కట్టలు తెంచుకుంటున్నాయ్
Published Tue, Nov 15 2016 2:53 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇప్పటివరకూ కుబేరుల కలుగుల్లో దాక్కున్న ‘కట్టల’ పాములు పెద్దనోట్ల రద్దుతో రోడ్డెక్కుతున్నాయి. తాజాగా నల్లధనాన్ని మార్చే ముఠాలు రంగంలోకి దిగాయి. పెద్ద నోట్లను మార్చేందుకు కమీష¯ŒS ప్రాతిపదికన కొందరు వ్యక్తులు కార్యకలాపాలు ప్రారంభించారు. సోమవారం రూ.24 లక్షల్ని మార్చుకునేందుకు విజయవాడ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు ఏలూరుకు చెందిన మరో ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు. విజయవాడలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్ పనులు చేసే విజయ్ అగర్వాల్, కార్ల విడిభాగాల వ్యాపారి అంచెల రవికుమార్ అనే వారు ఏలూరులో తమకు పరిచయం ఉన్నవారి సాయంతో పెద్దనోట్లు మార్చేందుకు రాగా, పోలీసులు వారిని పట్టుకున్నారు. ఏలూరులో మెకానిక్‌గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తితో వారికి పరిచయం ఉండటంతో నోట్ల కట్టలు తీసుకుని వచ్చారు. మెకానిక్ రవి 4 శాతం కమీష¯ŒSకు పాతనోట్లు మారుస్తానని చెప్పడంతో అగర్వాల్, రవికుమార్ ఇక్కడకు వచ్చారు. మొదట పాండురంగ థియేటర్ వద్ద, ఆ తరువాత పవర్‌పేటలో కలుద్దామనుకున్న ఆ వ్యక్తులు చివరకు దెందులూరు మండలం సోమవరప్పాడు లాకుల వద్ద కలిసేందుకు నిర్ణయించుకున్నారు. మెకానిక్ రవితోపాటు దస్తావేజుల లేఖరి, మరో ఇద్దరు విజయవాడ నుంచి వచ్చిన వారిని పొలాల్లో కలిశారు. ఈ వ్యవహారంపై ఉప్పందుకున్న పోలీసులు మెరుపుదాడి చేసి మొత్తం 8మందిని అరెస్ట్ చేశారు. వీరినుంచి రూ.24 లక్షల నగదు స్వా«ధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 కోట్లు మార్చుకునేందుకు ఒప్పందం కుదిరిందని, ఈ ప్రయత్నంలో వారు పోలీసులకు పట్టుబడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడకు అసలు ముఠా రాలేదని సమాచారం. ఈ ముఠా వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు, ఇప్పటివరకూ ఎంత నల్లధనాన్ని మార్చారనే విషయాలపై పోలీసులు విచారణ జరపాల్సి ఉంది.
నగదు మార్పిడికి కొత్త మార్గాలు
నల్లధనాన్ని మార్చుకునేందుకు జిల్లాలోని బడాబాబులు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఏలూరు నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నిర్వాహకుడు తన వద్ద పనిచేసే సిబ్బందిని అధార్‌కార్డు, ఫొటోలు ఇవ్వాలని వత్తిడి చేస్తున్నట్టు సమాచారం. వీరి పేరుతో అకౌంట్లు తెరిచి నగదు డిపాజిట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారనే ప్రచారం ఉంది. వాటిని ఇవ్వడానికి ఇష్టపడని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరిస్తుండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఆ హోటల్ యజమాని వద్ద సుమారు 90 మంది పనిచేస్తున్నట్టు సమాచారం. నగరంలో పలు వస్త్ర దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారి తన వద్ద పని చేసే సిబ్బందికి రెండు నెలల జీతం ఒకేసారి అడ్వా¯Œ్సగా చెల్లిం చినట్టు తెలిసింది. బ్యాంకుల్లోని వ్యక్తిగత ఖాతాల్లోకి రూ.2.50 లక్షల వరకూ డిపాజిట్ చేసే అవకాశం ఉండటంతో సిబ్బంది ఖాతాల్లో డబ్బులు వేసేందుకు యజమానులు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి అంత మొత్తం తమ ఖాతాల్లోకి వస్తే తెల్ల రేష¯ŒS కార్డుతో పాటు ఇతర ప్రభుత్వ సదుపాయాలు నిలిచిపోతాయనే ప్రచారంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చి బంగారం బిస్కెట్లు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మార్కెట్ ధరకంటే ఎక్కువ చెల్లించి బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఐటీ దాడుల భయంతో సోమవారం జిల్లాలోని పలు పట్టణాల్లో బంగారు దుకాణాలు మూతపడ్డాయి. ఏటీఎంలు వారం తర్వాత కూడా పనిచేయడం లేదు. దీంతో ప్రజల ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయి. కేంద్రం త్వరలో లాకర్లను తనిఖీ చేస్తుందనే వార్తల నేపథ్యంలో బ్యాంకు లాకర్లలో ఉన్న నగదు, నగలను తీసుకునే పనిలో కొందరు నిమగ్నమయ్యారు.
పెరిగిన సెటిల్‌మెంట్లు
పెద్దనోట్ల రద్దుతో బకాయిలకు సంబంధించి సెటిల్‌మెంట్లు పెద్దఎత్తున సాగుతున్నాయి. ఇప్పటివరకూ అప్పు తీసుకున్న వ్యక్తులు వడ్డీ భారాన్ని, రుణదాతల నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోలేక రాజీ ఒప్పందాల కోసం పెద్దల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా రుణాలి చ్చిన వ్యక్తులు పెద్దల వద్దకు వచ్చి తమ బకాయిలను ఇప్పటికిప్పుడు చెల్లించకుండా రుణగ్రహీతలను కట్టడి చేయాలని కోరుతున్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఓ వ్యక్తి వడ్డీ వ్యాపారి వద్ద రూ.3 లక్షల రుణం తీసుకోగా, ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ.3.60 లక్షలైంది. రుణమిచ్చిన వ్యక్తి ఎన్నిసార్లు తిరిగినా అప్పు తీర్చే గడువును వాయిదా వేస్తూ వచ్చిన రుణగ్రహీత ఉన్నట్టుండి రూ.3.60 లక్షల అప్పు తీర్చేం దుకు వడ్డీ వ్యాపారి వద్దకు వచ్చాడు. పెద్ద నోట్లు మారడం లేదని, కొత్త నోట్లు ఇవ్వాలని వడ్డీ వ్యాపారి కోరగా, రుణగ్రహీత ససేమిరా అన్నట్టు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో తాను చెల్లించే మొత్తాన్ని స్వీకరించాలని పట్టుబట్టడంతో వడ్డీ వ్యాపారి సెటిల్మెంట్ చేసే పెద్దల్ని ఆశ్రయించాడు. వారు రంగంలోకి దిగి ఇద్దరితోనూ చర్చిం చారు. పాత నోట్లకు బదులు చిల్లర నోట్లు లేదా రూ.2 వేల నోట్లను వడ్డీ వ్యాపారికి ఇవ్వాలని, అసలు మొత్తం రూ.3 లక్షలు చెల్లిస్తే చాలని, వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని రుణగ్రహీతకు నచ్చజెప్పారని తెలుస్తోంది. ఇందుకు ఉభయులూ అంగీకరించడంతో సుఖాంతమైంది. ఇలాంటి వ్యవహారాలు జిల్లా నలుమూలలా అనేకం చోటుచేసుకుంటున్నాయి.
తాడేపల్లిగూడెంలో రూ.వెయ్యి నోట్ల కలకలం
నల్లధనం మార్పిడి వ్యవహారం జిల్లావ్యాప్తంగా ఊపందుకుంది. తాజాగా, తాడేపల్లిగూడెం శివారు ప్రత్తిపాడులో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి రూ.వెయ్యి నోట్ల కట్టలను మార్పిడి నిమిత్తం కొందరు వ్యక్తులకు పంపిణీ చేయడం కలకలం రేపింది. ప్రతిపాడు వై.జంక్ష¯ŒSలోని కనకదుర్గమ్మ ఆలయం ఎదురుగా కాలువ గట్టు వద్ద ఈ తతంగం చోటుచేసుకుంది. మోటార్ సైకిళ్లపై వచ్చిన సుమారు 10 మంది యువకులు కారులోని వ్యక్తులు ఇచ్చిన రూ.వెయ్యి నోట్ల కట్టలను తీసుకుని క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. ఒక్కొక్క యువకుడికి రూ.వెయ్యి నోట్లు గల వందేసి కట్టలను (రూ.కోటి చొప్పున) కారులో వచ్చిన వ్యక్తులు ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని సమీపంలోని చిల్లర వ్యాపారులు దూరం నుంచి గమనించి అక్కడకు చేరుకునే లోగానే నోట్ల కట్టల పంపిణీ, వాటిని తీసుకున్న వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోవడం పూర్తయిపోయిందని చెబుతున్నారు. జిల్లాలోని మారుమాల ప్రాంతాల్లో చాలాచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Advertisement
Advertisement