ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. తాజాగా తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అశ్విన్ కోత్వాల్ రాజీనామా చేశారు. ఇక, గుజరాత్ పీసీసీ చీఫ్ హార్ధిక్ పటేల్ తన ట్విట్టర్ ఖాతాలో బయో నుంచి కాంగ్రెస్ పార్టీని తొలగించారు. దీంతో రాజకీయంగా దీనిపై చర్చ నడుస్తోంది.
కాగా, ఖేద్‌బ్రహ్మ నియోజకవర్గం ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ మంగళవారం తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నీమాబేన్ ఆచార్యకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఉన్న గిరిజనులు అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. బీజేపీ వల్లే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని తాను నమ్ముతున్నానని కొత్వాల్ కామెంట్స్ చేశారు.
అయితే, అశ్విన్ కొత్వాల్ 2007 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇక హార్ధిక్ విషయానికొస్తే.. కాంగ్రెస్ పార్టీని వీడతారంటూ జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఆయన ఇలా వ్యవహరించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ట్విట్టర్ బయోగా ఉన్న ‘వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ గుజరాత్ కాంగ్రెస్’ను హార్ధిక్ తొలగించారు. ప్రస్తుతం
‘ప్రౌడ్ ఇండియన్ ప్యాట్రాయిట్. సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్’ అని తన బయోగా మార్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment