డిప్యూటీ సీఈఓ రాజేశ్వరికి వినతిపత్రం అందజేస్తున్ననాయకులు
- నిరసన తెలిపిన పీఆర్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం
- డిప్యూటీ సీఈఓ రాజేశ్వరికి వినతి అందజేసిన నాయకులు
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేస్తున్న 7 గురు ఉద్యోగుల సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించారు. పీఆర్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో సీఈఓ ఇచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని,తిరిగి యథాస్థానాల్లో వారిని కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.జిల్లాపరిషత్ ఉద్యోగులు నిరసనలో పాల్గొని పెన్‌డౌన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే ఆందోళనలు ఉధతం చేస్తామన్నారు. అనంతరం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కర్నాటి రాజేశ్వరిని కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు భానుమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల రవీంద్రప్రసాద్,నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాషా,జిల్లా కోశాధికారి వై.సురేందర్‌రెడ్డి,జిల్లా కౌన్సిలర్స్ అంకుబాబు,రాజేష్,వెంకటేశ్వరరావు,గౌసుద్దీన్, శ్రీనివాస్‌రావు, సర్పరాజ్, వాణిశ్రీ, శ్రీనివాసరావు,అంబిక, రవి, కిశోర్‌రెడ్డి,శారద,విజయలక్ష్మి, రమణ,శంకర్, సాంబశివారెడ్డి, కిశోర్, గంగా భవాని, పద్మ,సుజాత పాల్గొన్నారు. పీఆర్‌టియు జిల్లా అ«ధ్యక్షుడు ఎన్‌కష్ణమోహన్ మద్దతు తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉద్యోగులు చైర్‌పర్సన్ గడిపల్లి కవిత ఉద్యోగులు, సీఈఓ మారుపాక నాగేశ్‌తో వేర్వేరుగా జర్చలు చర్చలు సఫలం కాలేదు.