hardhik patel
-
గుజరాత్ ఎన్నికలు.. గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే!
నరేంద్ర రికార్డులను భూపేంద్ర బ్రేక్ చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కమళనాథులకు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 127 సీట్లు రావడమే బీజేపీ ఖాతాలోకి అత్యధిక రికార్డు. ఇప్పుడు బీజేపీ దాన్ని తిరగరాసింది. ఏకంగా 156 సీట్లను చేజిక్కించుకుంది. మాధవ్‌సిన్హ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ నెగ్గిన 149 సీట్ల రికార్డునూ బీజేపీ ప్రస్తుతం తిరగరాయడం విశేషం. విపక్షాల మధ్య ఓట్ల చీలిక వచ్చినా... బీజేపీ ఏకంగా 53 (ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం) శాతం ఓట్లు సాధించడం కూడా రికార్డే. కమలనాథులకు ఈ స్థాయిలో ఓట్లు గతంలో ఎప్పుడూ రాలేదు. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు 1977 నుంచి 2011 వరుసగా ఏడు పర్యాయాలు అధికారాన్ని చేపట్టాయి (34 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించాయి). గుజరాత్లో 1998 నుంచి నిరంతరాయంగా అధికార పీఠంపై ఉన్న బీజేపీ వరుసగా ఏడోసారి నెగ్గి ఈ రికార్డును సమయం చేసింది. ►గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజారిటీతో గెలిచారు. ► క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జామ్‌నగర్ నార్త్‌లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెల్చారు. ► పటీదార్ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ అర్బన్ వీరమ్గ్రామ్ స్థానంనుంచి ఆప్ అభ్యర్థిపై గెలిచారు. ► వదగామ్ (ఎస్సీ) స్థానంలో గతంలో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దళిత నేత జిగ్నేశ్ మేవానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ► హార్దిక్ మాజీ సన్నిహితుడు, పటీదార్ నేత అల్పేశ్ కథిరియా వరఛా రోడ్ (సూరత్) స్థానంలో విజయఢంకా మోగించారు. ► కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన గాంధీనగర్ (సౌత్) నియోజకవర్గ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ సైతం గెలిచారు. ఓడిన ప్రముఖులు ► గుజరాత్ ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కటర్గామ్లో ఓడారు. ► ఆప్ సీఎం అభ్యర్థి ఎసుదాన్ గాఢ్వీ ఖంభలియా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ► ప్రాథమిక, యువజన విద్యాశాఖ సహాయ మంత్రి కీర్తిసిన్హా వాఘేలా, ఏడుగురు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. ► ఇక హిమాచల్‌లో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగిన ఆశాకుమారి, రామ్‌లాల్ ఠాకూర్, కౌల్సింగ్ ముగ్గురూ ఓటమి చవిచూశారు. -
కేజ్రీవాల్‌కు దిమ్మతిరిగే షాకులిస్తున్న బీజేపీ.. ఎన్నికలపై ఎఫెక్ట్ ఎంత?
ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయాలతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. పలు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు వినూత్న ప్లాన్స్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గుజరాతీలకు కీలక హామీలు సైతం ఇస్తున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలపై కూడా ఆప్ సర్కార్ ఫోకస్ పెంచింది. కానీ.. కేజ్రీవాల్‌కు అనుకోని రీతిలో కొన్ని షాక్‌లు తగులుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్.. ఆప్ నేతలను టార్గెట్ చేయడంతో కేజ్రీవాల్ ఢిల్లీ డిఫెన్స్‌లో పడినట్టు తెలుస్తోంది. కాగా, లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్ట్ చేయడం, తీహార్ జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌కు అధికారులు సపర్యలు చేయడం వంటి వీడియోలు బయటకు రావడంతో అనుకోని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఆప్‌పై బీజేపీ ముప్పెట దాడి చేస్తోంది. #WATCH | Latest CCTV footage sourced from Tihar jail sources show Delhi Minister Satyendar Jain getting proper food in the jail. Tihar Jail sources said that Satyendar Jain has gained 8 kg of weight while being in jail, contrary to his lawyer's claims of him having lost 28 kgs. pic.twitter.com/cGEioHh5NM — ANI (@ANI) November 23, 2022 కాగా, ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఆప్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ప్రజల దృష్టికి ఇటీవల జరిగిన ఘటనలపై ప్రచారం మొదలుపెట్టింది. ఇక, మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్.. నవంబర్ 25వ తేదీ నుంచి ప్రచారంలోకి దిగనున్నారు. రోడ్ షోలు, ఢిల్లీలో పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. తాము ఢిల్లీలో చేసిన అభివృద్ధే తమకు విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆప్ గెలుపే టార్గెట్‌గా పౌర సమస్యలపై దృష్టిపెట్టింది. Delhi minister & AAP leader Satyendar Jain getting a massage inside Tihar jail. Tihar Jail is run by the Department of Delhi Prisons under the Government of Delhi. pic.twitter.com/xKjTay434L — Anshul Saxena (@AskAnshul) November 19, 2022 ఇదిలా ఉండగా.. గుజరాత్ ఎన్నికల్లో కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. ఇక, గుజరాత్లో ఎన్నికలపై పలు సర్వేలు సైతం ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆప్‌కు గుజరాత్లో మంచి ఆదరణ ఉందని సర్వేలు చెప్పుకొచ్చాయి. మరోవైపు.. గుజరాత్లో బీజేపీలో చేరిన పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పటేల్.. 2015లో పాటిదార్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఈ పోరాటం బీజేపీకి వ్యతిరేకంగానే కొనసాగింది. కానీ, ఇటీవల హార్దిక్.. కాషాయతీర్థం పుచ్చుకోవడంతో ఆయనపై పాటిదార్లు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇక, గుజరాత్‌లోని విర్మగం అసెంబ్లీ స్థానం నుంచి హార్దిక్ పటేల్ పోటీలో నిలిచారు. Good Days ahead for @HardikPatel_ 'Will slap him': Patidars upset with Hardik Patel for fighting on BJP tickethttps://t.co/EE4r2nuXdS — Sanjay Karan (@SanjayK53544321) November 23, 2022 -
ఎన్నికల రేసులో క్రికెటర్ జడేజా భార్య.. బీజేపీ సీటుపై అక్కడ పోటీ
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ తమ పార్టీ తరఫున అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాగా, ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, గురువారం ఉదయం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల పేర్లను బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్ ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 160 స్థానాల్లో పోటీ చేస్తున్న వారి వివరాలను వెల్లడించారు. కాగా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్.. ఘట్లోదియా నియోజకవర్గం నుంచి, హోంశాఖ మంత్రి హర్ష సంఘ్వీ మజురా నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా.. నార్త్ జామ్‌నగర్ నుంచి బరిలో దిగనున్నారు. ఇక, ఇటీవలి కాలంలో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేతలకు సైతం కాషాయ పార్టీ టికెట్స్ ఇచ్చింది. మాజీ కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్.. విరాంగ్రామ్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక, ఇటీవల మోర్బి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ టికెట్ ఇవ్వలేదు. అలాగే, 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం బీజేపీ టికెట్ ఇవ్వకపోవడం విశేషం. Delhi | BJP announces the list of its candidates for #GujaratAssemblyPolls , CM Bhupendra Patel to contest the elections from Ghatlodiya constituency. pic.twitter.com/j2V67IAaBc — ANI (@ANI) November 10, 2022 ఇక, గుజరాత్లో 182 స్థానాలకు గానూ రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశలో 89 స్థానాలకు డిసెంబర్ 1న, రెండో దశలో 93 స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. -
గుజరాత్: బీజేపీలో చేరిన పటీదార్ నేత హార్ధిక్ పటేల్
గాంధీనగర్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరేముందు హార్దిక్ ట్విటర్లో పోస్టు పెట్టారు. తన జీవితంలో మరో కొత్త అధ్యయం మొదలు కాబోతుందని ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం కోసం ఒక చిన్న సైనికుడిగా పనిచేయనున్నట్లు తెలిపారు. యావత్ ప్రపంచానికే మోదీ ఆదర్శంగా నిలుస్తున్నారని హార్దిక్ అన్నారు. ఇక గాంధీనగర్ బీజేపీ పార్టీ కార్యాలయం చుట్టూ హార్దిక్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా 28 ఏళ్ల యువ పాటిదార్ నేత 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2020లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకయ్యారు. అయితే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాలపై అసంతృప్తి చెందిన హర్దిక్ బహిరంగంగా ఆ పార్టీని విమర్శిస్తూ వచ్చారు. కొన్ని రోజులకు(మే 18న) కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా రాజీనామా చేశారు. తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. చదవండి: మా చేతులు కట్టేసినట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్ ఖాన్ అయితే తాను పదవి కోసం ఎప్పుడు పాకులాడలేదని, ఎవరి ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదన్నారు. ప్రజల కోసం పనిచేయడానికే బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మరికొన్ని నెలల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: బీజేపీ దూకుడు.. నష్టం తప్పదన్న సీనియర్ నేత -
మోదీ నాయకత్వంలో చిన్ని సైనికుడిలా..
గుజరాత్ యువ ఉద్యమనేత, కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ హర్ధిక్ పటేల్.. బీజేపీలో చేరే అంశంపై అధికారికంగా స్పందించాడు. ఈ మేరకు బీజేపీలో చేరుతున్న విషయాన్ని ధృవీకరిస్తూ గురువారం ఉదయం ఒక ట్వీట్ చేశాడు. దేశప్రయోజనం, రాష్ట్రప్రయోజనం, ప్రజాప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాల భావాలతో నేటి నుంచి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాను. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో.. దేశానికి సేవ చేసే గొప్ప పనిలో నేను చిన్న సైనికుడిలా పని చేస్తాను అంటూ హిందీలో ఓ ట్వీట్ చేశాడు హర్ధిక్ పటేల్. బీజేపీలో చేరే ముందు హర్ధిక్ పటేల్ పూజాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. పాటీదార్ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన 28 ఏళ్ల ఈ యువనేత.. 2019లో కాంగ్రెస్‌లో చేరాడు. అనంతరం, కాంగ్రెస్ అధిష్టానం పటేల్‌కు గుజరాత్ పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది. దీంతో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవాలని భావించిన పటేల్‌కు అనుహ్యంగా పార్టీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గుజరాత్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు, పార్టీ పెద్దల నుంచి సహాకారం అందకపోవడంతో పటేల్.. అధిష్టానం తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा। — Hardik Patel (@HardikPatel_) June 2, 2022 Gujarat | Hardik Patel performs 'pooja' at his residence in Ahmedabad. He will be joining Bharatiya Janata Party today. pic.twitter.com/AqMboWjs7e — ANI (@ANI) June 2, 2022 ఇది కూడా చదవండి: 13 ఏళ్ల తర్వాత కుటుంబంతో సినిమా చూశా!.. భార్యతో అమిత్ షా సరదా వ్యాఖ్య -
బీజేపీలోకి కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్.. డేట్ ఫిక్స్?
కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, పాటిదార్ నేత హార్ధిక్ పటేల్.. బీజేపీలో చేరుతున్నారు. గుజరాత్ మాజీ కాంగ్రెస్ నేత పటేల్.. గురువారం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి బీజేపీ పెద్దలతో మంతనాలు పూర్తి అయినట్టు జాతీయ మీడయాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, అంతకు ముందు హార్దిక్ పటేల్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ తనను వేధిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు ఈ విషయాన్ని తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు నిజం కాదంటూ హార్ధిక్ పటేల్ కొట్టి పారేశారు. కానీ, అనూహ్యంగా గురువారం ఆయన బీజేపీ తీర్థం తీసుకుంటున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న వేళ పాటిదార్ నేత పటేల్ బీజేపీలో చేరడం కాషాయ పార్టీకి ఎంతో మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సీనియర్లకు బిగ్ షాక్ -
ఆమ్ ఆద్మీ పార్టీ.. మరో కాంగ్రెస్‌లా మారుతుందా: హార్ధిక్ పటేల్
కాంగ్రెస్ మాజీ నేత, మాజీ పీసీసీ చీఫ్ హార్దిక్ పటేల్ సోమవారం బీజేపీలో చేరుతున్నారా..? కాషాయ కండువా కప్పుకోవడానికి ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై హార్దిక్ పటేల్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఫేక్ అంటూ చెక్ పెట్టారు. "నేను సోమవారం బీజేపీలో చేరడం లేదు.. అలాంటిదేమైనా జరిగితే మీకు తెలియజేస్తాను" అని పటేల్ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రముఖ పంజాబీ సింగ్ సిద్ధూ మూస్వాలా హత్య నేపథ్యంలో పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ దారుణ ఘటన అనంతరం పటేల్ ట్విట్టర్ వేదికగా.. "ఏ ప్రభుత్వమైనా అస్తవ్యస్తంగా పాలన చేస్తే ఇలాంటి విషాద ఘటనలే చోటుచేసుకుంటాయి. కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడి దారుణ హత్య, ఇప్పుడు ప్రముఖ యువ కళాకారుడు సిద్ధూ మూసావాలేను కాల్చి చంపారు.. ఈ ఘటనలు భద్రతను ప్రశ్నిస్తున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయా.. పంజాబ్‌కు బాధ కలిగించడానికి కాంగ్రెస్‌లాగా మరో పార్టీగా మారాలనుకుంటున్నారా లేదా ప్రజలకు నిజంగా ఏదైనా చేయాలనుకుంటున్నారా అనేది ఆలోచించుకోవాలి. సిద్ధూ మూసేవాలాకు నా నివాళి." అని పేర్కొన్నారు. కాగా, అంతకు ముందు హార్ధిక్ పటేల్.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో హస్తం పార్టీకి రాజీనామా చేశారు. గుజరాత్ లో పటీదార్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్ధిక్ పటేల్.. ఎన్నికల సమయంలో ఇలా పార్టీ నుంచి వెళ్లిపోవడం కాంగ్రెస్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్‌ను వీడటంతో బీజేపీలో చేరుతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇది కూడా చదవండి: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా? -
కాంగ్రెస్‌లో కుదుపు.. భారీ షాకిచ్చిన సీఎం సన్నిహితుడు
దేశంలో కాంగ్రెస్‌పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. ఇటీవల సంస్థాగత మార్పులే లక్ష్యంగా రాజస్థాన్ వేదికగా చింతన్ శిబిర్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇంతలోనే రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎం అశోక్ గెహ్లాట్ అత్యంత సన్నిహితుడైన గణేశ్ ఘోగ్రా.. హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గణేశ్ ఘోగ్రా.. రాజస్థాన్‌లోని డంగార్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, తాను సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం, ప్రజా సమస్యలు చెప్పినా.. పార్టీలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌కు, సీఎం గెహ్లాత్‌కు, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. గుజరాత్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘నా నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారనని నమ్ముతున్నాను. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ద్వారా భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నాను’ అని ట్విటర్లో రాసుకొచ్చారు. -
కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన సీనియర్ నేతలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. తాజాగా తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అశ్విన్ కోత్వాల్ రాజీనామా చేశారు. ఇక, గుజరాత్ పీసీసీ చీఫ్ హార్ధిక్ పటేల్ తన ట్విట్టర్ ఖాతాలో బయో నుంచి కాంగ్రెస్ పార్టీని తొలగించారు. దీంతో రాజకీయంగా దీనిపై చర్చ నడుస్తోంది. కాగా, ఖేద్బ్రహ్మ నియోజకవర్గం ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ మంగళవారం తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నీమాబేన్ ఆచార్యకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఉన్న గిరిజనులు అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. బీజేపీ వల్లే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని తాను నమ్ముతున్నానని కొత్వాల్ కామెంట్స్ చేశారు. అయితే, అశ్విన్ కొత్వాల్ 2007 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇక హార్ధిక్ విషయానికొస్తే.. కాంగ్రెస్ పార్టీని వీడతారంటూ జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఆయన ఇలా వ్యవహరించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ట్విట్టర్ బయోగా ఉన్న ‘వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ గుజరాత్ కాంగ్రెస్’ను హార్ధిక్ తొలగించారు. ప్రస్తుతం ‘ప్రౌడ్ ఇండియన్ ప్యాట్రాయిట్. సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్’ అని తన బయోగా మార్చేశారు. -
స్వరం మార్చిన కాంగ్రెస్ చీఫ్.. బీజేపీపై ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హస్తం నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నారు. కాగా, భవిష్యత్ ప్రణాళికలపై ఇప్పటికే కాంగ్రెస్ చర్యలకు దిగింది. పార్టీ ప్రక్షాళనకు ప్లాన్స్ తయారుచేస్తోంది. అయితే, ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. తాజాగా గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే హర్ధిక్ పటేల్.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేయగా.. శుక్రవారం మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉన్నఫలంగా తాను రాముడి భక్తుడినని ప్రకటించుకొన్నారు. హఠాత్తుగా హార్ధిక్.. హిందుత్వ బాణిని వినిపించారు. అలాగే బీజేపీని ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు. ‘‘బీజేపీకి సంబంధించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. వాటిని మనం అంగీకరించాలి. రాజకీయంగా ఇటీవల బీజేపీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించాలి. అలాంటి చర్యలు తీసుకునే శక్తి వారికి ఉందని మనం అంగీకరించాలి. అలాగే గుజరాత్లో కాంగ్రెస్ బలంగా మారాంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. నిర్ణయాధికారాన్ని మెరుగుపరచుకోవాలి’’ అన్ని అన్నారు. మరోవైపు.. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై హార్ధిక్ పటేల్ స్పందిస్తూ.. తాను పార్టీ మారాలా? వద్దా అన్నది మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నానని అన్నారు. బీజేపీలో చేరే ఆలోచనలేదని తెలిపారు. కాగా, హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ సందర్భంగా తాను పీసీసీ బాధ్యతలు నిర్వర్తించలేనని చెప్పినట్లు సమాచారం. తన పనులకు కొందరు అడ్డుతగులుతున్న కారణంగా ప్రజల పక్షాన పోరాడలేకపోతున్నానని గుజరాత్ నేతలపై అధిష్టానానికి హార్ధిక్ ఫిర్యాదు చేశారు. -
టైం వేస్ట్ చేసుకోకండి.. కాంగ్రెస్ చీఫ్‌కు ‘ఆప్’ భారీ ఆఫర్
గాంధీనగర్: ఎన్నికల వేళ గుజరాత్ పాలిటిక్స్‌లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్‌గురు.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ హస్తం పార్టీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో తమ పార్టీ(ఆప్)లో చేరాలని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా కోరారు. శుక్రవారం ఇటాలియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ పటేల్ వంటి అంకిత భావంతో పనిచేసే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండదు. పటేల్‌కు కాంగ్రెస్‌లో ఉండటం ఇష్టం లేకపోతే వెంటనే ఆప్‌లో చేరాలి. పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు ఆప్ గౌరవమిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. హార్దిక్ పటేల్ సమయం వృథా చేసుకోకుండా ఆప్‌లో చేరండి. ఆప్ గెలుపునకు సహకరించండి’’ అని అన్నారు. ఇటాలియా ఇలా కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, అంతకు ముందు హార్దిక్ పటేల్.. రాష్ట్ర పార్టీ నాయకులు తనను వేధిస్తున్నారని, తాను పార్టీ విడిచి వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ అధిష్టానం కూడా తనను పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. రాష్ట్ర పార్టీ తనను వేధిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. If Hardik Patel is not liking in Congress, he should join a like-minded party like AAP. Instead of complaining to Congress, wasting his time, he should contribute here... A party like Congress would not have a place for dedicated people like him: Gopal Italia, AAP Gujarat chief pic.twitter.com/LjKZv31hL9 — ANI (@ANI) April 15, 2022 కాంగ్రెస్ పార్టీ కోసం ‘‘2017లో మీరు(అధిష్టానం) హార్దిక్‌ని ఉపయోగించుకున్నారు. 2022 వచ్చేసరికి మీకు నరేష్ కావాల్సి వచ్చారు. 2027లో మరో పాటిదార్ నాయకుడు కోసం చూస్తారు. హార్దిక్ పటేల్‌నే శక్తిమంతుడిగా మీరు తయారు చెయ్యలేరా?’’ అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ఖొదాల్దమ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ పటేల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
విజయ్ రూపానీ రాజీనామా: కొత్త సీఎం రేసులో ఉన్నది వీరే
-
విజయ్ రూపానీ రాజీనామా: కొత్త సీఎం రేసులో ఉన్నది వీరే
గాంధీనగర్: మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుజరాత్ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. మోదీ నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే విజయ్ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే గుజరాత్లో బలమైన పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకే రూపానీతో రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన హార్ధిక్ పటేల్ బీజేపీని బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. తమ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆయన భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ, పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చితే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దీంతో అధికార బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. 15 శాతం జనాభా.. మద్దతు లేకుంటే కష్టమే.. గుజరాత్లో అధికార బీజేపీకి పటేళ్లు గట్టి మద్దతుదార్లు. ఆ రాష్ట్ర జనాభాలో ఈ సామాజికవర్గం వారు 15 శాతం మంది ఉన్నారు. గుజరాత్లో రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం వారు కీలక స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలోనే పటేళ్లకు మరింత ప్రాధాన్యం కల్పించి.. వారికి దగ్గరవ్వాలని బీజేపీ చూస్తోంది. ఇక రూపానీ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం పీఠాన్ని ఎవరికి కట్టబెడతారనే చర్చ ఊపందుకుంది. కొత్త ముఖ్యమంత్రి రేసులో నితిన్ పటేల్, సీఆర్ పటేల్, ఆర్సీ ఫాల్దూ, మన్సుఖ్ మాండవియా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. చదవండి: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా -
‘నా భర్త కనిపించడం లేదు’
అహ్మదాబాద్ : పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ గత 20 రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ అధికార యంత్రాంగం తన భర్తను వేధిస్తోందని, తన ఆచూకీ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె ఇంటర్నెట్లో ఓ వీడియోను షేర్ చేశారు. 2017లో పటేళ్లపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరిస్తామని 2017లో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, మరి అలాంటప్పుడు హార్ధిక్ పటేల్ ఒక్కడినే ఎందుకు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. బీజేపీలో చేరిన మరో ఇద్దరు పటేల్ నేతల పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. హార్థిక్ పటేల్ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను ప్రస్తావించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. హార్థిక్ ఎక్కడ ఉన్నారనేది వెల్లడికాకున్నా చివరిసారిగా ఆయన ఈనెల 11న తన ట్విటర్ ఖాతా నుంచి ఢిల్లీ ఎన్నికల్లో నెగ్గిన అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తనను బయటకు రాకుండా నిరోధించేందుకు జైలులో ఉంచాలని గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా ఈనెల 10న పటేల్ ఆరోపించారు. నాలుగేళ్ల కిందట గుజరాత్ పోలీసులు తనపై తప్పుడు కేసును నమోదు చేశారని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తనపై నమోదైన కేసుల గురించి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించగా ఆ సమయంలో తనపై ఈ కేసు లేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తనను కస్టడీలోకి తీసుకునేందుకు తన ఇంటికి పోలీసులు వచ్చారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని ఆ ట్వీట్లో పటేల్ పేర్కొన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే తనపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తనను నిర్బంధించేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయినా తాను ప్రజల తరపున బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతానని, త్వరలోనే ప్రజలను కలుస్తానమంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. చదవండి : ‘అందుకే హార్దిక్ చెంప చెళ్లుమనిపించా’ -
హార్దిక్ చెంప చెళ్లుమంది
అహ్మదాబాద్: కాంగ్రెస్ నేత, పటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి ఆయన చెంప చెళ్లుమనిపించాడు. ఆ వ్యక్తిని గుజరాత్‌కు చెందిన తరుణ్ గజ్జర్‌గా గుర్తించారు. దాడి తర్వాత కాంగ్రెస్ నేతలు, పటేల్ మద్దతుదారులు అతన్ని చితకబాదగా, తీవ్ర గాయాలపాలైన అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘బీజేపీ నాకు హాని తలపెట్టాలని చూస్తోంది. నాపై దాడికి బీజేపీ చాలామందిని నియమించింది. అసలు ఆ వ్యక్తి నాపై ఎందుకు దాడి చేశాడో తెలీదు. అతను కచ్చితంగా బీజేపీకి చెందినవాడే. ఒక వేళ అతను తుపాకీ గానీ వెంట తెచ్చి ఉంటే నేను చనిపోయేవాన్ని’అని హార్దిక్ అన్నారు. బీజేపీ నేతలు ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సానుభూతి పొందాలనే కొత్త నాటకానికి తెరలేపిందని అన్నారు. హార్దిక్‌పై దాడికి గల కారణాలను గజ్జర్ ఆస్పత్రి బెడ్ మీద నుంచే మీడియాకు వెల్లడించాడు. ‘2015లో పటేల్ ఉద్యమ సందర్భంగా అల్లర్లు జరిగినప్పుడు నా భార్య, నా బిడ్డ అతని వల్ల ఇబ్బంది పడ్డారు. అందుకే అప్పటినుంచి ఆయనంటే నాకు కోపం’ అని గజ్జర్ అన్నాడు. -
హార్ధిక్ పటేల్‌కు హైకోర్టు షాక్
అహ్మదాబాద్ : కాంగ్రెస్‌లో చేరిన పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశలకు గుజరాత్ హైకోర్టు గండికొట్టింది. మెహసనా జిల్లాలో ఓ అల్లర్ల కేసులో సెషన్స్ కోర్టు తనను దోషిగా పేర్కొనడాన్ని కొట్టివేయాలని కోరుతూ హార్థిక్ పటేల్ అభ్యర్ధనను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగాలని పటేల్ భావిస్తుండగా, గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు ఆయన ఆశలపై నీళ్లుచల్లాయి. మెహసనా జిల్లాలో జరిగిన ఘర్షణల కేసులో సెషన్స్ కోర్టు హార్ధిక్ పటేల్‌ను గత ఏడాది జులైలో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనను దోషిగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని హార్ధిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హార్ధిక్‌కు శిక్షను రద్దు చేసిన హైకోర్టు ఆయనకు గత ఏడాది ఆగస్టులో బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు హార్ధిక్‌ను దోషిగా తేల్చడంపై మాత్రం హైకోర్టు స్టే ఇవ్వలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పటేల్ కాంగ్రెస్ నుంచి జామ్‌నగర్ లోక్‌సభ స్దానం నుంచి బరిలో దిగాలని యోచిస్తుండగా, గుజరాత్ హైకోర్టు ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం హార్థిక్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. -
ఇది మోదీ ఇచ్చే చివరి లాలీపాప్ : హార్ధిక్ పటేల్
అహ్మదాబాద్ : ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ కులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలనే కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తప్పుబట్టారు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందుకే తన అమ్ములపొదిలోని చివర అస్త్రాన్ని ఈ రకంగా వదిలారన్నారు. ఈ రిజర్వేషన్ లాలీపాప్ ప్రజలకు అందిస్తే అది పెద్ద పొరబాటు అవుతుందని, సరిగ్గా అమలు చేయకపోయినా ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక వెనకబడిన అగ్రవర్ణకులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోదీ సర్కార్ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది. అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేలా మంగళవారం ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది. -
ముగిసిన హార్ధిక్ పటేల్ ఆమరణ దీక్ష
అహ్మదాబాద్ : పటేళ్లకు రిజర్వేషన్లు, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లతో 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ బుధవారం తన ఆందోళన విరమించారు. భవిష్యత్ పోరాటాల కోసం బతికిఉండాలని అనుచరులు నచ్చచెప్పడంతో ఆయన దీక్ష విరమించారు. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నేత హార్థిక్ పటేల్ ఆగస్ట్ 25 నుంచి తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. పటేళ్లకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, రైతులకు రుణమాఫీ డిమాండ్లను నెరవేర్చేవరకూ తన ఆందోళన కొనసాగుతుందని హార్థిక్ అంతకుముందు ప్రకటించారు. కాగా పటేల్ దీక్షకు కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది -
క్షీణించిన హార్ధిక్ ఆరోగ్యం
అహ్మదాబాద్ : పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో పటేళ్లకు రిజర్వేషన్ కోరుతూ.. హార్ధిక్ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 14 రోజుల నుంచి దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని సోలా సివిల్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. బాగా నీరసించిపోవడంతో పాటు.. కిడ్నీ సంబంధిత వ్యాధితో హార్దిక్ బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పటేళ్లకు కోటాతో పాటు రైతు రుణాల మాఫీ వంటి పలు డిమాండ్లను పటేల్ ముందుకు తెచ్చారు. గత నెల 25న నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిన హార్థిక్ పటేల్‌కు.. కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. -
ఆమరణ దీక్ష : 20 కిలోలు తగ్గిన హార్థిక్
అహ్మదాబాద్ : పటేళ్లకు విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో కోటా కోరుతూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ నిరసన మంగళవారం పదకొండో రోజుకు చేరింది. దీక్షకు దిగినప్పుడు 78 కిలోల బరువున్న పటేల్ ప్రస్తుతం 20 కిలోలు తగ్గారని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలిపారు. దీక్షా వేదిక వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్ ‘ఐసీయూ ఆన్ వీల్స్’ ను సిద్ధంగా ఉంచారు. కాగా తన నివాసాన్ని సందర్శించే ప్రజలను పోలీసులు వేధించడం నిలిపివేసే వరకూ తాను వైద్యులను అనుమతించనని మెడికల్ చెకప్‌కు హార్ధిక్ పటేల్ నిరాకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. పటేళ్లకు కోటాతో పాటు రైతు రుణాల మాఫీ వంటి పలు డిమాండ్లను పటేల్ ముందుకు తెచ్చారు.