అహ్మదాబాద్: పటీదార్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ల నేత హార్దిక్ పటేల్(25) చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. ఇకపై మంచినీరు కూడా తాగనని ఆయన శుక్రవారం ప్రకటించారు. ఆహారం, నీరు లేకుండా దీక్షచేస్తానని, ఆశయం సిద్ధించేదాకా గాంధీజీ చూపిన బాటలో పోరు సాగిస్తానన్నారు. శుక్రవారం గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ మొధ్వాడియా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కనూ కల్సారియా సహా పలువురు నేతలు హార్దిక్‌ను కలిసి మద్దతు తెలిపారు. వేర్పాటు వాదులతో చర్చలు జరపగలిగిన ప్రభుత్వం హార్దిక్‌తో ఎందుకు చర్చలు జరపడం లేదని మొధ్వాడియా అన్నారు. హార్దిక్‌తో చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో దీక్షకు అధికారులు నో చెప్పడంతో 25న తన నివాసంలోనే హార్దిక్ దీక్ష ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment