బీహార్‌లో రిజర్వేషన్ల పరిధిని మరింతగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.
విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం మేరకు పెంచిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పెంపును రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గౌరవ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను పూర్తి చేశాక, మార్చి 11న నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. పట్నాహైకోర్టు ఈ రోజు(గురువారం) రిజర్వేషన్లపై తన తీర్పు వెలువరించింది.
Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.
The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn— ANI (@ANI) June 20, 2024
Comments
Please login to add a commentAdd a comment