గత నెల 25న హార్థిక్ పటేల్ నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. మరోవైపు నిరవధిక దీక్ష చేపట్టిన హార్ధిక్ పటేల్‌ను పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా రానున్నారు. మోదీ సర్కార్‌పై పలు సందర్భాల్లో సిన్హా నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. 11 రోజుల నుంచి దీక్ష చేస్తుండటంతో హార్థిక్ పటేల్ ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వస్తున్నా గుజరాత్‌లోని బీజేపీ సర్కార్ ఈ అంశంలో ఇప్పటివరకూ జోక్యం చేసుకోలేదు. కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి హార్థిక్ ఆందోళనకు మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రైతుల కోసం, గుజరాత్ ప్రజల కోసం నిరసనకు దిగిన హార్థిక్ పటేల్‌తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత శక్తి సింగ్ గోహిల్ డిమాండ్ చేశారు. ఇక వ్యవసాయ రుణాల మాఫీ డిమాండ్‌పై హార్థిక్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. -
వీలునామా సిద్ధం చేసుకున్న హార్దిక్
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లతోపాటు రైతు రుణమాఫీ చేయాలంటూ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ చేస్తున్న అమరణ నిరాహార దీక్షకు ఆదివారంతో 9రోజులు పూర్తయ్యాయి. అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్ తన ఆస్తులను పంచుతూ వీలునామా రాయడం సంచలనం సృష్టిస్తోంది. హార్దిక్ ఖాతాలో రూ.50 వేలున్నాయి. ఇందులో తల్లిదండ్రులకు 20వేలు, పంజ్రపోల్ గ్రామంలో ఆవులకు షెడ్ కోసం రూ.30వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. ‘తన జీవితగాథపై వస్తున్న పుస్తకం హూ టుక్ మై జాబ్‌పై వచ్చే రాయల్టీ, ఇన్సూరెన్స్ డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లెలితోపాటు మూడేళ్ల క్రితం పటీదార్ ఉద్యమంలో చనిపోయిన 14 మందికి పటేళ్లకు సమానంగా పంచాలని హార్దిక్ పేర్కొన్నారు’ అని పటీదార్ సంఘం అధికార ప్రతినిధి మనోజ్ పనారా వెల్లడించారు. ఒకవేళ ఈ దీక్షలో తను చనిపోతే.. కళ్లను దానం చేయాలని సూచించారు. వీలునామాలో పేర్కొన్న వివరాల ప్రకారం హార్దిక్ ఆస్తిలో 15%తల్లిదండ్రులకు, 15% చెల్లెలికి మిగిలిన 70% 14 మంది పటీదార్లకు చెందుతుంది. -
మంచినీరు కూడా ముట్టను
అహ్మదాబాద్: పటీదార్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ల నేత హార్దిక్ పటేల్(25) చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. ఇకపై మంచినీరు కూడా తాగనని ఆయన శుక్రవారం ప్రకటించారు. ఆహారం, నీరు లేకుండా దీక్షచేస్తానని, ఆశయం సిద్ధించేదాకా గాంధీజీ చూపిన బాటలో పోరు సాగిస్తానన్నారు. శుక్రవారం గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ మొధ్వాడియా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కనూ కల్సారియా సహా పలువురు నేతలు హార్దిక్‌ను కలిసి మద్దతు తెలిపారు. వేర్పాటు వాదులతో చర్చలు జరపగలిగిన ప్రభుత్వం హార్దిక్‌తో ఎందుకు చర్చలు జరపడం లేదని మొధ్వాడియా అన్నారు. హార్దిక్‌తో చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో దీక్షకు అధికారులు నో చెప్పడంతో 25న తన నివాసంలోనే హార్దిక్ దీక్ష ప్రారంభించారు. -
రిజర్వేషన్ల కోసం హార్దిక్ ఆమరణ దీక్ష
అహ్మదాబాద్: విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో పటీదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) చీఫ్ హార్దిక్ పటేల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దతుదారుల సమక్షంలో హార్దిక్ తన ఫాంహౌస్‌లో దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రాంగణానికి పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలిరావటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానాపాట్లు పడ్డారు. మరోవైపు పలువురు కాంగ్రెస్ నేతలు హార్దిక్‌ను కలసి తమ మద్దతు తెలిపారు. ఈ దీక్ష వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ప్రభుత్వం ఆరోపించింది. రెండు నెలల క్రితం దీక్షకు అనుమతి కోరామని..అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వలేదని హార్దిక్ ఆరోపించారు. -
గుజరాత్ సీఎంను సాగనంపారు: హార్థిక్ పటేల్
అహ్మదాబాద్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌పై బీజేపీ దృష్టి సారించిందని, సీఎం విజయ్ రూపానీని తప్పించారని పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ పేర్కొన్నారు. గతంలో ఆనందిబెన్ పటేల్‌ను రాజీనామా చేయాలని కోరిన తరహాలోనే గురువారం కేబినెట్ బేటీలో విజయ్ రూపానీని సీఎం పదవి నుంచి వైదొలగాలని కోరారని చెప్పారు.సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారని పది రోజుల్లో గవర్నర్ దాన్ని ఆమోదిస్తారని చెప్పారు. గుజరాత్ తదుపరి సీఎంగా క్షత్రియ లేదా పటేల్ వర్గీయుడిని ఎంపిక చేస్తారని తాను భావిస్తున్నానని హార్థిక్ పటేల్ పేర్కొన్నారు. కాగా తాను రాజీనామా చేస్తున్నట్టు హార్థిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలను సీఎం విజయ్ రూపానీ తోసిపుచ్చారు. మీడియా దృష్టిని ఆకర్షించిందుకే పటేల్ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రులు రాజీనామా చేయరని, రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు సమర్పిస్తారని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు హార్థిక్ పటేల్ వంటి కాంగ్రెస్ ఏజెంట్లు ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
గట్టిపోటీ కానేకాదు: అమిత్ షా
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీని ఇచ్చిందని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ కన్నా కాంగ్రెస్ 8% వెనుకబడి ఉందనీ, అది గట్టి పోటీ కానేకాదన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమే ఎన్నికల ఫలితాలన్నారు. ప్రధాని మోదీకి ఉన్న జనాకర్షణ, కేంద్రంలో, రాష్ట్రంలో తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపించాయని చెప్పారు. కాంగ్రెస్ విభజనవాద రాజకీయాల వల్లే తమ పార్టీకి సీట్లు తగ్గాయన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. హిందువని చెప్పినా ఫలితం లేదా? సోమ్‌నాథ్ మందిర్‌కు వెళ్లినప్పుడు రాహుల్... తాము హిందూవేతరులమని తెలిపే విజిటర్ల పుస్తకంలో సంతకం పెట్టడాన్ని బీజేపీ ఎన్నికల్లో వాడుకోవాలని చూసింది. ఈ క్రమంలో బీజేపీ వాదనను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కాషాయపక్షం వలలో పడి అనవసర చర్చకు ఆస్కారం కల్పించారు. రాహుల్ హిందువు మాత్రమే కాదు, ఆయన ‘జనేవూధారీ’ (జంధ్యం ధరించిన) బ్రాహ్మణుడని అందరూ భావించేలా సూర్జేవాలా వివరణ ఇవ్వడమేగాక గతంలో రాహుల్ తన కోటుపై జంధ్యం వేసుకున్నప్పటి ఫోటో ట్విటర్లో పెట్టి కాంగ్రెస్ కూడా కులాన్ని ఎన్నికల్లో ఇంత బాహాటంగా వాడుకుంటోందనే విమర్శలకు అవకాశం కల్పించారు. ట్యాంపరింగ్‌తోనే గెలుపు: హార్దిక్ గుజరాత్లో బీజేపీ ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)లను ట్యాంపర్ చేసి, ధనబలాన్ని ఉపయోగించి గెలిచిందని పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా ఉండుంటే కాంగ్రెసే గెలిచేదని ఆయన అన్నారు. ‘గుజరాత్లో పోలింగ్ సమయంలో వైఫై నెట్‌వర్క్‌లను గుర్తించిన సందర్భాలున్నాయి. అలాగే ఈ రోజు ఓట్ల లెక్కింపు మొదలవ్వడానికి ముందే కూడా కొన్ని ఈవీఎంలకు సీళ్లు లేవు’ అని హార్దిక్ ఆరోపించారు. పటీదార్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న వరచ్చ రోడ్, కమ్రేజ్ తదితర నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలవడాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీది నైతిక ఓటమి ‘గుజరాత్లో బీజేపీది నైతిక ఓటమి. 2019లో ఆ పార్టీ ఓటమికి ఇదే ఆరంభం. సమతూకంతో తీర్పు ఇచ్చిన గుజరాత్ ప్రజలకు అభినందనలు. ఇది బీజేపీకి తాత్కాలిక, పరువు నిలుపుకునే గెలుపు మాత్రమే. సామాన్యులపై దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం సంబరాలెందుకు: సీపీఎం ‘గుజరాత్లో బీజేపీ గెలుపు ఆ పార్టీ సంబరాలు చేసుకోవాల్సినంతగా ఏమీ లేదు. 150 సీట్లు గెలవడం తమ లక్ష్యమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారంలో ప్రకటించినా కనీసం వంద సీట్లు కూడా గెలవలేకపోయారు.’ తగ్గుతున్న బీజేపీ ఓట్‌బ్యాంక్ గుజరాత్లో బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి అత్యధికంగా 60శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 49.1శాతానికి పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును 33 శాతం నుంచి 41.4 శాతానికి పెంచుకుంది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల ఓటు బ్యాంక్ తేడా 10.4% కాగా 2012 ఎన్నికల్లో 9 శాతానికి.. తాజాగా ఈ తేడా 7.7 శాతానికి తగ్గిపోయింది. ఐదుగురు మంత్రులు చిత్తు! అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఐదుగురు మంత్రులు కాంగ్రెస్ అభ్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. గధడ్లో దళిత మంత్రి ఆత్మారామ్ పర్మర్ కాంగ్రెస్ నేత ప్రవీణ్భాయ్ మరు చేతిలో, జమ్జోధ్పూర్లో మంత్రి చిమన్‌భాయ్ సపరియా చిరాగ్‌భాయ్ కలారియా(కాంగ్రెస్) చేతిలో ఓటమి చవిచూశారు. వీరితో పాటు శంకర్ చౌధరీ, కేశాజీ చౌహాన్, శబ్ద్శరణ్ తడ్వీలు తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. మెజారిటీ కన్నా ‘నోటా’కే ఎక్కువ న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్లో బీజేపీ అభ్యర్థి బాబూభాయ్ బోఖారియా 1,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. అదే నియోజకవర్గంలో నోటా గుర్తుకు 3,433 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 5.5 లక్షల మంది ఓటర్లు అభ్యర్థులను తిరస్కరించి ‘నోటా’ (పైవారెవరూ కాదు)కు ఓటేశారు. ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో ఇది 1.8 శాతానికి సమానం. హిమాచల్‌ప్రదేశ్‌లో 33 వేల మంది (0.9 శాతం) ఓటర్లు నోటా మీట నొక్కారు. గుజరాత్లో పార్టీల పరంగా నోటాకు పడిన ఓట్ల సంఖ్య బీజేపీ, కాంగ్రెస్‌ల తరువాత మూడో స్థానంలో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి మేవాని గెలుపొందిన వాద్గాంలో అత్యధికంగా 4,200కు పైగా, సీఎం విజయ్ రూపానీ పో టీచేసిన రాజ్‌కోట్ (పశ్చిమ)లో 3,300 నోటా ఓట్లు పోలయ్యాయి.