![Hardik Patel Shifted To Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/7/hardik.jpg.webp?itok=4gfNKyzt)
అహ్మదాబాద్ : పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో పటేళ్లకు రిజర్వేషన్ కోరుతూ.. హార్ధిక్ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 14 రోజుల నుంచి దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని సోలా సివిల్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. బాగా నీరసించిపోవడంతో పాటు.. కిడ్నీ సంబంధిత వ్యాధితో హార్దిక్ బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా పటేళ్లకు కోటాతో పాటు రైతు రుణాల మాఫీ వంటి పలు డిమాండ్లను పటేల్ ముందుకు తెచ్చారు. గత నెల 25న నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిన హార్థిక్ పటేల్‌కు.. కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment