నరేంద్ర రికార్డులను భూపేంద్ర బ్రేక్ చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కమళనాథులకు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 127 సీట్లు రావడమే బీజేపీ ఖాతాలోకి అత్యధిక రికార్డు. ఇప్పుడు బీజేపీ దాన్ని తిరగరాసింది. ఏకంగా 156 సీట్లను చేజిక్కించుకుంది. మాధవ్‌సిన్హ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ నెగ్గిన 149 సీట్ల రికార్డునూ బీజేపీ ప్రస్తుతం తిరగరాయడం విశేషం. విపక్షాల మధ్య ఓట్ల చీలిక వచ్చినా... బీజేపీ ఏకంగా 53 (ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం) శాతం ఓట్లు సాధించడం కూడా రికార్డే.
కమలనాథులకు ఈ స్థాయిలో ఓట్లు గతంలో ఎప్పుడూ రాలేదు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు 1977 నుంచి 2011 వరుసగా ఏడు పర్యాయాలు అధికారాన్ని చేపట్టాయి (34 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించాయి). గుజరాత్‌లో 1998 నుంచి నిరంతరాయంగా అధికార పీఠంపై ఉన్న బీజేపీ వరుసగా ఏడోసారి నెగ్గి ఈ రికార్డును సమయం చేసింది.
►గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాట్‌లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజారిటీతో గెలిచారు.
► క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జామ్‌నగర్ నార్త్‌లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెల్చారు.
► పటీదార్ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ అర్బన్ వీరమ్‌గ్రామ్ స్థానంనుంచి ఆప్ అభ్యర్థిపై గెలిచారు.
► వదగామ్ (ఎస్సీ) స్థానంలో గతంలో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దళిత నేత జిగ్నేశ్ మేవానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు.
► హార్దిక్ మాజీ సన్నిహితుడు, పటీదార్ నేత అల్పేశ్ కథిరియా వరఛా రోడ్ (సూరత్) స్థానంలో విజయఢంకా మోగించారు.
► కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన గాంధీనగర్ (సౌత్) నియోజకవర్గ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ సైతం గెలిచారు.
ఓడిన ప్రముఖులు
► గుజరాత్ ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కటర్‌గామ్‌లో ఓడారు.
► ఆప్ సీఎం అభ్యర్థి ఎసుదాన్ గాఢ్వీ ఖంభలియా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
► ప్రాథమిక, యువజన విద్యాశాఖ సహాయ మంత్రి కీర్తిసిన్హా వాఘేలా, ఏడుగురు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు.
► ఇక హిమాచల్‌లో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగిన ఆశాకుమారి, రామ్‌లాల్ ఠాకూర్, కౌల్‌సింగ్ ముగ్గురూ ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment