సాక్షిలో గెస్ట్‌ ఎడిటర్‌ | Inter student guest editor in sakshi | Sakshi
Sakshi News home page

సాక్షిలో గెస్ట్‌ ఎడిటర్‌

Published Thu, Oct 12 2017 3:25 AM | Last Updated on Thu, Oct 12 2017 3:25 AM

Inter student guest editor in sakshi

బుధవారం ఎడిటోరియల్‌ సమావేశంలో పాల్గొన్న కృష్ణ ప్రియ. చిత్రంలో సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్‌ మురళి, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ దిలీప్‌రెడ్డి తదితరులు

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థిని కృష్ణప్రియ బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో గెస్ట్‌ ఎడిటర్‌ పాత్ర పోషించింది. ఎడిటోరియల్‌ సమావేశంలో పాల్గొని వార్తల ఎంపికలో చురుగ్గా వ్యవహరించింది. పత్రికా సిబ్బంది విధి నిర్వహణ, స్థానిక, జాతీయ,  అంతర్జాతీయ వార్తలు, సంఘటనలపై ఆసక్తిని ప్రదర్శించింది. బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నగరంలోని రాణిగంజ్‌కు చెందిన కృష్ణప్రియకు ‘సాక్షి’ ఈ అరుదైన అవకాశాన్ని  కల్పించింది.

అంతకుముందు ‘సాక్షి’ కార్యాలయంలో అప్సా, ప్లానింగ్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ దిలీప్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో అప్సా డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ప్లానింగ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రోగ్రాం  మేనేజర్‌ శాంతి, ప్రతినిధులు పద్మ, పార్వతి, సత్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement