మెహ్సనా: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌పై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. గురువారం ఈ మేరకు విస్‌నగర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2015లో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉద్యమంలో భాగంగా తన ఆఫీస్‌పై హార్దిక్ అనుచరులు దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే రిషికేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో కోర్టు హార్దిక్‌తో పాటు మరో ఆరుగురికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. దీంతో హార్దిక్ గురువారం కోర్టులో హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు హార్దిక్, సర్దార్ పటేల్ గ్రూప్ కన్వీనర్ లాలాజీసహా పలువురిపై అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment