరుకులు, కూరగాయలు రవాణాకు ఉపయోగిస్తున్నాం. వారికి ఉపాధి కల్పిస్తున్నాం. ప్రశ్న : కొందరు నేతలు సేవా కార్యక్రమాల పేరుతో మాస్క్‌లు లేకుండానే గుంపులుగా వస్తున్నారు? ఎస్పీ : ఇది మా దృష్టికీ వచ్చింది. సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు మాస్క్‌లు ధరించాలని, జాగ్రత్తలు తీసుకుని తక్కువమంది వెళ్లాలని సూచించాం. ప్రశ్న : తండ్రి కేన్సర్ పేషంట్. ప్రతి నెలా హైదరాబాదు వెళ్లాలి. వెహికల్‌కు అనుమతి ఇస్తారా? ఎస్పీ : వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లే వారిని పోలీసులు అడ్డుకోరు. తగిన ఆధారాలు తప్పకుండా చూపించాలి. ప్రశ్న : కూరగాయల మార్కెట్లలో అమ్మకందారులు మాస్క్‌లు ధరించడం లేదు? ఎస్పీ : అన్ని మార్కెట్లలో వ్యాపారులు మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకుంటాం. చదవండి: మరో 18 కరోనా పాజిటివ్ కేసులు ప్రశ్న : మందుల షాపులు, కిరాణా దుకాణాల వద్ద చాలామంది భౌతిక దూరం పాటించడంలేదు? పోలీసులు పట్టించుకోవడం లేదు? ఎస్పీ : ఇక నుంచి అలా జరగకుండా చూస్తాం. పోలీసులకు ఆ మేరకు ఆదేశాలు ఇస్తాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా భౌతిక దూరం పాటించాలి. అప్పుడే కరోనా నుంచి బయట పడగలం. ప్రశ్న : అధికారులు పండ్లు, కూరగాయలు తీసుకెళ్లి అమ్ముకోవాలని చెబుతున్నా కొందరు పోలీసులు అడ్డుకుంటున్నారు? ఎస్పీ : అలా జరగకుండా చూస్తాం. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులకు పూర్తి అనుమతులు ఇచ్చాం. పోలీసులు ఎవరూ అడ్డుకోరు. అలా జరిగితే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : జిల్లాలో కరోనా బాధితులు ఎంతమంది ఉన్నారు? ఎస్పీ : ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, ఢిల్లీ తబ్లిక్ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారితో కలిపి దాదాపు ఐదు వేల మంది ఉన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన 86 మందిలో నేరుగా 17 మందికి, వీరి బంధువులు, మిగిలిన వారు 12 మందితో కలిపి మొత్తం 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రశ్న : కరోనా విస్తరించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్పీ : అందరిపై నిఘా పెట్టాం.వారి సెల్ఫోన్లలో ప్రత్యేక యాప్ ఇన్స్టాల్ చేసి వారి కదలికలను కంట్రోల్లోకి తీసుకున్నాం. కరోనా అనుమానితులపై త్రీ బీట్ సిస్టమ్ అమలు చేస్తున్నాం. మహిళా పోలీసులు, విలేజ్ పోలీసులు, బీట్ కానిస్టేబుళ్లు ఇళ్ల వద్దకు వెళ్లి చెక్ చేస్తున్నారు. ప్రశ్న : బయటి వారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్పీ : జిల్లాలో 39 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. బయటి జిల్లాల నుంచి ఎవరినీ జిల్లాలోకి అనుమతించడం లేదు. అలా రావాలనుకునే వారు 14 రోజులు క్వారంటైన్లలో ఉండాల్సిందేనని ఆంక్షలు పెట్టాం. ప్రశ్న : పెట్రోలు బంకులు ఎప్పటి నుంచి పనిచేస్తాయి? ఎస్పీ : ఇక నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల కోసం, మధ్యాహ్నం తర్వాత గూడ్స్ వెహికల్స్‌కు పెట్రోలు, డీజల్ అందించేలా ఆదేశాలు ఇచ్చాం. ప్రశ్న : కరోనా లాక్డౌన్లో పోలీసుల పాత్ర? ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా 4 వేల మంది పోలీసులు, అధికారులు లాక్డౌన్లో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. కుటుంబాలను వదిలి ప్రజలకు సేవ చేస్తున్నారు.పోలీసులతోపాటు వైద్యులు, వలంటీర్లు,రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు. ప్రశ్న : జిల్లా ప్రజల సహకారం ఎలా ఉంది? ఎస్పీ : కరోనాపై జిల్లా ప్రజలకు అపూర్వమైన అవగాహన వచ్చింది. వారి సహకారంతో లాక్డౌన్ విజయవంతమవుతోంది. జిల్లా వాసుల సహకారం ఎన్నటికీ మరువలేనిది. ప్రశ్న : ప్రజల ఇబ్బందులు ఎలా పరిష్కరిస్తున్నారు? ఎస్పీ : ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా అదనపు మార్కెట్లను అందుబాటులోకి తెచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో సబ్ ఇన్స్పెక్టర్ కిరాణాషాపులు, మెడికల్ షాపుల వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఇబ్బందులు రాకుండా కిరాణా, మందులు సరఫరా అయ్యేలా చూస్తున్నారు. -
మీడియాసంస్థల అధినేతలతో ప్రధాని మోదీ
-
నిర్మలారెడ్డికి అభినందనలు..
సాక్షి, హైదరాబాద్: సాక్షి’ దినపత్రిక చీఫ్ రిపోర్టర్ నిర్మలారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాధోడ్ ఆమెకు పురస్కారాన్ని అందజేశారు. దీనిని పురస్కరించుకుని ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి, డిప్యూటీ ఎడిటర్ రమణమూర్తి, అసిస్టెంట్ ఎడిటర్ ఖదీర్‌బాబు పలువురు సీనియర్ పాత్రికేయులు సోమవారం ఆమెకు అభినందనలు తెలిపారు. నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్ల మండలం, చిలకమర్రి గ్రామానికి చెందిన నిర్మలారెడ్డి గత 20 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. మహిళల ఆదరణ పొందిన ‘సాక్షి’ ఫ్యామిలీ విభాగంలో ఫీచర్ జర్నలిస్ట్‌గా పలువురు మహిళల స్ఫూర్తిదాయక విజయాలను వెలుగులోకి తెచ్చారు. మానవీయ కథనాల ద్వారా ఎందరో ఆపన్నులకు చేయూత అందేలా చేశారు. కథా రచయిత్రిగానూ తనదైన ముద్రవేసుకున్న ఆమె గతంలో ప్రతిష్టాత్మక డీఎన్‌ఎఫ్ ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డును సైతం అందుకున్నారు. అవార్డు గ్రహీత నిర్మలను అభినందిస్తున్న ‘సాక్షి’ ఎడిటర్ వర్దెల్లి మురళి తదితరులు -
నేను, నాది కాదు.. మనం, మనది!
‘‘అభివృద్ధి అంటే ఆర్థికంగా మాత్రమే కాదు. సామాజిక అజెండా కూడా ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమవుతుంది. ఈ భావనతోనే పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టంగా ఈ ఆలోచనతోనే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవడం.. ఇది మనదనే భావన పెంపొందించడం, సొంతంగా మన పనులు మనం చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆలోచనలను తొలగించడం వంటి ప్రాధమ్యాలతో పనిచేస్తున్నాం. కేవలం అధికారంతో పనిచేయించడం కాదు.. ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలనే అభిప్రాయంతో ముందుకెళుతున్నాం’’ అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ‘సాక్షి’ ఎడిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. పత్రిక ఎలా డిజైన్ అవుతుంది? ఎలా ప్రింట్ అవుతుందనే అంశాలను పరిశీలించడంతో పాటు జిల్లా అభివృద్ధిలో తన ప్రాధాన్యతలను ఆయన వివరించారు. – సాక్షి ప్రతినిధి, అనంతపురం ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా రీడర్స్, సాక్షి ఉద్యోగులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విద్యకు ప్రాధాన్యం గతంలో నాతో పాటు చదువుకునే ఒక మిత్రుడిని వాళ్ల తండ్రి.. కూలికి వెళితే రూ.10 వస్తాయి. చదువుకుంటే ఏం వస్తుందని పనులకు తీసుకెళ్లారు. కూలికి పోవడం వల్ల ఆ రోజు ఆదాయం కనిపించింది. కానీ నేను చదువుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఉద్యోగంతో పాటు ఐఏఎస్ కాగలిగాను. ప్రతి ఒక్కరూ పిల్లల చదువుకు ప్రాధాన్యత నివ్వాలి. భరోసా కల్పిద్దాం ‘‘ఈ కార్యాలయం మనందరిది. ఇక్కడి అధికారులను కలిసే సమయంలో దయచేసి చెప్పులు విడవవద్దు. చేతులు కట్టుకుని ఒంగి నిలబడవద్దు. కన్నీళ్లు పెట్టుకోకండి. కాళ్లు మొక్కకండి.’’ అనే పోస్టర్‌ను రూపొందించాం. ప్రజల భుజం మీద చేయి వేసి.. మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వాలి. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు భరోసా కల్పించినప్పుడే ఉద్యోగ జీవితానికి సార్థకత. విలువలు ముఖ్యం ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కుల వెంట పరుగులు తీస్తుండటం విద్యార్థుల మానసిక స్థితిపై పెను ప్రభావం చూపుతుంది. అలా కాకుండా విద్యార్థి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఫలితాలు ఉండాలి. ఏదో ఒకటి చేసి ఉత్తీర్ణత శాతం చూపించడం వల్ల.. ఆ విద్యార్థి భవిష్యత్తులో దేనికీ పనికిరాకుండా పోతాడు. అలాంటి చదువు వద్దు.. విలువలతో కూడిన విద్య ముఖ్యం. ‘‘ప్రభుత్వం అంటే ప్రజలది అనే భావన రావాలి. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో (అధికారులతో) మాట్లాడేటప్పుడు కూడా మనం, మనది అనే చెబుతుంటారు. నేను, నాది అనే భావన కనిపించదు. అందరూ కలిసి పని చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.’’ చదవండి: అదిరిందయ్యా చంద్రం అధికారి తలుచుకుంటే.. అధికారులు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి పనులు చేయాలి. అధికార దర్పంతో కాదు. ఇదెందుకు చెబుతున్నానంటే.. ‘‘నేను కర్నూలులోని జవహర్ నవోదయలో పదో తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఆర్బీకి ఎంపికయ్యాను. ఆ ఉద్యోగంలో చేరేందుకు నాకు టీసీ అవసరం. నవోదయలో టీసీ తీసుకోవాలంటే రెండు నెలల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రిన్సిపాల్‌ను కలిస్తే, నిబంధనలు అలా ఉన్నాయని.. హైదరాబాద్‌కు వెళ్లి ఉన్నతాధికారిని కలవమని సూచించారు. చిన్న వయస్సులోనే ఉద్యోగం వచ్చిందనే సంతోషం ఒకవైపున్నా.. టీసీ వస్తుందో రాదోననే టెన్షన్. హైదరాబాద్‌కు వెళ్లి నా పరిస్థితిని అంతా వివరించగా ఆ అధికారి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ టీసీ మంజూరుకు అనుమతించారు. ఒక అధికారి తలుచుకుంటే.. ఎంతో కొంత సహాయం చేయగలరనేందుకు ఇదొక నిదర్శనం. ఆ భావన ప్రతి ఒక్కరిలో రావాలి.’’ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నేనూ రాయలసీమవాడినే. ఇక్కడి ప్రజల బాధలు, ఆశలు, ఆకాంక్షలు నాకు బాగా తెలుసు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో వర్షపాతం చాలా తక్కువ. విపరీతమైన కరువు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులతో పాటు చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువగా పొలాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలన వచ్చింది. మనదనే భావన అందరిలో పెంపొందినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఇక అధికారంతో పనులు చేయించడం నా విధానం కాదు.. ఆలోచనల్లో మార్పు తెచ్చి పనిచేయించాలన్నదే నా అభిమతం.’’ అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా అభివృద్ధి, సంక్షేమం ఏదైనా ప్రభుత్వానికి రెండు కళ్లుగా ఉంటాయి. అయితే, కేవలం ఎకనమిక్ అజెండా(ఆర్థిక అభివృద్ధి) మాత్రమే కాకుండా సోషల్ ఎజెండాతో కూడా మిళితం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాంటి వారు మంచి స్టేట్స్‌మెన్‌గా గుర్తింపు పొందుతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి–సంక్షేమంతో పాటు వాటి అమలులో సోషల్ ఎజెండా కూడా ఉంది. అది వివిధ ప్రభుత్వ పథకాల్లో కూడా ప్రతిఫలిస్తోంది. ఇందుకు ఉదాహరణలు.. నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం భాగస్వామ్యం కల్పించడం, నామినేషన్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలు వంటివి ఉన్నాయి. ఇది నేరుగా మనకు కనపడుతోంది. పరోక్షంగా కూడా ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో. ప్రభుత్వ సేవలు కేవలం కొద్ది మందికి మాత్రమే కాకుండా.. వాయిస్ లేని వారికి కూడా అందుబాటులోకి తేవడం. గతంలో ఎవ్వరూ చేయని విధంగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఇది మనదనే భావనతో.. ప్రభుత్వం అంటే ప్రజలది అనే భావన రావాలి. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో(అధికారులతో) మాట్లాడేటప్పుడు కూడా మనం, మనది అనే చెబుతుంటారు. నేను, నాది అనే భావన కనిపించదు. అందరూ కలిసి చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే మన బడి నాడు–నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో బడి మనది అనే భావన కేవలం విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, గ్రామస్తుల్లో కూడా రావాలన్నదే అభిప్రాయం. తద్వారా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. వాస్తవానికి విద్యారంగం మీద ప్రభుత్వం చేసే ప్రతీ పైసా ఖర్చు భావితరాలకు ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు అది ఆర్థిక ఫలితాలు ఇవ్వకపోవచ్చుకానీ.. దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం చేస్తున్నారు. కచ్చింగా మూడేళ్ల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చెందుతాయి. చదవండి: అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు గడప వద్దకే...! గతంలో ఏదైనా ప్రభుత్వ అధికారిని కలవాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఏ సమయంలో అందుబాటులో ఉంటారనే విషయం కూడా ప్రజలకు తెలిసేది కాదు. మండల కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం గ్రామ సచివాలయాలతో ప్రభుత్వ పాలన ప్రజల గడప వద్దకే వచ్చింది. ఒక గ్రామంలో ఏకంగా 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం.. అందుకు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థ ఇంటి వద్దకు వెళ్లి సేవలందించడం ఇది ఒక చరిత్ర. ఇప్పుడు ఏదైనా పనికావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏయే అధికారి ఎక్కడ ఉంటారు? ఏయే పనులు చేస్తారు? కూడా స్పష్టంగా పేర్కొంటున్నాం. ఇప్పటికే జిల్లాలో గ్రామ సచివాలయాల వ్యవస్థ పనిచేస్తోంది. ఇంకా ఇబ్బందులు ఉన్న చోట సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తాం. ఎక్కడా లేనివిధంగా జిల్లాలో మొదటిరోజే ప్రజలకు అవసరమైన సేవలను ప్రారంభించాం. 1బీ అడంగల్, డెత్, బర్త్ సర్టిఫికెట్లను జారీచేస్తున్నాం. అన్ని సేవలను కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజల గడపవద్దకే పాలన అందిస్తాం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని.. మనకు ఏదైనా సమస్య వస్తే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భావన ఎక్కువగా నాటుకుపోయింది. మన పనులను సొంతంగా మనమే చేసుకోవాలనే భావనను పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా మన అనంత–సుందర అనంత కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన ఇంటి పక్కన చెత్తను మనమే తీసేద్దాం. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుదామనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది ఒక్క రోజులో అయ్యే పనికాదు. మన భావనలో మార్పులు రావాలంటే సమయం పడుతుంది. అయినప్పటికీ భవిష్యతులో వీటి ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. కేవలం ఉన్న అధికారాలతో ఆదేశాలు జారీచేసి పనులు చేయించే అవకాశం ఉంది. అయితే, అది కేవలం అప్పటివరకే ఉంటుంది. అలా కాకుండా అందరి ఆలోచనల్లో మార్పు వస్తే ఆ మార్పు మనం ఉన్నా లేకపోయినా ఎల్లకాలం ఉంటుంది. ఫలితాలకు లింకు లేదు చదువు అంటే కేవలం మార్కులు అనే భావన పోవాలి. బట్టీపట్టో, కాపీయింగ్ చేసో మార్కులు సాధించడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. మా పాఠశాలలో 100 శాతం రిజల్ట్స్ వచ్చింది. మా జిల్లాలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాం అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అందుకే కేవలం మార్కుల మీద కాకుండా విజ్ఞానం పెంచుకోవడం మీద ధ్యాస ఉంచాలి. గతంలో పాఠశాల ఉత్తీర్ణత శాతానికి.. ప్రమోషన్లకీ లింకు ఉంది. అందుకే ఉత్తీర్ణత శాతం ఎక్కువ తెచ్చేందుకు ఉపాధ్యాయులు ఆరాటపడేవారు. ఇప్పుడు నేను పదో తరగతి ఉత్తీర్ణత విషయంలో కచ్చితంగా అందరికీ చెప్పాను. మీ ఫలితాలకు, ప్రమోషన్లకీ సంబంధం ఉండదని వివరించాం. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి.. స్ట్రిక్టుగా ఉంటామని చెప్పడం వల్ల ఫలితం ఉండదు. మన ఆలోచనల్లోనే మార్పులు రావాలి. ఆ దిశగానే 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఒక లేఖ రాశాను. త్వరలో 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో టెలీ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను. -
‘నాయనమ్మ’కు చేయూత
సాక్షి, కామారెడ్డి: తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను పెంచేందుకు ఆ నాయనమ్మ పడుతున్న కష్టాలపై కలెక్టర్ శరత్ స్పందించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈనెల 15న ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో ‘ముగ్గురు పిల్లలు.. నాయనమ్మ’ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇది చదివిన కలెక్టర్.. భిక్షాటన చేస్తూ పిల్లలను పెంచుతున్న నాయనమ్మ గంగవ్వ కష్టాలను తెలుసుకుని చలించిపోయారు. అధికారులతో వివరాలు సేకరించారు. బు ధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కుప్రియాల్ నుంచి గంగవ్వతో పాటు ఆమె మనవరాళ్లు చామంతి, వసంత, మనవడు శ్రీకాంత్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. (గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే..) కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇకపై భిక్షాటన చేయవద్దని గంగవ్వకు సూచించారు. తక్షణ సహాయంగా రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పెద్దమ్మా యి చామంతికి ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. 9వ తర గతి చదువుతున్న వసంతను కేజీబీవీలో చేర్పించాలని, టెన్త్ చదువుతున్న శ్రీకాంత్‌ను వచ్చే సంవత్సరం గురుకుల కళాశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పూరిగుడిసెలో నివసిస్తున్న గంగవ్వకు డబు ల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తామన్నారు. కలెక్టర్ భరోసా ఇవ్వడంతో గంగవ్వ ఆ మె మనువడు, మనువరాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదుకున్న కలెక్టర్‌కు, తమ కష్టాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి రుణపడి ఉంటామని అన్నారు. -
చిత్తూరు జిల్లాలో సాక్షి ప్రీమియర్ లీగ్
-
సబ్ ఎడిటర్లు కావలెను
సాక్షి పత్రిక అనుబంధ వెబ్సైట్ "సాక్షి డాట్ కామ్"లో పనిచేసేందుకు సబ్ ఎడిటర్లు/సీనియర్ సబ్ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్లుగా, న్యూస్ వెబ్సైట్లలో కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ బాగా చేయగలగాలి. 30 సంవత్సరాల లోబడిన వయసు కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ కింద పేర్కొన్న మెయిల్‌కు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాలను ఈ నెల 31 వ తేదీలోగా పంపించగలరు. recruitments@sakshi.com -
రారండోయ్... సత్తా చూపుదాం
క్రికెట్టే మీ జీవితమా... అయితే ఇక్కడ మీ జీవితమే మారిపోవచ్చు... ఆశల ఆకాశం... కలల ప్రపంచం... మీ నిలువెత్తు ప్రయత్నానికి మా అతి పెద్ద వేదిక... కేవలం మీరు చేయాల్సిందల్లా... ముందుగా ఎంట్రీలు పంపించడం.. ఆ తర్వాత బరిలోకి దిగడమే. తెలంగాణ రాష్ట్రంలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జనవరి తొలి వారం నుంచి సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్ (ఎస్‌సీపీఎల్) జరగనుంది. ఏ ఏ విభాగాల్లో... ►సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–18 జూనియర్ స్థాయిలో (1–12–2001 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్–24 సీనియర్ స్థాయిలో (1–12–1995 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. ►జూనియర్ స్థాయిలో ఆడేందుకు జూనియర్ కాలేజీ జట్లకు, సీబీఎస్ఈ స్కూల్ (ప్లస్ 11,12) జట్లకు, ఐటీఐ, పాలిటెక్నిక్ జట్లకు అర్హత ఉంది. ►సీనియర్ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కలి్పస్తారు. ఎన్ని జట్లకు అవకాశం... ►ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా మూడు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. మూడు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు. జట్ల నమోదు ఇలా.... ►సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలనుకునే జట్లు దరఖాస్తుతోపాటు మూడు డాక్యుమెంట్లను జత చేయాలి. ►డాక్యుమెంట్–1: కళాశాల లెటర్ హెడ్‌పై జట్టులోని 15 మంది ఆటగాళ్ల పేర్లు, ఫోన్ నంబర్లు రాసి ప్రిన్సిపాల్ సంతకం, రబ్బరు స్టాంపు వేసి పంపించాలి. ►డాక్యుమెంట్–2: 15 మంది ఆటగాళ్ల ఫోటోలు, వారి వివరాలు, పదో తరగతి పరీక్ష హాల్ టికెట్ నంబర్ రాసి, ఫోటోలపై ప్రిన్సిపాల్ సంతకం చేయాలి. చివర్లో ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ సంతకాలు, రబ్బరు స్టాంపుతో పంపించాలి. ►డాక్యుమెంట్–3: (మ్యాచ్ జరిగే రోజు ఇవ్వాలి): ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన డిక్లరేషన్ దరఖాస్తు చివర్లో ప్రిన్సిపాల్ సంతకం, రబ్బరు స్టాంపుతో పంపించాలి. ►ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం... www.arenaone.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. ధ్రువ పత్రాలు లేకుండా వచ్చిన ఎంట్రీలను పరిగణించరు. ముఖ్యమైన విషయం... ►మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు సంబంధించి పదో తరగతి మార్కుల మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. ►మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. ►గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం ఎంట్రీ ఫీజు... ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1200 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలి. www.arenaone.in వెబ్సైట్లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను డిసెంబర్ 22వ తేదీలోగా పంపించాలి. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు జోన్లుగా విభజించారు. ►జోన్–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉన్నాయి. (ఈ మూడు జిల్లాల మ్యాచ్‌లు మాత్రం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తారు) ►జోన్–2లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉన్నాయి. ►జోన్–3లో నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ ఉన్నాయి. ఒక్కో జోన్ నుంచి విజేత జట్టు రాష్ట్ర స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తుంది. టోర్నీ ఫార్మాట్ ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లపాటు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోరీ్నకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్లపాటు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 99120 35299, 96665 72244 (హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్) 95055 14424, 96660 13544 (వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్) -
సూర్యకు బతుకునిచ్చిన సాక్షి
సాక్షి, కోరుట్ల: ‘బాబుకు.. బతుకునివ్వరూ’ శీర్షికన ఈ నెల 8వ తేదిన సాక్షిలో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గొడిసెల సూర్య(14) అనే బాలుడు బ్రెయిన్ ఫీవర్‌తో బాదపడుతున్నాడు. తల్లిదండ్రులకు వైద్యం చేయించడం భారంగా మారింది. ఈ క్రమంలో సాక్షి ఆ కుటుంబ దయనీయ స్థితిపై కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు రూ.15 వేలు విరాళం అందించారు. జగిత్యాల జిల్లా బీజేపీ కార్యదర్శి ఇందూరి సత్యం రూ.5 వేలు విరాళం అందించారు. కోరుట్ల ప్రెస్‌క్లబ్ తరపున రూ.10వేల విరాళం ప్రకటించారు. ఆదుకున్న అర్వింద్ ఫౌండేషన్ బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతున్న సూర్య వైద్య సాయం కోసం అర్వింద్ ఫౌండేషన్ నిర్వహాకులు స్పందించారు. కోరుట్ల బీజేపీ నాయకులు ఇందూరి సత్యం సూర్య పరిస్థితిని అర్వింద్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లగా.. గురువారం ఫౌండేషన్ నిర్వహాకులు ధర్మపురి ప్రియాంక రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యను పరామర్శించారు. సూర్య వైద్యానికి ఆసుపత్రిలో అయిన ఖర్చులో దాదాపు రూ.68 వేలు ఫౌండేషన్ నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేశా రు. కుమారుని అనారోగ్యం విషయంలో మానవతా దృక్పథంతో స్పందించిన అర్వింద్ ఫౌండేషన్ నిర్వహకులు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు సూర్య తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. -
నాగల్‌గొంది.. తీరిన రంది
కెరమెరి: ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి వా రు అనుభవిస్తున్న కష్టాలు ఎట్టకేలకు దూరమయ్యాయి. కెరమెరి తహసీల్దార్ ప్రమోద్ ప్రత్యేక చొరవ తీసుకుని ఉన్న గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఓటర్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల తర్వాత అక్కడి ఆదివాసీలకు ఎట్టకేలకు స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావిస్తున్నారు. ఏళ్ల కష్టాలు దూరం.. మండలంలోని కరంజివాడ గ్రామ పంచాయతీ లోని నాగల్‌గొంది, కొలాంగూడ గ్రామాల్లో 379 జనాభా ఉంది. అందులో పురుష ఓటర్లు 113 కా గా.. మహిళలు 106 మొత్తం 219 ఓటర్లు ఉన్నా రు. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇందాపూర్, లేదా నిషాని గ్రామంలోని పోలింగ్ బూత్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేవారు. 70 ఏళ్లలో ఇప్పటికి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వారికి కష్టాలు తప్పలేదు. ఇందాపూర్‌కు వెళ్లాలంటే 15 కిలోమీ టర్లు కాగా, నిషాని గ్రామం 18 కిలోమీటర్ల దూ రంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏ కాలంలో ఏ ఎన్ని కలు జరిగిన వారు పాదయాత్రగా వెళ్లక తప్పలే దు. చాలా సందర్భాల్లో వానకు తడుస్తూ, ఎండ కు ఎండుతూ.. చలికి వణుకుతూ వెళ్లి ఓట్లు వేశా రు. ఎన్నికలు జరిగిన ప్రతీ సారి వారు దూరభా రం అధికమవుతుందని దగ్గర్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి ఓటర్లు కోరినప్పటికి అధికారులు పట్టించుకోలేదు. పోలింగ్ కేంద్రాల మార్పు రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉన్నప్పటికి మనకెందుకులే అనుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు ఓటు వేసేందుకు కష్టాలు చవిచూశారు. సాక్షి, తహసీల్దార్ ప్రత్యేక చొరవ ఈ విషయమై డిసెంబర్ 7న సాక్షి దినపత్రికలో ‘ఓట్ల కోసం తప్పని పాట్లు’ అనే కథనం ప్రచురి తం కావడంతో పాటు ఆ ప్రాంత ప్రజలు కెరమెరి తహసీల్దార్ ప్రమోద్ను వేడుకున్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్ అక్కడి ఓటర్లు, జనాభా తదితరాల వివరాలను సేకరించారు. అక్కడి ఓట ర్లు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడుతున్న విష యం వాస్తవమేనని గ్రహించిన ప్రమోద్‌కుమార్ వెంటనే నాగల్గొందిలోనే పోలింగ్ కేంద్రం ఏర్పా టు చేశారు. నేడు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు వారు నాగల్‌గొంది గ్రామంలో ఏర్పాటు చేసిన పో లింగ్ బూత్ సంఖ్య 90లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దూరభారం తగ్గింది చాలా కాలంగా ఓట్లు వేయడానికి పడుతున్న కష్టం ఎట్టకేలకు ముగిసింది. ఇక చక్కగ తమ గ్రామంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రెవెన్యూ అధికారులు కల్పించారు. సరైన రోడ్డు సౌకర్యం లేక , దూరభారం అధికంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. – మధుకర్ సర్పంచ్, నాగల్‌గొంది ఓటర్ల బాధలు చూసి.. ఓటర్లు టు వేసేందుకు పడుతున్న బాధనలు చూ సి వారు ఉండే గ్రామంలోనే పోలింగ బూత్ కేంద్రం ఏర్పాటు చే యాలని భావించాం. వెంటనే అధికారులకు నివేదికలు సమర్పించండంతో అక్కడ నూతనంగా పోలింగ్ బూత్ కేంద్రం మంజూరైంది. దీనికి ‘సాక్షి’ కూడా తోడైంది. ప్రజల బాధలు తీరాయి. దూరభారం తగ్గింది. – వి.ప్రమోద్, తహసీల్దార్ -
సాక్షిపై ఎమ్యెల్యే శంకర్ అక్కసు
ఆయన ఒక ప్రజాప్రతినిధి. ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవాల్సిన వ్యక్తి. మూడేళ్లుగా రోడ్డు పనులు చేయించకపోవడంపై స్థానికలు నిలదీయడంతో విచక్షణ కోల్పోయారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరిపై చిందులేశారు. వార్త రాసి ఏం పీకుతారంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సంఘటన పెద్దమండ్యం మండలంలో బుధవారం జరిగింది. ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు, పెద్దమండ్యం: మండలంలోని మందలవారిపల్లె నుంచి తుమ్మలవంకతండా వరకు రూ.4.50 కోట్లతో తారు రోడ్డు, పెద్దేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్యె ల్యే శంకర్‌యాదవ్ బుధవారం శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం గ్రామ పరిధిలోని దేనేనాయక్ తండాకు వెళ్లారు. అక్కడ స్థానికులతో మాట్లాడుతూ తండాలను కలుపుతూ రోడ్డు వేశామని తెలిపారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ తండాల్లో సిమెంటు రోడ్లు ఎందుకు వేయలేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద తండాలో సిమెంటు రోడ్లు వేసేందుకు మూడేళ్ల క్రితం కంకర, ఇసుక తోలి అలాగే వదిలేశారని మండిపడ్డారు. తండాల్లో సిమెంటు రోడ్ల కోసం రూ.60 లక్షలు వచ్చిందని చెప్పి కంకరు, ఇసుక తోలి వదిలేస్తే ఏం ఉపయోగమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న సాక్షి విలేకరి ఫొటోలు తీస్తుండగా ఎమ్యెల్యే గమనించారు. విచక్షణ కోల్పోయారు. సాక్షి పేపరులో వార్త రాసి ఏం పీకుతారంటూ చిందులేశారు. అనంతరం దండువారిపల్లెకు రూ.1.23 కోట్లతో చేపట్టనున్న తారురోడ్డు పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇక్కడా ఎమ్మెల్యేకు గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఐదేళ్లుగా రోడ్డు వేయకుండా ఇప్పుడు వచ్చారా అంటూ నిలదీశారు. -
సాక్షి విలేకరిపై మంత్రి సోమిరెడ్డి చిందులు
సాక్షి, అమరావతి : సాక్షి టీవీ ప్రతినిధి సతీష్‌పై మంత్రి సోమిరెడ్డి చిందులు తొక్కారు. అన్ని ప్రశ్నలు మీరే ఎందుకు అడుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వేరే విలేకరులు కూడా ఉన్నారు కదా అంటూ చిర్రుబుర్రులాడారు. రైతు భరోసా కింద కేంద్రం ఇస్తున్న సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని కలిపి మొదటి విడతగా రూ. ఐదువేలు చెక్కు ఒక్కో రైతుకు ఇస్తున్నట్లు మంత్రి చెప్పగానే.. విలేకరి జోక్యం చేసుకుంటూ రబీ పూర్తయింది, ఖరీఫ్ పంట వేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుంది. ఇప్పుడు ఎందుకు రైతులకు చెక్‌లు ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నేనెందుకు సమాధానం చెప్పాలంటూ వేరే అంశంపై మాట్లాడారు. ఈ ఘటన బుధవారం సచివాలయంలోని రెండో బ్లాక్ వద్ద మీడియాతో మంత్రి మాట్లాడుతున్నప్పుడు జరిగింది. -
చిన్నాచితకా మనిషిని కాను
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామంటూ ఉన్నతాధికారుల వద్ద గొప్పలు.. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దానిని కార్యదర్శులపైకి నెట్టి వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు.. వాస్తవాలు రాసే సాక్షి విలేకరికి బెదిరింపులు.. నేను ఏదైనా చేస్తానంటూ హూంకరింపులు.. ఇవీ పంచాయతీల్లో ప్రజల సొమ్మును అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్న ‘చిన్న’ అధికారి లీలలు. అప్పనంగా ప్రైవేటు సంస్థలకు.. జిల్లా పంచాయతీ కార్యాలయంలో షాడో కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న డివిజనల్ స్థాయిచిన్న అధికారి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ అధికారి పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామంటూ ఉన్నతాధికారుల వద్ద గొప్పలు పోతున్నారు. పారిశుధ్యం నిమిత్తం ప్రవేశపెట్టిన ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఎక్కువ ధరకు కొని నిధులు గోల్మాల్ చేసిందే కాక.. వాటిని స్కానింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థకు అప్పనంగా నిధులు దోచిపెడుతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేయకున్నా.. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించకున్నా.. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్‌లను మాత్రం తప్పనిసరిగా స్కానింగ్ చేయాలంటూ కార్యదర్శులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఒక్కో స్కానింగ్‌కు రూ.3.50 చొప్పున అప్పనంగా కట్టబెడుతున్నారు. కార్యదర్శులంటే ‘చిన్న’చూపు ఈ అధికారి కార్యదర్శులంటే చిన్నచూపు చూస్తున్నారు. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు స్కానింగ్ చేయని కార్యదర్శులపై విరుచుకుపడుతున్నారు. పంచాయతీల్లో చెత్త సేకరించే సిబ్బంది లేకపోవడం, గ్రీన్వెహికల్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల పారిశుధ్య పనులు సాగడం లేదు. అయినా ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు స్కాన్ చేయాలని కార్యదర్శులను ఆదేశిస్తున్నారు. మాట వినని కార్యర్శులను దుర్భాషలాడుతున్నారు. పంచాయతీలపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం జిల్లాలో ప్రతి మండలంలోనూ ఈ అధికారి ప్రైవేటుగా శానిటరీ ఇన్స్పెక్టర్ అంటూ కొంతమందిని నియమించి వారి ద్వారా కార్యదర్శులపై పెత్తనం చెలాయిస్తున్నారు. అంతే కాకుండా డివిజనల్ పంచాయతీ అధికారులనూ అజమాయిషీ చేస్తున్నారు. దీంతో ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామో అర్థంకాని పరిస్థితి పంచాయతీ క్షేత్రస్థాయి అధికారుల్లో నెలకొంది. ‘ప్రత్యేక’ పోస్టుతో మెమోలు ఈ అధికారి ఏ జిల్లాలోనూ లేని విధంగా పరిశుభ్రతపై ప్రత్యేక పోస్టును సృష్టించుకుని కార్యదర్శులకు మెమోలు జారీ చేయడమూ అధికారయంత్రాంగంలో చర్చనీయాంశమవుతోంది. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఉద్యోగులకు ఎన్జీఓల అండ ఈ అధికారి వల్ల జిల్లాలో ఎక్కడైనా పంచాయతీ ఉద్యోగులు ఇబ్బందులు పడితే తమ దృష్టికి తీసుకురావాలని, ఏ ఉన్నతాధికారి వల్ల ఇబ్బందులకు గురికావద్దని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్ చెప్పారు. ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘సాక్షి’కి బెదిరింపులు తన లీలలపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో చిన్న అధికారికి కోపమొచ్చింది. ఆదివారం ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ‘మీరు రాసుకుంటే.. నాలాంటి మెంటలోడు ఉంటాడు ఏదైనా చేయొచ్చుగా.. నేను ఏదైనా చేస్తా’ అంటూ హెచ్చరించారు. దూషణలకు దిగారు. -
సాక్షి ఫొటోగ్రాఫర్‌కు గాయాలు
సాక్షి, వైఎస్సార్ కడప : సాక్షి మీడియా సంస్థలో పనిచేస్తున్న ఫొటోగ్రాఫర్ రమేష్‌ను బైక్ ఢీకొట్టింది. నూతన సంవత్స వేడుకల సందర్భంగా కడప పట్టణంలోని ఏడురోడ్ల కూడలి వద్ద ఫొటోలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం సేవించి వాహనం నడిపిన యువకులు అతివేగంగా వచ్చి రమేష్‌ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని తిరుమల ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. -
పరిటాల శ్రీరాం రాజ్యాంగేతర శక్తి
అనంతపురం: గతంలో పరిటాల రవీంద్ర హయాంలో జిల్లాలో ఎలా దౌర్జన్యాలు జరిగాయో ఈరోజు పరిటాల సునీత మంత్రి అయిన తర్వాత ఆ కుటుంబం అదే తరహాలో దౌర్జన్యాలకు పాల్పడుతోందని, శ్రీరాం రాజ్యాంగేతర శక్తిగా మారారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరాం, ఎమ్మెల్యే పార్థసారథి ‘సాక్షి’ కార్యాలయం వద్ద ధర్నా చేసి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడిన తీరును నిరసిస్తూ శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా పరిటాల కుటుంబం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఓఎస్డీ స్వామికి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో పత్రికాస్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ పథకం చూసినా అవినీతిమయం చేశారన్నారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను లాగేసుకుంటున్నారన్నారు. పత్రికలు కాని, రాజకీయ పార్టీలు ప్రశ్నించినా వారిపై దౌర్జన్యాలు చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం, ఆస్తుల, ప్రాణ నష్టం కల్గించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అభివృద్ధి పేరుతో మంత్రి సునీత సాగిస్తున్న దోపిడీని ‘సాక్షి’ పత్రిక ప్రచురించిందన్నారు. నియోజకవర్గంలో తన బంధువులను మండలానికి ఒక ఇన్చార్జిని నియమించుకుని సాగిస్తున్న దోపిడీపై కథనం వచ్చిందన్నారు. ఇందులో ఏవైనా తప్పులుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పరిటాల సునీత మంత్రి హోదాలో ఉన్నా.. తనయుడు పరిటాల శ్రీరాం ‘సాక్షి’ కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా గతంలో ‘సాక్షి’ కార్యాలయం ఎదుట రచ్చ చేశారన్నారు. వారి అవినీతి అక్రమాలు ‘సాక్షి’లోనే కాదు తక్కిన పత్రికల్లో కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను భయభ్రాంతులకు గురచేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే కుటిల ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ఎవరూ జీర్ణించుకోరని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు పూర్తిగా కీలుబొమ్మలుగా మారాయన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారన్నారు. పత్రికలపై దాడులకు పా ల్పడాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. ఏకంగా పత్రికా కార్యాలయానికి వచ్చారంటే వారు దేనికైనా తెగిస్తారనేది అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్ర«ధా న కార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ మంత్రి కుటుంబానికి ఉన్నది ఉన్నట్లు రాస్తే అంత ఉలుకెందుకన్నారు. ఆరు మండలాల్లోనూ తమ బంధువులను ఇన్‌చార్జ్‌లుగా నియమించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వారి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుందని, దాన్నికూడా హరించాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి కుటుంబం సాగిస్తున్న దందా ప్రజలందరికీ తెలుసన్నారు. గాలి మరల నుంచి రైల్వే టెండర్ల దాకా ప్రతిదాంట్లోనూ దోచుకుంటున్నారన్నారు. నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఒక ఓటుకు ఐదుగురు మంత్రులు, ఎమ్మెల్యేలయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రి సునీత బంధువులు మండలానికో ఇన్చార్జ్ కాదని ఎమ్మెల్యే, మంత్రిలా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, గౌస్‌బేగ్, మహానందరెడ్డి, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మైనుద్దిన్, పెన్నోబులేసు, తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం నరేంద్రరెడ్డి, ఎద్దుల రాజేష్, మహిళా విభాగం వాసంతి సాహిత్య, కొండమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు. ఉనికి కోసమే ‘సాక్షి’పై బెదిరింపులు రాప్తాడు నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా మంత్రి సునీత కుటుంబం చేస్తున్న దోపిడీపై పత్రికల్లో లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. ఆధారాలతో సహా ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన రోజే కథనం రావడంతో పరిటాల కుటుంబం టీడీపీలో ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. తమ ప్రతిష్ట దిగజారుతోందనే ఆక్రోషంతో మంత్రి సునీత తన కుమారుడు శ్రీరాం, మరికొందరు గూండాలను ఉసిగొలిపి ‘సాక్షి’ పత్రిక జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలో ఆమె తనయుడు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సమాజంలో నాలుగో స్తంభమైన మీడియాను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో నోరెత్తిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుంది. ఇందుకోసమే ‘సాక్షి’కి అండగా నిలుస్తున్నాం. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త