కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, పాటిదార్ నేత హార్ధిక్ పటేల్.. బీజేపీలో చేరుతున్నారు. గుజరాత్ మాజీ కాంగ్రెస్ నేత పటేల్.. గురువారం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి బీజేపీ పెద్దలతో మంతనాలు పూర్తి అయినట్టు జాతీయ మీడయాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే, అంతకు ముందు హార్దిక్ పటేల్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ తనను వేధిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు ఈ విషయాన్ని తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు నిజం కాదంటూ హార్ధిక్ పటేల్ కొట్టి పారేశారు. కానీ, అనూహ్యంగా గురువారం ఆయన బీజేపీ తీర్థం తీసుకుంటున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది చివరలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న వేళ పాటిదార్ నేత పటేల్ బీజేపీలో చేరడం కాషాయ పార్టీకి ఎంతో మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ సీనియర్లకు బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment