గుజరాత్‌లో బీజేపీ దుమ్మురేపింది. రికార్డు స్థాయిలో సీట్లను కొల్లగొట్టి ప్రభంజనాన్ని సృష్టించింది. మోదీ- షా సొంత రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకుంది కమల దళం. మోదీ మ్యాజిక్‌తో 156 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది.
బీజేపీ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది. 20 సీట్లు కూడా గెలవలేక చతికిలపడింది. గుజరాత్‌లో ఎన్నికల ఆరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 12శాతం ఓట్లను కొల్లగొట్టింది. డిసెంబర్ 12న భూపేంద్ర పటేల్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో గుజరాత్‌లో బీజేపీ గెలుపుకు దోహం చేసిన అంశాలేవీ?. గుజరాత్‌లో గెలిచింది బీజేపీనా? మోదీనా?. బలమైన నేతలను ఆకట్టుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందా?. రాబోయే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతోంది? రాహుల్ జోడో యాత్ర, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఖర్గే ప్రభావం ఎక్కడ? వంటి అనేక అంశాలపై సాక్షి విశ్లేషణ..
Comments
Please login to add a commentAdd a comment